
సాక్షి, చెన్నై/వేలూరు: తమిళనాడులో దారుణం చోటుచేసుకుంది. ఫిర్యాదు చేసేందుకు వచ్చిన ఓ మహిళ పోలీస్టేషన్ గేటు ముందే దారుణ హత్యకు గురికావటం తమిళనాట సంచలనం సృష్టిచింది. వివరాలు.. వేలూరు జిల్లా రాణిపేటలోని సెంగాడు ప్రాంతానికి చెందిన సుగుణ పొరుగునే ఉంటున్న సురేంద్రకు గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. సురేంద్రపై ఫిర్యాదు చేసేందుకు సుగుణ బుధవారం స్థానిక మహిళా పోలీస్టేషన్‌కు వచ్చింది.
ఫిర్యాదు చేసి బయటకు వస్తుండగా స్టేషన్ గేటు దగ్గరే కాపుగాసిన కొందరు దుండగులు వేటకొడవళ్లతో ఆమెపై దాడిచేశారు. విచక్షణారహితంగా ఆమెను నరికేశారు. తీవ్ర గాయాలతో సుగుణ సంఘటనా స్థలంలోనే ప్రాణాలు విడిచారు. రెప్పపాటు కాలంలో పోలీస్టేషన్ ఎదుటే ఈ దారుణ ఘటన జరగడం గమనార్హం. మృతదేహాన్ని వాలాజా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించామనీ, దర్యాప్తు చేపట్టామని పోలీసులు తెలిపారు. సురేంద్ర, సుగుణకు గతంలో ఉన్న వివాహేతర సంబంధమే ఈ హత్యకు కారణంగా కావొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment