
గుంటూరు, వెంకటపాలెం(తుళ్లూరురూరల్): తాడికొండ ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్‌పై అసమ్మతి వర్గం తుళ్లూరు మండలంలో శనివారం విస్తృత స్థాయిలో సమావేశాలు నిర్వహించింది. సాయంత్రం ఆరు గంటల నుంచి ప్రారంభమైన ఈ సమావేశాలు వెంకటపాలెం, మందడం, వెలగపూడి, మల్కాపురం, ఉద్దండ్రాయునిపాలెం గ్రామాల్లో అర్ధరాత్రి వరకు కొనసాగాయి. రానున్న ఎన్నికల్లో శ్రావణ్‌కుమార్‌కు టికెట్ ఇవ్వొద్దని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లేందుకు నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే అనుచరుల మద్దతు కోరారు. వెంకటపాలెం గ్రామానికి చెందిన నాయకుడు బెల్లంకొండ నరసింహారావును తమ వర్గంలోకి రావాలని చర్చలు జరిపారు. రాజధాని ప్రాంతంలో వర్గాలను తయారు చేస్తున్న ఎమ్మెల్యే చేతుల్లో పార్టీని పెట్టడం సరైంది కాదని చెప్పారు. శ్రావణ్‌కుమార్‌కు టికెట్ ఇస్తే సహకరించేది లేదని తీర్మానించుకున్నారు. స్థానిక నాయకుల మాట కాదని అధిష్టానం వ్యవహరిస్తే ఇక్కడ ఓడిస్తామని స్పష్టం చేశారు. టీడీపీ నేతలు నరేంద్రబాబు, సుధాకర్ తరదితరుల నివాసాలలో ఈ చర్చలు జరిగాయి.
Comments
Please login to add a commentAdd a comment