Mental Disability
-
ఒలింపిక్స్ వరల్డ్ గేమ్స్‌లో భారత్‌కు పతకాల పంట.. ఏకంగా 202 మెడల్స్
బెర్లిన్: స్పెషల్ ఒలింపిక్స్ వరల్డ్ గేమ్స్‌ను భారత జట్టు ఏకంగా 202 పతకాలతో ముగించింది. ఇందులో 76 స్వర్ణ పతకాలు, 75 రజత పతకాలు, 51 కాంస్య పతకాలు ఉన్నాయి. బుద్ధి మాంద్యంతో బాధపడుతున్న వారికి ప్రోత్సహించేందుకు స్పెషల్ ఒలింపిక్స్ పేరిట క్రీడలు నిర్వహిస్తారు. ఓవరాల్‌గా భారత్ నుంచి 198 మంది క్రీడాకారులు బరిలోకి దిగారు. ఆంధ్రప్రదేశ్ నుంచి గుజ్జల అలివేలమ్మ మహిళల టేబుల్ టెన్నిస్ డి–3 కేటగిరీ సింగిల్స్‌లో, డి02 డబుల్స్‌లో స్వర్ణ పతకాలు నెగ్గింది. బ్యాడ్మింటన్ సింగిల్స్ డబ్ల్యూ–7 కేటగిరీలో దూదేకుల షమీలా కాంస్య పతకం సాధించింది. -
మతిస్థిమితం లేదని.. సోదరి హత్య
మైసూరు: మానసిక అస్వస్థురాలు అయిన మహిళను ఆమె సోదరి దంపతులు హతమార్చారు, సుమారు రెండు సంవత్సరాల తరువాత ఈ ఘోరం బయటపడింది. చామరాజనగరకు చెందిన లక్ష్మిని ఆమె సోదరి రూపా, భర్త సిద్దరాజుతో కలిసి హత్య చేసింది. వివరాలు.. హేమ కుమార్తె అయిన లక్షి్మని తమిళనాడులోని తిరువణ్ణామలైకి చెందిన రాజేష్‌కు ఇచ్చి పెళ్లి చేయగా 7 ఏళ్ల ప్రీతం అనే కుమారుడు ఉన్నాడు. గత ఐదు సంవత్సరాల నుంచి లక్ష్మి మానసిక అస్వస్థకు గురి కావడంతో భర్త ఆమెను పుట్టింటిలో వదిలిపెట్టాడు. అక్కడ రాయనహుండి గ్రామంలో ఆమె సోదరి రూపా ఇంట్లో ఉండేది. రెండేళ్ల క్రితం లక్ష్మీకి మతిస్థిమితం పూర్తిగా కోల్పోయి ఉద్రేకంగా ప్రవర్తించసాగింది. మర్యాద పోతుందని ఆగ్రహంతో లక్ష్మీ కాళ్లు చేతులు కట్టి వేసి, నోట్లో బట్టలు కుక్కి రూపా, ఆమె భర్త సిద్దరాజు కలిసి ఇంటికి తాళం వేసి వెళ్లిపోయారు. సాయంత్రం ఇంటికి వచ్చి చూడగా లక్ష్మి ఊపిరి ఆడక చనిపోయి ఉంది. గుట్టుగా ఇంటి వెనుకాల అర్ధరాత్రి గుంత తీసి పూడ్చిపెట్టారు. ఎక్కడికో వెళ్లిపోయిందని బంధువులకు చెప్పారు. ఇటీవల తల్లి గట్టిగా నిలదీయడంతో రూపా అసలు విషయం చెప్పింది. తల్లి వరుణా పోలీసులకు ఫిర్యాదు చేయగా విచారణ చేపట్టారు. (చదవండి: కంట్లో కారం చల్లి.. చేతులు నరికి) -
మానసిక వ్యాధులకు ఆరోగ్యశ్రీ
సాక్షి, అమరావతి/లబ్బీపేట (విజయవాడ తూర్పు): గతంలో ఎన్నడూలేని విధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇటీవలే మానసిక వ్యాధులకు కూడా ఆరోగ్యశ్రీ వర్తించేలా చర్యలు తీసుకున్నట్లు ఉప ముఖ్యమంత్రి అంజద్‌బాషా చెప్పారు. విజయవాడలో డాక్టర్ ఇండ్ల రామసుబ్బారెడ్డి నిర్వహిస్తున్న ఇండ్లాస్ విమ్హాన్స్ మానసిక వైద్యశాలను ఆయన గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్నడూ లేనివిధంగా అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు ఆరోగ్యశ్రీ అమలు చేస్తున్నట్లు తెలిపారు. రాయలసీమ ప్రాంత వాసులు మానసిక వ్యాధులకు చికిత్స పొందేందుకు ఇప్పటి వరకు ఆస్పత్రి అందుబాటులో లేదన్నారు. దీంతో కడప రిమ్స్‌లో రూ.50 కోట్లతో 100 పడకల మానసిక వ్యాధుల ఆస్పత్రి నిర్మాణానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శంకుస్థాపన చేశారని తెలిపారు. వచ్చే మార్చి నాటికి ఈ ఆస్పత్రి అందుబాటులోకి వస్తుందన్నారు. తమ జిల్లాకు చెందిన డాక్టర్ ఇండ్ల రామసుబ్బారెడ్డి, డాక్టర్ విశాల్‌రెడ్డి నాలుగు దశాబ్దాల కిందటే విజయవాడలో మొదటి మానసిక వ్యాధుల ఆస్పత్రి స్థాపించి, ఈ ప్రాంతం వారికి సమర్థమైన సేవలు అందించడం అభినందనీయమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ ఇండ్ల రామసుబ్బారెడ్డి తాను రచించిన ఎమోషనల్ ఇంటెలిజెన్స్ పుస్తకాన్ని ఉప ముఖ్యమంత్రికి అందచేశారు. -
దివ్యాంగ బాలుడి కేసులో... ఇండిగోకు రూ.5 లక్షల ఫైన్
న్యూఢ్లిల్లీ: మానసిక వైకల్యమున్న బాలుడిని విమానం ఎక్కకుండా అడ్డుకున్నందుకు ఇండిగో ఎయిర్‌లైన్స్ మీద డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) సీరియస్ అయింది. విమానయాన నిబంధనల్ని ఉల్లంఘించిందంటూ శనివారం రూ.5 లక్షల జరిమానా విధించింది. ఈ నెల 7న రాంచీ విమానాశ్రయంలో తల్లిదండ్రులతో పాటు హైదరాబాద్ విమానం ఎక్కబోతుండగా సదరు బాలున్ని సిబ్బంది అడ్డుకోవడం, అది వివాదానికి దారి తీయడం తెలిసిందే. ఆ సమయంలో బాలుడు ఎవరి మాటా వినకుండా ఉన్మాదంగా ప్రవర్తించాడన్న ఇండిగో వాదనను డీజీసీఏ తోసిపుచ్చింది. -
బాత్రూం గోడలో దూరిన వ్యక్తి.. 2 రోజుల తర్వాత నగ్నంగా దర్శనం
న్యూయార్క్: మతి స్థిమితం లేని ఓ వ్యక్తి సినిమా థియేటర్‌కు వెళ్లాడు. ఏం అయ్యిందో తెలియదు కానీ.. బాత్రూం గోడకున్న కన్నంలో దూరాడు. దాదాపు రెండు రోజుల తర్వాత గోడ పగలగొట్టిన పోలీసులకు అక్కడ నగ్నంగా ఉన్న వ్యక్తి కనిపించాడు. అతడిని బయటకు తీసుకువచ్చి.. ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. ఈ సంఘటన న్యూయార్క్‌లో చోటు చేసుకుంది. ఆ వివరాలు.. కొన్ని రోజుల క్రితం మతిస్థిమితం లేని ఓ వ్యక్తి న్యూయార్క్‌లోని ఓ థియేటర్‌కు వెళ్లాడు. బాత్రూంకు వెళ్లిన వ్యక్తి.. అనుకోకుండా అక్కడ గోడకున్న పెద్ద కన్నంలోంచి లోపలికి వెళ్లాడు. అలా రెండు, మూడు రోజులు గడిచాయి. అప్పటి వరకు కన్నంలో ఉండిపోయిన వ్యక్తి.. ఆ తర్వాత సాయం కోసం కేకలు వేయసాగాడు. అప్పుడుగానీ అతగాడి గురించి థియేటర్ యాజమాన్యానికి తెలియలేదు. (చదవండి: అమ్మాయి వైపు నుంచి చెప్పే ప్రేమకథ ఇది) ఇక విషయం తెలిసిన వెంటనే థియేటర్ యాజమాన్యం.. పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి కాల్ చేసి సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు.. బాత్రూం గోడకు వేరే చోట కన్నం చేసి.. దాని గుండా ఫైబర్ ఆప్టిక్ కెమరాను పంపి.. అతడు ఉన్న ఎగ్జాక్ట్ లోకేషన్‌ని గుర్తించారు. ఆ తర్వాత గోడను పగలకొట్టి చూడగా.. సదరు వ్యక్తి నగ్నంగా దర్శనమిచ్చాడు. (చదవండి: ఫస్ట్‌డేట్ రోజే విషాదం: టిక్‌టాక్ స్టార్ కాల్చివేత) అతడిని బయటకు తీసుకువచ్చిన పోలీసులు సమీప ఆస్పత్రిలో చేర్పించారు. ఈ సందర్భంగా ఓ అధికారి మాట్లాడుతూ.. ‘‘సదరు వ్యక్తి మానసిక వికలాంగుడు. సమీపంలోని ఓ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. ఇక అతడు బాత్రూం గోడ కన్నంలోకి ఎందుకు వెళ్లాడనే విషయం అర్థం కావడం లేదు. బహుశా వెచ్చగా ఉంటుందని భావించి వెళ్లాడేమో’’ అని తెలిపాడు. చదవండి: అల్లు అర్జున్ కొత్త బిజినెస్: మహేష్‌కు పోటీగా! -
World Mental Health Day: డార్క్ చాక్లెట్, నారింజ పండ్లు, చేపలు.. తరచూ తిన్నారంటే..
ఆధునిక జీవనశైలి కారణంగా ఇటీవల కాలంలో మానసిక సమస్యలు గణనీయంగా పెరుగుతున్నాయి. డిజిటల్ ఎలక్ట్రానిక్స్ వెల్లువలో పడి మెదడుకు తగిన వ్యాయామం ఇవ్వడమే మరచిపోతున్నాం. ఐతే పోషకాహారం ద్వారా ఏ విధంగా మెదడు పనితీరును మెరుగుపరచుకోవచ్చో ఈ కింది అధ్యయనాల ద్వారా తెలుసుకుందాం.. చాక్లెట్స్ మీకు చాక్లెట్స్ అంటే చాలా ఇష్టమా.. ఐతే మీకో గుడ్ న్యూస్! చాక్లెట్స్ బ్రెయిన్ హెల్త్‌కు మేలు చేస్తాయని తాజా అధ్యయనాలు వెల్లడించాయి. కోకో బీన్స్‌లో ఫ్లేవనాల్ అని పిలువబడే కొన్ని చిన్న అణువులు ఉంటాయి. ఈ అణువులు మెదడు చురుకుదనాన్ని మెరుగుపరుస్తాయని 'సైంటిఫిక్ రిపోర్ట్స్' జర్నల్‌లో ప్రచురించిన నివేధిక తెలియజేస్తుంది. మామూలు చాక్లెట్లకంటే డార్క్ చాక్లెట్లలో ఫ్లావోనాయిడ్ కంటెంట్ అధికంగా ఉంటుందని, ఇవి మెదడు సంబంధిత సమస్యలను దూరంగా ఉంచడానికి తోడ్పడతాయని నిపుణులు చెబుతున్నారు. ఆరెంజ్ పండ్లు ఆరెంజ్ పండ్లలో కూడా ఫ్లావోనాయిడ్స్ అధికంగానే ఉంటాయి. రోజూ గ్లాస్ నారింజ రసం తీసుకోవడం వల్ల కాగ్నిటివ్ పనితీరు మెరుగుపడుతుందని అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ నూట్రిషన్‌లో ప్రచురించిన అధ్యయనాలు వెల్లడించాయి. టీ మన అలవాట్లలో ముఖ్యమైనది ప్రతి ఉదయం ఒక కప్పు టీ తాగడం. దీనిలో అల్లం, మిరియాలువంటి భిన్న పదార్థాలను జోడించడం వల్ల అనేక ప్రయోజనాలు చేకూరుతాయనే విషయం తెలిసిందే! ఐతే అదనంగా మెదడు పనితీరుకు టీ ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. టీ క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మన మెదడు నిర్మాణంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో ఒక అధ్యయనం వెల్లడించింది. తాగని వారితో పోల్చితే క్రమం తప్పకుండా టీ తాగేవారిలో ప్రయోజనాలు ఎక్కువగా కనిపించాయట. చేపలు గుండె ఆరోగ్యం నుంచి చర్మం, జుట్టు సమస్యల నివారణ వరకు చేపల్లోని ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు ఎంతో ఉపయోగపడతాయి. చేపలను రోజువారీ ఆహారంలో చేర్చడం వల్ల మెదడు ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుందని తాజా అధ్యయనాలు వెల్లడించాయి. అమెరికన్ జర్నల్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్‌లో ప్రచురించబడిన ఒక అధ్యయనం ప్రకారం.. ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు మెదడు కణాలకు ప్రయోజనకరంగా ఉంటుందని తెల్పింది. దీనిలోని విటమిన్-ఇతో పాటు, కొన్ని యాంటీఆక్సిడెంట్లు డైమెన్షియా (చిత్తవైకల్యం) ప్రమాదాన్ని నివారించడంలో సహాయపడతాయి. ఆకు కూరలు బ్రొకోలి, కాలె, పాలకూర వంటి ఆకుకూరలు కాగ్నిటివ్ డామేజ్ నుంచి రక్షణ కల్పిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ది ఫెడరేషన్ ఆఫ్ అమెరికన్ సొసైటీస్ ఫర్ ఎక్స్పరిమెంటల్ బయోలజీ ప్రకారం ఆకుకూరల్లో విటమిన్ ‘కె’, బేటా కెరోటిన్, లూటిన్, ఫోలెట్ వంటివి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మెదడు ఆరోగ్యాన్ని కాపాడటంలో కీలకంగా వ్యవహరిస్తాయి. శారీరక వ్యాయామాలు, యోగా, డిజిటల్ గాడ్జెస్ను తక్కువగా వాడటం వంటి అలవాట్లతోపాటు ఈ ఆహార అలవాట్లు కూడా పాటించడం వల్ల మీ మెంటల్ హెల్త్‌ను పదికాలాలపాటు కాపాడుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. చదవండి: హీరా మండి చీకటి చరిత్ర.. ఎన్నో ఆసక్తికర విషయాలు.. -
గూడ్స్ రైలు ఎక్కి వ్యక్తి వీరంగం
సాక్షి,విజయనగరం: రైల్వే స్టేషన్లో మతి స్థిమితం లేని వ్యక్తి హల్చల్ చేశాడు. రైల్వే సిబ్బందితో పాటు పోలీసులను కాసేపు ముప్పుతిప్పలు పెట్టాడు. ఈ ఘటన విజయనగరంలో చోటు చేసుకుంది. గురువారం స్టేషన్లోకి ప్రవేశించిన ఓ వ్యక్తి నిలిచి ఉన్న గూడ్స్ రైలు పైకి ఎక్కి వీరంగం సృష్టించాడు. విషయం తెలుసుకున్న జీఆర్పీ పోలీసులు అక్కడికి చేరుకుని వ్యయప్రయాసలతో అతన్ని కిందకు దింపి, అదుపులోకి తీసుకున్నారు. రైల్వే అధికారులు , పోలీసులు సకాలంలో స్పందించడంతో ఆ వ్యక్తికి ప్రాణాపాయం తప్పింది. చదవండి: పది కోళ్లను తిన్న కొండచిలువ -
విషాదం: ఐదు రోజుల్లోనే అంతా తల్లకిందులు
ఎదిగిన ఒక్కగానొక్క కొడుకు తన కాళ్ల మీద తాను నిలబడి.. ఊరు కాని ఊళ్లో చెమటోడ్చి పెళ్లాం పిల్లలను పోషించుకుంటున్నాడని తలచి స్థిమితపడ్డ తల్లి, ఒక్కసారిగా తన ఆలోచనలు తలకిందులయ్యేసరికి తట్టుకోలేకపోయింది. మూడు పదులు దాటిన వయస్సులో కుమారుడు మతి తప్పిన తీరులో స్వస్థలానికి చేరుకోవడంతో ఆమె అతలాకుతలమైంది. కూతుళ్లకు పెళ్లిళ్లు చేశాక.. కృష్ణారామా అనుకోవాల్సిన వయస్సులో.. మీదపడ్డ సమస్య ఆమెను నైరాశ్యం వైపు నెట్టింది. తన బిడ్డ ప్రాణాలకే ప్రమాదం వస్తుందేమోనన్న బాధతో.. భయంతో ఆమె తీవ్ర నిర్ణయం తీసుకుంది. పురుగు మందు తాగి ప్రాణాలు విడిచింది. అదే సమయంలో తనయుడు కూడా విషం మింగి.. ఆపై భీతిల్లి ఆస్పత్రికి పరుగులు తీశాడు. వెంటనే చికిత్స అందించినా అతిడిని కూడా మృత్యువు వెంటాడింది. విధిలీల అర్థం కాదని వ్యథ చెందడం అందరి వంతైంది. కొత్తూరు: కొత్తూరులోని కొత్తపేట కాలనీకి చెందిన కనపాకల చిన్నమ్మడు (70), ఆమె కుమారుడు శ్రీనివాసరావు (35)లు శనివారం పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. వీరిలో ముందు చిన్నమ్మడు చనిపోగా తర్వాత శ్రీనివాసరావుకు వైద్యం అందించినా ఫలితం దక్కలేదు. పోలీసులు, బాధితుని కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. చిన్నమ్మడుకు కొడుకుతో పాటు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. అందరికీ పెళ్లిళ్లయ్యాయి. శ్రీనివాసరావుకు పదేళ్ల కిందట కొత్తూరుకే చెందిన శ్రీదేవితో వివాహం జరిగింది. వీరికి ఒక కొడుకు, ఒక కూతురు ఉన్నారు. స్థానికంగా ఉపాధి లేకపోవడంతో భార్యాభర్తలు పిల్లలతో కలిసి హైదరాబాద్ వలస వెళ్లిపోయారు. అక్కడే శ్రీనివాసరావు తాపీ మేస్త్రీగా పనిచేస్తున్నారు. ఐదు రోజుల కిందట శ్రీనివాసరావు ప్రవర్తనలో ఉన్నట్టుండి మార్పు కనిపించింది. అర్థం లేకుండా మాట్లాడడం, పిల్లలను ఊరికే కొట్టడం, గ్యాస్ సిలిండర్ నుంచి గ్యాస్ విడిచి పెట్టడం వంటి పనులు చేసేవాడు. దీంతో భయపడిన అతని భార్య అక్కడే ఉన్న బంధువులకు విషయం చెప్ప డంతో వారు పరిస్థితిని గమనించి రాత్రుళ్లు కాప లా కాయడం కూడా మొదలుపెట్టారు. అయినా శ్రీనివాసరావు ప్రవర్తన అంతు చిక్కేది కాదు. ఒక క్షణం బాగానే ఉన్నా.. మరుక్షణానికి మారిపోయేవాడు. ఈ నెల 25న శ్రీనివాసరావు అక్కడ ఎవరికీ చెప్పకుండా కొత్తూరు వచ్చేశాడు. ఇక్కడ కూడా అతని ప్రవర్తనలో మార్పు రాలేదు. పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ వీధుల్లో తిరిగేవాడు. కొడుకు పరి స్థితి చూసి తల్లి చిన్నమ్మడు తీవ్ర మనస్తాపానికి గురైంది. ఇలాగే చనిపోతాడేమో అని బెంగ పెట్టుకుంది. దెయ్యం పట్టిందేమోనని అతడిని కుటుంబ సభ్యులంతా కలిపి ఓ గిరిజన గ్రామానికి కూడా తీసుకెళ్లారు. కానీ వారు ఆదివారం పూజ చేస్తామని చెప్పి వీరిని పంపించేశారు. శనివారం ఇంటిలో ఉన్న వారంతా ఉపాధి పనులకు వెళ్లిపోయారు. తల్లీ కొడుకులు మాత్రం కొత్తూరు నాలుగు రోడ్ల కూడలికి వచ్చి గడ్డి మందును కొన్నారు. వారి ఇంటికి దగ్గరలో ఉన్న చెరువు వద్దకు వెళ్లి ఇద్దరూ ఆ పురుగు మందు తాగేశారు. అయితే పురుగు మందు తాగాక శ్రీనివాసరావు పరుగులు పెడుతూ ఆస్పత్రికి వెళ్లిపోయాడు. తల్లి అక్కడే పడిపోవడంతో అటుగా వెళ్తున్న ఉపాధి వేతనదారులు ఆమెను గమనించి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. తల్లీ కొడుకులకు స్థానిక సీహెచ్‌సీ వైద్యాధికారి దీప్తి వైద్యం అందించారు. తల్లి పరిస్థితి విషమించడంతో పాలకొండ ఏరియా ఆస్పత్రికి తరలించగా ఆమె అక్కడే చనిపోయారు. శ్రీనివాసరావును కూడా పాలకొండ తరలించారు. పరిస్థితి విషమించడంతో శ్రీకాకుళం రిమ్స్‌కు తీసుకెళ్లారు. అర్థరాత్రి తర్వాత ఆయన కూడా తనువుచాలించాడు. చిన్నమ్మడు కుమార్తె ఇచ్చిన ఫిర్యాదు మేరకు స్థానిక ఎస్ఐ వై.శ్రీనివాసరావు కేసు నమోదు చేశారు. ఇద్దరి మృతదేహాలకు పాలకొండ ఏరియా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించినట్లు ఎస్ఐ తెలిపారు. ఘటనతో కొత్తూరులో విషాదం అలముకుంది. -
పవిత్రమైన మక్కాలో కారుతో హల్చల్
రియాద్ : ఇస్లాం పవిత్ర స్థలమైన మక్కా మసీదులోకి ఓ వ్యక్తి కారుతో దూసుకెళ్లేందుకు ప్రయత్నించాడు. మసీదు వద్ద భద్రతగా ఉన్న గార్డులు అతడ్ని వెంబడించి పట్టుకున్నారు. సదరు వ్యక్తి మతిస్థిమితం సరిగా లేదని తెలుస్తున్నది. ఈ విషయాన్ని సౌదీ అరేబియా అధికారులు శనివారం ధ్రువీకరించారు. శుక్రవారం మధ్యాహ్నం మసీదు దక్షిణ ద్వారాలలో ఒకదానిని ఢీకొట్టి లోనికి కారుతోపాటు వెళ్లేందుకు ఓ వ్యక్తి విఫలయత్నం చేశాడు. బయట ఉన్న రెండు బారికేడ్లను అధిగమించగా.. అక్కడే ఉన్న గార్డ్లులు అతడిని వెంబడించి నిలువరించినట్లు సమాచారం. కారుతో మక్కాలోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించిన వ్యక్తి పేరును సౌదీ అధికారులు వెల్లడించలేదు. అయితే అతనికి మతిస్థిమితం సరిగా లేదని మాత్రం తెలిపారు. తదుపరి విచారణ నిమిత్తం అతడిని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కార్యాలయానికి పంపించామని వారు చెప్పారు. (చదవండి : పిచ్చి ప్రయోగాలకు పోతే జరిగేది ఇదే) కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో మూతపడిన పవిత్ర మక్కా మసీదు.. ఏడు నెలల అనంతరం ఈ నెలలో తెరుచుకున్న విషయంత తెలిసిందే. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఉమ్రా తీర్థయాత్ర మార్చిలో నిలిపివేశారు. గత ఏడాది దాదాపు 2.5 లక్షల మంది యాత్రికులు మక్కాను దర్శించుకోగా.. ఈసారి కేవలం 10 వేల మంది దేశ పౌరులు మాత్రమే పాల్గొనేందుకు అనుమతించారు. (చదవండి : ఆన్లైన్ గేమ్ ఆడుతుండగా భూకంపం..) Car ploughs through Grand Mosque courtyard in Makkah, crashes into door#Makkah #MasjidilHaram#SaudiArabia pic.twitter.com/YeB3qQeFE9 — Mohammad Jamlish Roy (@jamlishofficial) October 31, 2020 -
విమానంలో ఉగ్రవాది.... హై టెన్షన్
పనాజీ: విమానంలో ఉగ్రవాది ఉన్నాడంటూ ఓ ప్రయాణికుడు హల్చల్ చేశాడు. దాంతో ప్రయాణికులు, అధికారులు తీవ్రంగా ఆందోళనకు గురయ్యారు. ఈ ఘటన గురువారం ఢిల్లీ నుంచి గోవా వెళ్తున్న ఎయిరింయా విమానంలో చోటు చేసుకుంది. వివరాలు.. జియా ఉల్ హక్(30) అనే వ్యక్తి తాను స్పెషల్ సెల్ అధికారిని అని.. విమానంలో టెర్రరిస్ట్ ఉన్నాడంటూ హల్చల్ చేశాడు. దాంతో ప్రయాణికులు, అధికారులు తీవ్ర టెన్షన్‌కు గురయ్యారు. ఇక డబోలిమ్ విమానాశ్రయంలో దిగిన వెంటనే అతడిని సీఐఎస్ఎఫ్ పోలీసులకు అప్పగించారు. విచారణలో జియా ఉల్ హక్కి మతి స్థిమితం సరిగా లేదని తెలిసింది. అతడు ఢిల్లీలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నట్లు వెల్లడించారు. స్థానిక ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం అతడిని పనాజీలోని మానసిక వ్యాధుల చికిత్స కేంద్రంలో చేర్చినట్లు అధికారులు తెలిపారు. (చదవండి: కోయి గోలి నహీ చలేగా..) -
వింత ఘటన : తండ్రి కోరిక మేరకు..
లక్నో : పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక మదురస్మృతిగా నిలిచిపోతుంది. పెళ్లి చేసుకునే వారు తమకు మంచి భార్య రావాలని కలల కంటారు. అందమైన అమ్మాయి తన జీవితంలోకి రావాలని కోరుకుంటూ ఆమె కోసం అన్వేషిస్తుంటారు.కానీ ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌కు చెందిన ఒక యువకుడు మాత్రం అమ్మాయిని పోలిన దిష్టిబొమ్మను వివాహం చేసుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. ప్రయాగ్‌రాజ్‌కు చెందిన శివమోహన్(90)కు తొమ్మిది మంది సంతానం. అందరిలోకి చిన్నవాడైనా పంచరాజ్ పుట్టుకతోనే మానసిక వికలాంగుడు. (ప్రగ్నెంట్ అని తెలీకుండానే బిడ్డకు జన్మనిచ్చింది) శివ మోహన్ తనకున్న ఆస్తితోనే పిల్లలందరిని పెద్ద చేసి వారికి వివాహాలు జరిపించాడు. అయితే పంచరాజ్‌కు కూడా పెళ్లి చేయాలని తండ్రి శివ మోహన్ అనుకున్నాడు. కానీ పంచరాజ్ మానసిక వికలాంగుడు కావడంతో అమ్మాయి దొరకడం కష్టంగా మారింది. దీంతో తన కుమారుడికి ఎలాగైనా పెళ్లి చేయాలని సంకల్పించుకున్న శివమోహన్ పెళ్లికుమార్తెను పోలిన దిష్టిబొమ్మను తయారు చేసి హిందూ సంప్రదాయం ప్రకారం పంచరాజ్‌కి వివాహం జరిపించారు. పైగా వివాహానికి హాజరైన వారికి చక్కని విందు కూడా ఏర్పాటు చేశారు. అయితే ఈ పెళ్లిని మొదట పంచరాజ్ తిరస్కరించాడు. చివరకు తండ్రి కోరిక మేరకు, ఆయన గౌరవాన్ని నిలబెట్టేందుకు దిష్టి బొమ్మతో పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యాడు. ఇదే విషయమై శివమోహన్ స్పందిస్తూ..' ఇప్పుడు నా వయసు 90 ఏళ్లు.. నాకు తొమ్మిది మంది పిల్లలు.. నా 8 మంది పిల్లలకు పెళ్లి చేశా. కానీ మానసిక వికలాంగుడైన నా చిన్నకొడుకు పంచరాజ్‌కు కూడా ఎలాగైనా పెళ్లి చేయాలని తీర్మానించకున్నా. అందుకే వాడిని ఒప్పించి పెళ్లికూతురు రూపంలో ఉన్న దిష్టిబొమ్మను తయారు చేసి అంగరంగ వైభవంగా వివాహం జరిపించా' అంటూ తెలిపాడు. ప్రస్తుతం ఈ పోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. -
పారిపోతాడని సంకెళ్లతో కట్టి తాళం వేస్తే..
రాంచీ : మతిస్థిమితం లేని వ్యక్తిని బంధించటానికి వేసిన సంకెళ్ల తాళం అతడి ప్రాణాల మీదకు తెచ్చింది. ఈ సంఘటన జార్ఖండ్ రాష్ట్రంలోని రాంచీలో ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాలలోకి వెళితే.. రాంచీ పట్టణానికి చెందిన జితేంద్ర కుమార్ అనే యువకుడికి మతిస్థిమితం సరిగాలేదు. తరచుగా ఇంటి నుంచి పారిపోతూ ఉండేవాడు. దీంతో అతడి తల్లిదండ్రులు అతడ్ని సంకెళ్లతో బంధించి తాళం వేశారు. అప్పుడప్పుడు తాళం తీస్తూ ఉండేవారు. కొద్దిరోజుల కిత్రం తాళం తీసిఉన్న సమయంలో అతడు ఆ తాళాన్ని మింగేశాడు. అది కాస్తా గొంతులో అడ్డుపడటంతో ఊపిరి అందక అల్లాడసాగాడు. ఇది గమనించిన కుటుంబసభ్యులు అతడ్ని ఆసుపత్రికి తరలించారు. అతడ్ని పరీక్షించిన డాక్టర్లు తాళాన్ని ఎండోస్కోపీ ద్వారా తీయటానికి ప్రయత్నించారు. అయితే ఆ ప్రయత్నం ఫలించలేదు. తాళాన్ని బయటకు తీయటానికి గొంతుకు ఆపరేషన్ చేయటం ఒక్కటే మార్గమని డాక్టర్లు భావించారు. ఫిబ్రవరి 14న జితేంద్రకు ఆపరేషన్ నిర్వహించారు. విజయవంతంగా అతడి గొంతులోని తాళాని బయటకు తీశారు. 12రోజులు ఆసుపత్రిలో ఉన్న అతడు డిశ్చార్జ్ అయ్యాడు. -
మతి స్థిమితం లేని బాలికపై అఘాయిత్యం
సాక్షి,మణుగూరుటౌన్: పట్టణంలోని మతి స్థిమితం లేని బాలిక(14)పై సోమవారం రాత్రి లైంగిక దాడి చేసిన ముగ్గురు నిందితులలో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. స్థానిక పోలీస్ స్టేషన్లో మంగళవారం విలేకరుల సమావేశంలో మణుగూరు డీఎస్పీ ఆర్.సాయిబాబా తెలిపిన వివరాలు...బెలూన్లు కొనేందుకని పట్టణంలోని షాపు వద్దకు వెళ్లిన మతి స్థిమితం లేని బాలికను ముగ్గురు యువకులు ద్విచక్ర వాహనంపై ఎక్కించుకున్నారు. గాంధీనగర్ చర్చి ప్రాంతంలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి లైంగిక దాడి చేశారు. ఆ బాలిక గట్టిగా అరవడంతో ఆ యువకులు పారిపోయారు. చుట్టుపక్కల వారు ఆ బాలికను తల్లిదండ్రులకు అప్పగించారు. బాధితురాలి తండ్రి ఫిర్యాదుతో పోలీసులు గాలింపు చేపట్టారు. హనుమాన్ టెంపుల్ ప్రాంతంలో మంగళవారం సాయంత్రం తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులకు బైక్‌పై ఇద్దరు యువకులు అనుమానాస్పదంగా కనిపించారు. వారిని అదుపులోకి తీసుకుని విచారించారు. బాలికపై లైంగిక దాడి చేసింది తామేనని వారు ఒప్పుకున్నారు. వీరిని– అశోక్‌నగర్‌కు చెందిన డేగ యశ్వంత్, కరకగూడెం మండలం తురుములగూడెం గ్రామస్తుడు నిట్టా ప్రశాంత్‌గా పోలీసులు గుర్తించారు. మరో నిందితుడైన పినపాక మండలం టి.కొత్తగూడెం గ్రామస్తుడు సిద్ధి నరేష్ పరారీలో ఉన్నాడు. వీరు ముగ్గురూ గతంలో కూడా గాంధీనగర్‌కు చెందిన బాలికను కిడ్నాప్ చేసి వదిలేశారు. నరేష్‌ను పట్టుకునేందుకు ప్రత్యేక పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. -
ఆరు నెలల తర్వాత కుటుంబసభ్యుల చెంతకు
ఖమ్మంఅర్బన్ : నగరంలోని ప్రశాంతినగర్‌లోని అన్నం ఫౌండేషన్ ఆశ్రమంలో ఆశ్రయం పొందుతున్న మతిస్థిమితం కోల్పోయిన వ్యక్తిని 6 నెలల తర్వాత కుటుంబ సభ్యులకు ఆదివారం అప్పగించారు. అతడి ఆరోగ్యం కుదుట పడటంతో చిరునామా తెలిపాడు. దీంతో అర్బన్ పోలీస్ స్టేషన్లో ఎస్ఐలు బాగం మోహన్‌రావు, అశోక్‌రెడ్డిల సమక్షంలో కుటుంబ సభ్యులకు అప్పగించారు. వివరాలిలా ఉన్నాయి. ఆరు నెలల కిందట పచ్చిమగోదావరి జిల్లా (ఐ) పంగిడి మండలం కొవ్వూరు గ్రామానికి చెందిన ఎంఎల్ సుబ్రహ్మణ్యం మతిస్థిమితం కోల్పోయి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. కొంతకాలం కిందట ఖమ్మం నగరంలోని వరంగల్ క్రాస్ రోడ్డులో రోడ్డుపై తిరుగుతుండగా స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు అన్నం ఫౌండేషన్ అధ్యక్షుడు అన్నం శ్రీనివాసరావు తీసుకొచ్చి తన ఆశ్రమంలో చేర్పించాడు. వైద్య పరీక్షలు చేయించాడు. దీంతో అతడి ఆరోగ్యం కుదుట పడింది. అనంతరం తన కుటుంబ వివరాలు, గ్రామం పేరు.. ఇతర వివరాలన్నీ చెప్పడంతో వారికి సమాచారం అందించారు. దీంతో సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులు శ్రీరాములు, కృష్ణకుమారి రావడంతో పోలీసుల సమక్షంలో కుటుంబ సభ్యుల చెంతకు చేర్చారు. మంచి మనిషిగా తీర్చిదిద్దిన ఫౌండేషన్ అధ్యక్షుడు అన్నం శ్రీనివాసరావుకు వారు కృతజ్ఞతలు తెలిపారు. -
మంటగలిసిన మానవత్వం..!
