సాక్షి, విజయవాడ: రాష్ట్రంలో కక్షపూరితంగా పార్టీ ఆఫీసులు కూల్చడానికా కూటమికి అధికారం ఇచ్చింది అని ప్రశ్నించారు జై భీమ్ భారత్ పార్టీ వ్యవస్థాపకులు జడ శ్రవణ్ కుమార్. అలాగే, టీడీపీ సెంట్రల్ కార్యాలయానికి పర్మిషన్ ఉందా?. ఏపీలో టీడీపీ పార్టీ కార్యాలయాలకు పర్మిషన్ ఉంటే చూపించండి అని ప్రశ్నించారు.
కాగా, శ్రవణ్ కుమార్ సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ఏవైనా భవనాలను కూల్చాలనుకుంటే కోర్ట్ ఆర్డర్‌తో కూల్చండి. అలా కాకుండా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడం కరెక్ట్ కాదు. రూల్ ఆఫ్ లాను టీడీపీ ఉల్లంఘిస్తోంది. పార్టీ ఆఫీసులకు అనుమతి లేదని అధికారులకు ఇప్పుడు గుర్తొచ్చిందా?. అధికారులు ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే వాళ్లు కొమ్ము కాయడం కరెక్ట్ కాదు. ఇటువంటి చర్యల వల్ల ప్రజలకు ప్రభుత్వంపై నమ్మకం పోతుంది.
నాడు నారాయణ కాలేజీలను మూయించారని.. ఇప్పుడు మంత్రి అవగానే వైఎస్సార్‌సీపీ కార్యాలయాలు పడగొడతారా?. కోర్డ్ ఆర్డర్ ప్రకారం బిల్డింగ్‌ను కూల్చివేయాలి. అంటే సూర్యోదయం తర్వాత లేదా సూర్యాస్తమయంలోపు ఇలా చేయాలి. శని, ఆదివారాల్లో బిల్డింగ్స్ పడగొట్టకూడదు. అయినా కోర్ట్ ఆర్డర్ ఉండగా ఎలా కూల్చివేస్తారు?. టీడీపీ సెంట్రల్ కార్యాలయానికి పర్మిషన్ ఉందా?. టీడీపీ పార్టీ కార్యాలయాలకు పర్మిషన్ ఉంటే చూపించండి. కరకట్ట మీద ఉన్న ఏ బిల్డింగ్‌కి అనుమతి లేదు. వాటిని ఎందుకు పడగొట్టలేదు?. కరకట్ట మీద ఉన్న బిల్డింగ్స్ పడగొట్టాలని కోర్టులో పిటిషన్ వేస్తాం.
వైఎస్సార్‌సీపీ నేతలు, మాజీ ఎమ్మెల్యేలు, కార్యకర్తలను టార్గెట్ చేస్తూ దాడులు చేస్తున్నారు. ప్రత్యేక హోదా, రైల్వే జోన్, వైజాగ్ స్టీల్ ప్లాంట్‌పై ఎందుకు మోదీతో మాట్లాడలేదు. 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వకపోతే చొక్కా పట్టుకొని అడుగుతాము. 100 వెల్ఫేర్ స్కీమ్స్ పునరుద్ధరించాలి. 95వేల ఎస్సీ, ఎస్టీ బ్యాక్‌లాగ్ పోస్టులు భర్తీ చేయాలి.
టీడీపీ నేత అచ్చెన్నాయుడు ఇచ్చిన స్టేట్‌మెంట్ ఎంత ప్రమాదకరమో 2029 ఎన్నికలో ఆయనకు తెలుస్తుంది. అధికారులను అరెస్ట్ చేయాలి. కలెక్టర్లను టార్గెట్ చేయాలి అనేవి మానుకోవాలి. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై దాడి చేయాలి, తరిమేయాలని అనుకుంటే కుదరదు. ప్రజలు చూస్తూ ఊరుకోరు. ప్రజల ఆలోచనలకు విలువ ఇవ్వాలి. ఏదైనా చేస్తాం అంటే చూస్తూ ఊరుకోము. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం చాలా ఇంపార్టెంట్. అధికార దాహంతో ఆ గొంతు నొక్కితే ప్రజాస్వామ్యానికి విలువ ఉండదు. ప్రజాస్వామ్యం లేకుండా నియంతృత్వం రాజ్యమేలితే నష్టం తప్పదు’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment