మానసిక వికలాంగురాలిపై లైంగిక దాడి | sexual assault on mentally disabled lady | Sakshi
Sakshi News home page

మానసిక వికలాంగురాలిపై లైంగిక దాడి

Published Thu, Jul 28 2016 11:22 PM | Last Updated on Tue, Oct 16 2018 4:50 PM

sexual assault on mentally disabled lady

ఆలస్యంగా వెలుగులోకి..
చెన్నారావుపేట: మానసిక వికలాంగురాలిపై ఓ యువకుడు లైంగిక దాడికి పాల్పడిన ఘటన మండలంలోని గురిజాల గ్రామంలో ఆలస్యంగా వెలుగుచూసింది. ఎస్సై పులి వెంకట్‌గౌడ్‌ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన కుంచెపు పవన్‌ అనే సుతారి మేస్త్రీ ఇదే గ్రామానికి చెందిన మానసిక వికలాంగురాలి(19)పై 10 రోజుల క్రితం లైంగిక దాడికి పాల్పడ్డాడు.
 
విషయం ఎక్కడైనా చెపితే చంపేస్తానని బెదిరించడంతో యువతి ఎవరికీ చెప్పలేదు. గురువారం ఆమె అమ్మమ్మ దౌడు లచ్చమ్మకు తెలపడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement