villagers protest
-
యురేనియం.. ఆందోళన ఉగ్రరూపం
కర్నూలు(సెంట్రల్): కర్నూలు కలెక్టరేట్ వద్ద సోమవారం తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఒకవైపు పోలీసుల అడ్డగింపు..మరోవైపు యురేనియం బాధిత గ్రామాల ప్రజల ఆందోళనతో అట్టుడికింది. దేనకొండ మండలం కప్పట్రాళ్ల పరిసరాల్లో ఎలాంటి యురేనియం తవ్వకాలు చేపట్టబోమని కలెక్టర్ వచ్చి ప్రకటన చేయాలని 15 గ్రామాల ప్రజలు కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు దిగారు. తమ గ్రామాలను పరిరక్షించాలని, తాము నమ్ముకొని ఉన్న భూములు, ఇళ్ల సమీపంలో యురేనియం తవ్వకాలు చేపడితే తమ గతి ఏమిటని, వచ్చే రోగాలకు బాధితులెవరని, పంటలు పండే భూములు బీడుగా మారితే తమ కుటుంబాల పరిస్థితి ఏమిటని ప్రశి్నస్తూ 5 గంటల పాటు కలెక్టరేట్‌ను ముట్టడించారు. పోలీసులు ఎంతచెప్పినా ఆందోళనను విరమించలేదు.తమకు కలెక్టర్ వచ్చి సమాధానం చెప్పాలని పట్టుబట్టారు. అయితే కలెక్టర్ తనకు బదులుగా డీఆర్వో సి.వెంకటనారాయణమ్మను మొదట పంపారు. ఆమె కలెక్టర్ తరపున వివరణ ఇచ్చేందుకు ప్రయత్నిస్తే వారు ఒప్పుకోలేదు. కలెక్టరే రావాలంటూ నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు. చివరకు కలెక్టర్‌కు బదులుగా జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి.నవ్య ఆందోళనకారుల దగ్గరకు వచ్చారు. అందరూ ఏక కంఠంతో యురేనియం తవ్వకాలు ఆపాలని నినదించారు.తమ గ్రామాలను కాపాడాలని అభ్యరి్థంచారు. యురేనియం తవ్వకాలు చేపడితే తీవ్ర పరిణామాలు చోటు చేసుకుంటాయని, అధికారులే తమకు న్యాయం చేయాలని కోరడంతో జేసీ స్పందిస్తూ...ప్రస్తుతానికి ఆందోళన అక్కర్లేదని, కేంద్ర పర్యావరణ అనుమతులు రాలేదని, అప్పటివరకు యురేనియం తవ్వకాల నిర్థారణ కోసం గాని, యురేనియం తవ్వకాలు కాని చేపట్టబోమని చెప్పారు. అయితే అనుమతులు రాగానే గ్రామాల్లో గ్రామసభలు నిర్వహిస్తారని, అప్పుడు అభ్యంతరాలను ప్రజలు తెలుపవచ్చని సూచించారు.జేసీ ప్రసంగానికి అడ్డంకులుజేసీ డాక్టర్ నవ్య ప్రసంగానికి కొందరు యువకులు అడ్డు తగిలారు. తాము అసలు యురేనియం తవ్వకాలపై ఎలాంటి ముందడుగు వేయడానికి వీలు లేదంటే అనుమతులు వచి్చన తరువాత గ్రామసభలు పెడతామని ఎలా మాట్లాడుతారని జేసీని ప్రశి్నంచారు. దీంతో పోలీసులు కలుగజేసుకొని వారిని వారించారు. మరోవైపు ఆందోళనలో చురుగ్గా ఉన్న యువకుల వివరాలను పోలీసులు తీసుకోవడంపై వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. శాంతి భద్రతలను కాపాడడంలో భాగంగా ముందుగా జాగ్రత్తగా తీసుకొని ఉంటారని ఆమె వివరించారు. మొత్తంగా జేసీ వివరణతో తరువాత కప్పట్రాళ్ల చుట్టుపక్కల యురేనియం తవ్వకాలు చేపడతారని స్పష్టంగా అర్థమైపోయింది. కాగా, ప్రజలు ఎంత కోరినా కలెక్టర్ మాత్రం బయటకు రాకపోవడంతో గమనార్హం. ఆందోళనకు సీపీఎం నేతలు జి.రామకృష్ణ, పి.నిర్మల, పీఎస్ రాధాకృష్ణ, వీరశేఖర్ మద్దతు తెలిపారు. కార్యక్రమంలో కప్పట్రాళ్ల, కోటకొండ, బేతపల్లి, నెల్లిబండ, గుడిమిరాళ్ల, బంటుపళ్లి, గుండ్లకొండ తదితర గ్రామాల నుంచి వందల సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. -
అమ్మవారిపై అనుచిత వ్యాఖ్యలు.. బాసరలో ఉద్రిక్తత
సాక్షి, నిర్మల్: నిర్మల్ జిల్లా బాసరలో గ్రామస్థుల బంద్‌తో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చదువుల తల్లి సరస్వతిపై రేంజర్ల రాజేశ్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా గ్రామస్థులు బంద్‌కు పిలుపునిచ్చారు. ఉదయం నుంచే స్వచ్ఛందంగా వ్యాపార సముదాయాలు, దుకాణాలు,స్కూల్స్ మూసివేసి బంద్‌లో పాల్గొన్నారు. రోడ్లపై బైఠాయించి ఆందోళనకు దిగారు. సరస్వతి అమ్మవారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రాజేశ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా గ్రామస్థులు రేంజర్ల రాజేశ్ దిష్టిబోమ్మను దగ్దం చేశారు. పోలీసులకు ఫిర్యాదు.. బంద్ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీగా బలగాలను మోహరించారు. ఈ క్రమంలోనే బాసర పోలీస్ స్టేషన్లో రేంజర్ల రాజేశ్‌పై గ్రామస్థులు ఫిర్యాదు చేశారు. అమ్మవారిని కించపరుస్తూ చేసిన వ్యాఖ్యలపై చర్యలు చేపట్టాలని కోరారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇదీ చదవండి: బైరి నరేశ్ అనుచిత వ్యాఖ్యలు.. నిజామాబాద్‌లో టెన్షన్.. టెన్షన్.. -
ఖమ్మం రూరల్ మండలం తెల్దారుపల్లిలో గ్రామస్థుల ఆందోళన
-
కలిసి కట్టుగా కదిలారు.. అక్రమార్కుల భరతం పట్టారు
విత్తనాలతో విప్లవాత్మక చర్యకు శ్రీకారం చుట్టారు ఆదిలాబాద్ జిల్లా వాసులు. రైతుల నుంచి బలవంతంగా భూములు లాక్కునేందుకు ప్రయత్నించిన అక్రమార్కులకు సరైన గుణపాఠం చెప్పారు. అన్నదాతలకు అండగా తాము ఉన్నామంటూ భరోసాయిచ్చారు. తలమడుగు: తన భూమిని కబ్జా చేసేందుకు కొందరు యత్నించి దాడి చేయడంతో జైపాల్‌రెడ్డి అనే రైతు మనస్తాపం చెందాడు. కొడుకు చరణ్‌రెడ్డితో కలిసి పురుగుల మందు తాగాడు. ప్రస్తుతం రిమ్స్‌లో చికిత్స పొందుతున్నాడు. ఆ రైతు కష్టం చూసి ఊరి ప్రజలంతా ఏకమయ్యారు. చందాలతో విత్తనాలు కొని ఆ రైతు భూమిని చదును చేసి పత్తి విత్తనాలు వేశారు. భూకబ్జాకు యత్నిస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం కజ్జర్ల గ్రామంలో జరిగింది. ఒక్కడి కోసం అందరూ..! అదే రోజు మండలంలోని కుచులాపూర్ గ్రామంలో అదే తరహలో మరో ఘటన జరిగింది. రైతు మీసాల లింగన్న 25 ఏళ్లుగా సాగుచేసుకుంటున్న భూమి తమదని కొంతమంది ఆదిలాబాద్‌కు చెందిన అబ్దుల్ రజాక్, అబ్దుల్ సాజిద్, రజాక్ వచ్చి చేనులో పత్తి విత్తనాలు నాటారు. ఆరోజు లింగన్న గ్రామంలో లేకపోవడంతో విషయం బయటకు రాలేదు. తాజాగా మంగళవారం చేనును పరిశీలించిన రైతు లింగన్న ఆందోళన చెందాడు. విషయాన్ని గ్రామస్తులకు తెలుపగా బాధిత రైతుకు మద్దతుగా అందరూ ఒక్కటయ్యారు. అరకలు పట్టుకుని లింగన్న చేను వద్దకు వెళ్లి.. ఆక్రమణదారులు నాటిన పత్తి విత్తనాలను చెడగొట్టారు. తర్వాత లింగన్న గ్రామస్తుల సాయంతో తాను పత్తి విత్తనాలు నాటాడు. ఈ సందర్భంగా లింగన్న మాట్లాడుతూ తాను 25 ఏళ్ల క్రితం గ్రామానికి చెందిన అబ్దుల్ బాబుసేట్ వద్ద ఎకరాకు రూ.50 వేల చొప్పున నాలుగు ఎకరాలు కొనుగోలు చేసినట్లు చెప్పాడు. తండ్రి అమ్మిన ఇప్పుడు కొడుకులు, బంధువులు వచ్చి భూమి తమదని ఆక్రమించుకోవడం ఏమిటని ప్రశ్నించాడు. గ్రామస్తులు కూడా మరోమారు ఎవరైనా లింగన్న పొలంలో అడుగు పెడితే ఊరుకోమని హెచ్చరించారు. తర్వాత రైతు లింగన్న తలమడుగు పోలీస్ స్టేషన్లో అబ్దుల్ రజాక్, అబ్దుల్ సాజిద్, రజాక్‌పై ఫిర్యాదు చేశాడు. జైపాల్‌రెడ్డి పొలాన్ని పరిశీలించిన ఆర్డీవో తమడుగు: మండలంలోని కజ్జర్ల గ్రామంలో రైతు జైపాల్‌రెడ్డి పొలాన్ని ఆర్డీవో రాథోడ్ రమేశ్ మంగళవారం పరిశీలించారు. జైపాల్‌రెడ్డి పొలం పక్క పొలం రైతుల వివరాలు తెలుసుకున్నారు. ఆసర్వే నంబర్లలో ఎంత భూమి ఉంది, పక్కన గల రైతు స్వామి పొలాన్ని చుట్టు పక్కల హద్దుల వివరాలను, రెండు రోజుల్లో సర్వే చేసి నివేదిక ఇవ్వాలని తహసీల్దార్ ఇమ్రాన్‌ఖాన్, సర్వేయర్ మనోజ్‌ను ఆదేశించారు. రైతు జైపాల్‌రెడ్డికి న్యాయం జరిగేలా చూస్తామని తెలిపారు. ఆర్డీవో వెంట గ్రామస్తులు కిరణ్, జైపాల్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, మాజీ సర్పంచ్ నారాయణరెడ్డి ఉన్నారు. -
చూస్తూ ‘ఊరు’కోం..
విత్తనాలతో విప్లవాత్మక చర్యకు శ్రీకారం చుట్టారా గ్రామస్తులు. తన భూమిని కబ్జా చేసేందుకు కొందరు యత్నించి దాడి చేయడంతో జైపాల్‌రెడ్డి అనే రైతు మనస్తాపం చెందాడు. కొడుకు చరణ్‌రెడ్డితో కలిసి పురుగుల మందు తాగాడు. ప్రస్తుతం రిమ్స్‌లో చికిత్స పొందుతున్నాడు. ఆ రైతు కష్టం చూసి ఊరి ప్రజలంతా ఏకమయ్యారు. చందాలతో విత్తనాలు కొని ఆ రైతు భూమిని చదును చేసి పత్తి విత్తనాలు వేశారు. భూకబ్జాకు యత్నిస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం కజ్జర్ల గ్రామంలో జరిగింది. – తలమడుగు/సాక్షి ఫొటోగ్రాఫర్, ఆదిలాబాద్ -
మా గ్రామానికి ఎన్నికలు రద్దు చేయండి
పిడుగురాళ్లరూరల్ (గురజాల): తమ గ్రామంలో పంచాయతీ ఎన్నికలు రద్దు చేయాలని గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండల పరిషత్ కార్యాలయం వద్ద న్యూ వెల్లంపల్లి గ్రామస్తులు ఆదివారం ఆందోళన చేపట్టారు. గతంలో మాచవరం మండలంలోని పులిచింతల ముంపు గ్రామంగా వెల్లంపల్లి ఉంది. ఈ ముంపు వాసులకు పిడుగురాళ్ల మండలంలోని బ్రాహ్మణపల్లి శివారులో నివాసం కల్పించారు. ఆ నివాస ప్రాంతాన్ని న్యూ వెల్లంపల్లి గ్రామ పంచాయతీగా పరిగణిస్తున్నట్లు 2020లో ప్రభుత్వం నుంచి ఉత్వర్వులు అందాయి. ఈ పంచాయతీకి 2019 ఓటర్ల లిస్టు ప్రకారం ఎన్నికలు నిర్వహిస్తున్నారు. అయితే ప్రస్తుతం గ్రామంలో నివసించేవారంతా వేరువేరు గ్రామాలకు చెందిన వారని, గతంలో తాము కోర్టుకు వెళ్లగా న్యూ వెల్లంపల్లిలో ఇప్పుడు నివసిస్తున్న వారితోపాటు కొత్త ఓటర్ల లిస్టు తయారు చేయాలని కోర్టు ఆదేశించిందని వివరించారు. అయినా అధికారులు స్పందించడం లేదని ఆరోపిస్తూ ధర్నా చేశారు. అధికారులు స్పందించి కొత్త లిస్టు వచి్చన తర్వాతనే ఎన్నికలు నిర్వహించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. దీనిపై ఎంపీడీవో కాశయ్య స్పందిస్తూ ఎన్నికల నిర్వహణ తమ చేతుల్లో లేదని, అధికారుల ఆదేశాల మేరకే పనిచేస్తున్నామని చెప్పారు. -
విద్యుత్ అధికారులను చెట్టుకు కట్టేసిన గ్రామస్తులు
-
విద్యుత్ సిబ్బందిని స్తంభానికి కట్టేసి..
సాక్షి, మెదక్: అధిక విద్యుత్ బిల్లులపై వినియోగదారులు భగ్గుమన్నారు. ముట్టుకుంటేనే షాక్ కొడుతున్న కరెంట్ బిల్లులు చూసి ఆగ్రహం చెందిన మెదక్ జిల్లా మండల పరిధిలోని ముస్లాపూర్ గ్రామవాసులు విద్యుత్ సిబ్బందిపై తమ ప్రతాపం చూపించారు. విద్యుత్ బిల్లులు వసూలు చేయడానికి వచ్చిన అధికారులను పట్టుకుని గ్రామస్తులు స్తంభానికి కట్టేశారు. ఉన్నతాధికారులు వచ్చేంతవరకు వారిని విడిచిపెట్టేది లేదని స్పష్టం చేశారు. అధిక విద్యుత్ బిల్లులు, విద్యుత్ సరఫరాలో అంతరాయం వంటి సమస్యలను చూసి చూడనట్టు వదిలేస్తున్న అధికారుల తీరుపై విసుగు చెందిన గ్రామస్తులు ఇలా నిరసనకు దిగారు. తమ సమస్యలు పరిష్కరించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. రోజులకు రోజులు విద్యుత్ సరఫరాలో అంతరాయం, అధిక కరెంటు బిల్లులు వసూళ్ల గురించి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకున్న నాథుడు లేడని గ్రామస్తులు వాపోయారు. ఇప్పటికైనా తమ వెతలకు పరిష్కారం చూపించాలని వేడుకుంటున్నారు. (చదవండి: నాటు వేస్తూ.. కబడ్డీ ఆడుతూ..) -
మాకు పునరావాసం కల్పించాలి
భువనగిరి టౌన్ : బస్వాపురం రిజర్వాయర్ నిర్మాణంలో ఇళ్లు, భూములు కోల్పోతున్న తమకు పునరావాసం కల్పించాలని డిమాండ్ చేస్తూ సోమవారం బీఎన్ తిమ్మాపురం గ్రామస్తులు కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టారు. అనంతరం జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టారు. న్యాయం జరిగే వరకు ఇక్కడినుంచి వెళ్లేది లేదని పెద్దఎత్తున మహిళలు రోడ్డుపై బైఠాయించారు. ఈ సందర్భంగా పలువురు గ్రామస్తులు మాట్లాడుతూ పునరావాస బాధితులందరికీ ఒకే దగ్గర భూమి, ఇళ్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. గతంలో హామీ ఇచ్చిన అధికారులు అమలుకు ఇంతవరకు చర్యలు చేపట్టలేదన్నారు. భూములకు నష్టపరిహారం చెల్లించి, పునరావాసం కల్పిస్తామని అధికారులు కాలయాపన చేస్తున్నారని, జూలై చివరివారం వరకు రిజర్వాయర్‌లోకి 1.5 టీఎంసీల నీరు నింపడానికి పనులు పూర్తి చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. భువనగిరి మండలం వడపర్తి గ్రామం వద్ద, తిమ్మాపురం రెవెన్యూ పరిధిలో 57 నుంచి 78 సర్వే నెంబర్ లలో, ముత్తిరెడ్డిగూడెం గ్రామంలో ఇళ్ల కోసం స్థలాలు కేటాయించాలని కోరగా, ఇప్పటి వరకు పట్టించుకోలేదని ఆరోపించారు. గతంలో రెవెన్యూ అధి కారులు హామీ ఇచ్చినప్పటికీ ఇంతవరకు పునరావాసం, నష్టపరిహారం ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అంతకు ముందు అదనపు కలెక్టర్ కీమ్యానాయక్ ధర్నా వద్దకు వచ్చి, కలెక్టర్ సెలవులో ఉన్నారని, సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని పేర్కొన్నారు. అయినా శాంతిచని గ్రామస్తులు స్పష్టమైన హామీ ఇచ్చే వరకు వెళ్లేది లేదని కలెక్టరేట్ ఎదురుగా ఉన్న హన్మకొండ–హైదరాబాద్ జాతీయ రహదారిని దిగ్భందనం చేశారు. పోలీసులు జోక్యం చేసుకుని కలెక్టర్ సెలవులో ఉన్నారని చెప్పినా, అధికారుల నుంచి స్పష్టమైన హామీ వచ్చే వరకు ఇక్కడే కూర్చుంటామని భీష్మించారు. సుమారు రెండున్నర గంటల పాటు గ్రామస్తులు రాస్తారోకో, ధర్నా చేపట్టడంతో జాతీయ రహదారిపై పెద్దఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. దీంతో ఏసీపీ భుజంగరావు జోక్యం చేసుకుని సర్ధి చెప్పడంతో గ్రామస్తులు ధర్నా విర మించారు. ధర్నాలో సర్పంచ్ పిన్నెం లతరాజు, ఎంపీటీసీ ఉడుత శారద, దర్శన్‌రెడ్డి, ఉడుత కవిత, రావులు రాజు, నందు, మల్లేష్, బాలయ్య, బాల్‌రాజుతో పాటు పెద్దఎత్తున మహిళలు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఒంటిపై పెట్రోల్ పోసుకునేందుకు యువకుడి యత్నం... జాతీయ రహదారిపై బీఎన్ తిమ్మాపురం గ్రామస్తులు ధర్నా చేస్తున్నా, అధికారులు ఏ మాత్రం స్పందించడం లేదని అవేదన వ్యక్తం చేస్తూ తిమ్మాపురం గ్రామానికి చెందిన ఉడుత రాజు ఒంటిపై పెట్రోల్ పోసుకునేందుకు యత్నించాడు. దీంతో అక్కడే ఉన్న పోలీసులు ఆయువకుడి నుంచి పెట్రో ల్ డబ్బాను తీసుకుని అతడిని అదుపులోకి తీసుకున్నారు. -
ఆగ్రో కంపెనీని మూయించాల్సిందే
పద్మనాభం(భీమిలి): పాండ్రంగిలో ఉన్న లైఫ్‌లైన్ ఆగ్రో ప్రొడక్టు కంపెనీని మూయించాలని గ్రామస్తులు చేపట్టిన ఆందోళన తీవ్ర స్థాయికి చేరింది. ఇప్పటికే పలు రూపాల్లో నిరసన తెలిపిన గ్రామస్తులు సోమవారం కంపెనీ ఎదుట బైటాయించారు.తమకు తాగునీరు లేకుండా చేస్తున్న కంపెనీని మూయించాల్సిందేనని పట్టుబట్టారు. యాజమాన్యానికి కొమ్ముకాయకుండా ప్రజల ఇబ్బందులను పరిగణలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఈ సమయంలో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. గ్రామస్తులు కంపెనీలోకి దూసుకు పోవడానికి ప్రయత్నించడంతో పోలీసులు నిలువరించారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు మాట్లాడుతూ పోలీసులు తమ గొంతు నొక్కాలని చూస్తున్నారని ఆరోపించారు. ఆరోపించారు. మహిళలు అని చూడకుండా బలవంతంగా నెట్టేశారని అముజూరి ఆదిలక్ష్మి ఆరోపించారు. ఉన్నతాధికారుల దృష్టికి సమస్య ఆందోళన వద్దకు చేరుకున్న మధురవాడ ఏసీపీ ఎ.వి.ఎల్.ప్రసన్న కుమార్ మాట్లాడుతూ సమస్య ఉంటే శాంతియుతంగా పరిష్కరించుకోవాలని సూచించారు. శాంతి భద్రతలకు భంగం కలిగించ కూడదన్నారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఏసీపీ ప్రజల అభిప్రాయాలు తెలుసుకున్నారు. కంపెనీ పరిమితికి మించి భూగర్బ జలాలను తోడేయడంతో తమకు తాగు, సాగు నీటి కొరత ఏర్పడినందున కంపెనీని మూయించాలని ప్రజలు స్పష్టం చేశారు. కార్యక్రమంలో సీఐ జి.శ్రీనివాసరావు, వైఎస్సార్ సీపీ జిల్లా కార్యదర్శి అముజూరి అప్పారావు, పాండ్రంగి మాజీ సర్పంచ్ పల్లి మహేష్ పాల్గొన్నారు. కలెక్టర్‌కు వినతి పాండ్రంగిలోని లైఫ్ లైన్ ఆగ్రో ప్రొడెక్టు కంపెనీని మూసివేయడానికి చర్యలు తీసుకోవాలని కోరుతూ పాండ్రంగి ప్రజలు సోమవారం కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ కాటంనేని భాస్కర్‌కు వినతి పత్రం ఇచ్చారు. వైఎస్సార్ సీసీ జిల్లా కార్యదర్శి అముజూరి అప్పారావు, మాజీ సర్పంచ్ పల్లి మహేష్, మహంతి అప్పలనాయుడు వినతి పత్రం ఇచ్చిన వారిలో ఉన్నారు. ప్రజలను కొట్టలేదు మహిళలను ఈడ్చుకు వెళ్లి కొట్టామనడంలో వాస్తవం లేదు. గొడవను అడ్డుకోవడానికి రోప్ తేవడానికి వెళుతున్న పీఎంపాలెం ఎస్ఐ నిహార్, పద్మనాభం ఎస్ఐ రామమూర్తి, ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లు,, ఒక మగ కానిస్టేబుల్‌పై ప్రజలే రాళ్లు విసిరారు. వీరిలో పద్మనాభం ఎస్ఐ రామమూర్తికి రాయి తగిలింది. –ఎ.వి.ఎల్.ప్రసన్నకుమార్, ఏసీపీ -
కొత్త నమూనాతో పట్టణాభివృద్ధి
తమ గ్రామాన్ని పట్టణాభివృద్ధి సంస్థ అహ్మదాబాద్‌లో కలపడాన్ని నిరసిస్తూ 15కి.మీ.దూరంలోని భావన్‌పూర్ గ్రామస్తులు ఆందోళన చేస్తున్నారు. సూరత్, హిమ్మత్‌నగర్ సమీప గ్రామాల్లో కూడా ఇటువంటి నిరసనలే కొనసాగుతున్నాయి. పట్టణ అభివృద్ధి ఫలాలను తిరస్కరించడం ఆశ్చర్యకరమైన ధోరణి. నగరాల్లో పెరుగుతున్న కాలుష్యం కూడా వలసదారులు తిరుగుముఖం పట్టడానికి కారణంగా కనిపిస్తోంది. వ్యవసాయ సంక్షోభం కారణంగా హరియాణా నుంచి ఢిల్లీ, గుర్గావ్లకు వచ్చి, డ్రైవర్లుగా, క్లీనర్లుగా పనిచేసేవారంతా చలికాలం రాగానే కాలుష్యాన్ని భరించలేక గ్రామాలకు తిరుగుముఖం పడుతున్నారు. ఈ ధోరణి పెద్ద నగరాల్లోనే కాదు. కాన్పూర్, గ్వాలియర్ వంటి నగరాల్లో కూడా ఇదే పరిస్థితి. దేశంలోని జనాభాలో 34శాతానికి పైగా జనం పట్టణ ప్రాంతాల్లోనే నివసిస్తున్నారు. 2011తో పోలిస్తే ఇది మూడు శాతం ఎక్కువ. 2005 వరకు 50 లక్షల వరకు జనాభా వున్న నగర పరిధి అలాగే వుండగా, చిన్న సమూహాలు పెరుగుతూ వచ్చాయి. దేశంలోని పట్టణాలన్నీ పేదరికంతో, మౌలిక సదుపాయాలు లేకుండా, చిన్నపాటి ప్రణాళిక కూడా లేనట్టు కనిపిస్తాయి. దేశంలోని పట్టణాలన్నీ ఒక్కలాంటివే. ప్రాంతీయ, భౌగోళిక, సాంస్కృతిక వంటి భేదాలేవీ వీటి మధ్య కనిపించవు. పట్టణ జనాభా పెరగడంతో కనీస అవసరాలైన తాగునీరు, ప్రజా రవాణా, మురుగునీటి పారుదల, వసతి సౌకర్యాల అవసరం పెరిగింది. ఇదిలావుంటే, స్మార్ట్ సిటీల వ్యవహారం చూస్తే 90 స్మార్ట్ సిటీలలో 2,864 ప్రాజెక్టులు చేపట్టగా కేవలం 148 ప్రాజెక్టులు మాత్రమే పూర్తయ్యాయి. ఇంకా 70శాతానికి పైగా ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉన్నాయి. చివరికి, ఇంకా కోటికిపైగా గృహాలు అవసరం పడుతున్నాయి. ఇక ప్రతి ఏడాది వచ్చే వరదలు, డెంగ్యూ వంటి వ్యాధులు ముంబై, ఢిల్లీ, బెంగళూరు నగరాలను మసకబారుస్తున్నాయి. ఢిల్లీ–ముంబై ఇండస్ట్రియల్ కారిడార్, బుల్లెట్ ట్రైన్ వచ్చినప్పటికీ పట్టణానికి ఉండే సమస్యలు తీరవు. పట్టణం అని దేనిని పరిగణించాలనేది కూడా ఒక ప్రాథమిక సమస్యే. పట్టణాభివృద్ధి రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోకి రావడంతో జనాభా, స్థానిక పాలనా సంస్థల ఆదాయం, వ్యవసాయేతర రంగాల్లో ఉద్యోగుల శాతం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని గవర్నర్ ఒక ప్రాంతాన్ని పట్టణంగా, మున్సిపాలిటీగా గుర్తిస్తారు. ఇంత అస్పష్టమైన నిర్వచనం కారణంగా పట్టణంగా పరిగణించడంలో అనేక వ్యత్యాసాలు తలెత్తుతున్నాయి. కొండప్రాంతాలైన ఈశాన్య రాష్ట్రాల్లో పట్టణాలను చూస్తే జనాభా వందల్లోనే ఉంటారు. గుజరాత్, మేఘాలయల్లోని వలసల్లో 13 వేలమంది వున్నా గ్రామాలుగా భావిస్తారు. పట్టణ మౌలిక వసతుల కోసం పెడుతున్న ఖర్చు చాలా స్వల్పం కావడం మరో సమస్య. ఇప్పటికీ మన దేశం తలసరి 17 డాలర్లు ఖర్చు చేస్తుం డగా, చైనా 116 డాలర్లు ఖర్చు చేయడం గమనార్హం. ప్రభుత్వాలు వస్తున్నాయి, పోతున్నాయి. ఎన్నెన్నో విభిన్నమైన పథకాలను ప్రకటిస్తున్నాయి. కానీ, అమలు మాత్రం జరగడం లేదు. ఆర్థిక వనరులు కూడా అంతంతమాత్రమే. జైపూర్, బెంగళూర్ తమకు రావల్సిన ఆస్తి పన్నులో కేవలం 5 నుంచి 20 శాతం మాత్రమే వసూలు చేయగలుగుతున్నాయి. ఇంత స్వల్ప ఆర్థిక వనరులతో స్థానిక సంస్థలు ఎలా మనుగడ సాగించాలి? దీంతోపాటు స్థానిక సంస్థలకు నైపుణ్యం కలిగిన వారు లేకపోవడం మరో కొరత. వనరుల తరలింపు, కనీస సేవలు అందించడానికి, ప్రాథమికమైన పద్దుల నిర్వహణకు నగరాల్లో కూడా తగినంత మంది సిబ్బంది లేరు. పట్టణ వలసలకు సంబంధించి ఒక స్పష్టమైన విధానం ఉండాలి. వలసలను దృష్టిలో పెట్టుకుని పట్టణ పథకాలు, కార్యక్రమాలు రూపొందించుకోవాలి. వలసదారులపై వివక్షను రూపుమాపడం, వాళ్ల హక్కులను కాపాడటం అభివృద్ధికి దోహదపడతాయి. రవాణా సౌకర్యాలను మెరుగుపరచడం ద్వారా వలసలను తగ్గించవచ్చు. పట్టణ ప్రణాళికలు రూపొందించేవారు మన పట్టణాభివృద్ధి చారిత్రక సందర్భాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. గత శతాబ్దంగా మన పట్టణాలు ఎన్నో మార్పులకు గురయ్యాయి. ఈశాన్య భారతంలో హిల్ స్టేషన్లు నెలకొల్పాలి. వాటి ఆర్థిక అవసరాల కోసం టీ, కాఫీ తోటల సాగు పెంచాలి. అలాగే, పారిశ్రామిక వాడలను ఏర్పాటు చేయాలి. చాలా పట్టణాలు అస్తవ్యస్తంగా పెరిగిపోయాయి. కంటోన్మెంట్లు, సివిల్ లైన్లను ఏర్పాటు చేసి, రైల్వే సౌకర్యం కూడా కల్పించాలి. పట్టణాభివృద్ధికి మనకో ప్రత్యేకమైన నమూనా కావాలి. భారత్ వెలిగిపోవాలంటే, పట్టణాభివృద్ధి అత్యవసరం. వ్యాసకర్త: వరుణ్ గాంధీ, పార్లమెంటు సభ్యులు ఈ–మెయిల్ : fvg001@gmail.com -
ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా గ్రామస్థుల పాదయాత్ర
సాక్షి, అమరావతి : అరకు ఫిరాయింపు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావుకు చెందిన నల్ల క్వారీని మూసివేయాలంటూ హుకుంపేట మండలం గూడ గ్రామస్థులు ఆందోళన చేపట్టారు. 14 రోజులుగా గ్రామ ప్రజలు ఆందోళన చేస్తున్న ఎమ్మెల్యే నోరు మెదపట్లేదని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే తీరుకు నిరసనగా గూడ గ్రామం నుంచి హుకుంపేట మండల కార్యాలయం వరకు గ్రామస్థులు పాదయాత్ర చేసి నిరసన వ్యక్తం చేశారు. గ్రామస్థుల పాదయాత్రకు వైఎస్సార్సీపీ అరకు సమన్వయ కర్త చెట్టి ఫాల్గుణ సంఘీభావం తెలిపారు. ఈ పాదయాత్రలో రాష్ట్ర యువజన కార్యదర్శి చెట్టి వినయ్, ఎస్టీ సెల్ అధ్యక్షుడు కొండలరావు పాల్గొన్ని అక్రమ క్వారీని మూసివేయాలని డిమాండ్ చేశారు. -
గొంతెండుతోంది.. నీళ్లివ్వండి
లెమల్లెపాడు(వట్టిచెరుకూరు): రెండు నెలలుగా గ్రామంలో నెలకొన్న తాగునీటి సమస్యకు తక్షణమే పరిష్కారం చూపాలని కోరుతూ లెమల్లెపాడు గ్రామస్థులు గ్రామంలోని పోలేరమ్మ తల్లి గుడి సెంటర్ వద్ద రిలే నిరాహార దీక్షల్ని బుధవారం నుంచి చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గుంటూరు చానల్ ద్వారా నీటిని విడుదల చేసి చెరువులు నింపుకొనే అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. వారం రోజుల నుంచి చందాలు వేసుకుని ట్యాంకర్ల ద్వారా నీటిని తెచ్చుకుంటున్నామని, తాగునీటి సమస్యను పరిష్కరించకపోతే తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందని వాపోయారు. అధికారులు అలసత్వ వైఖరి నిరసనగా గత్యంతరం లేక నిరాహార దీక్ష చేపట్టినట్లు తెలిపారు. విషయం తెలుసుకున్న ఎంపీడీవో సుధాకర్, తహసీల్దార్ రాములునాయక్, ఎస్ఐ అశోక్ దీక్ష స్థలానికి వచ్చి దీక్షలో పాల్గొన్న గ్రామస్థులతో మాట్లాడారు. జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి సమస్యలను తీసుకెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చినా గ్రామస్థులు పట్టువీడలేదు. శాంతిభద్రతల్ని దృష్టిలో ఉంచుకుని రిలే నిరాహార దీక్ష శిబిరం వద్ద పోలీసులు బందోబస్తు నిర్వహించారు. -
ట్రబుల్ బెడ్రూం!
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్రూం ఇళ్ల పథకం ఎంపికపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, పట్టుమని పది నిమిషాలు కూడ సభ నిర్వహించలేదని గ్రామస్తులు మండిపడ్డారు. లాటరీ పద్ధతిలో కాకుండా అధికారులు ముందుగానే ఎంపిక చేసిన జాబితాను చదివి వినిపించారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్రూం ఇళ్ల పథకం ఎంపికపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, పట్టుమని పది నిమిషాలు కూడ సభ నిర్వహించలేదని గ్రామస్తులు మండిపడ్డారు. లాటరీ పద్ధతిలో కాకుండా అధికారులు ముందుగానే ఎంపిక చేసిన జాబితాను చదివి వినిపించారని ఆరోపించారు. నేలకొండపల్లి : మండలంలోని చెరువుమాధారంలో ఇటీవల నిర్మించిన 18 డబుల్ బెడ్రూం ఇళ్లకు లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు బుధవారం గ్రామసభ నిర్వహించారు. సభ గ్రామ సెంటర్లో అని చెప్పి, ఆ తర్వాత పాఠశాల వద్దకు మార్చారు. అది కూడ జనం వచ్చే లోపు గ్రామ సభను మమ అనిపించారు. జనం అంతా అర్హత ఉన్న వారితో లాటరీ తీసి లబ్ధిదారులను ఎంపిక చేస్తారని అనుకున్నారు. కానీ రెవెన్యూ అధికారులు అలాంటిది ఏమీ లేకుండా ముందుగానే జాబితాను సిద్ధం చేసుకుని వచ్చి పేర్లు వినిపించారు. అయితే జాబితాలో అర్హత లేని వారు ఉన్నారని వివిధ పార్టీల వారు నిరసన వ్యక్తం చేశారు. లబ్ధిదారుల ఎంపికకు ఖమ్మం ఆర్డీఓ పూర్ణచందర్రావు వచ్చే లోపే గ్రామ సభను ముగించడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. నిరసనకు రంగం సిద్ధం మండలంలోని చెరువుమాధారంలో లబ్ధిదారుల ఎంపిక లో రెవెన్యూ అధికారులు తప్పిదాన్ని నిరసిస్తూ గ్రామంలో గురువారం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటించనున్న సందర్భంగా మహిళలు, వివిధ రాజకీయ పక్షాలు నిరసన వ్యక్తం చేసేందుకు సిద్ధమవుతున్నారు. రెవెన్యూ అధికారుల తీరుపై సమగ్ర విచారణ నిర్వహించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. మంత్రి తుమ్మలకు విన్నవించేందుకు గ్రామస్తులు సంతకాల సేకరిస్తున్నారు. అధికారులు ఏకపక్షం చెరువుమాధారంలో డబుల్ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక విషయంలో అధికారులు ఏకపక్షంగా వ్యహరించారు. అర్హత లేని వారికి ఇళ్లు ఇచ్చారు. పట్టుమని పది నిమిషాలు కూడ సభ నిర్వహించలేదు. అధికారులు తీరుపై జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తాం. – మహమూద్ అధికార పార్టీకి అనుకూలం అధికారులు తీరు బాగలేదు. గ్రామ సభ అంటే పది నిమిషాల్లో ముగించడం కాదు. జనం ముందు జాబితాను చదివి, అర్హత ఉన్న వారికి ఇవ్వాలి. కాని ఇక్కడ అధికార పార్టీకి అనుకూలంగా ఉన్న వారికి ఇచ్చారు. దీనిపై విచారణ నిర్వహించాలి. – సూరేపల్లి రవి -
దివీస్‌కు వ్యతిరేకంగా గ్రామస్తుల ఆందోళన
-
ఎయిర్‌పోర్టు నిర్వాసిత గ్రామాల్లో ఉద్రిక్తత
-
ఎయిర్‌పోర్టు నిర్వాసిత గ్రామాల్లో ఉద్రిక్తత
విజయనగరం: విజయనగరం జిల్లా భోగాపురం పరిసర ప్రాంతాల్లో ఉద్రక్తత చోటు చేసుకుంది. భోగాపురంలో ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న అంతర్జాతీయ విమానశ్రయానికి గురువారం అధికారులు స్థల పరిశీలన చేయనున్నారు. ఈ అంశంపై రైట్ అనే సంస్థ సర్వే చేయనుంది. దీంతో పరిసర గ్రామాల్లోని ప్రజలు ఆందోళన చేపడుతున్నారు. తమ భూములు అన్యాయంగా తీసుకుంటున్నారని గ్రామస్తులు పలు ధర్నాలు కూడా చేపట్టారు. తాజాగా సర్వే నేపథ్యంలో గ్రామస్థుల నుంచి వ్యతిరేకత ఏర్పడుతుందనే ముందస్తు చర్యగా నిర్వాసిత గ్రామాల్లో భారీగా పోలీసులు మోహరించారు. -
వైద్యుడి కోసం రాస్తారోకో
దండేపల్లి: ప్రభుత్వ ఆస్పత్రిలో శాశ్వత ప్రాతిపదికన వైద్యుడిని నియమించాలంటూ గ్రామస్తులు, రోగులు ఆందోళనకు దిగారు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా దండేపల్లి మండల కేంద్రంలో శనివారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. వివరాలు.. దండేపల్లి ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రస్తుతం ఇన్చార్జి డాక్టర్ మాత్రమే ఉన్నారు. శాశ్వత వైద్యుడు లేకపోవటంతో సేవలు సరిగా అందక రోగులు ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆస్పత్రి ఎదుట రహదారిపై శనివారం మధ్యాహ్నం రాస్తారోకోకు దిగారు. దీంతో ఇన్చార్జి వైద్యుడు నవీన్ వారి వద్దకు వచ్చి.. సమస్య తీవ్రంగా ఉంది కాబట్టి దీనిపై ఉన్నతాధికారులకు నివేదిక అందజేస్తామని హామీ ఇవ్వటంతో వారు ఆందోళన విరమించారు. -
బాలకృష్ణ ఇంటి ముందు ఎండ్ల బండ్లతో నిరసన
హిందూపురం: మరుగుదొడ్ల నిర్మాణాలకు ఇసుక తెచ్చుకుంటుంటే పోలీసులు వేధిస్తున్నారంటూ గురువారం అనంతపురం జిల్లా పరిగి మండలం శాసనకోట గ్రామస్తులు హిందూపురంలోని ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఇంటి ముందు ఎడ్లబండ్లతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. శాసనకోట ప్రాంతంలోని పెన్నానది పరీవాహక ప్రాంతం నుంచి ప్రతిరోజూ ట్రాక్టర్ల ద్వారా ఇసుక అక్రమంగా తరలిపోతోందని తెలిపారు. ఒక చలానా కట్టి.. దాన్నే కలర్ జిరాక్స్‌లు చేసి పెద్ద ఎత్తున ఇసుక తరలించుకుపోతున్నా పట్టించుకోని పోలీసులు, రెవెన్యూ అధికారులు.. తమను మాత్రం చితకబాదుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో ఎమ్మెల్యే బాలకృష్ణ కలగజేసుకుని.. న్యాయం చేయాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. -
సర్వేబృందాన్ని అడ్డుకున్న గ్రామస్తులు
భోగాపురం (విజయనగరం): భోగాపురంలో విమానాశ్రయం ఏర్పాటుకు స్థల పరిశీలనకు వచ్చిన సర్వే బృందాన్ని చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అడ్డుకున్నారు. తమ భూములు ఇవ్వబోమంటూ కొయ్యపేట గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులు కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేయబోయారు. పక్కనే ఉన్న మహిళలు అప్రమత్తమవటంతో ప్రమాదం తప్పింది. చీపుర్లు, చాటలు చేతపట్టుకుని సర్వేయర్లను ఊరి బయటకు తరిమారు. కారిగొల్లపేట గ్రామస్తులు తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. భోగాపురం ఎయిర్‌పోర్టు సర్వేను వెంటనే ఆపేయాలని డిమాండ్ చేస్తూ అధికారులకు శాపనార్ధాలు పెట్టారు. -
నీటి కోసం ఆందోళన
మెదక్: తాగునీటి కోసం మహిళలు ఖాళీ బిందెలతో మెదక్ - నర్సాపూర్ ప్రధాన రహదారిపై గంటపాటు రాస్తారోకో చేశారు. ఈ సంఘటన మెదక్ మండలం మంబోజిపల్లి చౌరస్తాలో శుక్రవారం చోటు చేసుకుంది. బాధితుల కథనం మేరకు మంబోజిపల్లి గ్రామంలోని ఇంద్రనగర్ కాలనీలో వంద నివాస గృహాలున్నాయి. ఇప్పటిదాకా వారికి బోరుబావి నీటిని డైరైక్టు పంపింగ్ ద్వారా అందిస్తున్నారు. బావిలో ఊట తగ్గి పోవటంతో నెల రోజులుగా కాలనీ వాసులు నీటి కోసం అల్లాడుతున్నారు. ప్రజాప్రతినిధులకు చెప్పినా ఫలితం లేకపోవటంతో మహిళలు శుక్రవారం మెదక్ - నర్సాపూర్ ప్రధాన రహదారిపై బైఠాయించారు. దీంతో వాహనాలు పెద్ద సంఖ్యలో నిలిచిపోయాయి. మెదక్ రూరల్ ఎస్సై వినాయక్‌రెడ్డి జోక్యంతో రాస్తారోకో విరమించారు. -
ఓపెన్‌కాస్ట్‌కు వ్యతిరేకంగా గ్రామస్తుల ధర్నా
ఆదిలాబాద్ (మందమర్రి): ఆదిలాబాద్ జిల్లా మందమర్రి మండలం ఎర్రగుంటపల్లి గ్రామస్తులు ఓపెన్‌కాస్ట్‌కు వ్యతిరేకంగా దీక్ష చేపట్టారు. తమ గ్రామం ఓపెన్ కాస్ట్ వల్ల నాశనం అవుతుందని, పకృతికి కూడా ఇది ప్రమాదకరమని తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఓపెన్‌కాస్ట్ నుంచి తమ గ్రామాన్ని మినహాయించాలని గ్రామస్తులు అధికారులను కోరారు. దీక్షకు దిగిన గ్రామస్తులకు కౌన్సిలింగ్ నిర్వహించేందుకు ఆర్డీఓ నస్రత్, డీఎస్పీ రమణా రెడ్డి రంగంలోకి దిగారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. -
ఖానాపూర్ లో నీటి కోసం గ్రామస్తుల నిరసన
ఖానాపూర్ : ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ మండలంలో ప్రజలు తాగు నీటికోసం నిరసన చేపట్టారు. బాదనకుర్తిలో కొన్ని రోజులుగా నీటి సమస్య తీవ్రమైంది. అధికారులు, ప్రజాప్రతినిధులకు విన్నవించినా పట్టించుకోవటం లేదంటూ శుక్రవారం ఉదయం ప్రధాన రహదారిపైకి చేరి గ్రామస్తులు నిరసన చేశారు. ఖాళీ బిందెలతో రాస్తారోకో ప్రారంభించారు. దీంతో ప్రధాన రహదారిపై కొద్దిసేపు రాకపోకలు స్తంభించాయి. పోలీసులు అక్కడికి చేరుకుని గ్రామస్తులను ఇళ్లకు పంపించివేశారు. -
జల్లికట్టు వివాదం.. లాఠీచార్జి
-
జల్లికట్టు వివాదం: పోలీసులపై గ్రామస్తుల దాడి
కనుమ పండుగ చేసుకుంటున్న గ్రామస్తులపై పోలీసులు లాఠీచార్జి చేయడంతో కోపోద్రిక్తులైన గ్రామస్తులు పోలీసులపై దాడికి దిగారు. ఈ సంఘటన చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలం కడపనొత్తం గ్రామంలో చోటుచేసుకుంది. కనుమ పండుగను పురస్కరిచుకొని శుక్రవారం ఉదయం ఏర్పాటు చేసిన జల్లికట్టు వద్ద బైరెడ్డిపల్లి ఎస్సై హరిహర ప్రసాద్ ఆధ్వర్యంలో పోలీసులు ముందస్తు హెచ్చరికలు లేకుండా లాఠీచార్జి చేశారు. దాంతో ఆగ్రహించిన గ్రామస్తులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అకారణంగా లాఠీచార్జి చేసినందుకు గ్రామస్తులంతా ఏకమై పోలీసులపై దాడీ చేశారు. ఇందులో ఎస్సై హరిహర ప్రసాద్‌తో పాటు ఇద్దరు కానిస్టేబుళ్లకు చిన్నపాటి గాయాలయ్యాయి. గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.