వరిని ఆశించే క్రిమికీటకాల నివారణ
వరినాట్లు వేసిన తర్వాత 30 రోజులకు 10కిలోల వేప పిండిని లేదా కానుగ పిండిని పొడి చేసి ఎకరం పొలంలో చల్లాలి. ఇది గొంగలి పురుగులను నివారిస్తుంది.
వేప ఆకులను కట్టగా కట్టి ఎకరం పొలంలో పలు ప్రదేశాల్లో 10 చోట్ల పెట్టడం ద్వారా కూడా ఈ పురుగులను తరిమివేయవచ్చు.
5కిలోల ఆముదం గింజలను పెనంపై వేయించి, పొడి చేసి, దీనికి తగువిధంగా నీరు కలిపి పేస్టు(ముద్ద)గా తయారు చేయాలి. - దీన్ని మట్టి కుండలో ఉంచి ఎకరా పొలంలో 5, 6చోట్ల పెట్టాలి. ప్రతి పది
రోజులకోసారి పేస్టును మారుస్తుండాలి.
మట్టి కుండలపై మూత పెట్టకూడదు.
ఇది రెక్కల పురుగులను ఆకర్శించడానికి ఎరగా ఉపయోగపడుతుంది.
వరి పొలాల్లో నిండా నీరు పెట్టడం వల్ల నేలల్లో దాగి ఉన్న డింబక, కోశస్థ దశ క్రిములు
బయటకు రావడంతో పక్షలు వీటిని తినేస్తాయి.
దీనికోసం ఎకరం పొలంలో నాలుగైదు చొప్పున పక్షి స్థావరాలను ఏర్పాటు చేయాలి.
వరి ఈనిన తర్వాత టీ ఆకారంలో కర్రలను క ట్టి పొలంలో అక్కడక్కడ పాతాలి.
వీటిపై వాలే పక్షులు పంటలను పాడు చేసే పురుగులను తినేస్తాయి.
లీటరు కిరోసిన్(గ్యాస్‌నూనె)లో అర కిలో వెళ్లుల్లిని రాత్రంతా నాబెట్టాలి. ఉదయం దీనికి పావు కిలో అల్లం, పావుకిలో పచ్చిమిర్చిని కలిపి తగినంత నీటిని వేసుకుని దీన్ని పేస్టుగా నూరుకోవాలి. దీనిలో కొన్ని మిరపకాయలు వేసి తగినంత నీటితో కలిపి పేస్టుగా చేసుకోవాలి.
దీన్ని 60లీటర్ల నీటిలో కలిపి ఎకరం పైరుపై పిచికారీ చేయాలి.
మిడతలు, నల్ల నల్లులు, తాటాకు తెగులు నివారణ
పొలంలోని పలు ప్రదేశాల్లో కొన్ని జిల్లేడు ఆకులను ఒకదానిపై ఒకటి పేర్చాలి.
వీటి ప్రభావం వల్ల మితడత లు, నల్లనల్లు, తాటాకు తెగులు నుంచి పంటలను కాపాడుకోవచ్చు.
ఎకరానికి 10-15 కిలోల విప్ప పిండి లేదా వేప చెక్కలతో పదిహేను రోజులకు ఒకసారి పొలంలో పొగబెట్టాలి.
5లీటర్ల కిరోసిన్‌ను 30లీటర్ల నీటిలో కలిపి సాయంత్రం వేళల్లో పొలంలో స్రే చేస్తే చేలకు హానిచేసే పురుగులు నివారించబడుతాయి.
పిండి నల్లి, ఎర్ర నల్లి నివారణ
వేపగింజల పొడిని ఒక గుడ్డ సంచిలో రాత్రంతా నీటిలో నానబెట్టి, మరుసటి రోజు ఆ సంచిని పిండగా వచ్చిన కషాయాన్ని వడబోసి 50-60 లీటర్ల నీటిలో కలిపి ఎకరం పైరుపై పిచికారీ చేస్తే ఫలితం కనిపిస్తుంది.
గింజలు మగ్గే దశలో ఆశించే కంపు నల్లి నివారణ
సైకస్ పువ్వును 5-10 ముక్కలుగా చీల్చి కర్రలకు కట్టి ఎకరా పొ లంలో 15-20చోట్ల ఉంచితే చిన్న, పెద్ద కంపు నల్లులు ఆ పూల వాసన భరించలేక నివారించడుతాయి. 3 శాతం వేప నూనె ద్రా వకాన్ని గానీ, 5శాతం వేప గింజల కషాయాన్ని గానీ కంకి ఏ ర్పడే దశలో స్ప్రే చేస్తే ఈ కంపు నల్లి బెడదను నివారించవచ్చు.