పురుగుమందు తాగి వృద్ధుడు ఆత్మహత్య | Old Man Committed Suicide | Sakshi
Sakshi News home page

పురుగుమందు తాగి వృద్ధుడు ఆత్మహత్య

Published Tue, Apr 10 2018 1:56 PM | Last Updated on Tue, Oct 16 2018 4:50 PM

గోపాలపురం : గోపాలపురం మండలం గుడ్డిగూడెం గ్రామానికి చెందిన జగడాల సత్యనారాయణ(68) అనే వృద్ధుడు సోమవారం పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్టు ఎస్సై ఎం. జయబాబు చెప్పారు.

మృతుడు సత్యనారాయణకు గత కొంతకాలంగా మతిస్థిమితం లేకుండా జీవితం మీద విరక్తి చెంది ఉన్నాడని, పురుగుల మందు తాగుతానని బెదిరిస్తూ ఉండేవాడని, ఆయనను కుటుంబసభ్యులు ఓదార్చినా పట్టించుకోలేదన్నారు.

మతిస్థిమితం లేని సమయంలో పురుగుల మందు తాగిన సత్యనారాయణను స్థానిక పీహెచ్‌సీకి తరలించగా తాగిన మందు మోతాదు ఎక్కువకావడంతో ప్రయోజనం లేకుండా పోయిందన్నారు. మృతదేహాన్ని కొవ్వూరు ప్రభుత్వాసుపత్రికి పోస్టుమార్టంకు తరలించినట్టు ఎస్సై జయబాబు తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement