ఏటీఎంలో వికలాంగురాలిపై అత్యాచారం
పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో మమత దీదీ పాలనలో మహిళలకు రక్షణ కరువైంది. అభంశుభం తెలియని మానసిక వికలాంగురాలు అయిన యువతిపై ఓ మానవ మృగం దాడి చేసి అత్యాచారం జరిపాడు. ఆ హృదయవిదారకమైన సంఘటన బుధవారం తెల్లవారుజామున హౌరా జిల్లాలోని నజీర్ గంజ్ ప్రాంతంలో ఏటీఎంలో చోటు చేసుకుంది. అయితే అదే రహదారిపై వెళ్తున్న పెళ్లి బృందంలోని ఇద్దరు సభ్యులు మానసిక వికలాంగురాలు అరుపులను విని ఏటీఎంలోకి ప్రవేశించారు.
అయితే పోరిపోయేందుకు ప్రయత్నించిన నిందితుడిని పట్టుకున్నారు. అనంతరం నిందితుడికి దేహశుద్ధీ చేసి పోలీసులకు అప్పగించారు. పోలీసులు అతడిని అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం పోలీసులు ప్రభుత్వ ఆసుపత్రికి తరిలించారు. ఏటీఎం వద్ద భద్రత సిబ్బంది లేకపోవడంతో ఈ ఘటన చోటు చేసుకుందని పోలీసులు వెల్లడించారు.