Nelakondapally
-
నేలకొండపల్లి.. బౌద్ధం వర్ధిల్లి..
ఖమ్మం జిల్లా కేంద్రానికి సుమారు 24 కిలోమీటర్ల దూరాన నేలకొండపల్లిలో దక్షిణ భారతదేశంలోనే అతిపెద్దదైన బౌద్ధ క్షేత్రం ఉంది. బౌద్ధుల ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లిన ఈ క్షేత్రం.. దేశ, విదేశీ పర్యాటకుల రాకతో పర్యాటకంగా అభివృద్ధి వైపు అడుగులు వేస్తోంది. – నేలకొండపల్లి1976లో తొలిసారి తవ్వకాలు..ఖమ్మం జిల్లాలోని నేలకొండపల్లి– ముజ్జుగూడెం మధ్య ఈశాన్య దిక్కుగా బౌద్ధ స్తూపం ఉంది. ఈ స్తూపం చరిత్ర ఎంతో ఘనమైనది. క్రీ.శ. 2 – 3వ శతాబ్దానికి చెందినదిగా పురావస్తు శాఖ అధికారులు గుర్తించారు. దేశంలో చరిత్ర కలిగిన బౌద్ధమతానికి ఇదొక ప్రధాన కేంద్రం. అయితే పూర్వం స్థానికులు దీనిని ఎర్రదిబ్బ అని పిలిచేవారు. 1976లో పురావస్తు శాఖ అధికారులు ప్రథమంగా తవ్వకాలు జరిపారు. రెండో దఫా 1984లోనూ పెద్దఎత్తున తవ్వకాలు జరిపారు. అనంతరం దీనికి ఒక ఆకారం తీసుకొచ్చాక బౌద్ధ స్తూపంగా గుర్తించారు. ఈ స్తూపం సుమారు 106 అడుగుల వ్యాసం, 60 అడుగుల ఎత్తుతో ఉంటుంది. స్తూపానికి మొత్తం 12 ఎకరాల çస్థలం ఉంది. ఇక్కడి తవ్వకాల్లో బుద్ధుని పాలరాతి విగ్రహాలు, మృణ్మయ పాత్రలు, మట్టిపూసలు, ఇక్ష్వాకులు, శాతవాహనులు, విష్ణుకుండినుల కాలంనాటి నాణేలు, బుద్ధుని పద్మాసనం, పంచలోహ విగ్రహాలు అనేకం బయటపడ్డాయి. వీటిని పురావస్తు శాఖ అధికారులు మ్యూజియంలో ఉంచారు. ఈ బౌద్ధ స్తూపాన్ని పోలిన ఒక మినీ స్తూపాన్ని దగ్గరే ఏర్పాటు చేశారు. క్రీ.శ. 2 శతాబ్దంలో చరిత్రకారుడు టోలమీ రచించిన భూగోళ చరిత్ర గ్రంథంలో దీన్ని నెల్సిండా అని పేర్కొన్నారు. అదే నేడు నేలకొండపల్లిగా మారిందని చరిత్రకారుల అభిప్రాయం. బౌద్ధ స్తూపం వద్ద నున్న బాలసముద్రం చెరువు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. పర్యాటక కేంద్రంగా అభివృద్ధి.. నేలకొండపల్లి గ్రామ సమీపంలో గల బౌద్ధ స్తూపాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం 2009లో రూ.1.26 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టింది. బౌద్ధ స్తూపంతో పాటు ఫెన్సింగ్, పార్కు ఏర్పాటు చేశారు. ఆర్కియాలజీ వారి ఆధ్వర్యంలో రూ.50 లక్షలతో దీనిని అభివృద్ధి చేశారు. గతేడాది మరో రూ.50 లక్షలతో పర్యాటకుల కోసం విశ్రాంతి భవనం నిర్మించారు. ఇటీవల రాష్ట్ర పర్యాటక మంత్రి జూపల్లి కృష్ణారావుతో పాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సందర్శించారు. అభివృద్ధి కోసం రూ.2.50 కోట్లు మంజూరు చేశారు. మరో రెండెకరాల స్థలంలో వివిధ అభివృద్ధి పనులు చేసేలా చర్యలు చేపట్టారు. స్తూపం వద్దకు ఇలా చేరుకోవచ్చు..» ఖమ్మం నుంచి వచ్చే పర్యాటకుల కోసం నేలకొండపల్లి శివారులో బైపాస్‌రోడ్డు ఏర్పాటు చేశారు. ప్రధాన రహదారి నుంచి దాదాపు కిలోమీటరు దూరం వెళితే బౌద్ధక్షేత్రం వద్దకు చేరుకోవచ్చు. » కోదాడ నుంచి వచ్చే పర్యాటకులు మండల కేంద్రంలోని అంబేడ్కర్ సెంటర్ నుంచి మసీద్ సెంటర్ వైపుగా వెళ్లి ముజ్జుగూడెం రహదారి నుంచి వెళితే బౌద్ధక్షేత్రానికి చేరుకుంటారు. » కూసుమంచి వైపు నుంచి వచ్చే సందర్శకులు నేలకొండపల్లి వరకు వచ్చి సుందరయ్య చౌక్ మీదుగా ఆంజనేయస్వామి సెంటర్, మర్రి చెట్టు సెంటర్ నుంచి ముజ్జుగూడెం రహదారి వైపుగా వెళ్లాలి.» బౌద్ధక్షేత్రానికి వెళ్లడానికి బస్సు సౌకర్యం లేదు. ప్రత్యేక వాహనాల్లో నేరుగా వెళ్లొచ్చు. లేదంటే నేలకొండపల్లి వరకు బస్సుల్లో చేరుకుని అక్కడి నుంచి ఆటోల్లో వెళ్లాలి. విదేశీ యాత్రికుల తాకిడి.. దక్షిణ భారతదేశంలోకెల్లా అతిపెద్దదైన బౌద్ధక్షేత్రానికి విదేశాల నుంచి పెద్ద సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు. ముఖ్యంగా చైనా, జపాన్ నుంచి ఎక్కువగా వస్తుంటారు. దేశంలోని బౌద్ధ పర్యాటకులు కూడా వస్తుంటారు. అందుకే బౌద్ధక్షేత్రం పర్యాటక కేంద్రంగా విరాజిల్లుతోంది. అంతేకాకుండా ప్రతిరోజూ వివిధ ప్రాంతాల నుంచి సందర్శకులు భారీగానే వస్తున్నారు. పిక్నిక్, విహార యాత్రలకు వచ్చే వారు కోకొల్లలుగా ఉన్నారు. పర్యాటకులకు చరిత్రను వివరించేలా తెలుగు, ఇంగ్లిష్ భాషల్లో బోర్డులు ఏర్పాటుచేశారు. ప్రత్యేక ఆకర్షణగా చెరువు..బౌద్ధక్షేత్రాన్ని ఆనుకుని ఉన్న బాలసముద్రం చెరువు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. బౌద్ధక్షేత్రం చుట్టూ తిరిగిన సందర్శకులు కట్టపైకెక్కి చెరువును తిలకిస్తారు. చెరువులో వివిధ రంగులలో పూలు ఆహ్లాదకరంగా ఉంటాయి. దీనిని గమనించిన టూరిజం అధికారులు చెరువులో బోటు షికారుకు కసరత్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం పర్యాటక చెరువుగా ఎంపిక చేసి రూ.50 లక్షల నిధులు మంజూరు చేసింది. -
దసరా బంపర్ ఆఫర్.. వంద రూపాయలకే 10 కేజీల మేక!
dussehra offer: రండీ బాబూ రండీ.. ఆలసించినా ఆశాభంగం. త్వరపడండి.. మంచి తరుణం మించినా దొరకదు. ఏంటీ హడావుడి అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నా. సాధారణంగా దసరా పండుగకు జనమంతా షాపింగ్ చేయడం సర్వసాధారణం. అటు దుకాణాదారులు కూడా ఆఫర్లతో పాటు ఉచిత బహుమతులతో వినియోగదారులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంటారు. దీంతో దుకాణాలు, షాపింగ్ మాల్స్ కొనుగోలుదారులతో కిటకిటలాడుతుంటాయి.ఇదిలావుంచితే రానున్న దసరా పండుగ సందర్భంగా ఖమ్మం జిల్లా నేలకొండపల్లి వాసులకు వెరైటీ ఆఫర్లు ప్రకటించారు. నేలకొండపల్లి చెందిన కొందరు యువకులు డ్రా ద్వారా బహుమతులు అందించాలని నిర్ణయించారు. అయితే, టీవీలు, కూలర్లు, బైక్‌లు వంటివి కాకుండా ఈసారి వినూత్న బహుమతులను ప్రకటించారు.కేసు బీర్లు, నాటు కోళ్లురూ.100 చొప్పున టికెట్లు అమ్మకం చేపట్టి ఈనెల 10న తీయనున్న డ్రాలో మొదటి బహుమతి 10 కిలోల మేక ఇస్తామని పోస్టర్లను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. రెండో బహుమతిగా బ్రాండెడ్ మద్యం బాటిల్, మూడో బహుమతి కేసు బీర్లు, నాలుగో బహుమతి రెండు నాటు కోళ్లు, ఐదో బహుమతిగా మద్యం బాటిల్ ఇస్తామని ప్రకటించడంతో టికెట్లు జోరుగానే అమ్ముడవుతున్నాయని తెలుస్తోంది.వేములవాడలో కేసు కాగా, నల్లగొండ జిల్లా మునుగోడు మండలం వెల్మకన్నె గ్రామంలోనూ ఇంతకుముందు ఇలాంటి ఆఫర్లే ప్రకటించారు. ఈ ట్రెండ్ చాలా ఊర్లకు పాకింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో మాత్రం పోలీసులు కన్నెర్ర చేశారు. వేములవాడ పట్టణంలో “100 కొట్టు మేకను పట్టు” క్యాప్షన్‌తో పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో బుధవారం నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. ప్రైజ్‌మనీల పేరుతో మోసాలకు పాల్పడితే చర్యలు తప్పవని వేములవాడ ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. -
శివయ్యా.. నా వల్ల కాదయ్యా!
సాక్షి, ఖమ్మం: ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా నాలుగేళ్ల నుంచి ఆలయ నిర్వహణ నిధులు రాకపోవడంతో శివరాత్రి వేడుకలు నిర్వహించలేనంటూ నేలకొండపల్లిలోని శ్రీ ఉత్తరేశ్వరస్వామి దేవాలయం అర్చకుడు కొడవటిగంటి నరసింహారావు అధికారులకు మొర పెట్టుకుంటున్నాడు. ఆలయం పేరిట 1996వ సంవత్సరం వరకు 23 ఎకరాల భూమి ఉండగా, స్వాధీనం చేసుకున్న ప్రభుత్వం నిధులు సమకూర్చలేదు. ఆతర్వాత ఆదాయం పడిపోయి అర్చకుల వేతనాలు నిలిపేయడంతో 2018లో నరసింహారావు హైకోర్టును ఆశ్రయించగా, భూమి విలువతో పాటు వడ్డీ కలిపి రూ.51 లక్షలను బ్యాంక్‌లో ఫిక్స్డ్ చేశారు. అయినప్పటికీ నాలుగేళ్ల నుంచి అర్చకుడికి వేతనం రాకపోగా, దీప, ధూప నైవైద్యం నిధులు కూడా ఇవ్వడంలేదు. దీంతో కుటంబ పోషణే కష్టంగా మారిన నేపథ్యాన శివరాత్రి వేడుకలు చేయడం సాధ్యం కాదంటూ నరసింహారావు బుధవారం తన గోడు వెళ్లబోసుకున్నాడు. -
TS Police: ఫ్రెండ్లీ పోలీసింగ్ ఇదేనా.. అర్ధరాత్రి రోడ్డుపై భార్యాభర్తలను..
