goods train
-
పట్టాలు తప్పిన గూడ్స్ ట్రైన్
-
పట్టాలు తప్పిన గూడ్స్ రైలు
అల్లూరి జిల్లా: గూడ్స్‌రైలు పట్టాలు తప్పింది.రైల్వే అధికారుల అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం తప్పింది.రైల్వే అధికారుల వివరాల మేరకు.. శుక్రవారం ఉదయం అల్లూరి జిల్లాలోని అనంతగిరి మండలం బొర్రా గృహాల సమీపంలో కొత్తవలస కిరండూల్ రైల్వే ట్రాక్‌పై కొండచరియలు విరిగిపడ్డాయి.ఆ సమయంలో అరకు వెళ్తున్న ఓ గూడ్స్ వ్యాగన్ బొర్రా రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాలు తప్పింది. ప్రమాదంపై సమాచారం అందుకున్న రైల్వే అధికారులు రాకపోకల్ని నిలిపివేడయంతో పెను ప్రమాదం తప్పింది. ట్రాక్‌లను పునరుద్దించేందుకు రైల్వే శాఖ యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది. -
యుద్ధప్రాతిపదికన ట్రాక్‌ల పునరుద్ధరణ
సాక్షి, పెద్దపల్లి/రామగుండం: ధ్వంసమైన మూడు ట్రాక్‌లను యుద్ధప్రాతిపదికన పునరుద్ధరిస్తున్నారు. ఐరన్ కాయల్స్ లోడ్‌తో వెళుతున్న 44 వ్యాగన్లు ఉన్న గూడ్సు రైలు మంగళవారం రాత్రి రామగుండం–రాఘవాపూర్ రైల్వేస్టేషన్ల మధ్య కన్నాల గేట్ వద్ద పట్టాలు తప్పిన విషయం తెలిసిందే. బుధవారం రాత్రి వరకు ఒక ట్రాక్‌ను అందుబాటులోకి తీసుకొచ్చేలా పనులు వేగంగా కొనసాగిస్తున్నారు. వందలాదిమంది కూలీలు, భారీయంత్రాలను వినియోగించి పట్టాలపై పడిపోయిన వ్యాగన్లను తొలగించారు. దక్షిణమధ్య రైల్వే జీఎం అరుణ్‌కుమార్ జైన్ క్షేత్రస్థాయిలో పనులను పర్యవేక్షిస్తున్నారు. పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, ఎంపీ గడ్డం వంశీకృష్ణ ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. 39 రైళ్లు రద్దు.. 61 రైళ్లు దారిమళ్లింపు కాజీపేట–బల్హార్షా మీదుగా నడిచే 39 రైళ్లను పూర్తిగా, 7 రైళ్లను పాక్షికంగా రద్దు చేసిన అధికారులు.. 61 రైళ్లను దారిమళ్లించారు. మరో 7 రైళ్లను రీషెడ్యూల్ చేశారు. దీంతో ప్రయాణికులు గమ్యస్థానాలు చేరుకునేందుకు ఎలాంటి సౌక ర్యం లేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వివిధ స్టేషన్లలోని ప్రయాణికులు సమీప ఆర్టీసీ బస్టాండ్లకు చేరుకోవడంతో బస్సులు కిక్కిరిసిపోయాయి. రామగుండం మీదుగా దేశవ్యాప్తంగా నిత్యం ప్ర యాణించేవారు వేల సంఖ్యలో ఉంటారు. టికెట్ రిజర్వేషన్ చేయించుకున్న వారు రైళ్ల రద్దుతో దిక్కుతోచని స్థితిలో పడ్డారు. ప్రయాణికులకు సేవలు అందించడం, సమాచారం తెలియజేయడానికి రామగుండం రైల్వేస్టేషన్లో అధికారులు హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేశారు.ప్రమాదాన్ని గుర్తించలేదా? ఇటీవల ట్రాక్‌ల సామర్థ్యం పెంచారు. దీంతో గూడ్సు రైలు ప్రమాదానికి వేగం కారణం కాదని రైల్వే అధికారులు భావిస్తున్నారు. ఉష్ణోగ్రతలు 3 డిగ్రీల సెల్సియస్ కన్నా తక్కు వ ఉంటే పట్టాలు సంకోచ, వ్యాకోచాలకు లోనవుతాయని, ప్రమాద సమయంలో ఉష్ణో గ్రతలు ఆ స్థాయిలో లేవని వారు అంచనా వేస్తున్నారు. రైలు ఇంజిన్ నుంచి తొమ్మిదో నంబరు వ్యాగన్ పట్టాలు తప్పడంతో ఈ ఘటన చోటుచేసుకుందని అంటున్నారు. ప్రమాదాన్ని పసిగట్టని లోకోపైలెట్ వేగం తగ్గించకుండా ముందుకు వెళ్లడంతో పట్టాలు తప్పిన 11 వ్యాగన్లు సుమారు కిలోమీటరు పొడవున అలాగే వెళ్లిపోయాయా? దీంతోనే భారీ నష్టం వాటిల్లిందా? లేదా మరేదైనా కుట్ర ఉందా? అనే కోణంలో డివిజినల్ సేఫ్టీ కమిటీతో పాటు రైల్వే ఇంటెలిజెన్స్ అధికారులు విచారణ జరుపుతున్నారు.దిక్కుతోచడం లేదు మా సొంతూరు వెళ్లేందుకు సంతోషంగా రైలెక్కిన. పెద్దపల్లి నుంచి కరీంనగర్, నిజామాబాద్, నాగపూర్ మీదుగా తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌ను నడిపిస్తే గమ్యస్థానం చేరుకునేవాడిని. రైళ్ల గురించి అడిగితే అధికారులు సమాధానం చెప్పడం లేదు. ఎలా వెళ్లాలో అర్థం కావడం లేదు. – ప్రధాన్, ప్రయాణికుడు, ఝాన్సీ, ఉత్తరప్రదేశ్ 12 గంటల ప్రయాణమైంది దాణాపూర్ ఎక్స్‌ప్రెస్‌లో నాగ్‌పూర్ వెళ్లాలి. స్టేషన్‌కు వచ్చాక రైళ్ల రద్దు విషయం తెలిసింది. రిజర్వేషన్ ప్రయాణికులకు రైల్వేశాఖ సెల్‌నంబర్లు ఇస్తే బాగుంటుంది. బస్సులో నాగ్‌పూర్ వెళ్తున్న. రూ.500 ఖర్చుతో ఆరు గంటల్లో మా ఊరు చేరుకునేవాడిని. రైళ్ల రద్దుతో రూ.2వేల ఖర్చు, 12 గంటల సమయం పడుతుంది. – సత్యం, ప్రయాణికుడు, నాగ్‌పూర్, మహారాష్ట్ర -
పట్టాలు తప్పిన గూడ్స్ రైలు
-
పట్టాలు తప్పిన గూడ్స్ రైలు
సాక్షి, పెద్దపల్లి/రామగుండం: పెద్దపల్లి జిల్లాలో ఓ గూడ్స్ రైలు మంగళవారం పట్టాలు తప్పటంతో ఢిల్లీ–చెన్నై మార్గంలో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. నిజామాబాద్ నుంచి ఘజియాబాద్ వైపు 43 వ్యాగన్లతో ఐరన్ కాయల్స్ లోడుతో వెళుతున్న గూడ్స్ రైలులోని 11 వ్యాగన్లు పెద్దపల్లి జిల్లా రాఘవాపూర్–కన్నాల గేట్ మధ్యలో 282/35 పోల్ వద్ద పట్టాలు తప్పాయి. దీంతో ఈ మార్గంలో ఎటువైపు రైలు అటువైపు నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న రైల్వే సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని పునరుద్ధరణ పనులు చేపట్టారు. మంచిర్యాల, రామగుండం, పెద్దపల్లి, ఓదెల, జమ్మికుంట తదితర రైల్వే స్టేషన్లలో రైళ్లు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మూడు లైన్లు ధ్వంసం కన్నాల గేట్ వద్ద 11 వ్యాగన్లు పట్టాలపై పడిపోవడంతో కాజీపేట్–బల్లార్షా మధ్య ఉన్న మూడు రైల్వే లైన్స్ పూర్తిగా ధ్వంసమయ్యాయి. ప్రమాద తీవ్రతకు పట్టాలు విరిగిపోయి చెల్లాచెదురయ్యాయి. కరెంట్ పోల్స్ సైతం విరిగిపోయాయి. వ్యాగన్లు ఒక్కదానిపైకి ఒక్కటి ఎక్కడంతో ట్రాక్ పునరుద్ధరణ పనులు కష్టంగా మారాయి. రైలు ఇంజిన్, గార్డ్ వ్యాగన్ పట్టాలు తప్పలేదు. పునరుద్ధరణ పనులు రాత్రి 11 గంటల తరువాత మొదలయ్యాయి. రైలు ఇంజిన్‌వైపు ఉన్న 8 వ్యాగన్లతోసహా గూడ్స్‌ను రామగుండంకు తరలించారు. భాగ్యనగర్ రైలు రాఘవాపూర్‌కు చేరుకోగా, దానిని వెనుకకు మళ్లించి పెద్దపల్లిలో ప్రయాణికులను దింపివేశారు. వరంగల్ వైపు వెళ్లే మరికొన్ని సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను రామగుండం, మంచిర్యాల రైల్వేస్టేషన్లలో నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు. రైళ్ల రాకపోకలను పునరుద్ధరించేందుకు కనీసం 24 గంటల సమయం పట్టవచ్చని చెప్పారు. ప్రమాదానికి గల కారణాలపై రైల్వే ఇంటెలిజెన్స్ అధికారులు ఆరా తీస్తున్నారు. ఈ ప్రమాదం నుంచి లోకోపైలెట్లు ఇద్దరు, గార్డు సురక్షితంగా బయటపడ్డారు. -
రూర్కీలో రైలు పట్టాలపై గ్యాస్ సిలిండర్
హరిద్వార్: ఉత్తరాఖండ్‌లోని రూర్కీ–లుక్సార్ మార్గంలో రైలు పట్టాలపై గుర్తు తెలియని వ్యక్తులు గ్యాస్ సిలిండర్‌ను ఉంచారు. ధంధేరా రైల్వే స్టేషన్ సమీపంలో రెండో లైన్‌పై ఉన్న సిలిండర్‌ను శనివారం ఉదయం 6.45 గంటల సమయంలో గూడ్స్ రైలు గార్డు ఒకరు గమనించి అధికారులకు వెంటనే సమాచారిమిచ్చారు. ఆ సమయంలో ఆ మార్గంలో రైళ్లేవీ ప్రయాణించడం లేదని లుక్సర్ రైల్వే పోలీస్ ఇన్చార్జి సంజయ్ శర్మ చెప్పారు. రైలు మార్గం మధ్యలో మూడు కిలోల చిన్న ఖాళీ సిలిండర్ పడి ఉందని తెలిపారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసు బృందాలు సిలిండర్‌ను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. రూర్కీ సివిల్ లైన్ పోలీస్‌స్టేషన్‌లో గుర్తు తెలియని వ్యక్తులపై రైల్వే చట్టం కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టామని వెల్లడించారు.ఎక్స్‌ప్రెస్ రైలు బోగీకి మంటలుఛతర్పూర్: మధ్యప్రదేశ్‌లోని ఛతర్పూర్లో ఆదివారం ఉదయం గీతా జయంతి ఎక్స్‌ప్రెస్ రైలు బోగీకి మంటలంటుకున్నాయి. ఉదయం 7.30 గంటల సమయంలో చోటుచేసుకున్న ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి ప్రమాదం సంభవించలేదు. ఇషానగర్ స్టేషన్ నుంచి రైలు వెళ్తుండగా డీ5 కోచ్‌లో పొగలు రావడాన్ని గమనించిన వెంటనే సిబ్బంది రైలును నిలిపివేసి, ఆర్పివేశారని ఓ అధికారి తెలిపారు. కోచ్ దిగువ భాగంలోని రబ్బర్ వేడెక్కడం వల్లే మంటలు మొదలైనట్లు తెలుస్తోందన్నారు. -
తమిళనాడులో గూడ్స్ రైలును ఢీ కొన్న మైసూరు-దర్భంగా భాగమతి ఎక్స్‌ప్రెస్... రెండు బోగీల్లో మంటలు... పట్టాలు తప్పిన 13 కోచ్‌లు.. ఐదుగురు ప్రయాణికులకు తీవ్ర గాయాలు
-
Jharkhand: పట్టాలు తప్పిన గూడ్సు రైలు.. రైళ్ల రాకపోకలకు అంతరాయం
తుప్కాడి: జార్ఖండ్‌లో రైలు ప్రమాదం చోటుచేసుకుంది. బొకారో స్టీల్ ప్లాంట్ నుండి వల్లభ్‌గఢ్‌కు వెళ్తున్న గూడ్స్ రైలుకు చెందిన రెండు వ్యాగన్లు పట్టాలు తప్పాయి. తుప్కాడి రైల్వే స్టేషన్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదం కారణంగా ఈ మార్గంలో వెళ్లే పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. ఈ నేపధ్యంలోనే వారణాసి నుంచి రాంచీ వెళ్తున్న వందే భారత్ రైలును చందర్పురా రైల్వే స్టేషన్లో నిలిపివేశారు.ఈ ప్రమాదం అనంతరం సంఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పోస్టు సోషల్ మీడియాలో కనిపిస్తోంది. దానిలో గూడ్స్ రైలు వ్యాగన్లు బోల్తా పడటాన్ని గమనించవచ్చు. ప్రస్తుతం రైల్వే ఉన్నతాధికారులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.ఇటీవలి కాలంలో గుజరాత్, మధ్యప్రదేశ్, మధురలలో రైళ్లు పట్టాలు తప్పాయి. కొన్ని చోట్ల ఉద్దేశపూర్వకంగా రైలును పట్టాలు తప్పించే ప్రయత్నాలు జరిగాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గుజరాత్‌లోని సూరత్‌లో పంజాబ్‌లోని భటిండాలో రైళ్లను పట్టాలు తప్పించేందుకు కుట్ర పన్నారు. అయితే డ్రైవర్ తెలివిగా వ్యవహరించడంతో పెను ప్రమాదాలు తప్పాయి. Bokaro, Jharkhand: A goods train passing through Tupkadih got detached in two, with two of its wagons overturning after derailment. The incident occurred between Tupkadih and Rajabera sections. Train movement affected and the plying of trains on down line track suspended. A… pic.twitter.com/p3luQ0gppk— ANI (@ANI) September 26, 2024ఇది కూడా చదవండి: ఊపిరి తీసిన హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ -
పట్టాలు తప్పిన గూడ్స్ రైలు
భువనేశ్వర్: భువనేశ్వర్ రైల్వే స్టేషన్ సమీపంలో శుక్రవారం గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణహాని, ఆస్తి నష్టం జరగలేదని తూర్పు కోస్తా రైల్వే అధికారులు వెల్లడించారు. రైలులోని రెండు వ్యాగన్లు పట్టాలు నుంచి జారడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. వాణి విహార్ పాసింజరు హాల్టు స్టేషను వద్ద రైలు కటక్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. తాజా ఘటన నేపథ్యంలో మధ్య, ఎగువ లైన్లు ప్రభావితం కాలేదని, ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది ఎదురుకాలేదని తూర్పు కోస్తా రైల్వే ఽపేర్కొంది. -
పశ్చిమ బెంగాల్లో ఘోర రైలు ప్రమాదం...ఎక్స్‌ప్రెస్‌ను ఢీకొట్టిన గూడ్సు రైలు
న్యూజల్పాయ్గురి/కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్ జిల్లాలో ఘోర రైలు ప్రమాదం సంభవించింది. వేగంగా వస్తున్న గూడ్స్ రైలు రెడ్ సిగ్నల్‌ను జంప్ చేసి అదే ట్రాక్‌పై నిలిచిఉన్న కాంచనజంగ ఎక్స్‌ప్రెస్‌ను వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. త్రిపురలోని అగర్తలా నుంచి బెంగాల్‌లోని సీల్డాకు వెళ్తున్న ఎక్స్‌ప్రెస్ రైలు నుంచి మూడు కోచ్‌లు పట్టాలు తప్పాయి. ఇందులో ఒక గార్డు కోచ్, రెండు పార్సల్ కోచ్‌లు ఉన్నాయి. అదృష్టవశాత్తూ ప్రయాణికుల కోచ్‌లకు నష్టం వాటిల్లలేదు. ఉత్తర బెంగాల్లో న్యూజల్పాయ్గురి రైల్వేస్టేషన్‌కు 30 కిలోమీటర్ల దూరంలోని రంగపాణి స్టేషన్ సమీపంలో సోమవారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో 9 మంది మరణించారు. 41 మంది గాయపడ్డారు. గూడ్సు రైలు లోకో పైలట్, ఎక్స్‌ప్రెస్ రైలు గార్డుతోపాటు ఏడుగురు ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని రైల్వేశాఖ అధికారులు వెల్లడించారు. రైలు ప్రమాదంపై సమాచారం అందిన వెంటనే రైల్వేశాఖతోపాటు పశ్చిమ బెంగాల్ అధికారులు సహాయక చర్యలు ప్రారంభించారు. కోచ్‌ల్లో ఇరుక్కుపోయిన ప్రయాణికులను బయటకు తీసుకొచ్చారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.రెడ్ సిగ్నల్ పడినా.. గూడ్సు రైలు లోకో పైలట్ నిర్లక్ష్యం వల్లే రైలు ప్రమాదం చోటుచేసుకున్నట్లు అధికారులు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించినట్లు తెలుస్తోంది. ఈ దుర్ఘటనలో మానవ తప్పిదం ఉండొచ్చని, రెడ్ సిగ్నల్ ఇచ్చినప్పటికీ లోకో పైలట్ ఆగకుండా ముందుకు దూసుకెళ్లడంతో ఎక్స్‌ప్రెస్ రైలును వెనుకనుంచి ఢీకొట్టినట్లు భావిస్తున్నామని రైల్వే బోర్డు చైర్పర్సన్ జయవర్మ సిన్హా చెప్పారు. సిగ్నలింగ్ వ్యవస్థలో లోపాలు చోటుచేసుకున్నాయా? అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. ఒకే సింగిల్ ట్రాక్‌పై రెండు రైళ్లు అత్యంత సమీపంలోకి వచ్చేలా సిగ్నల్ ఎలా ఇచ్చారన్న దానిపై దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాద తీవ్రతకు కాంచనజంగ్ ఎక్స్‌ప్రెస్ చివరి భాగంలోని మూడు కోచ్‌లు పట్టాలు తప్పాయి. రెండు కోచ్‌లు పూర్తిగా పక్కకు ఒరిగిపోగా, మరో కోచ్ గాల్లోకి లేచి అలాగే వేలాడుతోంది. గూడ్సు రైలు ఇంజన్ దానికిందికి చొచ్చుకొచి్చంది. వేలాడుతున్న కోచ్‌ను అధికారులు తొలగించారు. మధ్యాహ్నం 12.40 గంటలకు మిగిలిన కోచ్‌లతో ఎక్స్‌ప్రెస్ రైలు ఘటనా స్థలం నుంచి కోల్‌కతా వైపు ప్రయాణం సాగించింది. కమిషనర్ ఆఫ్ రైల్వే సేఫ్టీ దర్యాప్తు ఘటనా స్థలంలో సహాయక చర్యలను పర్యవేక్షించడానికి రైల్వేశాఖ మంత్రి వైష్ణవ్ రంగంలోకి దిగారు. లిఫ్ట్ అడిగి బైక్‌పై ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ ప్రమాదంపై కమిషనర్ ఆఫ్ రైల్వే సేఫ్టీ దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున, తీవ్రంగా గాయపడిన వారికి రూ.2.5 లక్షల చొప్పున, స్వల్పగాయాలైన వారికి రూ.50 వేల చొప్పున పరిహారం అందజేస్తామని ప్రకటించారు. రాష్ట్రపతి, ప్రధానమంత్రి దిగ్భ్రాంతి సాక్షి, న్యూఢిల్లీ: పశి్చమ బెంగాల్లో జరిగిన ఘోర ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. మృతుల కుటుంబాలకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి రూ.2 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేíÙయా, క్షతగాత్రులకు రూ.50 వేల చొప్పున ఇవ్వనున్నట్లు ప్రధానమంత్రి కార్యాలయం ప్రకటించింది. ఇదంతా మోదీ సర్కారు నిర్వాకం: కాంగ్రెస్ బెంగాల్ రైలు ప్రమాదంపై కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే, పార్టీ నేత రాహుల్ గాంధీ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. కేంద్ర ప్రభుత్వ నిర్వాకం వల్లే ఈ దుర్ఘటన జరిగిందని విమర్శించారు. మోదీ ప్రభుత్వం రైల్వేశాఖను నిర్లక్ష్యం చేసిందని మండిపడ్డారు. మోదీ పదేళ్ల పాలనలో రైల్వేశాఖ తల్లిదండ్రులు లేని అనాథగా మారిందని సీఎం మమతా బెనర్జీ ధ్వజమెత్తారు. రైల్వే శాఖ గత వైభవాన్ని కోల్పోయిందన్నారు.ఆ మార్గంలో ‘కవచ్’ లేదు రైళ్లు పరస్పరం ఢీకొట్టకుండా కవచ్ వ్యవస్థను రైల్వేశాఖ ప్రవేశపెట్టింది. అయితే, గౌహతి–ఢిల్లీ మార్గంలో ఈ వ్యవస్థను ఇంకా అందుబాటులోకి తీసుకురాలేదు. కాంచనజంగ ప్రమాదం జరిగిన ప్రాంతం ఇదే మార్గంలో ఉంది.కొంపముంచిన టీఏ912 లెటర్! కాంచనజంగ రైలు ఘటనలో మరో కోణం వెలుగులోకి వచ్చింది. ఈ ప్రమాదం వెనుక గూడ్సు రైలు లోకో పైలట్ తప్పిదం లేదని తెలుస్తోంది. రాణిపాత్ర స్టేషన్, ఛత్తర్‌హట్ జంక్షన్ మధ్యలో కాంచనజంగ రైలును గూడ్సు రైలు ఢీకొట్టింది. అయితే, సోమవారం ఉదయం 5.50 గంటల నుంచి ఈ మార్గంలో ఆటోమేటిక్ సిగ్నలింగ్ వ్యవస్థ పనిచేయకపోవడంతో రెడ్‌సిగ్నల్ ఉన్నప్పటికీ ముందుకెళ్లాలని లోకో పైలట్‌కు సూచించినట్లు వెల్లడయ్యింది. ఈ మేరకు రైల్వేశాఖ అంతర్గత నివేదిక ఒకటి వెలుగులోకి వచి్చంది. ఈ నివేదిక ప్రకారం.. రాణిపాత్ర స్టేషన్ మాస్టర్ టీఏ912 పేరిట లోకో పైలట్‌కు లిఖితపూర్వక ఆదేశాలిచ్చారు. రాణిపాత్ర స్టేషన్, ఛత్తర్‌హట్ జంక్షన్ మధ్యలో ఏ సిగ్నల్ పడినా దాటుకొని ముందుకెళ్లాలని పేర్కొన్నారు. అదే ట్రాక్‌పై మరో రైలు లేకపోతే సిగ్నల్‌తో సంబంధం లేకుండా ముందుకెళ్లడానికి టీఏ912 లెటర్ జారీ చేస్తుంటారని రైల్వేవర్గాలు వెల్లడించాయి. ప్రమాదం జరిగిన ట్రాక్‌పై అంతకుముందే ఒక రైలు వెళ్లింది. మరో సెక్షన్లోకి ప్రవేశించింది. దాంతో ట్రాక్‌పై రైలు లేదన్న అంచనాతో స్టేషన్ మాస్టర్ టీఏ912 జారీ చేసినట్లు అనుమానిస్తున్నారు. కాంచనజంగ ఎక్స్‌ప్రెస్ సోమవారం ఉదయం 8.27 గంటలకు రంగపాణి స్టేషన్‌ను దాటేసింది. రాణిపాత్ర స్టేషన్, ఛత్తర్‌హట్ జంక్షన్ మధ్యలో ట్రాక్‌పై నిలిచిపోయింది. ఎందుకు నిలిచిందన్నది తెలియడంలేదు. గూడ్సు రైలు ఉదయం 8.42 గంటలకు రంగపాణి స్టేషన్‌ను దాటేసి సరిగ్గా 8.55 గంటలకు కాంచనజంగ ఎక్స్‌ప్రెస్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదం ఏడాది క్రితం జరిగిన కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ దుర్ఘటనను గుర్తుకుతెచి్చంది. -
బెంగాల్ రైలు ప్రమాద దుర్ఘటన (ఫొటోలు)
-
Train Accident: బెంగాల్లో ఘోర రైలు ప్రమాదం.. పెరిగిన మృతుల సంఖ్య
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ ఘోర రైలు ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటిదాకా 15 మంది మరణించినట్లు అధికారులు ప్రకటించారు. మరో 60 మంది ప్రయాణికులు గాయపడినట్లు చెబుతున్నారు. సహాయక చర్యలు కొనసాగుతుండడం.. క్షతగాత్రులకు తీవ్ర గాయాలు కావడంతో మృతుల సంఖ్య మరింత పెరగొచ్చని అధికారులు అంటున్నారు.సోమవారం ఉదయం ఘోర రైలు ప్రమాదం సంభవించింది. న్యూ జల్పాయ్గురి వద్ద ఓ గూడ్స్ రైలు కాంచనజంగా ఎక్స్‌ప్రెస్ రైలును ఢీ కొట్టింది. అస్సాం సిల్చార్- కోల్‌కతా సీల్దా మధ్య కాంచన్‌జంగా ఎక్స్‌ప్రెస్(13174) నడుస్తుండగా.. ప్రమాదానికి కారణమైన గూడ్స్ అగర్తల నుంచి సీల్దా వస్తోంది. ఈ క్రమంలో.. సోమవారం ఉదయం 9గం. ప్రాంతంలో న్యూ జల్పాయ్గురి రంగపాని-నిజ్బారి స్టేషన్ల మధ్య గూడ్స్, కాంచన్‌జంగా ఎక్స్‌ప్రెస్‌ను ఢీ కొట్టింది. पश्चिम बंगाल में रेल हादसा, डाउन कंचनजंगा एक्सप्रेस से टकराई मालगाड़ी, फिलहाल 6 घायलों की सूचनाअभी तक किसी जनहानि की खबर नहीं, राहत और बचाव के लिए रेलवे दल रवाना...#WestBengal #TrainAccident @IRCTCofficial @RailMinIndia pic.twitter.com/mhsDQpXHTw— Manraj Meena (@ManrajM7) June 17, 2024ప్రమాదం ధాటికి రైలు బోగీలు చెల్లాచెదురుగా పడిపోయాయి. ఓ బోగీ గాల్లోకి లేచింది. మూడు బోగీల్లోని ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే అధికారులు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలిస్తున్నారు. వీళ్లలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాద నేపథ్యంలో పలు రైళ్లను రద్దు చేశారు. మరికొన్నింటిని దారి మళ్లించారు. ప్రమాదంలో గూడ్స్ డ్రైవర్, అసిస్టెంట్ పైలట్.. కాంచన్‌జంగా ఎక్స్‌ప్రెస్ గార్డ్ మరణించినట్లు రైల్వే శాఖ ధృవీకరించింది. అయితే మృతుల వివరాలను ఇంకా వెల్లడించాల్సి ఉంది.Shocked to learn, just now, about a tragic train accident, in Phansidewa area of Darjeeling district. While details are awaited, Kanchenjunga Express has reportedly been hit by a goods train. DM, SP, doctors, ambulances and disaster teams have been rushed to the site for rescue,…— Mamata Banerjee (@MamataOfficial) June 17, 2024మరోవైపు ఘటన గురించి తెలియగానే ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఘటనా స్థలానికి వెళ్లారు. ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉప రాష్ట్రపతి జగ్దీప్ ధన్కడ్, దేశ ప్రధాని నరేంద్ర మోదీ తదితరులు సోషల్ మీడియా ద్వారా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంపై రైల్వే శాఖమంత్రి అశ్వినీ వైష్ణవ్ ఎక్స్ ద్వారా స్పందించారు. 👉: (ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)ఈ ప్రమాదం బాధాకరమని, సహాయక చర్యలు కొనసాగుతున్నాయని దిగ్భ్రాంతి వ్యక్తం చేశారాయన. ఇంకోవైపు కేంద్రం ప్రమాదంలో మరణించిన వాళ్లకు రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. రైల్వే శాఖ తరఫున మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు, తీవ్రంగా గాయపడిన వాళ్లకు 2.5 లక్షలు, గాయపడిన వాల్లకు రూ.50వేలు ప్రకటించారు మంత్రి అశ్వినీ వైష్ణవ్. Unfortunate accident in NFR zone. Rescue operations going on at war footing. Railways, NDRF and SDRF are working in close coordination. Injured are being shifted to the hospital. Senior officials have reached site.— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) June 17, 2024ప్రమాదం ఎలా జరిగింది?ప్రమాదం అనంతరం ఆ ప్రాంతమంతా బీతావహ వాతావరణం నెలకొంది. ఒకే ట్రాక్‌పై రెండు రైళ్లు రావడంతోనే ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. అయితే గూడ్స్ రైలు సిగ్నల్‌ను పట్టించుకోకుండా వేగంగా క్రాస్ చేసి వెళ్లిపోయిందని ప్రాథమికంగా తెలుస్తోంది. అయితే.. ప్రమాదానికి గల కారణంపై రైల్వే శాఖ అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. -
నల్గొండ జిల్లా: పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.. పలు రైళ్ల నిలిపివేత
సాక్షి, నల్గొండ జిల్లా: దామచర్ల మండలం విష్ణుపురం వద్ద గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. దీంతో ఆ మార్గంలో వస్తున్న శబరి ఎక్స్‌ప్రెస్ మిర్యాలగూడలో, జన్మభూమి ఎక్స్‌ప్రెస్ రైలు పిడుగురాళ్లలో నిలిపివేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు ప్రమాద ఘటనపై విచారణ జరుపుతున్నారు. -
పట్టాలు తప్పిన సబర్మతి రైలు
జైపూర్: రాజస్థాన్‌లో సబర్మతి సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ నాలుగు బోగీలు పట్టాలు తప్పాయి. గూడ్స్ రైలును ఢీకొట్టిన తర్వాత ఈ ప్రమాదం జరిగింది. అజ్మీర్‌లోని మడర్ రైల్వేస్టేషన్లో సోమవారం తెల్లవారుజామున ఒంటి గంటకు ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో సబర్మతి రైలులోని పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. #WATCH | Rajasthan: Four coaches including the engine of a passenger train travelling from Sabarmati-Agra Cantt derailed near Ajmer. Further details awaited. pic.twitter.com/fX9VeLKw2e — ANI (@ANI) March 18, 2024 సబర్మతి సూపర్‌ఫాస్ట్ డ్రైవర్ అత్యవసర బ్రేకులు వేసి రైలును ఆపడానికి ప్రయత్నించినప్పటికీ అది గూడ్స్ రైలును ఢీ కొట్టింది. ఈ ఘటనపై నార్త్ వెస్టర్న్ రైల్వే ఎక్స్(ట్విటర్)లో ఒక పోస్టు చేసింది. ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని తెలిపింది. ప్రమాదానికి సంబంధించి వివరాల కోసం హెల్ప్‌డెస్క్‌ను ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది. ఇదీ చదవండి.. కుప్పకూలిన ఐదంతస్తుల భవనం -
డ్రైవర్ లేకుండానే... 70 కి.మీ. వెళ్లిన గూడ్స్
జమ్మూ/చండీగఢ్: గూడ్స్ రైలొకటి డ్రైవర్ లేకుండానే 70 కిలోమీటర్ల దూరం వెళ్లిపోయింది. అధికారులు చివరికి అప్రమత్తమై ఇసుక బస్తాలను పట్టాలపై అడ్డుగా ఉంచి రైలును నిలపగలిగారు. ఘటన జమ్మూ–జలంధర్ సెక్షన్లో ఆదివారం ఉదయం 7.25 నుంచి 9 గంటల మధ్యలో చోటుచేసుకుంది. జమ్మూకశ్మీర్ నుంచి కంకర లోడున్న 53 బోగీల డీజిల్ లోకోమోటివ్ గూడ్స్ రైలు పంజాబ్ వైపు బయలుదేరింది. డ్రైవర్ మార్పిడి కోసం కథువా స్టేషన్ వద్ద రైలును ఆపారు. తర్వాత ఏం జరిగిందో ఏమో..రైలు నెమ్మదిగా జమ్మూ–జలంధర్ సెక్షన్ దిశగా ముందుకు సాగింది. కొంత సేపటికి విషయం తెలిసిన అధికారులు ఆ మార్గంలోని స్టేషన్లతోపాటు, రైల్–రోడ్ క్రాసింగ్‌ల వద్ద అధికారులను అప్రమత్తం చేశారు. దాదాపు 70 కిలోమీటర్ల దూరం వెళ్లాక ఊంచి బస్సీ వద్ద పట్టాలపై ఇసుక బస్తాలను అడ్డుగా ఉంచి రైలును ఆపు చేయగలిగారు. ఘటనపై రైల్వే శాఖ దర్యాప్తునకు ఆదేశించింది. -
రామగుండంలో సీ అండ్ టీ ట్రాక్‌పై తప్పిన ప్రమాదం
పెద్దపల్లి: పెద్దపల్లి జిల్లా రామగుండం రైల్వే అండర్ బ్రిడ్జ్ సమీపంలోని క్యారేజ్&వాగన్ (C&W) ట్రాక్‌పై తప్పిన ప్రమాదం. లూప్ లైన్లో నిలిచి ఉన్న మిషన్‌ను గూడ్స్ రైలు భోగీలు ఢీకొట్టాయి. గూడ్స్ రైలు నుంచి లింకు ఊడిపోవడంతో 8 భోగీలు వేరు అయ్యాయి. కిందకు విడిపోయిన భోగీలు వేగంగా వెళ్లాయి. యూటీ మిషన్‌ను ఢీకొట్టడంతో ట్రాక్ ఎండ్ గోడపైకి యూటీ మిషన్ దూసుకెళ్లింది. ప్రమాద సమయంలో ఆపరేటర్ మిషన్‌లో నిద్రిస్తున్నాడు. అదృష్టవశాత్తు ప్రమాదం నుంచి ఆపరేటర్ బయటపడ్డాడు. సమాచారం అందుకున్న రైల్వే అధికారులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. -
పట్టాలు తప్పిన గూడ్స్ రైలు
ముంబయి: మహారాష్ట్రలోని కసర రైల్వే స్టేషన్ సమీపంలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. గూడ్స్ రైలు రెండు కోచ్‌లు పట్టాలు తప్పాయని సెంట్రల్ రైల్వే తెలిపింది. గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో 11 ఎక్స్‌ప్రెస్ రైళ్లను దారి మళ్లించారు. మరో నాలుగు ఎక్స్‌ప్రెస్ రైళ్ల రాకపోకలపై ప్రభావం పడినట్లు అధికారులు తెలిపారు. Two coaches of a goods train derailed near Kasara. Kalyan Station Road ART and Igatpuri Station Rail ART were ordered and moved to the accident site: Central Railway CPRO pic.twitter.com/WxUWH2HvFF — ANI (@ANI) December 10, 2023 రైలు పట్టాలు తప్పినప్పటికీ ముంబయి సబర్బన్ రైలు సేవలు ప్రభావితం కాలేదని సెంట్రల్ రైల్వే తెలిపింది. కళ్యాణ్- ఇగత్పురి నుండి అధికారులు రెండు సహాయ రైళ్లను సంఘటనా స్థలానికి పంపారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇదీ చదవండి: కూతుర్ని చంపి రీసార్ట్‌లో దంపతులు ఆత్మహత్య -
ట్రాక్ దాటుతుండగా..ఆ ఏనుగులను..
కోల్‌కతా: మొత్తం మూడు ఏనుగులు కలిసి ట్రాక్ దాటుతున్నాయి. ఇంతలో ఓ గూడ్స్ ట్రైన్ అదే ట్రాక్ పై నుంచి దూసుకొచ్చింది. వేగంగా గజరాజులను ఢీ కొట్టడంతో అవి కిందపడి మృతి చెందాయి. ఈ హృదయ విదారక ఘటన పశ్చిమబెంగాల్లోని అలీపుర్ద్వార్ జిల్లా రాజభక్తావ అటవీ ప్రాంతంలో జరిగింది. అలీపూర్‌ద్వార్ నుంచి సిలిగురి వెళుతున్న ఖాళీ గూడ్స్ రైలు సోమవారం ఉదయం 7.20 గంటలకు ఏనుగులను ఢీ కొట్టింది. ఈ ఘటనలో చనిపోయిన మూడు ఏనుగుల్లో రెండు చిన్న ఏనుగులేనని ఫారెస్ట్ అధికారులు చెప్పారు. సంఘటన జరిగిన రాజభక్తావ-కాల్చిని సెక్షన్లో రైలు ఢీకొట్టడాన్ని నిరోధించే ఇన్స్ట్రక్షన్ డిటెక్షన్ సిస్టమ్(ఐడీఎస్) ఇంకా అందుబాటులోకి రాలేదని నార్త్ ఫ్రాంటియర్ రైల్వే అధికారులు తెలిపారు. ఇక్కడ ఐడీఎస్ వ్యవస్థ ఇంకా టెండర్ల దశలోనే ఉందని, ఈ వ్యవస్థ అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో ఏనుగులను రైళ్లు ఢీకొన్న సంఘటనలు జరగలేదని అధికారులు చెప్పారు. ఇదీచదవండి..ఉచిత ఆధార్ అప్డేట్కు ఇదే చివరి తేది! -
త్రుటిలో తప్పిన పెనుప్రమాదం
టెక్కలి రూరల్: విశాఖపట్నం నుంచి భువనేశ్వర్ వైపు వెళ్తున్న గూడ్స్ రైలుకు టెక్కలి మండలం నౌపడ ఆర్ఎస్ రైల్వే గేటు వద్ద పెనుప్రమాదం తప్పింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం గూడ్స్ రైలు విశాఖపట్నం నుంచి నౌపడా మీదుగా భువనేశ్వర్ వైపు వెళ్తుండగా ఆ సమాచారం తెలియని గేట్‌మ్యాన్ గేటు వెయలేదు. ఈ విషయాన్ని గుర్తించిన గూడ్స్ డ్రైవర్ రైలు వేగాన్ని తగ్గించే ప్రయత్నం చేశారు. హారన్ వేయడంతో అప్రమత్తమైన గేట్ మ్యాన్ హుటాహూటిన గేటు వేశారు. దీంతో రైలు అక్కడి నుంచి వెళ్లింది. గూడ్స్ డ్రైవర్ గుర్తించకపోతే పెనుప్రమాదం జరిగి ఉండేదని వాహనదారులు చెబుతున్నారు. -
గూడ్స్ నుంచి విడిపోయిన వ్యాగన్లు
కర్ణాటక: బెంగళూరు నుంచి బళ్లారి వైపు బొగ్గులోడు తో వెళుతున్న గూడ్సు రైలు సోమవారం అనంతపురం జిల్లా రాయదుర్గం పరిధిలో డి.హీరేహాళ్ మండలం కల్యం గ్రామం వద్ద ఇంజిన్ నుంచి 46 వ్యాగన్లు విడిపోయాయి. ఇంజిన్ ఐదు వ్యాగన్లతో వెళ్లిపోయింది. బొగ్గులోడుతో ఉన్న 46 వ్యాగన్లు కంట్రోల్ కాక పట్టాలు తప్పేలా కనిపించాయి. కిలోమీటర్ దూరం వెళ్లి నిలిచిపోయాయి. గార్డు వాకీటాకీ ద్వారా ఇంజిన్ డ్రైవర్‌కు సమాచారం ఇవ్వడంతో రైలు మళ్లీ వెనక్కు వచ్చి వ్యాగన్లను తగిలించుకుని వెళ్లిపోయింది. ఎలాంటి ప్రమాదం సంభవించక పోవడంతో రైల్వే అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. -
పట్టాలు తప్పిన గూడ్స్ రైలు
శ్రీకాకుళం: మండలంలోని బొడ్డవర వద్ద గూడ్స్ రైలు ఆదివారం సాయంత్రం పట్టాలు తప్పింది. కిరండూల్ నుంచి విశాఖకు ఐరన్ ఓర్‌తో వస్తున్న గూడ్స్ అదుపు తప్పింది. ఈ ప్రమాదంలో ఆరు వ్యాగన్లు పట్టాలు తప్పాయి. ప్రమాద సమయంలో 20 కి.మీ వేగంతో రావాల్సిన రైలు 40 కి.మీ వేగంతో రావడం ప్రమాదానికి కారణం కావచ్చని రైల్వే అధికారులు చెబుతున్నారు. వరుస గా ఉన్న నాలుగు వ్యాగన్లు పట్టాలు తప్పగా మధ్యలో రెండు మినహా తరువాత మరో రెండు వ్యాగన్లు మొత్తంగా ఆరు వ్యాగన్లు పట్టాలు తప్పా యి. ఐరన్ ఓర్ సమాంతరంగా వేయకపోవడం ప్రమాదానికి ఒక కారణం కావచ్చని భావిస్తున్నా రు. సోమవారం నాటికి ట్రాక్ పునరుద్ధరణ పను లు పూర్తవుతాయని రైల్వే అధికారులు తెలిపారు. -