రాయగడ : ప్రజలంతా కలిసి చనిపోయేలా చితకబాది వదిలేసిన వ్యక్తికి ఆస్పత్రిలోనూ అదే పరిస్థితి కనిపిస్తోంది. కనీస వైద్యం కూడా అందించడానికి వైద్యులు ముందుకు రాకపోవడం చూస్తే మానవత్వం మంటగలిసిందా? అని పలువురు వాపోతున్నారు. వివరాలిలా ఉన్నాయి. రాయగడలోని మెయిన్ రోడ్డు జగన్నాథ మందిరం వీధి ప్రాంతంలో భాష రాని, మాటలు లేని మతిస్థిమితం లేని వ్యక్తి తిరుగుతుండగా పిల్లలను దొంగిలించే వ్యక్తిగా ప్రజలు అనుమానించి ప్రాణాలు పోయేలా చితకబాది పడవేశారు. ప్రజలు కొట్టిన దెబ్బలతో తలకు తగిలిన గాయంతో ఆ వ్యక్తి అచేతనంగా పడి ఉండగా ఒంటినిండా పురుగులు చేరి కొరుక్కుని తినడం చూసిన పోలీసులు ఆ వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు. అయితే ఆస్పత్రిలో 3రోజులుగా ఉన్న వ్యక్తికి వైద్య సిబ్బంది కనిసం ప్రాథమిక చికిత్స కానీ, ఎటువంటి వైద్యం అందించక పోవడంతో మితిస్థిమితం లేని వ్యక్తి అలాగే పడి ఉన్నాడు. ఆ వ్యక్తి అలా పడి ఉంటే వైద్య సిబ్బందికి కనీసం హృదయం కరగలేదని స్థానికులు వాపోతున్నారు. రాయగడలో కొద్ది నెలలుగా ఏ ఒక్క పిల్లాడు దొంగతనానికి గురి కాకపోయినా వాట్సాప్ పుకార్ల ద్వారా, మూఢనమ్మకాల ద్వారా నిత్యం ఏదో ఒక ప్రాంతంలో ఇతర రాష్ట్రాల నుంచి విచ్చేసిన మతి స్థిమితం లేని, భాష తెలియని వ్యక్తులపై ప్రజలు దాడులు చేసి చితక బాదుతున్నారు. జిల్లా అధికారులు ప్రజలను చైతన్యం చేయడంలో సంపూర్ణంగా విఫలమవుతున్నారు. -
రాములు వచ్చేదెట్టా?
సత్తుపల్లి : మతి స్థిమితం సరిగ్గా లేక, మూగ, చెవిటి వైకల్యంతో ఉన్న ఖమ్మంజిల్లా సత్తుపల్లి మండలం కిష్టారం గ్రామానికి చెందిన కంచపోగు పెద్దరాములు అదృశ్యమై ఏడాది కాలం తర్వాత..అతను రాజస్తాన్ రాష్ట్రంలో ఉన్నట్లు సామాజిక మాధ్యమాల్లో ఫొటోలు చక్కర్లు కొట్టడంతో ఇక్కడి కుటుంబ సభ్యులు అతడిని రప్పించాలని ఉన్నతాధికారులను వేడుకుంటున్నారు. పేద కుటుంబానికి చెందిన ఇతను అవివాహితుడు. 70 ఏళ్ల వయస్సులో..గతేడాది జూన్‌లో ఇంటి నుంచి వెళ్లిపోయాడు. బంధువులు చాలా చోట్ల వెతికినా ప్రయోజనం కన్పించలేదు. అప్పట్లో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేశారు. శుభకార్యాల్లో వంటలు చేస్తూ జీవించేవాడు. అయితే..పరిశుభ్రత అంటే..చాలా ఇష్టమని, ఎక్కడ చిన్న చెత్తకాగితం కనిపించినా తీసి పక్కకు వేస్తుంటాడని, శుభకార్యాలప్పుడు వచ్చి పరిసరాలను పరిశుభ్రం చేస్తుంటాడని, స్థానికంగా సుపరిచితుడని ఇక్కడివారు చెబుతున్నారు. ఈక్రమంలో రెండురోజుల క్రితం సోషల్ మీడియాలో పెద్దరాములు రాజస్తాన్ రాష్ట్రంలోని ఉదయ్‌పూర్ ప్రాంతలో ఉన్నట్లు వచ్చింది. రాజస్తాన్ పత్రికలో తన వారి కోసం వృద్ధుడి ఆరాటం.. పేరిట కథనం కూడా ప్రచురితమైంది. తెలుగువాడు అయినందున సోషల్ మీడియాలో తెలుగు వాళ్లందరికీ పోస్టు చేశారు. ఈ ప్రాంతంలోని కొందరు గుర్తించడంతో పెద్దరాములు రాజస్తాన్ రాష్ట్రం ఉదయ్‌పూర్‌లో ఉన్నట్లు వెలుగుచూసింది. కలెక్టర్, సీపీకి వినతి.. రాజస్తాన్ రాష్ట్రం నుంచి కంచపోగు పెద్దరాములును తీసుకొచ్చేందుకు సహకారం అందించాలని బంధువులు కలెక్టర్ లోకేష్‌కుమార్, సీపీ తఫ్సీర్ ఇక్బాల్‌లను కలిసి వేడుకున్నారు. అక్కడి అధికారులతో మాట్లాడి ఆ ప్రాంతంలో సంచరిస్తున్న పెద్దరాములును అప్పగించాలని కోరారు. -
‘సీఎంను చంపేస్తా’.. కత్తితో హల్చల్
సాక్షి, న్యూఢిల్లీ: నగరంలోని కేరళ భవన్ వద్ద శనివారం హైడ్రామా చోటు చేసుకుంది. కత్తితో భవన్ ఆవరణలోకి చొరబడ్డ ఓ వ్యక్తి.. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ను చంపేస్తానంటూ హల్ చల్ చేశాడు. టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం.. విమల్ రాజ్(46) అనే వ్యక్తి ఈ ఉదయం చేతిలో కొన్ని పేపర్లు.. జేబులో జాతీయ జెండా, కత్తితో కన్నౌట్ ప్లేస్(ఢిల్లీ)లోని కేరళ భవన్ వద్దకు చేరుకున్నాడు. మెయిన్ గేట్ సెక్యూరిటీ కళ్లు గప్పి ఎలాగోలా లోపలికి ప్రవేశించాడు. అయితే ఆవరణలోని అధికారులు అతన్ని అడ్డుకునే సరికి లోపలికి అనుమతించాలంటూ వారితో వాగ్వాదానికి దిగాడు. నెలరోజులుగా ఓ కేసు నిమిత్తం తాను సీఎంను కలిసేందుకు యత్నిస్తున్నానని, కానీ, ఆ పని జరగట్లేదని అతను ఆవేదన వ్యక్తం చేశాడు. ఇంతలో అధికారులు అతన్ని వెనకాల నుంచి వెళ్లి చాకచక్యంగా పట్టుకుని అదుపులోకి తీసుకున్నారు. కొడవూర్, కరిపుజ్జాకు చెందిన విమల్‌కు మతిస్థిమితం సరిగ్గాలేదని, అతని చేతిలో ఉన్న పేపర్లు అతని మెడికల్ రిపోర్ట్‌లేనని అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం అతన్ని చికిత్స కోసం ఐబీహెచ్‌ఏఎస్‌కు తరలించారు. ఇదిలా ఉంటే ఘటన జరిగిన సమయంలో సీఎం విజయన్ లోపలే ఉన్నారు. -
సీఎంను చంపేస్తానంటూ వ్యక్తి హల్ చల్!