Telangana police.. బైక్‌పై వస్తున్న తమపట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించారని, అర్ధరాత్రి నడిరోడ్డుపై అరగంట పాటు నిలబెట్టారని, అవసరం లేని ప్రశ్న లతో ఇబ్బంది పెట్టారని హైదరాబాద్‌లో పని చేస్తున్న భార్యాభర్తలు.. డీజీపీకి ట్విట్టర్ ద్వారా ఫిర్యాదు చేశారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో శనివారం అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. ముదిగొండ మండలం కమలాపురం గ్రామానికి చెందిన బొమ్మగాని దుర్గారావు, ఆయన భార్య భవాని హైదరాబాద్‌లో ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. శనివారం రాత్రి భార్యా భర్తలతో పాటు, భవాని సోదరుడు వెంకటేశ్ ఒకే బైక్‌పై కమలాపురం వస్తున్నారు. నేలకొండపల్లి వచ్చేసరికి రాత్రి 12.20 అయింది. ఆ సమయంలో పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులు తమను ఆపి సంబంధం లేని ప్రశ్నలు అడుగుతూ ఇబ్బంది పెట్టారని దుర్గారావు, భవాని ఆరోపించారు. తాను సమాధానం చెబుతున్నా పట్టించుకోకుండా, తన భార్యను ప్రశ్నించారని తాళిబొట్టు, పెళ్లిఫొటోలు చూపించినా వినకుండా జీపు ఎక్కమంటూ దురుసుగా ప్రవర్తించారని దుర్గారావు ఆవేదన వ్యక్తం చేశారు. తాము బైక్‌పై వస్తున్నామని చెప్పినా.. బస్ టికెట్లు చూపించమని అడిగారని, మీదే కులం అంటూ ఇబ్బంది పెట్టారని ఆరోపించారు. పోలీసులు మద్యం మత్తులో ఉన్నారని, అరగంట పాటు తమను రోడ్డుపైనే నిలబెట్టారని, ఈ ఘటనను వీడియో తీస్తుంటే మొబైల్ లాక్కుని.. తనపై చేయి చేసుకునే ప్రయత్నం చేశారని దుర్గారావు వాపోయారు. తమకు జరిగిన అవమానంపై మంత్రి కేటీఆర్, డీజీపీతో పాటు జిల్లా కలెక్టర్, ఇతర అధికారులకు ట్విట్టర్ ద్వారా ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. సోమవారం పోలీస్ కమిషనర్‌ను కలసి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తామని చెప్పారు. ఈ విషయమై ఆదివారం నేలకొండపల్లి ఎస్సై స్రవంతిని వివరణ కోరగా తమ సిబ్బంది విధుల్లో భాగంగానే వారిని వివరాలడిగారని తెలిపారు. ఇది కూడా చదవండి: ఆబ్కారీకి నకిలీ మకిలి! కోట్లలలో అక్రమార్జన -
ఫారెన్ వెళ్లలేకపోతున్నా.. మనస్తాపంతో యువతి
పటాన్చెరు టౌన్: విదేశాలకు వెళ్లేందుకు పరీక్ష రాసి డిస్క్వాలిఫై అయ్యింది. దీంతో మనస్తాపానికి లోనైన ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం వెలుగుచూసింది. పోలీసుల వివరాల ప్రకారం... ఖమ్మం జిల్లా నేలకొండపల్లికి చెందిన గార్లపాటి సింధు (23) తన సోదరుడు తేజతో కలసి అమీన్పూర్ పరిధిలోని పీఎన్ఆర్ కాలనీలో ఉంటోంది. చదవండి: మృతదేహాన్ని అడ్డగింత.. చితి పైకెక్కి ఆందోళన క్లినికల్ అనాలసిస్ట్‌గా పని చేసే ఆమె కరోనా కారణంగా ఉండడంతో ఇంటివద్ద నుంచే విధులు నిర్వర్తిస్తోంది. ఈ క్రమంలోనే విదేశాలకు వెళ్లేందుకు మూడుసార్లు పరీక్ష రాయగా ఉత్తీర్ణత సాధించలేక పోయింది. అప్పటి నుంచి తన స్నేహితులు విదేశాలకు వెళ్లారని, తాను వెళ్లలేకపోయానని సోదరుడికి చెప్పి బాధపడుతుండేది. ఈ క్రమంలోనే సింధు బుధవారం తన గదిలో ఆత్మహత్యకు పాల్పడింది. అయితే సోదరుడు తేజ బెడ్‌పై నురగలు కక్కుకుంటూ సింధు పడి ఉండడాన్ని గమనించి వెంటనే చందానగర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించాడు. పరిశీలించిన వైద్యులు అప్పటికే ఆమె మృతి చెందినట్లు తెలిపారు. కాగా తన సోదరి మనస్తాపంతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు తేజ ఫిర్యాదు చేశాడని అమీన్పూర్ పోలీసులు తెలిపారు. చదవండి: కూతురు పుడితే రూ.5,116 డిపాజిట్ -
వాట్సాప్‌లో చక్కర్లు కొడుతున్న బ్యాలెట్ పేపర్
నేలకొండపల్లి : ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండల కేంద్రంలోని ఎంపీటీసీ–3 పరిధిలోని పోలింగ్ బూత్‌లో ఓ యువకుడు తాను ఓటు వేసిన బ్యాలెట్ పేపర్‌ను ఫొటో తీసి వాట్సాప్‌లో పెట్టిన సంఘటన హల్చల్ చేస్తోంది. పోలింగ్ కేంద్రంలో ఓటు వేసిన అనంతరం తాను ఏ పార్టీకి ఓటు వేశాననే బ్యాలెట్ పేపర్‌ను వాట్సాప్‌లో పెట్టడంతో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. -
అందరి చూపు గ్రామాలపైనే..!
సాక్షి, నేలకొండపల్లి: ఎన్నికల ప్రచారం అంటేనే ప్రచార హోరు. మైకుల జోరు, ర్యాలీలు. మద్యం జోరు... సాగుతుంది. కాని నియోజకవర్గంలోని వాతావారణం ఎక్కడా కానరాటం లేదు. ఎక్కడా ప్రచార హోరు కనిపించటం లేదు. మైకుల మోత మోగటం లేదు. ర్యాలీల మాటే లేదు. మద్యం మందుబాబులు కనిపించటం లేదు. కాని నియోజకవర్గంలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారం మాత్రం సడిచప్పుడు లేకుండా సాగుతుంది. పార్లమెంట్ అభ్యర్ధులుగా బరిలో నేతలు వారి అనుచరగణం మొత్తం గ్రామాలపై ప్రధాన దృష్టి సారించారు. మరి గ్రామాల్లో ప్రచార హోరు కానవస్తుందా అంటే అదీ లేదు. కేవలం అభ్యర్ధుల ప్రధాన అనుచరులు గ్రామాల్లోకి వెళ్లి ప్రచారం చేసి వస్తున్నారు. నేతల్లో కనిపించని ఉత్సాహం.. పాలేరు నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో గ్రామాల్లో నేతల్లో కూడ ఎన్నికల ఉత్సాహం కనిపించటం లేదు. ఇటు టీఆర్ఎస్, ఆటు కాంగ్రెస్ ప్రధాన పార్టీల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. గ్రామాల్లో ప్రచార బాధ్యతలను కూడ ఆయా గ్రామాల్లో నాయకులకు అప్పగించలేదు. అభ్యర్ధులకు వెన్నుదన్నుగా ఉండే అనుచరులకు ఆయా పార్టీ సర్పంచ్‌లకు అప్పగించటంతో వారు గ్రామాల్లో సందడి చేయటం లేదు. ఎక్కడ బయటకు వెళ్లితే ఖర్చుల భారం మీదపడుతుందోనని ఆందోళన చెందుతున్నారు. మైకుల హోరు... ర్యాలీలు నిర్వహించటం లేదు. సాదాసీదాగా అయా గ్రామాలకు వెళ్లి గ్రామస్తులతో సమావేశం అవుతున్నారు. మొత్తం మీద సడిచప్పుడు కాకుండా ప్రచారం మమ అనిపిస్తున్నారు. ఫలితంగా నియోజకవర్గంలో ఎక్కడా ఎన్నికల వాతావరణం కనిపించకపోవటం విశేషం. ఇంకా కొద్దిరోజులే... లోక్‌సభ ఎన్నికలకు ఇంకా 9 రోజులే మిగిలింది. ఏప్రిల్ 11 న జరగనున్న ఎన్నికల కు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు ను పూర్తి చేసింది. ఈ నెల 8 వరకు మాత్రమే ప్రచారం చేయాల్సి ఉంది. 9, 10 తేదీల్లో తాయిలాల పంపిణీపై దృష్టి సారిస్తారు. పాలేరులో 104 గ్రామపంచాయతీల్లో ఓటర్లను ఆకర్షించేందుకు ప్రధాన పార్టీలు తాయిలాలు అందిస్తారా లేదా అనే విషయం పల్లెల్లో జోరుగా ప్రచారం సాగుతుంది. ఆయా గ్రామాలో ఉన్న నాయకుల ఇళ్ల చుట్టే కార్యకర్తలు, ఓటర్లు తిరుగుతున్నారు. ఏది ఏమైనాప్పటీకీ గ్రామాల్లో ప్రచారం సడిచప్పుడు కాకుండా జరుగుతుంది. కుల సంఘాల వారీగా సమావేశాలు.. లోక్‌సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతున్న ప్రధాన పార్టీల నాయకులు గ్రామల్లో కుల సంఘాల వారీగా సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తుంది. ప్రధాన పార్టీలు కాంగ్రెస్, టీఆర్ఎస్ లు కుల సంఘాల నాయకులకు వారు కొరిన కోర్కెలకు హమీలు ఇస్తున్నారు. తాము గెలవగానే మీ హమీలను పూర్తి చేస్తామని ఒప్పందాలు చేసుకుంటున్నారు. పాలేరులో వివిధ గ్రామాల్లో కుల సంఘాల సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తుంది. మెత్తం మీద ప్రచార హోరు లేకుండా గ్రామాల్లో ప్రతీరోజు ఆయా పార్టీలకు చెందిన నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. -
ఖమ్మం జిల్లాలో ఫొటోలతో పోల్ స్లిప్పుల పంపిణీ
సాక్షి, నేలకొండపల్లి/వైరా: జిల్లా యంత్రాంగం ఎన్నికల నిర్వహణకు పటిష్ట ఏర్పాట్లు చేస్తోంది. ఎన్నికల విధుల్లో భాగంగానే ప్రతీ ఓటరుకు పోల్ స్లిప్పులను పంపిణీ చేసేందుకు ఆయా రిటర్నింగ్ అధికారుల కార్యాలయాలకు చేరుకున్నాయి. జిల్లాలోని 5 అసెంబ్లీ స్థానాల్లో 10,83,175 మంది ఓటర్లు ఉన్నారు. 1,306 పోలింగ్ కేంద్రాలు ఉన్నా యి. 100శాతం ఓటు హక్కును సద్వినియోగం చేసుకునేందుకు స్లిప్పులు ప్రతీ ఓటరుకు చేరేలా చర్యలు తీసుకుంటున్నారు. వీటిని ఆర్వో కార్యాలయాల్లో బూత్‌ల వారీగా సిద్ధం చేస్తున్నారు. పోల్ స్లిప్పులపై ఫొటోలు ముద్రించడంతో బోగస్ ఓట్లను అరికట్టే అవకాశం ఉంది. బహుముఖ ప్రయోజనాలు: ఓటర్లకు ఫొటోలో కూడా పోల్ స్లిప్పులు ఇవ్వటం వల్ల బహుముఖ ప్రయోజనాలు ఉన్నాయి. స్లిప్పు పై ఫొటో, ఓటరు సంఖ్య ఉంటుంది. దీంతో ఓటర్లకు ఎలాంటి గందరగోళం ఉండదు. ఫొటో ఉంటుంది కాబట్టి ఎన్నికల సిబ్బంది సులభంగా గుర్తు పడతారు. ఓటింగ్ శాతం పెరిగేందుకు ఈ స్లిప్పులు దోహదపడతాయి. –దశరథ్, పాలేరు రిటర్నింగ్ అధికారి పోల్ స్లిప్పు తీసుకోవాలి: రాష్ట్ర ఎన్నికల సంఘం ముద్రించిన ఓటరు చిట్టీల ను ప్రతీ ఓటరు తీసుకోవాలి. బూత్ లెవల్ అధికారుల ద్వారా పంపిణీ చేస్తున్నాం. కొత్తగా నమోదైన ఓటర్లను స్మార్ట్ ఓటరు కార్డులు కూడా అం దించనున్నాం. బూత్ లెవల్ అధికారులతో పాటు నోడల్ అధికారులు కూడా ఓటరు చిట్టీల పంపిణీలో పాల్గొననున్నారు. –రవీందర్, ఎన్నికల డిప్యూటీ తహసీల్దార్, వైరా ప్రతీ ఓటరుకు.. పోలింగ్ చిట్టీలు ప్రతి ఒక్కరికీ అందేలా ప్రత్యేక చర్యలతో గతంలో ప్రజా ప్రతినిధులకు అందించే పద్ధతిని తొలగించారు. వారికి సైతం ఫొటోలతో ఉన్న పోలింగ్ చిట్టీలకు సంబంధించిన వివరాలు ఇవ్వడం లేదు. నేరుగా ఆయా పోలింగ్ బూత్‌లకు కేటాయించిన బూత్ లెవల్ అధికారులతో పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. డిసెంబర్ 1వ తేదీ నాటికి ప్రతీ ఓటరుకు తమ ఓటరు చిట్టీలు అందించడంతో పాటు, అందని వారికి ఎన్నికల సమయంలో పోలింగ్ కేంద్రాల వద్ద పంపిణీ చేయనున్నారు. గతం కన్నా భిన్నంగా... గత ఎన్నికల సమయంలో పోల్ చిట్టీల కన్నా ప్రస్తుత పోలింగ్ చిట్టీలు భిన్నంగా ఉన్నాయి. ప్రతీ ఓటరు చిట్టీపై వారి ఫొటో ఉంటుంది. దీంతో పాటు పోలింగ్ ఏజెంట్ గుర్తుంచుకునేందుకు ఇబ్బందులు తీరాయి. గతంలో పంపిణీ చేసిన చిట్టీలపై ఫొటో ఉండేది కాదు. దీంతో ఓటింగ్ సమయంలో ఏజెం ట్లు గుర్తుపట్టేవారు. ఇక నుంచి ఓటర్లకు ఇబ్బంది ఉండదు. వీటితో పాటు పోలింగ్ కేంద్రం ఎక్కడ ఉంది, తదితర వివరాలు కూడా పొందుపరిచారు. ఓటరు నేరుగా తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రానికి చేరుకునేలా చిరునామా పొందుపరిచారు. -
సంక్షేమం, అభివృద్ధి లక్ష్యాలుగా..పాలన సాగించాం
సాక్షి, నేలకొండపల్లి: తెలంగాణలో సంక్షేమం, అభివృద్ధి రెండూ ప్రధాన లక్ష్యాలుగా పాలన సాగించినట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. మండలంలోని బోదులబండ, మండ్రాజుపల్లి, పైనంపల్లి గ్రామాల్లో శుక్రవారం ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదలకు సంక్షేమ.. పల్లెలు అభివృద్ధి ఏజెండాగా సీఎం కేసీఆర్ పాలించారని అన్నారు. 70 ఏళ్లలో కాంగ్రెస్ చేయని అభివృద్ధిని రెండేళ్లలో తాను చేసి చూపించానని అన్నారు. పాలేరును రాష్ట్రంలో నెంబర్ వన్ స్థానంలో ఉంచేందుకు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. కరువు ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందని అన్నారు. పాలేరు పాత కాలువను రూ.70 కోట్లతో అభివృద్ధి చేసి రైతుల చివర భూములకు నీరందించినట్లు తెలిపారు. మీరు అడిగినా, అడగకున్నా అభివృద్ధి చేసి శభాష్ అని పించుకుంటామని అన్నారు. పదవుల కోసం, స్వార్థం కోసం, ఎన్నికల సమయం వచ్చినప్పుడు ఇలా వచ్చి.. ఆలా వెళ్లే వాడిని కాదన్నారు. మీరు ఇచ్చిన గౌరవానికి మరింత గౌరవం పెంచే విధంగా మిగిలిన పనులు పూర్తి చేయనున్నట్లు తెలిపారు. ఈ సభలో పాలేరు సమన్వయకర్త సాధు రమేష్‌రెడ్డి, జెడ్పీటీసీ అనిత, టీఆర్ఎస్ మండల అధ్యక్ష, కార్యదర్శులు సీతారాములు, కోటి సైదారెడ్డి, యడవల్లి సైదులు, నెల్లూరి భద్రయ్య, కట్టేకోల నాగేశ్వరరావు, అనగాని నరసింహారావు, కొడాలి గోవిందరావు తదితరులు పాల్గొన్నారు. -
ర్యాంపులకు నిధులేవి..
సాక్షి, నేలకొండపల్లి: ఓటు హక్కు కలిగిన ప్రతీ దివ్యాంగుడు తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకునేందుకు వీలుగా కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నా రు. జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో ర్యాంపు లను ఏర్పాటు చేస్తున్నారు. వీల్చైర్లలో తీసుకొచ్చి, తీసుకెళ్లటానికి రవాణా సౌకర్యం కల్పించనున్నది. డీజెబుల్ ఫ్రెండ్లీ ఎన్నికలకు శ్రీకారం చుట్టారు. అయితే ర్యాంపుల ఏర్పాటుకు నిధుల కొరత వెం టాడుతోంది. పంచాయతీల్లో నిధులు లేక అందినకాడికాల్లా అప్పులు తెచ్చి ర్యాంపులు నిర్మాణం చేపడుతున్నారు. జిల్లాలో మొత్తం 28,553 మంది దివ్యాంగ ఓటర్లు ఉన్నారు. ఖమ్మం నియోజకవర్గంలో 5630 మంది, మధిర 6055 మంది, వైరా 4679, సత్తుపల్లిలో 5289 మంది, పాలేరులో 6900 మంది ఉన్నారు. వీరిలో నడవలేని వారు, చెవిటి వారు, మాట రాని వారిని గుర్తించారు. అటువంటి వారి ని ఇంటి వద్ద నుంచి పోలింగ్ కేంద్రం వరకు, ఓటేసిన తర్వాత పోలింగ్ కేంద్రం నుంచి ఇంటి వరకు తరలించేందుకు వాహనాలను ఏర్పాటు చేయనున్నారు. వీల్ చైర్లను వికలాంగుల సంక్షేమ శాఖ, వైద్యారోగ్యశాఖల నుంచి సేకరిస్తున్నారు. దివ్యాంగులు ఓటు వేశాక ఇంటికి చేర్చేందుకు చర్యలు తీసుకుంటున్నారు. క్యూలైన్ లేకుండా ఓటు వేసేందుకు ప్రత్యేక వసతులు, పోలింగ్ కేంద్రానికి రాకపోకలు సులువుగా ఉండేలా వీల్చైర్లను సిద్ధం చేసింది. అంధ ఓటర్లు ఎన్నికల గుర్తును గుర్తించేందుకు బ్రెయిలీ సహాయకులు, వలంటీర్లను నియమించేందుకు చర్యలు చేపడుతున్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ర్యాంపుల ఏర్పాటు కలెక్టర్ ఆదేశాల మేరకు పోలింగ్ కేంద్రాల వద్ద దివ్యాంగుల కోసం ర్యాంపులు ఏర్పాటు చేస్తున్నాం. పంచాయతీ నిధులు వినియోగించి నిర్మించాలి. పంచాయతీ కార్యదర్శులకు ఎన్నికల నిధు లు రాగానే అందించే ఏర్పాట్లు చేస్తారు. ముందు గా దివ్యాంగుల ప్రయోజనాల కోసం ర్యాంపులు ఏర్పాటు చేయాలి. –బి.రవికుమార్,ఎంపీడీఓ, నేలకొండపల్లి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాం దివ్యాంగులు ఓటు హక్కును వినియోగించుకునే వీలుగా ఏర్పాట్లు చేస్తున్నాం. అన్ని పోలింగ్ కేం ద్రాల్లో ర్యాంపులు, వీల్చైర్లు అందుబాటులోకి తెస్తున్నాం. వీటిన్నంటిని జిల్లా నోడల్ అధికారి ఏర్పాట్లు చేస్తారు. అయితే అన్ని మండలాల ఎంపీడీఓ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా వీల్చైర్లు, ర్యాంపులు ఏర్పాటు చేస్తారు.దివ్యాంగులు ఇంటి నుంచి వచ్చి ఓటు వేసి తిరిగి ఇంటికి చేరుకునేందుకు వీలుగా వాహనాలు సమకూరుస్తున్నాం. –దశరథ్, పాలేరు రిటర్నింగ్ అధికారి వసతులు కల్పించాలి దివ్యాంగులు కూడా ఓటు హక్కు వినియోగించు కునేలా ఎన్నిల సంఘం చర్యలు తీసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అవి ఆచరణలో చూపా లి. ఓటుకు కోసం ఎలా తీసుకెళ్లాతారో అలాగే ఇంటికి చేర్చే విధంగా చర్యలు తీసుకోవాలి. దీని వల్ల దివ్యాంగులందరూ ఓటు హక్కును వినియోగించుకుంటారు. –బట్టపోతుల ప్రకాషం, వికలాంగుల సంక్షేమ సంఘం ప్రతినిధి, నేలకొండపల్లి -
న్యాయం చేయాలంటూ పోలీస్ స్టేషన్లో నగ్నంగా...
నేలకొండపల్లి ఖమ్మం : మండలంలోని రాజారాంపేటకు చెందిన మాధవరావు, తనకు న్యాయం చేయాలంటూ నేలకొండపల్లి పోలీస్‌స్టేషన్‌లో నగ్నంగా కూర్చున్నాడు. తన భార్య కాపురానికి రావడం లేదని, కుటుంబీకులు తన జీవీతాన్ని నాశనం చేశారని, న్యాయం చేయాలంటూ అతడు ముందుగా రూరల్ ఏసీపీ పి.నరేష్‌రెడ్డి ఎదుట పురుగు మందు డబ్బాతో హల్చల్ చేశాడు. ఇతడి సమస్యను పరిష్కరించాలంటూ నేలకొండపల్లి ఎస్హెచ్ఓ గణపతిని ఏసీపీ ఫోన్ చేసి ఆదేశించారు. పోలీస్ స్టేషన్‌కు వెళ్లాలని ఏసీపీ సూచించారు. దీంతో, మాధవరావు బైక్‌పై నేలకొండపల్లి స్టేషన్‌కు చేరుకున్నాడు. దుస్తులన్నీ విప్పి పూర్తి నగ్నంగా లోపలికి ప్రవేశించాడు. అక్కడున్న పోలీసులు వెంటనే బయటి నుంచి బట్టలు తెప్పించి కట్టించారు. ఇతడి మానసిక పరిస్థితి బాగాలేదని రాజారంపేట గ్రామస్తు లు చెప్పినట్టు ఏఎస్ఐ గణపతి తెలిపారు. -
ట్రబుల్ బెడ్రూం!
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్రూం ఇళ్ల పథకం ఎంపికపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, పట్టుమని పది నిమిషాలు కూడ సభ నిర్వహించలేదని గ్రామస్తులు మండిపడ్డారు. లాటరీ పద్ధతిలో కాకుండా అధికారులు ముందుగానే ఎంపిక చేసిన జాబితాను చదివి వినిపించారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్రూం ఇళ్ల పథకం ఎంపికపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, పట్టుమని పది నిమిషాలు కూడ సభ నిర్వహించలేదని గ్రామస్తులు మండిపడ్డారు. లాటరీ పద్ధతిలో కాకుండా అధికారులు ముందుగానే ఎంపిక చేసిన జాబితాను చదివి వినిపించారని ఆరోపించారు. నేలకొండపల్లి : మండలంలోని చెరువుమాధారంలో ఇటీవల నిర్మించిన 18 డబుల్ బెడ్రూం ఇళ్లకు లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు బుధవారం గ్రామసభ నిర్వహించారు. సభ గ్రామ సెంటర్లో అని చెప్పి, ఆ తర్వాత పాఠశాల వద్దకు మార్చారు. అది కూడ జనం వచ్చే లోపు గ్రామ సభను మమ అనిపించారు. జనం అంతా అర్హత ఉన్న వారితో లాటరీ తీసి లబ్ధిదారులను ఎంపిక చేస్తారని అనుకున్నారు. కానీ రెవెన్యూ అధికారులు అలాంటిది ఏమీ లేకుండా ముందుగానే జాబితాను సిద్ధం చేసుకుని వచ్చి పేర్లు వినిపించారు. అయితే జాబితాలో అర్హత లేని వారు ఉన్నారని వివిధ పార్టీల వారు నిరసన వ్యక్తం చేశారు. లబ్ధిదారుల ఎంపికకు ఖమ్మం ఆర్డీఓ పూర్ణచందర్రావు వచ్చే లోపే గ్రామ సభను ముగించడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. నిరసనకు రంగం సిద్ధం మండలంలోని చెరువుమాధారంలో లబ్ధిదారుల ఎంపిక లో రెవెన్యూ అధికారులు తప్పిదాన్ని నిరసిస్తూ గ్రామంలో గురువారం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటించనున్న సందర్భంగా మహిళలు, వివిధ రాజకీయ పక్షాలు నిరసన వ్యక్తం చేసేందుకు సిద్ధమవుతున్నారు. రెవెన్యూ అధికారుల తీరుపై సమగ్ర విచారణ నిర్వహించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. మంత్రి తుమ్మలకు విన్నవించేందుకు గ్రామస్తులు సంతకాల సేకరిస్తున్నారు. అధికారులు ఏకపక్షం చెరువుమాధారంలో డబుల్ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక విషయంలో అధికారులు ఏకపక్షంగా వ్యహరించారు. అర్హత లేని వారికి ఇళ్లు ఇచ్చారు. పట్టుమని పది నిమిషాలు కూడ సభ నిర్వహించలేదు. అధికారులు తీరుపై జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తాం. – మహమూద్ అధికార పార్టీకి అనుకూలం అధికారులు తీరు బాగలేదు. గ్రామ సభ అంటే పది నిమిషాల్లో ముగించడం కాదు. జనం ముందు జాబితాను చదివి, అర్హత ఉన్న వారికి ఇవ్వాలి. కాని ఇక్కడ అధికార పార్టీకి అనుకూలంగా ఉన్న వారికి ఇచ్చారు. దీనిపై విచారణ నిర్వహించాలి. – సూరేపల్లి రవి -
ఆపదలో మొక్కులవాడు!
ఆపద మొక్కులవాడా..అనాథ రక్షకా పాహిమాం..అని మనం మొక్కే కలియుగ దైవం వేంకటేశ్వరస్వామి భూములకే ఇప్పుడు రక్షణ కరువైంది. అధికారులు పర్యవేక్షణ లేక, బాధ్యులు పట్టించుకోక కబ్జాకోరులు నేలకొండపల్లిలో ఏకంగా 50ఎకరాలకు గోవిందనామం పాడుతున్నారు. ఇంకా కాజేసేందుకు కాచుక్కూర్చున్నారు. మరి బాధ్యులను ఏం జేస్తారు..? దేవుడి మాణ్యాన్ని ఎలా రక్షిస్తారో..? అని భక్తులు, జనం ఎదురుచూస్తున్నారు. నేలకొండపల్లి: మండలకేంద్రం నేలకొండపల్లిలోని శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయానికి 358ఎకరాల ఆస్తులు ఉండగా..వీటిపై కొందరు కన్నేశారు. విలువైన భూములను ఎంచక్కా కాజేస్తున్నారు. నేలకొండపల్లి, కమలాపురం, గువ్వలగూడెం, చిరుమర్రి, ముదిగొండ, మంగాపురం తదితర గ్రామాల్లో 358 ఎకరాలు ఈ దేవాలయానికి ఉన్నాయి. అయితే మంగాపురం గ్రామంలోనే 294.22 ఎకరాల భూములు ఉన్నాయి. కానీ అక్కడ 100 ఎకరాలకే కౌలు వస్తోంది. అది కూడా కేవలం రూ.60 వేలు మాత్రమే. ఇటీవల ప్రభుత్వం చేపట్టిన భూ ప్రక్షాళణ కార్యక్రమంలో అన్యాక్రాంతం వెలుగులోకి వచ్చింది. 294.22 ఎకరాలకుగాను 244 ఎకరాల భూమికి మాత్రమే పాస్ పుస్తకాలు ఇస్తున్నట్లు రెవెన్యూ అధికారులు ఆలయ కమిటీకి తెలపడంతో..వారు కంగు తిన్నారు. కాల్వ అవసరాల రీత్యా ఎన్నెస్పీ అధికారులు కొంతభూమి తీసుకోగా..దాదాపు 50 ఎకరాల భూములు అన్యాక్రాంతమైనట్లు వెలుగులోకి వచ్చింది. చెరువుమాధారంలో 38 కుంటల భూమికి గాను 28 కుంటలకు మాత్రమే పాస్ పుస్తకాలు ఇవ్వనున్నారు. ఇక్కడ 10 కుంటలు కబ్జా అయింది. దేవాలయం వెనుక కాసాయి గడ్డ కింద 9.23 ఎకరాలు భూములను నిరుపయోగంగా వదిలేయడంతో అవి బీడుబారాయి. ఉన్నతాధికారులు స్పందించకుంటే దేవుడి భూములు కనుమరుగవుతాయని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వివిధ గ్రామాల్లోఆలయ భూముల వివరాలు ఇలా.. మంగాపురంతండా 294.22 ఎకరాలు చెరువుమాధారం 38 కుంటలు గంధసిరి 3.14 ఎకరాలు చిరుమర్రి 8.22 ఎకరాలు కమలాపురం 6.26 ఎకరాలు గువ్వలగూడెం 2.13 ఎకరాలు ముదిగొండ 3.26 ఎకరాలు నేలకొండపల్లి 30 ఎకరాలు భూములు అప్పగించాలి.. శ్రీ వెంకటేశ్వరస్వామి దేవాలయానికి రికార్డుల్లో నమోదై ఉన్న భూములను అప్పగించాలి. ఆ లెక్కల ప్రకారమే పాస్ çపుస్తకాలు అందించాలి. 294.22 ఎకరాలకు గాను 244 ఎకరాలకే ఇస్తున్నారు. జిల్లా అధికారులకు ఫిర్యాదు చేశా. బోర్లు వేసుకోవడానికి కౌలురైతుల పేరున రెవెన్యూ అధికారులు ఎలా అనుమతి ఇచ్చారు. దీనిపై కూడా ఫిర్యాదు చేశాను. – చవళం వెంకటేశ్వరరావు, దేవస్థానం చైర్మన్, నేలకొండపల్లి ఇక విచారిస్తాం.. నేలకొండపల్లి దేవాలయం భూములు గెజిట్ ప్రకారం తక్కువగా ఉందని ఫిర్యాదు అందింది. మంగాపురంతండాలో క్షేత్ర స్థాయిలో విచారించి ఎక్కడ జరిగిందో తెలుసుకుంటాం. – దొడ్డారపు సైదులు, తహసీల్దార్, నేలకొండపల్లి చర్యలు తీసుకోవాలి.. దేవాలయం భూములు అభివృద్ధికి ఉపయోగపడేలా చర్యలు తీసుకోవాలి. అన్యాక్రాంతమైన భూములపై క్షేత్ర స్థాయిలో సమగ్ర విచారణ జరిపించి..బాధ్యులను శిక్షించాలి. – వంగవీటి నాగేశ్వరరావు,సర్పంచ్ -
భార్యను హత్య చేసి భర్త ఆత్మహత్యాయత్నం
సాక్షి, నేలకొండపల్లి: భార్యను హత్య చేసి తాను కూడా ఆత్మహత్యాయత్నం చేశాడో భర్త. ఈ దారుణ సంఘటన ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండల కేంద్రంలో చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. స్థానిక వెంకటేశ్వరస్వామి ఆలయం సమీపంలోని బీడులో మండలంలోని గువ్వలగూడెం గ్రామానికి చెందిన మాతంగి గంగాధర్, నవీన అనే భార్యాభర్తలు తమ ఇద్ద మగ పిల్లలతో నివసిస్తున్నారు. ఈ కుటుంబంలో కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం నవీనను చున్నీతో ఉరిబిగించి గంగాధర్ చంపాడు. అనంతరం అతను కూడా విష గిళికలు తిని ఆత్మహత్యకు యత్నించాడు. నేలకొండపల్లి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని అతడిని ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
నేలకొండపల్లిలో చైన్‌స్నాచింగ్...
ఖమ్మం: చైన్ స్నాచర్ల ఆగడాలకు అంతులేకుండా పోతోంది. రోడ్లపై ఒంటిరిగా మహిళలు కనిపిస్తే పాపం.. మెడలోంచి బంగారు గొలుసులు అపహరిస్తున్నారు. ప్రతిఘటిస్తే ప్రాణాలను కూడా తీయ్యడానికి వెనుకాడటలేదు. ఇలాంటి ఘటనలు ప్రతినిత్యం ఎక్కడో ఒకచోట వెలుగుచూస్తూనే ఉన్నాయి. తాజాగా ఖమ్మం జిల్లాలోని నేలకొండపల్లిలో ఓ మహిళ నుంచి బంగారు గొలుసును లాక్కెళ్లారు. మహిళను కొంతదూరం అనుసరించిన గొలుసు దొంగలు బైక్‌పై వెనకనుంచి వచ్చి ఆమె మెడలో బంగారు గొలుసును అపహరించారు. బాధితురాలు దగ్గరలోని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్టు పోలీసులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
స్టీరింగ్‌పైనే ప్రాణాలొదిలిన లారీ డ్రైవర్
నేలకొండపల్లి(ఖమ్మం): ఖమ్మం నుంచి కోదాడ వైపు వెళ్తున్న లారీ డ్రైవర్ గుండె పోటుతో స్టీరింగ్ పైనే చనిపోయాడు. పోలీసుల కథనం ప్రకారం... పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు పట్టణంలోని నరసింహారావుపేటకు చెందిన శివంగి సత్యనారాయణరాజు(55)అనే లారీ డ్రైవర్ సోమవారం జంగారెడ్డిగూడెం నుంచి కొబ్బరిబొండాల లోడుతో నల్లగొండ జిల్లా మిర్యాలగూడెం బయలుదేరారు. నేలకొండపల్లికి తెల్లవారు జామున చేరుకున్న సమయంలో గుండె నొప్పి వచ్చింది. దీంతో ఆయన మెల్లగా లారీని రోడ్డు పక్కకు తీశాడు. ఇంజిన్ ఆఫ్ చేయక మునుపే తీవ్ర గుండెపోటుతో స్టీరింగ్‌పై కుప్పకూలి ప్రాణాలు విడిచాడు. విషమ పరిస్థితుల్లోనూ ఆయన సమయస్ఫూర్తిగా వ్యవహరించటంతో పెనుప్రమాదం తప్పిందని గ్రామస్తులు అంటున్నారు. -
హెచ్ఆర్సీని ఆశ్రయించిన వృద్ధ దంపతులు
ఖమ్మం: జిల్లాకు చెందిన వృద్ధ దంపతులు తమకు రక్షణ కల్పించాల్సిందిగా కోరుతూ సోమవారం హెచ్ఆర్సీని ఆశ్రయించారు. నేలకొండపల్లి సీఐ నరేందర్ రెడ్డి, ఎస్ఐ సత్యనారాయణలిద్దరూ తమను చిత్రహింసలు పెడుతున్నారంటూ వారు వాపోతున్నారు. ఎస్ఐ, సీఐలపై చర్యలు తీసుకోవాలంటూ దంపతులిద్దరూ హెచ్ఆర్సీలో ఫిర్యాదు చేశారు. వారిద్దరూ ఆస్తి వ్యవహారాల్లో జోక్యం చేసుకుని తమను చిత్రహింసలకు గురిచేస్తున్నారంటూ వృద్ధ దంపతులు ఆరోపిస్తున్నారు.