ధర్మారెడ్డిపల్లిలో లింగాకర్షక బుట్టల ఏర్పాటు
గజ్వేల్: వరిలో కాండం తొలుచు పురుగు నివారణకు లింగాకర్షక బుట్టలను ఏర్పాటు చేసుకోవాలని గజ్వేల్ ఏడీఏ శ్రావణ్‌కుమార్ సూచించారు. గురువారం గజ్వేల్ మండలం ధర్మారెడ్డిపల్లి గ్రామంలో రైతు నరేందర్‌రెడ్డికి చెందిన వరి పొలంలో కాండం తొలుచు పురుగు నివారణకు లింగాకర్షక బుట్టలను మండల వ్యవసాయాధికారి ప్రవీణ్ సమక్షంలో ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా శ్రావణ్‌కుమార్ మాట్లాడుతూ లింగాకర్షక బుట్టల్లో ఉన్న ఆడ రెక్కల పురుగులు మగ రెక్కల పురుగులను వాసనతో ఆకర్షించి బుట్టలో పడేలా చూస్తాయని పేర్కొన్నారు. దీని వల్ల కాండం తొలుచు పురుగు ఉదృతి తగ్గుతుందని వెల్లడించారు. ఈ బుట్టలను రైతులు వరి పొలంలో ఏర్పాటు చేసుకుంటే మంచి ఫలితాలుంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆత్మ అధికారి గణేష్ తదితరులు పాల్గొన్నారు.