ధర్మపురి: దొంగ అని అనుమానించి ఓ మానసిక వైకల్యంగల బాలుడిని తీవ్రంగా కొట్టి అతడి చేతికి నిప్పంటించారు. దీంతో ఆ బాలుడి చేయి మణికట్టువరకు కాలిపోయింది.
ధర్మపురి: దొంగ అని అనుమానించి ఓ మానసిక వైకల్యం గల బాలుడిని తీవ్రంగా కొట్టి అతడి చేతికి నిప్పంటించారు. దీంతో ఆ బాలుడి చేయి మణికట్టు వరకు కాలిపోయింది. తమిళనాడులోని ధర్మపురి ప్రాంతంలో పీ రాజా, అతడి స్నేహితుడు గోవిందన్ అనే ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. వీరిలో రాజా సెల్ ఫోన్ పోవడంతో అక్కడే తిరుగుతున్న ఓ మానసిక వికలాంగుడిని పట్టుకొని, అతడిని దొంగగా అనుమానించి చెట్టుకు కట్టేసి దారుణంగా కొట్టారు. అనంతరం చేతికి నిప్పంటించారు.
ప్రస్తుతం ఆ బాలుడు ధర్మపురి ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటన గురించి తెలుసుకున్న మానసిక వైకల్యం చిన్నారుల హక్కుల ఉద్యమకారుడు ఎస్ నంబురాజన్ సదరు వ్యక్తులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారిపై పోలీసులు ఐపీసీ సెక్షన్ 294 (బీ), 324, 506 (1) ప్రకారం కేసులు నమోదు చేశారు. అయితే, ఈ సెక్షన్లు తేలికగా బెయిలు లభించే సెక్షన్లని, వారు చేసిన క్రూరమైన పనికి నాన్ బెయిలబుల్ కేసులుగా పెట్టాలని నంబురాజన్ డిమాండ్ చేశారు.