-
రాచర్ల అడవిలో అస్తిపంజరం లభ్యం
వేమనపల్లి(బెల్లంపల్లి) : రాచర్ల అటవీ ప్రాంతంలో బుధవారం ఉదయం అస్తిపంజరం లభ్యమైంది. నెల రోజుల క్రితం అదృశ్యమైన ముల్కలపేట గ్రామానికి చెందిన దున్న వెంకటిదిగా కుటుంబ సభ్యులు గుర్తించారు. కుటుంబీకుల కథనం ప్రకారం వెంకటి(43) కొన్ని నెలలుగా మతి స్థిమితం లేక తిరుగుతున్నాడు. ఇంటి నుంచి వెళ్లి పోయిన నాటి నుంచి కుటుంబ సభ్యులు గాలిస్తున్నారు. ఈ నేపథ్యంలో వెంకటి రాచర్ల అటవీ ప్రాంతంలోని చెట్టుకు ఉరి పెట్టుకున్నాడు. వెంచపల్లి గ్రామానికి చెందిన పశువుల కాపరులు గమనించి కుటుంబీకులకు సమాచారం ఇచ్చారు. మృతదేహం గుర్తు పట్టలేకుండా కుళ్లి పోగా చెట్టుపై ఉన్న దుస్తులను బట్టి అతను వెంకటిగా గుర్తించారు. మృతుడి భార్య కవిత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై భూమేశ్ తెలిపారు. మృతుడికి ఇద్దరు కూతుళ్లు సంకీర్తన, స్పందన, ఒక కుమారుడు రిత్విక్ ఉన్నారు. -
‘మతి’లేకున్నా.. మంచోడు..!
కూసుమంచి ఖమ్మం జిల్లా : ఇతడు ఇక్కడి వారందరికీ సుపరిచితుడు. అందరూ యాండో (పిచ్చోడు) అని పిలుస్తుంటారు. ఈ ఫొటో చూశారా...? ఇద్దరు వృద్ధుల చేతులు పట్టుకుని రోడ్డు దాటిస్తున్నాడు. అక్కడ ఇంకెంతోమంది ‘మంచి’మనుషులు ఉన్నారు. వారెవరూ ఇతడిలా సాయపడేందుకు ముందుకు రాలేదు. ఇప్పుడు చెప్పండి... ఇతడిని పిచ్చోడా...? పిచ్చోడిలా కనిపిస్తున్న మంచోడా...?! ఈ దృశ్యం ఖమ్మం–సూర్యాపేట రాష్ట్రీయ రహదారిలోని కూసుమంచి బస్టాండ్ సెంటర్లో కనిపించింది. ఈ రోడ్డు దాటాలంటే చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. ఇక వృద్ధుల సంగతి చెప్పనక్కరలేదు. అలాంటి రద్దీగా ఉండే రోడ్డుపై శనివారం ఇద్దరు వృద్ధులను రోడ్డు దాటించి మానవత్వాన్ని చాటుకున్నాడు. -
వాట్సాప్ వదంతులు: దివ్యాంగురాలిని కొట్టి చంపారు!
భోపాల్ : సుప్రీం కోర్టు ఎన్ని హెచ్చరికలు చేసినా, ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్నా మూక హత్యలకు అడ్డుకట్ట పడటం లేదు. కర్ణాటకలోని బీదర్‌లో నలుగురు హైదరాబాదీలను పిల్లల కిడ్నాపర్లుగా పొరబడి స్థానికులు చేసిన దాడిలో ఒకరు మృతిచెందిన ఘటన మరవక ముందే మధ్యప్రదేశ్‌లో అలాంటి సంఘటనే చోటుచేసుకుంది. పిల్లల కిడ్నాపర్ అంటూ ఓ మానసిక దివ్యాంగురాలని గుర్తు తెలియని వ్యక్తులు కొట్టి చంపారు. ఈ దారుణ ఘటన సింగ్రాలీ పోలీస్ స్టేషన్ పరిధిలోని మోర్వా ప్రాంతంలో చోటుచేసుకుంది. నిర్మానుష్య ప్రాంతంలో గుర్తు తెలియని మృత దేహం ఉన్నట్లు ఆదివారం పోలీసులకు సమాచారం అందింది. ఘటనాస్థలికి చేరిన పోలీసులు మానసిక స్థితి సరిగ్గా లేని మహిళ మృత దేహంగా గుర్తించారు. ఆమె గత ఆరు నెలలుగా ఈ ప్రాంతంలోనే తిరుగుతున్నట్లు స్థానికులు పేర్కొన్నారు. అయితే ఆమె శరీరంపై ఉన్న గాయాలను బట్టి ఎవరో కొట్టి చంపినట్లు పోలీసులు భావిస్తున్నారు. పిల్లల కిడ్నాపర్లు తిరుగుతున్నారనే వాట్సాప్ వదంతులతోనే ఆమెను చంపి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. గుర్తుతెలియని వ్యక్తులు హత్యచేసినట్లుగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. స్థానికుల సమాచారం మేరకు ఆరుగురు నిందితులను గుర్తించారు. ఇదే తరహాలో అటవీ అధికారుపై దాడిచేసిన మరో ఘటనలో నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక రాజస్తాన్‌లో ఆవుల స్మగ్లింగ్‌కు చేస్తున్నారని ఒకరిని కొట్టి చంపిన విషయం తెలిసిందే. చదవండి : వెంటాడి...వేటాడారు! మూక హత్య కేసులో మరో ట్విస్ట్ -
పదిహేనేళ్లుగా చీకటి గదిలోనే..
మొయినాబాద్(చేవెళ్ల): అమ్మ.. తమ్ముడు.. మరదలు అందరు ఉన్నా అతడు అనాథ అయ్యాడు. మతి స్థిమితం లేకపోవడంతో వ్యవసాయ పొలం వద్ద బందీ అయ్యాడు. 15 ఏళ్లుగా చీకటిగదిలో బందించి అన్నపానీయాలు కిటికీలోంచి ఇస్తున్నారు. తిండీ ఆ గదిలోనే.. మలమూత్ర విసర్జన ఆ గదిలోనే. మనుషుల్లో మాతవత్వం మాయమవుతుందనడానికి ఈ సంఘటనే తార్కాణం. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం కనకమామిడి గ్రామంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కనకమామిడి గ్రామానికి చెందిన బలిజ బుచ్చప్ప, సుశీల దంపతులకు ఇద్దరు కొడుకులు, ఒక కూతురు ఉన్నారు. అందరి పెళ్లిళ్లు అయ్యాయి. పదిహేనేళ్ల క్రితం తండ్రి బుచ్చప్ప చనిపోయాడు. పెద్దకొడుకు మల్లేష్‌కు మతిస్థిమితం సరిగా లేదని అతని భార్య అప్పట్లోనే వదిలేసి వెళ్లిపోయింది. పెళ్లికి ముందు మల్లేష్ అందరితో కలుపుగోలుగా, చలాకీగా ఉండేవాడు. అన్నదమ్ములు సైతం అన్యోన్యంగా ఉండేవారు. తమ్ముడి పెళ్లి అయ్యాక మల్లేష్‌కు మతిస్థిమితం సరిగాలేదని గ్రామ సమీపంలోని వ్యవసాయ పొలం వద్ద చీకటి గదిలో బందించారు. అప్పటి నుంచి తల్లి సుశీల ప్లాస్టిక్ కవర్లో అన్నం, నీళ్లు తీసుకెళ్లి కిటికీలోంచి మల్లేష్‌కు ఇచ్చేది. తిండితోపాటు మలమూత్ర విసర్జన కూడా గదిలోనే. 15 సంత్సరాలుగా ఈ తంతు కొనసాగుతూనే ఉంది. కోట్ల విలువచేసే ఆస్తి ఉన్నా... మల్లేష్ పేరుమీద రూ.కోట్ల విలువచేసే భూమి ఉంది. అయినా తనవాళ్లు అతన్ని సరిగ్గా చూసుకోకుండా గదిలో బందించారు. తల్లి కన్న ప్రేమతో అన్నం, నీళ్లు ఇవ్వడమే తప్ప.. తమ్ముడు, మరదలు మాత్రం అస్సలు పట్టించుకునే పరిస్థితిలేదు. 15 ఏళ్లుగా గదిలోనే బందీగా ఉన్న మల్లేష్ వికృతంగా తయారయ్యాడు. ఇటీవల గ్రామస్తులు గదిలో ఉన్న మల్లేష్‌ను చూసి గడ్డం, తలవెంట్రుకలు తీయించారు. మల్లేష్ చదువుకునే రోజుల్లో చాలా చురుగ్గా ఉండేవాడని చెబుతున్నారు. అతనికి నిజంగానే మతిస్థిమితం సరిగా లేకుంటే ఆసుపత్రిలో చూపించాలి కానీ చీకటి గదిలో బంధించడం ఏమిటని గ్రామస్తులు అంటున్నారు. పౌరహక్కుల కమిషన్ స్పందించి మల్లేష్‌ను చీకటి గదినుంచి విముక్తి చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
టీచర్ తలనరికి.. రోడ్డుపై తిరిగాడు
రాంచీ : జార్ఖండ్‌లోని ఓ ప్రైమరీ స్కూల్ టీచర్‌ను మతిస్థిమితం లేని వ్యక్తి అతి దారుణంగా హత్య చేశాడు. వివరాల్లోకి వెళ్తే.. సుకురు హీరెసా(35) అనే మహిళ సెరైకెలా ఖర్సవాన్ జిల్లా ఖప్సారై గ్రామంలోని ప్రైమరీ స్కూల్లో టీచర్‌గా పనిచేస్తున్నారు. మతిస్థిమితం లేని హరి హెంబ్రోం(45) ఆమె వైపు ఎప్పుడు అదోలా చూస్తు ఉండేవాడు. మంగళవారం సుకురు పాఠశాలకు వెళ్లిన తర్వాత హరి ఆమెను స్కూల్ బయటకు రావాలని పిలిచాడు. సుకురు స్కూలు బయటకు రాగానే ఆమెపై పదునైన ఆయుధంతో విచక్షణ రహితంగా దాడికి దిగాడు. అంతటితో ఆగకుండా సుకురు తల నరికి.. ఆమె తలను చేతిలో పట్టుకుని వీధుల్లో తిరగసాగాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని హరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కాగా ఈ హత్యకు గల కారణాలు తెలియలేదు. -
మతిస్థిమితం లేని తనయుడు చేతిలో తల్లి హత్య
గజపతినగరం రూరల్ : మండలంలోని ముచ్చర్ల గ్రామానికి చెందిన మీసాల పైడమ్మ (62) మతిస్థిమితం లేని తన కుమారుడు చేతిలో మంగళవారం హతమైంది. వివరాల్లోకి వెళ్తే... ముచ్చర్ల గ్రామానికి చెందిన పైడమ్మకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ముగ్గురికి వివాహమైంది. పైడమ్మ భర్త సన్యాసప్పడు రెండు సంవత్సరాల కిందటే మృతి చెందడంతో ఆమె ముచ్చర్ల గ్రామంలో నివాసం ఉంటుంది. ఈ క్రమంలో కొన్నేళ్లుగా విశాఖపట్నంలో మతిస్థిమితం లేని తన కుమారుడు సీతంనాయుడు ఇటీవల ముచ్చర్ల గ్రామంలోని తన తల్లి వద్దకు చేరాడు. ఒక్కోసారి బాగానే మంచివాడుగా ఉంటుండే వాడని కొన్నిసార్లు పిచ్చివాడుగా తిరుగుతుండేవాడని గ్రామస్తులు, బంధువులు చెబుతున్నారు. పైడమ్మ కొన్ని నెలలుగా వేమలి గ్రామంలో తన కుమార్తె అచ్చియ్యమ్మ ఇంటి వద్ద ఉండేదని ఇటీవల ముచ్చర్ల గ్రామానికి వచ్చిందని గ్రామస్తులు తెలిపారు. తల్లి వద్దకు చేరిన కొడుకు సీతంనాయుడు ఒక్కసారిగా మానసిక స్థితి కొల్పోయి తన తల్లిని ఇంట్లో పెట్టి తలుపులు వేసి చెక్కతో తలపైన, వంటిపైన కొట్టడంతో పైడమ్మ పడిపోయింది. కొన ఊపిరితో ఉన్న పైడమ్మను గజపతినగరం సామాజిక ఆస్పత్రికి తరలించారు. అయినా ప్రయోజనం లేక మృతి చెందింది. పోలీసుల సమక్షంలో శవపంచనామా నిర్వహించారు. గజపతినగరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆస్పత్రిలో డీఎస్పీ ఆరా! గజపతినగరం రూరల్: మీసాల పైడమ్మ హత్యకు గురవడం వెనుక గల కారణాలను తెలుసుకునేందుకు బొబ్బిలి డీఎస్పీ గౌతమి శాలి మంగళవారం ఆరా తీశారు. గజపతినగరం సామాజిక ఆస్పత్రిలో పోస్టుమార్టం కోసం తీసుకువచ్చిన పైడమ్మను ఆమె పరిశీలించారు. సీతంనాయుడు పైడమ్మపై దాడి చేసినప్పుడు ఆ సమయంలో ఇంకా ఎవరైనా ఉన్నారా? అన్నది ఆరా తీసినట్టు తెలిపారు. నిందితుడు సీతంనాయుడును పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. సీఐ కాళిదాసు ముచ్చర్ల గ్రామాన్ని సందర్శించి వివరాలు సేకరించారు. -
న్యాయం చేయాలంటూ పోలీస్ స్టేషన్లో నగ్నంగా...
నేలకొండపల్లి ఖమ్మం : మండలంలోని రాజారాంపేటకు చెందిన మాధవరావు, తనకు న్యాయం చేయాలంటూ నేలకొండపల్లి పోలీస్‌స్టేషన్‌లో నగ్నంగా కూర్చున్నాడు. తన భార్య కాపురానికి రావడం లేదని, కుటుంబీకులు తన జీవీతాన్ని నాశనం చేశారని, న్యాయం చేయాలంటూ అతడు ముందుగా రూరల్ ఏసీపీ పి.నరేష్‌రెడ్డి ఎదుట పురుగు మందు డబ్బాతో హల్చల్ చేశాడు. ఇతడి సమస్యను పరిష్కరించాలంటూ నేలకొండపల్లి ఎస్హెచ్ఓ గణపతిని ఏసీపీ ఫోన్ చేసి ఆదేశించారు. పోలీస్ స్టేషన్‌కు వెళ్లాలని ఏసీపీ సూచించారు. దీంతో, మాధవరావు బైక్‌పై నేలకొండపల్లి స్టేషన్‌కు చేరుకున్నాడు. దుస్తులన్నీ విప్పి పూర్తి నగ్నంగా లోపలికి ప్రవేశించాడు. అక్కడున్న పోలీసులు వెంటనే బయటి నుంచి బట్టలు తెప్పించి కట్టించారు. ఇతడి మానసిక పరిస్థితి బాగాలేదని రాజారంపేట గ్రామస్తు లు చెప్పినట్టు ఏఎస్ఐ గణపతి తెలిపారు.