
నేలకొండపల్లి ఖమ్మం : మండలంలోని రాజారాంపేటకు చెందిన మాధవరావు, తనకు న్యాయం చేయాలంటూ నేలకొండపల్లి పోలీస్‌స్టేషన్‌లో నగ్నంగా కూర్చున్నాడు. తన భార్య కాపురానికి రావడం లేదని, కుటుంబీకులు తన జీవీతాన్ని నాశనం చేశారని, న్యాయం చేయాలంటూ అతడు ముందుగా రూరల్ ఏసీపీ పి.నరేష్‌రెడ్డి ఎదుట పురుగు మందు డబ్బాతో హల్‌చల్ చేశాడు.
ఇతడి సమస్యను పరిష్కరించాలంటూ నేలకొండపల్లి ఎస్‌హెచ్‌ఓ గణపతిని ఏసీపీ ఫోన్ చేసి ఆదేశించారు. పోలీస్ స్టేషన్‌కు వెళ్లాలని ఏసీపీ సూచించారు. దీంతో, మాధవరావు బైక్‌పై నేలకొండపల్లి స్టేషన్‌కు చేరుకున్నాడు. దుస్తులన్నీ విప్పి పూర్తి నగ్నంగా లోపలికి ప్రవేశించాడు. అక్కడున్న పోలీసులు వెంటనే బయటి నుంచి బట్టలు తెప్పించి కట్టించారు. ఇతడి మానసిక పరిస్థితి బాగాలేదని రాజారంపేట గ్రామస్తు లు చెప్పినట్టు ఏఎస్‌ఐ గణపతి తెలిపారు.