మతిస్థిమితం సరిగా లేని ఓ వ్యక్తి గూడ్స్ రైలు ఎక్కడమే కాకుండా దానిపై నుంచి వెళుతున్న హై ఓల్టేజీ విద్యుత్ తీగను పట్టుకున్నాడు.
మట్టెవాడ: మతిస్థిమితం సరిగా లేని ఓ వ్యక్తి గూడ్స్ రైలు ఎక్కడమే కాకుండా దానిపై నుంచి వెళుతున్న హై ఓల్టేజీ విద్యుత్ తీగను పట్టుకున్నాడు. ఈ ఘటన వరంగల్ జిల్లా నెక్కొండ రైల్వే స్టేషన్ వద్ద మంగళవారం మధ్యాహ్నం జరిగింది. ఈ ఘటనలో సదరు వ్యక్తి విద్యుదాఘాతానికి గురై శరీరం 46 శాతం మేర కాలిపోయింది.
దీనిపై సమాచారం అందుకున్న వరంగల్ రైల్వే ఎస్‌ఐ గోవర్ధన్ సిబ్బందితో కలసి సంఘటనా స్థలానికి చేరుకుని బాధితుడిని ఎంజీఎం ఆస్పత్రిలో చేర్పించారు. ప్రమాదానికి గురైన వ్యక్తి వయసు 25 ఏళ్లు ఉంటుందని ఎస్‌ఐ గోవర్ధన్ తెలిపారు.