Araku MLA Kidari Sarveswara Rao
-
నారా లోకేశ్‌తో మంత్రి కిడారి శ్రవణ్ సమావేశం
సాక్షి, అమరావతి: గిరిజన సంక్షేమ, ప్రాథమిక విద్య, కుటుంబ సంక్షేమ శాఖల మంత్రి శ్రావణ్ కుమార్ గురువారం ఉండవల్లిలోని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసానికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మంత్రి నారా లోకేశ్‌తో భేటీ అయ్యారు. మంత్రి పదవికి రాజీనామా అంశంపై ఇరువురి మధ్య చర్చ జరిగినట్లు సమాచారం. కిడారి శ్రావణ్ కుమార్ పదవీ బాధ్యతలు చేపట్టి ఈనెల 10వ తేదీ నాటికి (శుక్రవారం) ఆరు నెలలు అవుతోంది. ఈ నేపథ్యంలో కిడారి శ్రావణ్ కుమార్ చేత మంత్రి పదవికి రాజీనామా చేయించాల్సిందిగా గవర్నర్ కార్యాలయ వర్గాలు సీఎంవోకు సూచించినట్టు సమాచారం. దీంతో ఆయన మంత్రి పదవికి రాజీనామా చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో నారా లోకేశ్‌తో ఆయన భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా శ్రావణ్ కుమార్ ఇవాళ తన రాజీనామా పత్రాన్ని ముఖ్యమంత్రికి సమర్పించనున్నుట్లు తెలిసింది. ఆ తరువాత గవర్నర్ ఆమోదానికి సీఎం పంపాల్సి ఉంటుంది. మొత్తానికి ఏ చట్ట సభకు ఎన్నిక కాకుండానే ఆరు నెలలపాటు మంత్రి పదవి అనుభవించిన రికార్డు మాత్రం శ్రావణ్‌కుమార్‌కు దక్కుతుంది. చదవండి: (మంత్రి కిడారితో రాజీనామా చేయించండి) -
మంత్రి పదవి కోల్పోనున్న కిడారి శ్రవణ్ కుమార్
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య, గిరిజన సంక్షేమ శాఖమంత్రి మంత్రి కిడారి శ్రవణ్ రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది. మావోయిస్టుల కాల్పుల్లో అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు మృతి చెందడంతో ఆయన కుమారుడు కిడారి శ్రవణ్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలోకి తీసుకున్నారు. గత ఏడాది నవంబర్ 11న ఆయన మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అయితే కిడారి శ్రవణ్ కుమార్ ఆరు నెలల్లోగా ఏదో చట్టసభల్లో సభ్యుడిగా ఉండాలి. ఈ నెల 10వ తేదీతో ఆరు నెలల గడువు పూర్తి కానున్న నేపథ్యంలో ఆయన చేత రాజీనామా చేయించాలని గవర్నర్ నరసింహన్ ... ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు సూచించారు. ఈ మేరకు రాజ్‌భవన్ అధికారులు మంగళవారం సాయంత్రం ఏపీ సర్కార్‌కు సమాచారం అందించింది. కాగా రాజ్యాంగం ప్రకారం మంత్రి పదవి చేపట్టి ఆరు నెలలలోపు చట్టసభల్లో సభ్యుడిగా ఎన్నిక అవ్వాల్సి ఉంటుంది. లేకుంటే పదవి కోల్పోవాల్సి ఉంటుంది. మరోవైపు ఈ విషయంపై కిడారి శ్రవణ్ కుమార్ ఇవాళ ముఖ్యమంత్రిని కలవనున్నట్లు తెలుస్తోంది. ఆయన సూచన మేరకు నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. -
ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా గ్రామస్థుల పాదయాత్ర
సాక్షి, అమరావతి : అరకు ఫిరాయింపు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావుకు చెందిన నల్ల క్వారీని మూసివేయాలంటూ హుకుంపేట మండలం గూడ గ్రామస్థులు ఆందోళన చేపట్టారు. 14 రోజులుగా గ్రామ ప్రజలు ఆందోళన చేస్తున్న ఎమ్మెల్యే నోరు మెదపట్లేదని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే తీరుకు నిరసనగా గూడ గ్రామం నుంచి హుకుంపేట మండల కార్యాలయం వరకు గ్రామస్థులు పాదయాత్ర చేసి నిరసన వ్యక్తం చేశారు. గ్రామస్థుల పాదయాత్రకు వైఎస్సార్సీపీ అరకు సమన్వయ కర్త చెట్టి ఫాల్గుణ సంఘీభావం తెలిపారు. ఈ పాదయాత్రలో రాష్ట్ర యువజన కార్యదర్శి చెట్టి వినయ్, ఎస్టీ సెల్ అధ్యక్షుడు కొండలరావు పాల్గొన్ని అక్రమ క్వారీని మూసివేయాలని డిమాండ్ చేశారు. -
ఫిరాయింపు ఎమ్మెల్యేకు విప్ పదవి
సాక్షి, అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేను అసెంబ్లీలో విప్‌గా నియమించాలని చంద్రబాబు నిర్ణయించారు. అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు పేరును విప్ పదవి కోసం ఖరారు చేశారు. ఈయనతోపాటు అసెంబ్లీలో మరో విప్, శాసన మండలిలో నలుగురు విప్ల నియామకానికి సంబంధించిన జాబితాను రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ ఆమోదానికి పంపింది. ఇప్పటికే ఫిరాయింపులపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నా పట్టించుకోని ప్రభుత్వం మరింత బరితెగించి అందులో ఒకరిని పార్టీ విప్‌గా నియమించాలని నిర్ణయించడం విశేషం. అలాగే కిడారి సర్వేశ్వరరావుతోపాటు మరో ఐదుగురు విప్‌లను నియమించాలని బాబు నిర్ణయించారు. శాసనసభలో ఇప్పటికే నలుగురు విప్లుండగా, తాజాగా ఫిరాయించిన సర్వేశ్వరరావు, విశాఖపట్నం పశ్చిమ ఎమ్మెల్యే గణబాబును విప్‌గా నియమించాలని నిర్ణయించారు. మండలిలో విప్‌లుగా బుద్ధా వెంకన్న, ఎంఎ షరీఫ్, రామసుబ్బారెడ్డి, డొక్కా మాణిక్యవరప్రసాద్ పేర్లను ఖరారు చేశారు. అసెంబ్లీ చీఫ్ విప్‌గా మాజీ మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డి, మండలిలో చీఫ్‌విప్‌గా పయ్యావుల కేశవ్‌లను నియమించాలని ఇటీవలే నిర్ణయించారు. ఈ పేర్ల జాబితాను రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ నరసింహన్ ఆమోదానికి పంపింది. -
అరకు ఎమ్మెల్యేను నేనే అరెస్ట్ చేయించా
మంత్రి రావెల కిషోర్‌బాబు పెదనందిపాడు: విశాఖపట్నం ఆంధ్ర విశ్వ విద్యాలయంలో ఆదివారం నిర్వహించిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవాల్లో సభను అడ్డుకున్నాడన్న కారణంతో వైఎస్సార్ సీపీకి చెందిన అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావును తానే అరెస్ట్ చేయించానని రాష్ట్ర సాంఘిక సంక్షేమ, గిరిజన శాఖ మంత్రి రావెల కిషోర్‌బాబు పేర్కొన్నారు. గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం కొప్పర్రు గ్రామంలో సోమవారం నిర్వహించిన ‘మీ ఇంటికి మీ భూమి’ కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడారు. అవినీతిలో రాష్ట్ర రెవెన్యూశాఖ ముందుందని, దాన్ని ప్రక్షాళన చేసే దిశగా ప్రభుత్వం పని చేస్తోందని చెప్పారు.