
పెళ్లికిముందే వరకట్న కాటు: యువతి బలి
ఆత్మకూరు: పెళ్లి కాకముందే వరకట్న వేధింపులు ఒక నిండు జీవితాన్ని బలి తీసుకున్నాయి. నిశ్చితార్థం సమయంలో కట్నకానుకలు మాట్లాడుకున్నారు. పెళ్లిలో ఒప్పుకున్న కట్నం నగదు మొత్తం ఇవ్వాలంటూ ఓ యువకుడు వేధించగా.. ఆ యువతి బలవన్మరణానికి పాల్పడింది. వరంగల్ జిల్లా ఆత్మకూరులో గు రువారం అర్ధరాత్రి జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు. ఆత్మకూరుకు చెందిన మార్త శంకర్-రమ దంపతుల ఏకైక కుమార్తె రోజారాణి(21) పీజీ, బీఈడీ పూర్తి చేసింది. ఆమెకు నా లుగు నెలల క్రితం దుగ్గొండి మండలం మైసంపల్లెకు చెందిన ఎంఫార్మసీ పూర్తిచేసిన బిట్ల శ్రావణ్‌కుమార్‌తో వివాహం నిశ్చయించారు. వీరు బంధువులే. నిశ్చితార్థ సమయంలో రూ. 5 లక్ష లు ఇచ్చిన రోజారాణి తల్లిదండ్రులు రూ. 2 లక్షలు వివాహం సమయంలో, ఆ తర్వాత కొం తకాలానికి రూ. 6 లక్షలు ఇస్తామని ఒప్పుకున్నా రు. అలాగే, ఈనెల 18న పెళ్లి ముహూర్తం కూ డా నిశ్చయించారు.
అయితే, పెళ్లి సమయంలో మొత్తం కట్నం ఇవ్వాలని, లేకుంటే పెళ్లి ఆపుతానని శ్రావణ్‌కుమార్ తరచూ ఫోన్‌లో ఆమెను వేధించసాగాడు. గురువారం ఇరువర్గాల వారు పెళ్లి దుస్తుల కోసం హన్మకొండకు వెళ్లారు. చెప్పులు కొనుక్కునేందుకు శ్రావణ్, రోజారాణి వెళ్లగా, అక్కడ కూడా డబ్బుల విషయంలో ప్రస్తావించాడు. దీంతో మనస్తాపానికి గురైన రోజారాణి గురువారం అర్ధరాత్రి తర్వాత ఇంటిపైకి వెళ్లి ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పం టించుకుంది. బాధ భరించలేక అరుస్తూ డాబా పైనుంచి కిందకు దూకగా.. స్థానికులు, తల్లిదండ్రులు ఆమెను చికిత్స నిమిత్తం వరంగల్ ఎంజీఎంకు తరలించారు. అక్కడ శుక్రవారం మృతి చెందింది. అయితే, కట్నం డబ్బు కోసం శ్రావణ్ వేధించడం వల్లే తన కుమార్తె ఆత్మహత్య చేసుకుందని ఆమె తండ్రి చేసిన శంకర్ ఫిర్యాదుతో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.