బాలికపై లైంగికదాడికి యత్నం | rape attempt | Sakshi
Sakshi News home page

బాలికపై లైంగికదాడికి యత్నం

Jul 23 2016 8:45 PM | Updated on Oct 16 2018 4:50 PM

మానసిక వికలాంగురాలైన బాలికపై ఓ వ్యక్తి లైంగిక దాడికి యత్నించాడు. ఈ ఘటన మండలంలోని ఐనపూరు దళితవాడలో జరిగింది. పోలీ సుల తెలిపిన వివరాల ప్రకారం ఐనపూరు దళితవాడకు చెందిన దంపతులకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమార్తె మానసిక వికలాంగురాలు కావడంతో ఇంటివద్ద ఉంచి వారు ఇరువురు కూలీ పనులకు వెళుతున్నారు.

పమిడిముక్కల : 
మానసిక వికలాంగురాలైన బాలికపై ఓ వ్యక్తి లైంగిక దాడికి యత్నించాడు. ఈ ఘటన మండలంలోని ఐనపూరు దళితవాడలో జరిగింది. పోలీ సుల తెలిపిన వివరాల ప్రకారం ఐనపూరు దళితవాడకు చెందిన దంపతులకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమార్తె మానసిక వికలాంగురాలు కావడంతో ఇంటివద్ద ఉంచి వారు ఇరువురు కూలీ పనులకు వెళుతున్నారు. శుక్రవారం కూడా పనులకు వెళ్లారు. సమీపంలో నివాసముండే చీలి నీలాంబరం (34) ఇంట్లో ఎవరూలేని సమయంలో వెళ్లి బాలికను (11) తన ఇంటికి తీసుకెళ్లి అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన స్థానికులు అక్కడకు వెళ్లడంతో బాలికను ఇంట్లోంచి బయటకు పంపిం చి వేశాడు. మధ్యాహ్నం 3 గంటలకు పొలం నుంచి ఇంటికి వచ్చిన దంపతులకు స్థాని కులు జరిగిన విషయం చెప్పారు. కుమార్తెను అడుగగా నీలాం బరం అసభ్యకరంగా ప్రవర్తించినట్లు సైగల ద్వారా చెప్పింది. తమ కుమార్తెపై అత్యాచారయత్నం, అస భ్య ప్రవర్తనకు పాల్పడిన చీలి నీలాం బరంపై తగు చర్యలు తీసుకోవాలని తల్లి శనివారం పోలీస్‌స్టేన్‌లో ఫిర్యాదు చేసింది. సీఐ సత్యన్నారాయణ, ఎస్‌ఐ శ్రీనివాస్‌లు ఐనపూరు వెళ్లి విచారణ జరిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.   
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement