
సాక్షి,విజయవాడ: సుగాలి ప్రీతి కేసును వాడుకుని రాజకీయంగా బాగుపడ్డారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై జై భీమ్ రావు భారత్ పార్టీ వ్యవస్థాపకులు జడ శ్రావణ్ కుమార్ ఫైరయ్యారు. సుగాలి ప్రీతి కుటుంబ సభ్యుల మనోవేదనపై న్యూ హోప్ ఫౌండేషన్ పాటను రూపొందించింది. ఆ పాట పోస్టర్‌ను జడ శ్రావణ్ కుమార్ ఆవిష్కరించారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పవన్‌కు నిబద్ధత,నిలకడలేదు. రాజకీయాల కోసమే సుగాలిప్రీతి కేసును వాడుకున్నారు. సుగాలిప్రీతి కుటుంబానికి న్యాయం చేస్తామన్నాడు.. ఏమైంది?. సుగాలి ప్రీతి కుటుంబానికి వైఎస్ జగన్ ప్రభుత్వం ఉద్యోగం ఇచ్చింది. వైఎస్ జగన్ హయాంలో ఐదెకరాల పొలం కూడా ఇచ్చారు. సీబీఐ విచారణకు జగన్ ప్రభుత్వం ఆదేశించింది.
పవన్ సుగాలి ప్రీతి గురించి ఒక వెయ్యి వీడియోల్లోనైనా మాట్లాడారు. సినిమాలో డైలాగ్ లు మర్చిపోయినట్లు .. సుగాలి ప్రీతి కేసును పవన్ మర్చిపోయినట్లున్నారు. సుగాలి ప్రీతికి న్యాయం కోసం పోరాడింది నేను. నన్ను తప్పుపట్టే విధంగా జనసేన కార్యకర్తలు సీన్ క్రియేట్ చేశారు. పవన్ కళ్యాణ్ ఆదేశాలతో జనసేన కార్యకర్తలు కేసులో ఎంటరయ్యారు. సుగాలి ప్రీతి కేసును వాడుకుని పవన్ రాజకీయంగా బాగుపడ్డాడు.
పవన్‌ను తిట్టిన వారిని అరెస్టులు చేయించారు. పవన్ కళ్యాణ్ ప్రజల సమస్యలపై స్పందించేందుకు సిద్ధంగా లేడు. తాను హామీ ఇచ్చిన సుగాలి ప్రీతి కుటుంబానికి న్యాయం చేయలేకపోయారు. పవన్‌కు నిబద్ధత..నిలకడ లేదు.
సుగాలి ప్రీతి కుటుంబం పవన్‌పై నమ్మకం ఇంకా ఎన్నాళ్లు పెట్టుకుంటారో వాళ్ల విజ్ఞతకే వదిలేస్తున్నా. సుగాలి ప్రీతి కేసును రాజకీయాల కోసం పవన్ వాడుకున్నాడు. పవన్‌ను నమ్ముకుంటే 2029లో మళ్లీ సుగాలి ప్రీతి హత్యకేసు ప్రచారాస్త్రంగా మారండం ఖాయమని’మండిపడ్డారు.