నారా లోకేశ్‌తో మంత్రి కిడారి శ్రవణ్‌ సమావేశం | Kidari Sravan Kumar met nara lokesh in undavalli | Sakshi
Sakshi News home page

నారా లోకేశ్‌తో మంత్రి కిడారి శ్రవణ్‌ సమావేశం

Published Thu, May 9 2019 2:46 PM | Last Updated on Thu, May 9 2019 2:53 PM

Kidari Sravan Kumar met nara lokesh in undavalli - Sakshi

సాక్షి, అమరావతి: గిరిజన సంక్షేమ, ప్రాథమిక విద్య, కుటుంబ సంక్షేమ శాఖల మంత్రి శ్రావణ్‌ కుమార్‌ గురువారం ఉండవల్లిలోని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసానికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మంత్రి నారా లోకేశ్‌తో భేటీ అయ్యారు. మంత్రి పదవికి రాజీనామా అంశంపై ఇరువురి మధ్య చర్చ జరిగినట్లు సమాచారం. కిడారి శ్రావణ్‌ కుమార్‌ పదవీ బాధ్యతలు చేపట్టి ఈనెల 10వ తేదీ నాటికి (శుక్రవారం) ఆరు నెలలు అవుతోంది. ఈ నేపథ్యంలో కిడారి శ్రావణ్‌ కుమార్‌ చేత మంత్రి పదవికి రాజీనామా చేయించాల్సిందిగా గవర్నర్‌ కార్యాలయ వర్గాలు సీఎంవోకు సూచించినట్టు సమాచారం. దీంతో ఆయన మంత్రి పదవికి రాజీనామా చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో నారా లోకేశ్‌తో ఆయన భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.

కాగా శ్రావణ్‌ కుమార్‌ ఇవాళ తన రాజీనామా పత్రాన్ని ముఖ్యమంత్రికి సమర్పించనున్నుట్లు తెలిసింది. ఆ తరువాత గవర్నర్‌ ఆమోదానికి సీఎం పంపాల్సి ఉంటుంది. మొత్తానికి ఏ చట్ట సభకు ఎన్నిక కాకుండానే ఆరు నెలలపాటు మంత్రి పదవి అనుభవించిన రికార్డు మాత్రం శ్రావణ్‌కుమార్‌కు దక్కుతుంది.

చదవండి: (మంత్రి కిడారితో రాజీనామా చేయించండి)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement