సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రాంత మంత్రుల అలసత్వం వల్లే ముఖ్యమం త్రి కిరణ్‌కుమార్‌రెడ్డి విభజనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని టీఆర్‌ఎస్ మండిపడింది. పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు దాసోజ్ శ్రవణ్ మంగళవారం తెలంగాణ భవన్‌లో విలేకరులతో మాట్లాడారు. మంత్రివర్గంలో చర్చించకుండా ముఖ్యమంత్రి ప్రభుత్వ పరంగా జీవోఎంకు నివేదికలు ఇవ్వడం అప్రజాస్వామికమన్నారు. సీఎం రాష్ట్రంలో రెం డు ప్రాంతాల మధ్య వైషమ్యాలు పెంచుతున్నారని, రాష్ట్ర అంతర్గత భద్రతకు భంగం కలిగించేలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి సొంత ప్రాంతమైన చిత్తూరు జిల్లాలో ఉగ్రవాదులుంటే రాష్ట్ర ఇంటిలిజెన్స్ పసిగట్టలేకపోయిందని.. తమిళనాడు ఇంటిలిజెన్స్ చెప్పిన తరువాతే తెలిసిందన్నారు. పరిస్థితి అలా ఉంటే విభజన జరిగితే ఉగ్రవాదం వస్తుందని కిరణ్ మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు.
‘టీ మంత్రుల వల్లే సీఎం విభజన వ్యతిరేకవాదం’
Published Wed, Nov 20 2013 12:44 AM | Last Updated on Mon, Jul 29 2019 5:31 PM
Advertisement
Advertisement