గిరిజన మహిళలపై అత్యాచారం, హత్య | Two tribal women raped and murdered in Jamshedpur | Sakshi
Sakshi News home page

గిరిజన మహిళలపై అత్యాచారం, హత్య

Published Wed, Feb 12 2014 3:01 PM | Last Updated on Tue, Oct 16 2018 4:50 PM

Two tribal women raped and murdered in Jamshedpur

ఇద్దరు గిరిజన మహిళలను వేర్వేరు ప్రాంతాలలో అత్యాచారం జరిపి ఆపై హత్య చేసిన సంఘటనలు జంషెడ్పూర్ నగరంలోని చోటు చేసుకున్నాయి. పోలీసులు కథనం ప్రకారం... మానసిక వికలాంగురాలైన మహిళ (44) మంగళవారం అదృశ్యమైంది. ఆ మహిళ మృతదేహన్ని బుధవారం ఉదయం దామ్హనీ ప్రాంతంలో కనుగొన్నారు. గత అర్థరాత్రి ఆ మహిళపై అత్యాచారం చేసి ఆపై బండ రాయితో తలపై మొది హత్య చేశారు.

 

అలాగే ఆరుగురు పిల్లల తల్లి అయిన మరో గిరిజన కార్మికురాలు (40) పై అత్యాచార జరిపి హత్య చేశారు. పొదల మాటున ఉన్న తన తల్లి మృతదేహన్ని కుమారుడు గుర్తించి పోలీసులకు సమాచారం అందించాడు. దాంతో కార్మికురాలి మృతదేహన్ని స్వాధీనం చేసుకున్నారు. అలాగే మానసిక వికలాంగురాలైన మహిళ మృతదేహన్ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకుని పోస్ట్మార్టం నిమిత్తం నగర ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement