
న్యూఢిల్లీ: భారతీయ రైల్వే(Indian Railways) దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకలాంటిదని అంటారు. దేశంలోని చాలామంది రైళ్లపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. అటు ప్రయాణికులను, ఇటు వస్తువులను తరలించేందుకు రైళ్లు రవాణా రంగంలో కీలకపాత్ర పోషిస్తున్నాయి. రైల్వేలు ఒకవైపు ఆధునికత దిశగా పరిగెడుతూ, మరోవైపు ప్రయాణికులకు అత్యుత్తమ సేవలు అందిస్తున్నాయి. తాజాగా భారతీయ రైల్వే అత్యంత శక్తివంతమైన ఇంజిన్‌ను రూపొందించింది. ఈ ఇంజిన్ వచ్చే నెలలో ట్రాక్‌లపై పరుగులు తీయనున్నదని సమాచారం.
ఈ అత్యంత శక్తివంతమైన ఇంజిన్‌ను గుజరాత్(Gujarat))లోని దాహోద్ ఫ్యాక్టరీలో తయారు చేశారు. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తాజాగా ఈ ఇంజిన్ తయారు చేసిన ఫ్యాక్టరీని సందర్శించారు. ఇక్కడ గూడ్స్ రైలు ఇంజన్లు తయారు చేస్తుంటారు. ప్రస్తుతం మొదటి అత్యంత శక్తివంతమైన ఇంజిన్ సిద్ధం అయ్యింది. ఈ రైల్వే కర్మాగారాన్ని ‘మేక్ ఇన్ ఇండియా’ ధ్యేయంలో భాగంగా ఏర్పాటు చేశారు. ఈ కర్మాగారానికి 2022లో ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. కేవలం మూడేళ్లలో ఈ కర్మాగారం దేశంలోనే అత్యంత శక్తివంతమైన రైలు ఇంజిన్‌ను నిర్మించి, ట్రాక్‌పైకి తీసుకువచ్చింది.
భారతీయ రైల్వే ఎలక్ట్రిక్ లోకోమోటివ్‌లను 6000 హార్స్‌పవర్ నుండి 9000 హార్స్‌పవర్‌కు అప్‌గ్రేడ్ చేస్తోంది. ఇంజినీరింగ్ కంపెనీ సీమెన్స్ గుజరాత్‌లోని దాహోద్‌లో రూ.20,000 కోట్ల ఖరీదు చేసే 9,000 హార్స్ పవర్ కలిగిన 1,200 ఎలక్ట్రిక్ ఇంజిన్‌లను తయారు చేయనుంది. 9000 హార్స్‌పవర్ సామర్థ్యం కలిగిన ఈ ఇంజిన్ 4,500 టన్నుల సరుకును మోసుకెళ్లే గూడ్స్ రైలును అధిక వేగంతో నడుపుతుంది. ఒక సాధారణ ట్రక్కు 7 నుండి 10 టన్నుల వస్తువులను మాత్రమే తీసుకువెళుతుంది. ఈ నూతన ఇంజిన్లతో రైళ్ల వేగం గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల మేరకు పెరగనుంది.
ఇది కూడా చదవండి: చెఫ్ అవతారంలో సోనూసూద్.. దోశ రేటు రెట్టింపు చేసి..
Comments
Please login to add a commentAdd a comment