ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా గ్రామస్థుల పాదయాత్ర | Villagers Padayatra Against Araku MLA | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా గ్రామస్థుల పాదయాత్ర

Published Sat, Jun 30 2018 4:54 PM | Last Updated on Mon, Aug 20 2018 6:07 PM

Villagers Padayatra Against Araku MLA - Sakshi

కిడారి సర్వేశ్వరరావు (ఫైల్‌ ఫోటో)

సాక్షి, అమరావతి : అరకు ఫిరాయింపు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావుకు చెందిన నల్ల క్వారీని మూసివేయాలంటూ హుకుంపేట మండలం గూడ గ్రామస్థులు ఆందోళన చేపట్టారు. 14 రోజులుగా గ్రామ ప్రజలు ఆందోళన చేస్తున్న ఎమ్మెల్యే నోరు మెదపట్లేదని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే తీరుకు నిరసనగా గూడ గ్రామం నుంచి హుకుంపేట మండల కార్యాలయం వరకు గ్రామస్థులు పాదయాత్ర చేసి నిరసన వ్యక్తం చేశారు. గ్రామస్థుల పాదయాత్రకు వైఎస్సార్‌సీపీ అరకు సమన్వయ కర్త చెట్టి ఫాల్గుణ సంఘీభావం తెలిపారు. ఈ పాదయాత్రలో రాష్ట్ర యువజన కార్యదర్శి చెట్టి వినయ్‌, ఎస్టీ సెల్‌ అధ్యక్షుడు కొండలరావు పాల్గొన్ని అక్రమ క్వారీని మూసివేయాలని డిమాండ్‌ చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement