చెరువుమాధారంలో పూర్తయిన ఇళ్లు
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్రూం ఇళ్ల పథకం ఎంపికపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, పట్టుమని పది నిమిషాలు కూడ సభ నిర్వహించలేదని గ్రామస్తులు మండిపడ్డారు. లాటరీ పద్ధతిలో కాకుండా అధికారులు ముందుగానే ఎంపిక చేసిన జాబితాను చదివి వినిపించారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్రూం ఇళ్ల పథకం ఎంపికపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, పట్టుమని పది నిమిషాలు కూడ సభ నిర్వహించలేదని గ్రామస్తులు మండిపడ్డారు. లాటరీ పద్ధతిలో కాకుండా అధికారులు ముందుగానే ఎంపిక చేసిన జాబితాను చదివి వినిపించారని ఆరోపించారు.
నేలకొండపల్లి : మండలంలోని చెరువుమాధారంలో ఇటీవల నిర్మించిన 18 డబుల్ బెడ్రూం ఇళ్లకు లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు బుధవారం గ్రామసభ నిర్వహించారు. సభ గ్రామ సెంటర్‌లో అని చెప్పి, ఆ తర్వాత పాఠశాల వద్దకు మార్చారు. అది కూడ జనం వచ్చే లోపు గ్రామ సభను మమ అనిపించారు. జనం అంతా అర్హత ఉన్న వారితో లాటరీ తీసి లబ్ధిదారులను ఎంపిక చేస్తారని అనుకున్నారు. కానీ రెవెన్యూ అధికారులు అలాంటిది ఏమీ లేకుండా ముందుగానే జాబితాను సిద్ధం చేసుకుని వచ్చి పేర్లు వినిపించారు. అయితే జాబితాలో అర్హత లేని వారు ఉన్నారని వివిధ పార్టీల వారు నిరసన వ్యక్తం చేశారు. లబ్ధిదారుల ఎంపికకు ఖమ్మం ఆర్‌డీఓ పూర్ణచందర్‌రావు వచ్చే లోపే గ్రామ సభను ముగించడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
నిరసనకు రంగం సిద్ధం
మండలంలోని చెరువుమాధారంలో లబ్ధిదారుల ఎంపిక లో రెవెన్యూ అధికారులు తప్పిదాన్ని నిరసిస్తూ గ్రామంలో గురువారం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటించనున్న సందర్భంగా మహిళలు, వివిధ రాజకీయ పక్షాలు నిరసన వ్యక్తం చేసేందుకు సిద్ధమవుతున్నారు. రెవెన్యూ అధికారుల తీరుపై సమగ్ర విచారణ నిర్వహించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. మంత్రి తుమ్మలకు విన్నవించేందుకు గ్రామస్తులు సంతకాల సేకరిస్తున్నారు.
అధికారులు ఏకపక్షం
చెరువుమాధారంలో డబుల్ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక విషయంలో అధికారులు ఏకపక్షంగా వ్యహరించారు. అర్హత లేని వారికి ఇళ్లు ఇచ్చారు. పట్టుమని పది నిమిషాలు కూడ సభ నిర్వహించలేదు. అధికారులు తీరుపై జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తాం.
– మహమూద్
అధికార పార్టీకి అనుకూలం
అధికారులు తీరు బాగలేదు. గ్రామ సభ అంటే పది నిమిషాల్లో ముగించడం కాదు. జనం ముందు జాబితాను చదివి, అర్హత ఉన్న వారికి ఇవ్వాలి. కాని ఇక్కడ అధికార పార్టీకి అనుకూలంగా ఉన్న వారికి ఇచ్చారు. దీనిపై విచారణ నిర్వహించాలి.
– సూరేపల్లి రవి
Comments
Please login to add a commentAdd a comment