Sravan Kumar
-
టీటీడీ బోర్డు సభ్యుల నియామకంపై జడ శ్రావణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు
-
టీటీడీ కాదు.. టీడీపీ బోర్డు: జడ శ్రావణ్ కుమార్
సాక్షి, విజయవాడ: ఏపీలో కూటమి నేతలు చెప్పే మాటలకు చేసే పనులకు చాలా తేడా ఉందన్నారు జై భీమ్ భారత్ పార్టీ వ్యవస్థాపకులు జడ శ్రావణ్ కుమార్. టీటీడీని రాజకీయ పునరావాసంగా మార్చారు. ఇది టీటీడీ బోర్డు కాదు.. టీడీపీ బోర్డు అని ఆరోపించారు. క్రిమినల్ కేసులు ఉన్న వారు ట్రస్ట్ బోర్డు సభ్యులా? అని ప్రశ్నించారు.జడ శ్రావణ్ కుమార్ విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ..‘టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుపై చాలా ఆరోపణలు ఉన్నాయి. క్రిమినల్ కేసులు ఉన్న వారు ట్రస్ట్ బోర్డు సభ్యులా?. ప్రశాంతి రెడ్డి, జ్యోతుల నెహ్రుపై ఐటీ ఎగవేత కేసులు ఉన్నాయి. ఎమ్మెల్యే ఎంఎస్ రాజుపై 23 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. బాబు అరెస్ట్ అయినప్పుడు క్యారేజీలు మోసిన మునికోటేశ్వర రావుకు పదవా?. అలివేలు మంగమ్మపై జోకులు వేసిన నర్సిరెడ్డి బోర్డు మెంబరా?. దేవాదాయ చట్టానికి విరుద్ధంగా బోర్డు సభ్యుల నియామకం జరిగింది.అలాగే, గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి ప్రజల డబ్బులు ఖర్చుచేశారని చెప్పిన పట్టాభి దీనికి సమాధానం చెప్పాలి. చంద్రబాబు ఇంటికి కోట్ల రూపాయలు ఎందుకు కేటాయించుకున్నారు. చంద్రబాబు నివాసం అనధికార నివాసం. అనధికార కట్టడం కూల్చివేయాలని నేషనల్ ట్రిబ్యునల్‌కి వెళ్తున్నాం. కరకట్ట మీద అన్ని కట్టడాలు కూలగొట్టి తీరుతాం. ముఖ్యమంత్రి నివాసం అయినా కూల్చాల్సిందే. ప్రభుత్వ ధనం వృధా అవుతుంటే సనాతన వాది, పవన్ స్టార్ ఏమయ్యాడు. పవన్ అనధికార కట్టడాలపై మౌనంగా ఉండడానికి కారణం జనసేన పార్టీ కార్యాలయానికి పర్మిషన్ లేకపోవడమే. హైడ్రా వంటి చట్టం ఆంధ్రప్రదేశ్‌లో అమలు అయితే ముందు పోయేది ముఖ్యమంత్రి ఇల్లు.. తర్వాత పోయేది పవన్ ఇల్లు. కూటమి నేతలు చెప్పే మాటలకు చెప్పే పనులకు చాలా తేడా ఉంది. జనవరి నుండి కాలర్ పట్టుకుని కూటమి నేతలను రోడ్లపైకి లాగుతాం అని సీరియస్ కామెంట్స్ చేశారు. -
లైవ్ లో పవన్ కళ్యాణ్ వీడియో చూపిస్తూ పరువు తీసిన జడ శ్రవణ్..
-
అమ్మాయిలపై లైంగిక వేధింపుల్లో బిజీబిజీగా కూటమి ఎమ్మెల్యేలు
-
జేసీ ప్రభాకర్ వీడియో వేసి పవన్,బాబును రఫ్పాడించిన జాడ శ్రవణ్ కుమార్
-
లడ్డు వివాదం.. రేపు సుప్రీం కోర్టులో జరిగేది ఇదే
-
నీలాంటి పాపాత్ముడు తిరుమల వెళ్తే అపచారం.. జాడ శ్రావణ్ కుమార్ ఫైర్
-
పవన్ పిచ్చికూతలకు జాడా శ్రావణ్ కుమార్ స్ట్రాంగ్ కౌంటర్
-
సాయంత్రం అయితే కోటార్ వేసేవాడు టీటీడీ మెంబెర్...? శ్రావణ్ కుమార్
-
అక్రమ కట్టడాలు కూల్చాలంటే.. చంద్రబాబు ఇంటి నుంచే స్టార్ట్ చేయాలి
-
అక్రమ కట్టడాల కూల్చివేత చంద్రబాబు నివాసం నుండే ప్రారంభం
-
బడ్జెట్ కేటాయింపులపై జడ శ్రవణ్ కుమార్ షాకింగ్ కామెంట్స్
-
ప్రజలు అధికారం ఇచ్చింది ఇందుకా ? కూటమిపై జడ శ్రవణ్ కుమార్ ఫైర్
-
కక్షతో ఆఫీసులు కూల్చడానికా అధికారమిచ్చింది: జడ శ్రవణ్ కుమార్
సాక్షి, విజయవాడ: రాష్ట్రంలో కక్షపూరితంగా పార్టీ ఆఫీసులు కూల్చడానికా కూటమికి అధికారం ఇచ్చింది అని ప్రశ్నించారు జై భీమ్ భారత్ పార్టీ వ్యవస్థాపకులు జడ శ్రవణ్ కుమార్. అలాగే, టీడీపీ సెంట్రల్ కార్యాలయానికి పర్మిషన్ ఉందా?. ఏపీలో టీడీపీ పార్టీ కార్యాలయాలకు పర్మిషన్ ఉంటే చూపించండి అని ప్రశ్నించారు.కాగా, శ్రవణ్ కుమార్ సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ఏవైనా భవనాలను కూల్చాలనుకుంటే కోర్ట్ ఆర్డర్‌తో కూల్చండి. అలా కాకుండా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడం కరెక్ట్ కాదు. రూల్ ఆఫ్ లాను టీడీపీ ఉల్లంఘిస్తోంది. పార్టీ ఆఫీసులకు అనుమతి లేదని అధికారులకు ఇప్పుడు గుర్తొచ్చిందా?. అధికారులు ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే వాళ్లు కొమ్ము కాయడం కరెక్ట్ కాదు. ఇటువంటి చర్యల వల్ల ప్రజలకు ప్రభుత్వంపై నమ్మకం పోతుంది.నాడు నారాయణ కాలేజీలను మూయించారని.. ఇప్పుడు మంత్రి అవగానే వైఎస్సార్సీపీ కార్యాలయాలు పడగొడతారా?. కోర్డ్ ఆర్డర్ ప్రకారం బిల్డింగ్‌ను కూల్చివేయాలి. అంటే సూర్యోదయం తర్వాత లేదా సూర్యాస్తమయంలోపు ఇలా చేయాలి. శని, ఆదివారాల్లో బిల్డింగ్స్ పడగొట్టకూడదు. అయినా కోర్ట్ ఆర్డర్ ఉండగా ఎలా కూల్చివేస్తారు?. టీడీపీ సెంట్రల్ కార్యాలయానికి పర్మిషన్ ఉందా?. టీడీపీ పార్టీ కార్యాలయాలకు పర్మిషన్ ఉంటే చూపించండి. కరకట్ట మీద ఉన్న ఏ బిల్డింగ్‌కి అనుమతి లేదు. వాటిని ఎందుకు పడగొట్టలేదు?. కరకట్ట మీద ఉన్న బిల్డింగ్స్ పడగొట్టాలని కోర్టులో పిటిషన్ వేస్తాం.వైఎస్సార్సీపీ నేతలు, మాజీ ఎమ్మెల్యేలు, కార్యకర్తలను టార్గెట్ చేస్తూ దాడులు చేస్తున్నారు. ప్రత్యేక హోదా, రైల్వే జోన్, వైజాగ్ స్టీల్ ప్లాంట్‌పై ఎందుకు మోదీతో మాట్లాడలేదు. 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వకపోతే చొక్కా పట్టుకొని అడుగుతాము. 100 వెల్ఫేర్ స్కీమ్స్ పునరుద్ధరించాలి. 95వేల ఎస్సీ, ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేయాలి.టీడీపీ నేత అచ్చెన్నాయుడు ఇచ్చిన స్టేట్మెంట్ ఎంత ప్రమాదకరమో 2029 ఎన్నికలో ఆయనకు తెలుస్తుంది. అధికారులను అరెస్ట్ చేయాలి. కలెక్టర్లను టార్గెట్ చేయాలి అనేవి మానుకోవాలి. వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడి చేయాలి, తరిమేయాలని అనుకుంటే కుదరదు. ప్రజలు చూస్తూ ఊరుకోరు. ప్రజల ఆలోచనలకు విలువ ఇవ్వాలి. ఏదైనా చేస్తాం అంటే చూస్తూ ఊరుకోము. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం చాలా ఇంపార్టెంట్. అధికార దాహంతో ఆ గొంతు నొక్కితే ప్రజాస్వామ్యానికి విలువ ఉండదు. ప్రజాస్వామ్యం లేకుండా నియంతృత్వం రాజ్యమేలితే నష్టం తప్పదు’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. -
ఇవి మాములు కౌంటర్లు కాదు బాబు పవన్ లకు చెమటలు పట్టించిన జడ శ్రవణ్ కుమార్
-
Crime: పగలు రెక్కీ.. రాత్రికి చోరీ! తాళం వేసిన ఇళ్లే లక్ష్యంగా..
సాక్షి, విశాఖపట్నం: పగలు ఆటో నడుపుతూ తాళం వేసి ఉన్న ఇళ్లను గుర్తించి... రాత్రి వేళ ఆ ఇళ్లల్లో చోరీలకు పాల్పడుతున్న నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను పోలీస్ కమిషనర్ కాన్ఫరెన్స్ హాలులో క్రైం ఏడీసీపీ శ్రావణ్‌కుమార్ మీడియాకు శుక్రవారం వెల్లడించారు. రైల్వే న్యూ కాలనీ సమీప శివాలయం వీధికి చెందిన షేక్ సహీద్ ఆటో డ్రైవర్‌గా పనిచేస్తూ జీవిస్తున్నాడు. పగలు అంతా నగరంలోని పలు ప్రాంతాల్లో ఆటో నడుపుతూ... ఆ సమయంలో తాళం వేసి ఉన్న ఇళ్లను గుర్తించి రెక్కీ నిర్వహించేవాడు. అనంతరం రాత్రి సమయంలో దొంగతనాలకు పాల్పడేవాడు. ఈ క్రమంలో పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధి వేపగుంట సమీప నాయడుతోట అప్పలనర్సయ్య కాలనీలో మున్సి లియాకత్ కుటుంబంతో నివసిస్తున్నారు. ఆయన గత ఏడాది డిసెంబర్ 27న కుమారుడి రిసెప్సన్ కోసం వేరే ప్రాంతానికి వెళ్లారు. ఆ ఇంటిని, వారి కదలికలను నిశితంగా గమనిస్తున్న షేక్ సహీద్ అదే రోజు రాత్రి ఆ ఇంటిలో చోరీకి పాల్పడ్డాడు. ఇంటి వెనక డోర్ తాళం పగలుగొట్టి 8 తులాల బంగారు ఆభరణాలు, రూ.2.30 లక్షల నగదు అపహరించుకుపోయాడు. మీడియాతో మాట్లాడుతున్న క్రైం ఏడీసీపీ శ్రావణ్‌కుమార్ పట్టించిన సీసీ కెమెరాలు కుమారుడి రిసెప్సన్ కార్యక్రమం తర్వాత మరుసటి రోజు డిసెంబర్ 28న ఇంటికి వచ్చిన మున్సి లియాకత్ చోరీ జరిగిందని గుర్తించి పెందుర్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే ఏసీపీ పెంటారావు నేతృత్వంలో సీఐలు లూథర్‌బాబు, సింహాద్రినాయుడు, ఎస్ఐలు ఎం.రాధాకృష్ణ, డి.కాంతారావు, ఎం.గణపతిరావు దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో చోరీ జరిగిన ఇంటి పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాల ఫుటేజీ పరిశీలించగా షేక్ సహీద్ చోరీకి పాల్పడినట్లు గుర్తించారు. నిందితుడిని అరెస్ట్ చేసి విచారించగా చోరీ చేసినట్లు అంగీకరించడంతోపాటు మరో ఐదు చోరీలకు పాల్పడినట్లు అంగీకరించాడు. ఫోర్త్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నాలుగు, కంచరపాలెం పీఎస్ పరిధిలో ఒక చోరీకి పాల్పడినట్లు అంగీకరించాడు. మొత్తం 17 తులాల బంగారం, 30 తులాల వెండి, రూ.3.80 లక్షల నగదు చోరీ చేయగా... 15 తులాల బంగారం, 30 తులాల వెండి, రూ.2.45 లక్షల నగదు, ఒక బైక్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు దొంగలించిన బంగారం కొనుగోలు చేస్తూ సహకరించిన పుట్టా భరత్‌కుమార్, బిక్కలు కళావతి, లంకా కామేశ్వరిలను పోలీసులు అరెస్ట్ చేశారు. సమావేశంలో ఏసీపీ పెంటారావు, ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు. చదవండి: Nellore: పాపం పసివాళ్లు! అమ్మానాన్నలు కాదనుకున్న అభాగ్యులు -
రాజధాని తరలిస్తున్నట్లు చెప్పారా?
సాక్షి, మంగళగిరి: రాజధానిలో దళితుల గురించి మాట్లాడే నైతిక హక్కు మాజీ ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్‌తో సహా ఏ ఒక్క టీడీపీ నాయకుడికి లేదని ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి (ఆర్కే) ధ్వజమెత్తారు. మంగళగిరిలోని తన కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజధాని ప్రకటించిన సమయంలో దళితులకు చెందిన అసైన్ట్, లంక, ప్రభుత్వ భూములకు రైతుల భూములతో పాటు పరిహారం ప్రకటించకుండా చంద్రబాబు బినామీలు దళితులను బెదిరించి, పరిహారం రాదని భయపెట్టి దళితుల భూములన్నింటిని తక్కువ ధరలకు కొట్టేసినప్పుడు మాజీ ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్ నిద్రపోతున్నారా అని నిలదీశారు. రాజధాని తరలిస్తున్నట్లు ఎవరు చెప్పారని, ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి కాని మరెవరైనా కాని రాజధాని తరలిస్తున్నట్లు చెప్పారా అని ప్రశ్నించారు. తాడికొండ, తుళ్ళూరులతో పాటు రాజధానిలో మంగళగిరి భాగం కాదా చెప్పాలన్నారు. మాజీ ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్‌కు ఇప్పుడు దళితులు గుర్తుకువచ్చారా అని నిలదీశారు. అసలు రాజధానిలో దళితుల భూములన్నింటిని రాజధాని ప్రకటించేనాటికే టీడీపీ నాయకులు హస్తగతం చేసుకున్నారని, ఇప్పుడు మొసలికన్నీరు కారుస్తున్నారని విమర్శించారు. రాజధానిలో ప్లాట్లు కేటాయించే సమయంలోనూ దళితులకు ప్రత్యేకంగా ప్లాట్లు కేటాయిస్తుంటే మాజీ ఎమ్మెల్యేకు కనిపించలేదా అన్నారు. ప్లాట్ల కేటాయింపులోను టీడీపీ నాయకులు వారికి నచ్చిన చోట వారికి నచ్చిన విధంగా వాస్తులు చూసుకుని మరీ ఇచ్చుకుని లాటరీ అంటూ రైతులను మభ్యపెట్టారన్నారు. రాజధాని భూములపై విచారణ కొనసాగుతుందని, పూర్తిస్థాయిలో విచారణ చేసి రాజధానిలో ఇన్సైడర్ ట్రేడింగ్‌ను నిరూపిస్తామని స్పష్టం చేశారు. అన్ని వాస్తవాలను ప్రజల ముందుంచి రాష్ట్ర ప్రజలందరికీ ఒక మంచి రాజధానిని అందించేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి త్వరలోనే ఒక మంచి నిర్ణయం తీసుకుంటారని ఆకాంక్షించారు. -
శ్రవణ్‌కుమార్‌పై మండిపడ్డ రైతులు
సాక్షి, అమరావతి : రాష్ట్ర రాజధాని అంశం విషయంలో ప్రభుత్వంపై కుట్రలు చేస్తున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు దళితుల సమావేశం పేరిట ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రవణ్ కుమార్ హాజరుకానున్నట్లు తెలిపారు. అయితే శ్రవణ్ అక్కడికి రావడానికి ముందే ఆయన అనుచరులు ప్రభుత్వంపై విషం చిమ్ముతూ ప్రసంగించారు. ఈ క్రమంలో సమావేశ స్థలికి చేరుకున్న అసైన్డ్ భూముల రైతులు వారిని అడ్డుకుని శ్రవణ్ కుమార్ దళిత ద్రోహి అంటూ మండిపడ్డారు. నాలుగున్నరేళ్లుగా దళితుల్ని చంద్రబాబు చిత్రహింసలు పెట్టినప్పుడు శ్రవణ్ కుమార్ ఎక్కడికి పోయాడని, దళితులపై టీడీపీ ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టినప్పుడు శ్రవణ్ కుమార్ ఏం చేశాడంటూ రైతులు ప్రశ్నించారు. జీవో నెంబర్ 41తో దళితులకు చంద్రబాబు అన్యాయం చేస్తుంటే అప్పుడు మాట్లాడని శ్రవణ్ కుమార్ ఇప్పుడు ఏం మాట్లాడతాడంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో దళిత రైతులకు, టీడీపీ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం చోటుచేసుకోవడంతో ఉద్రిక్త పరిస్థతి నెలకొంది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి గొడవ సద్దుమణిగేలా చేశారు. -
మంత్రి పదవికి కిడారి శ్రవణ్ కుమార్ రాజీనామా
-
పదవికి రాజీనామా చేసిన మంత్రి
అమరావతి: మంత్రి పదవికి టీడీపీ నేత కిడారి శ్రవణ్ కుమార్ రాజీనామా చేశారు. సీఎంవోకు తన రాజీనామా లేఖను శ్రవణ్ అందజేశారు. సీఎంఓ ద్వారా రాజీనామాను గవర్నర్‌కు పంపారు. సుమారు 8 నెలల క్రితం మావోయిస్టులు అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వర రావును కిడ్నాప్ చేసి హత్య చేసిన సంగతి తెల్సిందే. హత్య జరిగిన తర్వాత 6 నెలల్లో ఉప ఎన్నికలు జరగాల్సి ఉంది. కానీ సార్వత్రిక ఎన్నికలకు కూడా ఎక్కువ సమయం లేకపోవడంతో ఉప ఎన్నికలు నిర్వహించలేదు. దీంతో సర్వేశ్వర రావు కుమారుడు శ్రవణ్ కుమార్‌కు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు నేరుగా తన మంత్రి వర్గంలో చోటు కల్పించారు. మంత్రి పదవి చేపట్టి 6 గడిచిపోయినా ఎమ్మెల్సీ లేదా ఎమ్మెల్యేగా ఎన్నిక కాకపోవడంతో పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. నిబంధనలకు లోబడే రాజీనామా: కిడారి రాజ్యాంగ నిబంధనలకు లోబడి రాజీనామా చేసినట్లు కిడారి శ్రవణ్ కుమార్ తెలిపారు. మంత్రిగా ఆరు నెలల పదవీకాలంలో 3 నెలలు ఎన్నికల కోడ్‌కే పోయిందని చెప్పారు. గిరిజనుడిగా తనకు మంత్రి పదవి దక్కటం సంతోషంగా ఉందన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు తనను కుటుంబసభ్యుడిగా చూసుకున్నారని వాఖ్యానించారు. తన శాఖ ద్వారా గిరిజనుల కోసం ఫుడ్ బాస్కెట్ పథకాన్ని తీసుకురావడం సంతోషకరంగా ఉందని తెలియజేశారు. 6 నెలలే పదవిలో ఉండడంపై ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. -
నారా లోకేశ్‌తో మంత్రి కిడారి శ్రవణ్ సమావేశం
సాక్షి, అమరావతి: గిరిజన సంక్షేమ, ప్రాథమిక విద్య, కుటుంబ సంక్షేమ శాఖల మంత్రి శ్రావణ్ కుమార్ గురువారం ఉండవల్లిలోని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసానికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మంత్రి నారా లోకేశ్‌తో భేటీ అయ్యారు. మంత్రి పదవికి రాజీనామా అంశంపై ఇరువురి మధ్య చర్చ జరిగినట్లు సమాచారం. కిడారి శ్రావణ్ కుమార్ పదవీ బాధ్యతలు చేపట్టి ఈనెల 10వ తేదీ నాటికి (శుక్రవారం) ఆరు నెలలు అవుతోంది. ఈ నేపథ్యంలో కిడారి శ్రావణ్ కుమార్ చేత మంత్రి పదవికి రాజీనామా చేయించాల్సిందిగా గవర్నర్ కార్యాలయ వర్గాలు సీఎంవోకు సూచించినట్టు సమాచారం. దీంతో ఆయన మంత్రి పదవికి రాజీనామా చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో నారా లోకేశ్‌తో ఆయన భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా శ్రావణ్ కుమార్ ఇవాళ తన రాజీనామా పత్రాన్ని ముఖ్యమంత్రికి సమర్పించనున్నుట్లు తెలిసింది. ఆ తరువాత గవర్నర్ ఆమోదానికి సీఎం పంపాల్సి ఉంటుంది. మొత్తానికి ఏ చట్ట సభకు ఎన్నిక కాకుండానే ఆరు నెలలపాటు మంత్రి పదవి అనుభవించిన రికార్డు మాత్రం శ్రావణ్‌కుమార్‌కు దక్కుతుంది. చదవండి: (మంత్రి కిడారితో రాజీనామా చేయించండి) -
నాడు నందమూరి హరికృష్ణ.. నేడు శ్రావణ్
ఆయన శాసనసభ్యుడు కాదు.. కనీసం నామినేటెడ్ ఎమ్మెల్సీ కూడా కాదు.. ఏ చట్టసభలోనూ సభ్యుడు కానప్పటికీ.. కనీసం రాజ్యాంగ పదవులు చేపట్టిన అనుభవమైనా లేనప్పటికీ.. ఏకంగా మంత్రి హోదాలో ఆయా సభల్లోకి అడుగుపెట్టారు.అమాత్యుడిగా అన్ని రకాల అధికారాలు.. రాజభోగాలు అనుభవించారు తప్పితే.. మంత్రిగా క్రీయాశీలంగా వ్యవహరించారా అంటే.. అదీ లేదు. పైగా యువతలతో షికార్లు, జల్సాలతో వార్తల్లోకెక్కారు. ఆయనే మంత్రి కిడారి శ్రావణ్‌కుమార్. సరే.. రాజ్యాంగంలో కల్పించిన అవకాశం మేరకు ఆయన్ను మంత్రిగా కేబినెట్లోకి తీసుకున్నా.. ఆరు నెలల్లోపు శాసనసభ లేదా మండలిలో ఏదో ఒకదానికి సభ్యుడిగా ఎన్నిక కావాల్సి ఉంటుంది. కానీ ఆ రెండూ జరగకపోవడంతో మూడు రోజుల్లో కిడారివారి అమాత్యగిరీ ఊడిపోనుంది.గతంలో ఎన్టీఆర్ తనయుడు నందమూరి హరికృష్ణ విషయంలోనే ఇలా జరిగింది. నాడు.. 1994లో వెన్నుపోటు ఎపిసోడ్లో తనకు అండగా నిలిచినందుకు నజరానాగా చంద్రబాబు హరికృష్ణను రవాణాశాఖ మంత్రి పదవి ఇచ్చారు. కానీ చట్టసభకు మాత్రం పంపకపోవడంతో అర్నెల్లు ముగిసిన వెంటనే ఆయన పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.తిరిగి ఇప్పుడు అటువంటి ఎపిసోడ్‌నే చంద్రబాబు నడిపారు. వైఎస్సార్సీపీ నుంచి ఫిరాయించినందుకు బహుమతిగా కిడారి సర్వేశ్వరరావును ప్రభుత్వ విప్‌గా నియమించారు. ఆ హోదాలో పలు ఆక్రమణలకు పాల్పడిన ఆయన్ను గత ఏడాది నక్సల్స్ హతమార్చారు. ఇదే అదనుగా వైఎస్సార్సీపీకి వీరాభిమానులుగా ఉన్న గిరిజనులను సెంటిమెంట్ అస్త్రంతో తనవైపు తిప్పుకొనేందుకు టీడీపీ అధినేత రాజకీయంగా పావులు కదిపారు. రాజకీయాలతో ఎటువంటి సంబంధం లేని కిడారి తనయుడు శ్రావణ్‌కుమార్‌కు మంత్రి పదవి కట్టబెట్టేశారు. అయితే గడువులోగా ఆయన్ను చట్టసభకు పంపడంలో మాత్రం నిర్లక్ష్యం వహించారు.ఫలితంగా హరికృష్ణ మాదిరిగానే శ్రావణ్ మంత్రి పదవి ముచ్చట ఆర్నెలల్లోనే ముగిసిపోనుంది. సాక్షి, విశాఖపట్నం: గిరిజనులు 2014 ఎన్నికల్లో వైఎస్సార్సీపీని అక్కున చేర్చుకున్నారు. ఆ పార్టీ తరపున బరిలో నిలిచిన వారందరినీ గెలిపించారు. అలా అరుకు నుంచి కిడారి సర్వేశ్వరరావు ఎమ్మెల్యే అయ్యారు. ఆ తర్వాత ప్రలోభాలకు లొంగిపోయి అధికార టీడీపీలోకి ఫిరాయించారు. ప్రభుత్వ విప్ అయ్యరు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని అడ్డగోలు దోపిడీకి పాల్పడ్డారు. అక్రమ మైనింగ్ కార్యకలాపాలకు పాల్పడి మావోల ఆగ్రహానికి గురయ్యారు. పలుమార్లు హెచ్చరించినా తీరుమారకపోవడంతో టీడీపీ మాజీ ఎమ్మెల్యే సివేరి సోమతో కలిసి వెళ్తుండగా సర్వేశ్వరరావును గత ఏడాది సెప్టెంబర్ 23న మావోలు మట్టుబెట్టారు. రాజకీయ లబ్ధి కోసమే.. ఎస్టీ నియోజకవర్గాల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులే గెలవడంతో గిరిజన సలహా మండలిని కూడా ఏర్పాటు చేయని, ఆ వర్గానికి చెందిన వారిని మంత్రులుగా నియమించలేకపోయిన చంద్రబా బు.. సర్వేశ్వరరావు హత్యను రాజకీయ లబ్ధికి ఉపయోగించుకున్నారు. కిడారి తనయుడు శ్రావణ్‌కుమార్‌ను తెరపైకి తెచ్చి మంత్రిగిరీ కట్టబెట్టేశారు. శ్రావణ్ చట్టసభల్లో సభ్యుడు కాదు.. పైగా ఆర్నెలల్లోనే ఎన్నికలు ఉన్నాయి. ఇలాంటి తరుణంలో మంత్రి పదవి కట్టబెట్టడం సరికాదన్న వాదనలు వినిపించినా ఖాతరు చేయలేదు. రాజ్యాంగంలో ఉన్న అవకాశాన్ని అడ్డం పెట్టుకొని గత నవంబర్ 11న జరిగిన కేబినెట్ విస్తరణలో శ్రావణ్‌కుమార్‌కు చోటు కల్పించి గిరిజన సంక్షేమ శాఖ అప్పగించేశారు. మండలికైనా పంపలేదు చట్టసభల్లో సభ్యులు కాని మంత్రులు ఆర్నెల్లలోపు కచ్చితంగా ఏదో ఒక సభకు ఎన్నిక కావాల్సి ఉంటుందని రాజ్యాంగం స్పష్టం చేస్తోంది. ఈ విషయం తెలిసినా.. ఈ మధ్య కాలంలో ఎమ్మెల్యే, గవర్నర్, స్థానిక సంస్థలు కోటా ఎమ్మెల్సీ స్థానాలను ఎన్నికలు జరిగినా కిడారికి మాత్రం చంద్రబాబు అవకాశం ఇవ్వలేదు. ఇటీవలి సార్వత్రిక ఎన్నికల్లో అరకు నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయించారు. ఆ ఫలితాలు రాకముందే.. ఈ నెల 11కే ఆరు నెలల గడువు ముగుస్తుండటంతో మంత్రి పదవికి శ్రావన్ నీళ్లొదలాల్సిన పరిస్థితి తలెత్తింది. శ్రావణ్‌కుమార్‌తో రాజీనామా చేయించమని సీఎం చంద్రబాబుకు గవర్నర్ నరసింహన్ ఇప్పటికే సూచించారు. కిడారికి సైతం గవర్నర్ నుంచి ఆ వర్తమానం అందింది. దీంతో సభ్యుడు కాకుండానే చట్టసభల్లోకి అడుగుపెట్టి.. ఆర్నెల్లపాటు మంత్రి పదవిని అనుభవించి.. రాజీనామా చేసిన అరుదైన రికార్డు శ్రావణ్ కుమార్‌కు దక్కింది. నందమూరి హరికృష్ణ తర్వాత రాష్ట్రంలో ఇలా పదవి పోగొట్టుకున్న రెండోవ్యక్తి శ్రావనే. కాగా అరుకు నుంచి టీడీపీ తరపున బరిలోకి దిగిన శ్రావణ్‌కుమార్ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఫలితాల తర్వాతైనా ఆయన చట్టసభలోకి అడుగు పెడతారా?.. ఓటమి పాలై చట్టసభ్యుడు కాని మాజీ మంత్రిగానే మిగిలిపోతారో? చూడాలి. కాగా తమ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబును సంప్రదించిన తర్వాత రాజీనామా చేస్తానని కిడారి మీడియాకు తెలిపారు. ఆర్నెల్ల పాటు మంత్రి హోదా చెలాయించిన కిడారి రబ్బర్ స్టాంప్‌గానే ముద్రపడ్డారు. పైగా మంత్రి పదవిని అడ్డంపెట్టుకుని యువతులతో షికార్లు, విహార యాత్రలు, జల్సాలు చేశారన్న అపవాదు మూటగట్టుకున్నారు. -
మంత్రి కిడారితో రాజీనామా చేయించండి
సాక్షి, అమరావతి: గిరిజన సంక్షేమ, ప్రాథమిక విద్య, కుటుంబ సంక్షేమ శాఖల మంత్రి కిడారి శ్రావణ్‌కుమార్‌తో రాజీనామా చేయించాలని గవర్నర్ కార్యాలయం నుంచి ఆదేశాలు వెలువడినట్టు తెలిసింది. శ్రావణ్‌కుమార్ ఇటు అసెంబ్లీకి గాని, అటు శాసన మండలికి గాని ఎన్నిక కాకుండానే మంత్రిపదవి చేపట్టారు. రాజ్యాంగం మార్గదర్శక సూత్రాల ప్రకారం ఎవరైనా మంత్రిగా పదవి చేపట్టిన తరువాత ఏ చట్టసభకైనా (అసెంబ్లీ లేదా మండలి) సభ్యునిగా ఎన్నిక కావాల్సి ఉంది. ఆయన పదవీ బాధ్యతలు చేపట్టి ఈనెల 10వ తేదీ నాటికి ఆరు నెలలు అవుతోంది. ఈ నేపథ్యంలో కిడారి శ్రావణ్‌కుమార్ చేత మంత్రి పదవికి రాజీనామా చేయించాల్సిందిగా గవర్నర్ కార్యాలయ వర్గాలు సీఎంవోకు సూచించినట్టు సమాచారం. దీంతో ఆయన మంత్రి పదవికి రాజీనామా చేయాల్సిన పరిస్థితి నెలకొంది. హడావుడి నిర్ణయంతో మంత్రి అయ్యారు నాలుగున్నరేళ్లు పాటు మంత్రివర్గంలో ముస్లింలు, గిరిజనులకు అవకాశం కల్పించని చంద్రబాబు ఎన్నికలకు ముందు కంటితుడుపు చర్యగా గత ఏడాది నవంబర్ 11వ తేదీన కిడారి శ్రావణ్‌కుమార్‌ను, ఫరూక్‌ను మంత్రివర్గంలో తీసుకున్నారు. ఆ తరువాత ఫరూక్‌కు ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టడంతో ప్రస్తుత ప్రభుత్వ పదవీ కాలం ముగిసేంత వరకు ఆయన మంత్రి పదవికి ఢోకా లేదు. కిడారికి మాత్రం టీడీపీ ఆ అవకాశం కల్పించలేదు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తరఫున ఎమ్మెల్యే పదవికి పోటీ చేసినప్పటికీ.. ఫలితాలు వెలువడలేదు. ఇదిలావుంటే.. గత అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ తరఫున అరకు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి విజయం సాధించిన కిడారి సర్వేశ్వరరావు ఆ తరువాత చంద్రబాబు ప్రలోభాలకు లోనై తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకున్నారు. గత ఏడాది సర్వేశ్వరరావును నక్సలైట్లు హతమార్చారు. విధిలేని పరిస్థితుల్లో ఆయన కుమారుడు కిడారి శ్రావణ్‌కుమార్‌ను మంత్రివర్గంలోకి తీసుకుని అతనికి గిరిజన సంక్షేమం, ప్రాథమిక విద్య, కుటుంబ సంక్షేమ శాఖలను చంద్రబాబు కేటాయించారు. ఇదిలావుంటే.. మంత్రి శ్రావణ్‌కుమార్ స్పందిస్తూ గవర్నర్ కార్యాలయం నుంచి ఎటువంటి సమాచారం రాలేదని, ముఖ్యమంత్రిని కలిసి ఆయన సూచన మేరకు నడుచుకుంటానని పేర్కొన్నారు. ఐతే, కిడారి గురువారం సీఎంకు రాజీనామా పత్రాన్ని సమర్పించనున్నుట్లు తెలిసింది. ఆ తరువాత గవర్నర్ ఆమోదానికి సీఎం పంపాల్సి ఉంటుంది. మొత్తానికి ఏ చట్ట సభకు ఎన్నిక కాకుండానే ఆరు నెలలపాటు మంత్రి పదవి అనుభవించిన రికార్డు మాత్రం శ్రావణ్‌కుమార్‌కు దక్కుతుంది. -
మంత్రి పదవి కోల్పోనున్న కిడారి శ్రవణ్ కుమార్
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య, గిరిజన సంక్షేమ శాఖమంత్రి మంత్రి కిడారి శ్రవణ్ రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది. మావోయిస్టుల కాల్పుల్లో అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు మృతి చెందడంతో ఆయన కుమారుడు కిడారి శ్రవణ్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలోకి తీసుకున్నారు. గత ఏడాది నవంబర్ 11న ఆయన మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అయితే కిడారి శ్రవణ్ కుమార్ ఆరు నెలల్లోగా ఏదో చట్టసభల్లో సభ్యుడిగా ఉండాలి. ఈ నెల 10వ తేదీతో ఆరు నెలల గడువు పూర్తి కానున్న నేపథ్యంలో ఆయన చేత రాజీనామా చేయించాలని గవర్నర్ నరసింహన్ ... ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు సూచించారు. ఈ మేరకు రాజ్‌భవన్ అధికారులు మంగళవారం సాయంత్రం ఏపీ సర్కార్‌కు సమాచారం అందించింది. కాగా రాజ్యాంగం ప్రకారం మంత్రి పదవి చేపట్టి ఆరు నెలలలోపు చట్టసభల్లో సభ్యుడిగా ఎన్నిక అవ్వాల్సి ఉంటుంది. లేకుంటే పదవి కోల్పోవాల్సి ఉంటుంది. మరోవైపు ఈ విషయంపై కిడారి శ్రవణ్ కుమార్ ఇవాళ ముఖ్యమంత్రిని కలవనున్నట్లు తెలుస్తోంది. ఆయన సూచన మేరకు నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. -
తాడికొండలో.. అనకొండలు..
సాక్షి, గుంటూరు: తాడికొండ నియోజకవర్గంలో అధికార పార్టీకి చెందిన అవినీతి అనకొండలు పడ్డాయి. స్థానిక ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్ సారథ్యంలో ప్రజా ధనాన్ని నిలువునా దోచుకున్నాయి. రాజధాని ప్రాంతం కావడంతో ప్రభుత్వ, ప్రైవేటు అనే తేడా లేకుండా భూములను కబ్జా చేశాయి. రైతుల పొలాల్లో సెంట్ల చొప్పున భూమి కాజేసి కోట్ల రూపాయలు దండుకున్నాయి. నీరు– చెట్టు పథకం పేరిట అడ్డగోలుగా చెరువులు, పంట పొలాలను తవ్వేసి మట్టిని అమ్మేసుకున్నాయి. గ్రావెల్‌ను సైతం కొల్లగొట్టి కోట్ల రూపాయలు గడించాయి. కమీషన్లకు కక్కుర్తి పడి అభివృద్ధి పనుల్లో నాణ్యతకు పాతర వేశాయి. ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్ అండదండలతో నియోజకవర్గాన్ని అక్రమాలు, అవినీతి, అరాచకాలకు కేంద్ర బిందువుగా మార్చాయి. అక్రమంగా కాజేసిన సొమ్ము పంపకాల్లో తేడాలొచ్చి.. మింగిన ప్రజాధనం వివరాలన్నీ రోడ్డెక్కి మరీ కక్కేశాయి. మొత్తంగా నియోజకవర్గంలో సుమారు రూ.400 కోట్ల వరకు సహజ వనరులను లూటీ చేశాయి. ఇవన్నీ తెలిసినా ముడుపులు తీసుకున్న అధికారుల చేతులు నిబంధనలన్నింటినీ తమ గుప్పెట్లో పెట్టుకుని ముడుచుకుపోయాయి. రూ.200 కోట్లపైనే.. టీడీపీ ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్ అండదండలతో రాజధాని ప్రాంతం తుళ్లూరు మండలంలో అధికార పార్టీ నాయకులు రెచ్చిపోతున్నారు. నేటి వరకూ తుళ్లూరు మండలంలోని వివిధ గ్రామాల్లో భూకబ్జాలు, అక్రమ వసూళ్లు, మట్టి తవ్వకాల్లో రూ.200 కోట్లకుపైగా దిగమింగారు. వడ్డమాను గ్రామం ఎంపీటీసీ పిన్నక సాంబశివరావు 74/ఏ, 74/బీ అనే సర్వే నంబర్లలో సుమారు 33.7 ఎకరాల కొండ పోరంబోకు భూమిని కబ్జా చేశాడు. దీని విలువ సుమారు రూ. 20 కోట్లపైనే ఉంటుంది. పేదలకు చెందాల్సిన భూమిలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని గృహాలు నిర్మించుకున్నారు. యథేచ్ఛగా గ్రావెల్ తవ్వకాలు.. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఎమ్మెల్యే శ్రావణ్, ఆయన అనుచరులు నియోజవకర్గంలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఖాళీ జాగా కనిపిస్తే చాలు అక్కడ రాబందుల్లా వాలిపోయి భూమిని వశపరుచుకొని అక్రమంగా మట్టి, గ్రావెల్ తవ్వకాలను సాగిస్తున్నారు. కైలాసగిరి కొండ ప్రాంతంలో ఎమ్మెల్యే శ్రావణ్ అనుచరులు గ్రావెల్ తవ్వకాలు కొనసాగిస్తున్నారు. సర్వే నంబర్ 573లో 7 ఎకరాల 28 సెంట్ల కుంట పోరంబోకు స్థలంలో గతంలో మాజీ సైనికులు, నిరుపేదలకు ప్రభుత్వం ఇళ్లు, పంటలు వేసుకోవటానికి భూమి ఇచ్చింది. ఈ భూములపై కన్నేసిన ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్ పీఏ బత్తుల సురేశ్‌బాబు, విశదల గ్రామానికి చెందిన ఎమ్మెల్యే సన్నిహితుడు నరేంద్ర 2018 ఫిబ్రవరి నుంచి ఇష్టారాజ్యంగా తవ్వకాలు జరుపుతున్నారు. టిప్పర్‌కు రూ.1500 చొప్పున గ్రావెల్‌ను అమ్ముకుంటున్నారు. ఇలా రోజుకు వందల సంఖ్యలో టిప్పర్లను తిప్పుతున్నారు. ఇలా ఎమ్మెల్యే శ్రావణ్, ఆయన పీఏ, సన్నిహితుడు గ్రావెల్ అక్రమ రవాణా ద్వారా రూ.2 కోట్లకుపైగా గడించారు. లాంలో అక్రమంగా లోడింగ్ చేస్తున్న గ్రావెల్ (ఫైల్) సొసైటీ లీజులు అతిక్రమించి.. లాంలో ది లాం లేబర్ కాంట్రాక్ట్ కో–ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ పేరిట 60 సంవత్సరాలుగా లీజు పాలసీ నడుస్తోంది. దీనికి ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు నిర్వహించి అధ్యక్షుడిని ఎన్నుకుని సర్వే నెం. 199ఏలో 1.5 హెక్టార్ల కొండను మైనింగ్ చేసుకుంటున్నారు. సొసైటీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి చెందిన అభ్యర్థి పరాజయం పాలవడంతో ఎలాగైనా క్వారీని సొంతం చేసుకోవాలనుకున్న నాయకులు కుటిల పన్నాగం పన్నారు. అధికారులను, అధికారాన్ని అడ్డుగా పెట్టి క్వారీని నిలిపేయించడంతోపాటు పలుమార్లు కోర్టుల్లో కేసులు వేశారు. దీంతో మూడున్నర సంవత్సరాలుగా క్వారీ మూతపడి కార్మికులు రోడ్డున పడ్డారు. అధికార పార్టీకి చెందిన నాయకులు మాత్రం యథేచ్ఛగా గ్రావెల్‌ను తవ్వి అమ్మకాలు జరుపుకుంటూ కాసులు వెనకేసుకున్నారు. గతంలో గ్రామానికి చెందిన ఓ మైనార్టీ నాయకుడు ఈ తంతుకు తెరలేపడంతో అధికారులు కిమ్మనకుండా కూర్చున్నారు. రాత్రివేళ యంత్రాలతో మట్టిని తవ్వి పోగుచేయడంతోపాటు లోడింగ్ చేసి గుంటూరు, లాం పరిసర ప్రాంతాలలోని వెంచర్లకు, బహిరంగ మార్కెట్లో అమ్మకాలు చేశారు. దీనిపై సొంత పార్టీ నాయకులే బహిరంగ ఆరోపణలు చేయడం, లీజుదారులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో తవ్వకాలు నిలిచిపోయాయి. ఎమ్మెల్యే అండదండలతో నెక్కల్లు గ్రామంలో ఆయన అనుచరుల అరాచకాలకు అడ్డూఅదుపూ లేకుండా పోయింది. నెక్కల్లు గ్రామానికి ప్రధాన రహదారి వెంబడి ఉన్న సర్వే నెంబర్ 87/ఏలో తుళ్లూరు చేనేత పరపతి విక్రయ సంఘం భూమిని ఎమ్మెల్యే అనుచరుడు మేకల రవికుమార్ తన భార్య పేరు మీద నకిలీ దస్తావేజులు సృష్టించి భవనం నిర్మించుకున్నాడు. 25 సెంట్ల విస్తీర్ణం గల ఈ భూమి రూ. 3 కోట్ల విలువ ఉంది. గ్రామంలో 24 ఎకరాల్లో ఉన్న ఊర చెరువు భూమిలో ఎమ్మెల్యే అనుచరులు దాదాపు 5 ఎకరాలు ఇప్పటికే ఆక్రమించుకుని పశువుల పాకలను నిర్మించారు. ప్రస్తుతం మరో మూడు ఎకరాలకు మట్టిని తోలి లెవల్ చేస్తున్నారు. టీడీపీ నాయకులు ఆక్రమించిన ఈ 8 ఎకరాలు రూ. 80 కోట్లపైనే విలువ చేస్తుంది. సైనికుడి భూమిని చెరబట్టారు... ఆర్మీలో పనిచేసిన కొడుకుతో తల్లి షబీరున్నీసాబీ మేడికొండూరుకు చెందిన షేక్ ఆదాం సైన్యంలో పని చేశారు. భారత్–చైనా యుద్ధంలో పాల్గొన్నారు. ఆదాంను భారత ప్రభుత్వం మెడల్స్‌తో సత్కరించింది. రెండు దశాబ్దాలకుపైగా భారత సైన్యంలో సేవలందించినందుకుగాను అతనికి మేడికొండూరు పోలీస్‌స్టేషన్ సమీపంలో సర్వే నంబర్ 347లో 2 ఎకరాల 59 సెంట్ల భూమిని 1964లో రాసిచ్చింది. ఈయనకు ఇద్దరు పిల్లలు. వీరిలో ఒకరు ఆర్మీలో పని చేశారు. మాజీ సైనికుడికి ఇచ్చిన భూమిపై ఎమ్మెల్యే శ్రావణ్ అనుచరుల కన్ను పడింది. పచ్చగా సాగవుతున్న భూమిని టీడీపీ కబ్జాకోరులు 4 సంవత్సరాల క్రితం నీరు– చెట్టు పేరుతో తవ్వేసి చెరువులో కలిపేశారు. భర్త మరణానంతరం షబీరున్నీసాబీ ప్రభుత్వమిచ్చిన భూమిని సాగు చేసుకుంటూ పొట్ట పోసుకొంటోంది. అధికార పార్టీ నేతలు భూమిని అన్యాక్రాంతం చేయడంతో ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతోంది. ఎమ్మెల్యే ముఖ్య అనుచరుడు, ప్రస్తుత ఫిరంగిపురం మార్కెట్ యార్డు చైర్మన్ నార్నె శ్రీనివాసరావు నేతృత్వంలో జరిగిన భూకబ్జాపర్వంపై ఎదురు తిరిగినందుకు ఆదాం రెండో కుమారునిపై ఎస్సీ, ఎస్టీ కేసు బనాయించి జైలుకు పంపారు. దేశం కోసం పోరాడిన సైనికుని కుటుంబానికి ఇంతటి కష్టమొస్తే కనీసం ఆదుకోవాల్సిన రెవెన్యూ అధికారులు సైతం పచ్చపార్టీ నేతల అడుగులకు మడుగులొత్తారు. సెంట్లు చొప్పున భూమిని కాజేశారు అనంతవరం లో ఎమ్మెల్యే ప్రధాన అనుచరులు ఒక్కో రైతు నుంచి వారి రికార్డుల ఆధారంగా చేసుకుని సెంట్లు భూమిని కాజేశారు. 30 ఎకరాలలో ఈ విధంగా చిన్న సన్నకారు దళిత రైతుల వద్ద నుంచి ఆక్రమించుకున్నారు. ఇదేంటని ప్రశ్నించిన వారిపై కేసులు నమోదు చేశారు. కోర్టులను ఆశ్రయించడంతో కేవలం నోటీసులు మాత్రమే జారీ చేసి రెవెన్యూ, సీఆర్డీఏ అధికారులు చేతులను దులుపుకున్నారు. టీడీపీ నేతలు కబ్జా చేసిన భూమి విలువ సుమారుగా రూ.50 కోట్ల వరకు ఉంటుంది. మట్టిని మింగేశారు రావెల–పొన్నెకల్లు గ్రామాల మధ్య చెరువులో మట్టిని మండల పార్టీ ఉపాధ్యక్షుడు దగ్గుమల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పలువురు టీడీపీ నాయకులు జన్మభూమి కమిటీ పేరిట ప్రైవేటు వెంచర్లు, ఇతర గ్రామాలకు మళ్లించి రూ. 4 కోట్ల అవినీతికి పాల్పడ్డారంటూ అదే పార్టీకి చెందిన మాజీ ఎంపీపీ కొమ్మినేని రామచంద్రరావు ఆరోపించడంతో భారీ అవినీతి తంతు బయటపడింది. 4 సంవత్సరాలలో అక్రమంగా క్వారీయింగ్ నిర్వహించి పరిమితికి మించి మట్టిని తవ్వారని, రూ.4 కోట్ల మేర మట్టిని నీరు చెట్టు పథకం పేరిట స్వాహా చేశారని పంచాయతీ వార్డు మెంబర్లే స్వయంగా ఏడుగురి సంతకాలతో కలెక్టర్‌కు గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో అధికారులు దాడులు నిర్వహించి వాహనాలను సీజ్ చేశారు. పొన్నెకల్లులో నీరు– చెట్టు కింద పూడికతీత తీసిన మట్టి విక్రయాలకు సంబంధించి లెక్కల విషయంలో మాజీ గ్రామ పార్టీ అధ్యక్షుడు గుర్రం ఆదినారాయణ, ప్రస్తుత మార్కెట్ యార్డు ఛైర్మన్ గుంటుపల్లి మధుసూదనరావు వర్గీయుల మధ్య తీవ్ర విభేదాలు తలెత్తి ఎమ్మెల్యే ఎదుటే వాదోపవాదాలకు దిగారు. రూ. కోట్లు గడించారు తాడికొండ మండల కేంద్రలో నీరు–చెట్టు కార్యక్రమం పేరుతో టీడీపీ నాయకులు భారీగా మట్టిని తరలించి రూ. కోట్లు గడించారు. మట్టిని అమ్మడం ద్వారా వచ్చిన ఆదాయం వివరాలు ఇంత వరకు బయటకు పొక్కనీయకపోవడం గమనార్హం. గ్రామ పంచాయతీలో తీర్మానం, టెక్నికల్ ఎస్టిమేట్లు లేకుండా షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం చేసి విరాళాల పేరిట రూ.6 లక్షలు అధికార పార్టీ నాయకులు వసూలు చేశారు. ఎలాంటి వేలం నిర్వహించకుండా విరాళాలు సేకరించిన వారికే దుకాణాలు కేటాయిస్తామంటూ హామీ కూడా ఇచ్చి హడావుడిగా ప్రారంభోత్సవం చేశారు. విషయం పత్రికలకు ఎక్కడంతో దాదాపు ఏడాదిన్నరగా షాపింగ్ కాంప్లెక్స్ మూతబడింది. విరాళాలను పంచాయతీ ఖాతాలో జమ చేయకుండా సొంతానికి వాడుకున్న టీడీపీ నాయకులు.. ఆ కాంప్లెక్స్‌కు తిరిగి ప్రభుత్వ నిధులు బిల్లులు చేయాలంటూ అధికారులను ఒత్తిడికి గురి చేస్తున్నారు. టీడీపీకి చెందిన వార్డు మెంబర్ ఇళ్ల స్థలాలను ఆక్రమించి అక్రమంగా నిర్మాణాలు చేపట్టారు. అతనికి పంచాయతీకి చెందిన స్థలాలను లీజు పేరిట కట్టబెట్టారు. కంతేరులో భారీ దోపిడీ కంతేరు గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు సర్పంచ్‌ను సైతం పక్కన పెట్టి పారదర్శకత అంటూ ప్రచారం చేస్తూ సొంత వ్యక్తులను నియమించుకొని భారీగా మట్టి దోపిడీకి పాల్పడ్డాడు. ఈ నిధులకు ఆడిటింగ్ చేయించిన అనంతరం గ్రామంలో పంచాయతీ భవనం నిర్మాణం చేయిస్తానంటూ నిధులు జేబులోకి మళ్లించాక చేతులెత్తేశాడు. మట్టి వ్యవహారంపై అçప్పట్లో సర్పంచ్ భర్తకు ఓ ప్రజాప్రతినిధికి మధ్య తీవ్ర వాగ్వాదం జరగడంతో విషయం బయటకు పొక్కింది. రావెలలో.. తెలుగు తమ్ముళ్లు నీరు– చెట్టు పేరిట సహజ సంపదను దోచుకొని జేబులు నింపుకున్నారు. తాడికొండ మండలం రావెల గ్రామంలో అధికార పార్టీకి చెందిన మండల పరిషత్ ఉపాధ్యక్షుడు దగ్గుమల్లి శ్రీనివాసరావు నీరు– చెట్టు పథకం కింద మట్టిని అమ్ముకొని రూ. కోట్లు కొల్లగొట్టారంటూ అదే పార్టీకి చెందిన కొమ్మినేని రామచంద్రరావు మీడియా సాక్షిగా ధ్వజమెత్తారు. లాంలో మట్టి దందా నడుపుతూ ఎమ్మెల్యే శ్రవణ్ పేరు చెప్పి బెదిరింపులకు దిగుతున్నారంటూ గతంలో టీడీపీకి చెందిన ఓ వర్గం ఆందోళనకు దిగింది. పొన్నెకల్లులో మరో అడుగు ముందుకేసిన నాయకులు నీరు–చెట్టు పథకం కింద గ్రామ అవసరాలకు దానంగా ఇచ్చిన ఊర చెరువును పూడ్చి కల్యాణ మండపం నిర్మిస్తామంటూ విమర్శించారు. ఎమ్మెల్యే అండదండలతో నెక్కల్లు గ్రామంలో ఆయన అనుచరుల అరాచకాలకు అడ్డూఅదుపూ లేకుండా పోయింది. నెక్కల్లు గ్రామానికి ప్రధాన రహదారి వెంబడి ఉన్న సర్వే నెంబర్ 87/ఏలో తుళ్లూరు చేనేత పరపతి విక్రయ సంఘం భూమిని ఎమ్మెల్యే అనుచరుడు మేకల రవికుమార్ తన భార్య పేరు మీద నకిలీ దస్తావేజులు సృష్టించి భవనం నిర్మించుకున్నాడు. 25 సెంట్ల విస్తీర్ణం గల ఈ భూమి రూ. 3 కోట్ల విలువ ఉంది. గ్రామంలో 24 ఎకరాల్లో ఉన్న ఊర చెరువు భూమిలో ఎమ్మెల్యే అనుచరులు దాదాపు 5 ఎకరాలు ఇప్పటికే ఆక్రమించుకు ని పశువుల పాకలను నిర్మించారు. ప్రస్తుతం మరో మూడు ఎకరాలకు మట్టిని తోలి లెవల్ చేస్తున్నారు. టీడీపీ నాయకులు ఆక్రమించిన ఈ 8 ఎకరాలు రూ. 80 కోట్లపైనే విలువ చేస్తుంది. కమీషన్ల దందా పెదపరిమి గ్రామంలో ఎమ్మెల్యే పేరు చెప్పుకుని టీడీపీ సీనియర్ నాయకుడు, రైతు విభాగం నేత నూతలపాటి రామారావు చేస్తున్న అవినీతి పరాకాష్టకు చేరింది. గ్రామంలో ఏ అభివృద్ధి పని చేపట్టినా ఈయన కమిషన్లు వసూలు చేస్తున్నారు. నీరు చెట్టు పథకాన్ని అడ్డుపెట్టుకుని భారీగా మట్టి అమ్ముకున్నారు. సిలార్‌ఖాన్ అనే కౌలు రైతు 2015 సెప్టెంబరు 21 తేదీన అప్పుల బాధ తాళలేక పురుగుల మందు తాగి మరణించాడు. కౌలు రైతు కుటుంబానికి ప్రభుత్వం నుంచి వచ్చే ఆర్థిక సహాయంలో వాటా ఇవ్వటానికి సిలార్ కుటుంబ సభ్యులు ముందుకు రాకపోవడంతో ఎమ్మెల్యే ద్వారా ఆ పరిహారాన్ని నిలిపి వేయించాడు. తుళ్లూరుకు చెందిన సీనియర్ నాయకుడు ఒకరు సీఆర్డీఏ అధికారులను తన చెప్పుచేతల్లో పెట్టుకుని ఉద్యోగ విరమణ చేసిన అధికారులను కొనసాగిస్తూ గ్రామ కంఠాల పరిహారాలను ఒకటికి రెండింతలు పొందుతున్నారు. నీరు–చెట్టు పథకంలో దోపిడీ రూ.100 కోట్లు భూకబ్జాలతో దండుకున్న మొత్తం రూ.200 కోట్లు గ్రావెల్ అమ్ముకున్న సొమ్ము రూ.50 కోట్లు రైతుల పొలాల్లో సెంట్ల రూపంలో కాజేసిన భూమి రూ.50 కోట్లు కైలాసగిరి కొండ ప్రాంతంలో మట్టి తరలిస్తున్న లారీలు తాడికొండలో మట్టి తరలిస్తున్న టిప్పర్లు, ట్రాక్టర్లు