వివిధ సంస్థలు.. బాధితులకు సేవలు
కొరాపుట్/భువనేశ్వర్: రైలు దుర్ఘటన జరిగిన విషయం సామాజిక మాధ్యమాల్లో ప్రసారమైన వెంటనే బాలేశ్వర్, బద్రక్ జిల్లాల యువత స్పందించారు. ఎటువంటి పిలుపు లేకుండానే తమకు తాముగా సాయం అందించేందుకు ముందుకు కదిలారు. బద్రక్, బాలేశ్వర్ జిల్లా కేంద్రాల అస్ప త్రుల వద్దకు చేరుకొని, అవసరమైన క్షతగ్రాతులకు రక్తదానం చేసేందుకు సిద్ధమయ్యారు. రాత్రి నుంచి ఉదయం వరకు క్యూలోనే ఉండి రక్తదానం చేశారు. సుమారు వేయి మంది యువత రక్తదానం చేసి, ప్రాణదాతలుగా నిలిచారు. సత్యసాయి భక్తుల సేవలు రైల్వే దుర్ఘటన జరిగిన వెంటనే సత్యసాయి భక్తుల సేవలు మొదలయ్యాయి. ఘటన జరిగిన వెంటనే సత్యసాయి సేవా సమితి అఖిల భారత సమన్వయకర్త నిమిష్ పాండ్యా, జాతీయ సేవా సమన్వయకర్త కోటేశ్వరరావు వ్యక్తిగతంగా రంగంలోకి దిగారు. వారి సూచనతో సుమారు 70 మంది సత్యసాయి సేవాదళ్ కార్యకర్తలు ఘటనా స్థలానికి చేరుకున్నారు. తాము తెచ్చిన ట్రాక్టర్ల మీద క్షతగాత్రులు, మృతదేహాలను అస్పత్రులకు తరలించారు. వైద్య సిబ్బంది తగినంతమంది లేకపోవడంతో బాధితులకు తామే సపర్యలు చేసి, ప్రాథమిక చికిత్స అందజేశారు. అలాగే బాధితులకు ఆహారం, తాగునీరు అందించి, అందరి మన్ననలు పొందారు. 300 మందిని రక్షించిన ఎన్డీఆర్ఎఫ్ రైలు దుర్ఘటన జరిగిన వెంటనే ఎన్డీఆర్ఎఫ్ దళాలు అత్యంత వేగంగా అప్రమత్తం కావడంతో సుమారు 300 ప్రాణాలు నిలిచాయి. ఘటన జరిగిన నిమిషాల వ్యవధిలో 9 బృందాలు రంగంలోకి దిగాయి. అత్యంత వేగంగా ప్రాణా పాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న 300 మందిని ఆస్పత్రులకు తరలించడంతో ప్రాణాపా యం తప్పింది. ఎన్డీఆర్ఎఫ్ బృందాలకు పోలీసు జాగిలాలు తోడ్పాటునందించాయి. -
సిగ్నల్ లోపం వల్లే...!
సిగ్నల్ సమస్యే ప్రమాదానికి ప్రధాన కారణమని రైల్వే శాఖ సంయుక్త తనిఖీ కమిటీ తేల్చింది. ‘‘కోరమండల్ మొదటి మెయిన్ లైన్లోంచి లూప్ లైన్లోకి మారి దానిపై గూడ్సును ఢీకొట్టి పట్టాలు తప్పింది. దాని బోగీలు చెల్లాచెదురయ్యాయి. కొన్ని వెళ్లి రెండు మెయిన్ లైన్లపై పడ్డాయి. అదే సమయంలో రెండో మెయిన్ లైన్‌పై బెంగళూరు నుంచి హౌరా వెళ్తున్న ఎక్స్‌ప్రెస్ ఆ బోగీలను ఢీకొని పట్టాలు తప్పింది. రెండు బోగీలు పట్టాలు తప్పి తలకిందులయ్యాయి’’ అని ప్రాథమిక నివేదికలో స్పష్టం చేసింది. అందులో ఇంకా ఏముందంటే... ► సాయంత్రం 6.52 గంటల సమయంలో కోరమండల్ ఎక్స్‌ప్రెస్ బహనగా స్టేషన్‌ను దాటుతుండగా ప్రమాదం జరిగింది. ► ఈ స్టేషన్ వద్ద రెండు మెయిన్ లైన్లతో పాటు వాటికిరువైపులా రెండు లూప్ లైన్లున్నాయి. ► పాసింజర్ హాల్ట్ స్టేషన్ గనుక ఎక్స్‌ప్రెస్‌లు, సూపర్‌ఫాస్ట్ రైళ్లు వచ్చినప్పుడు గూడ్స్‌లను లూప్ లైన్లకు తరలిస్తారు. ► శుక్రవారం సాయంత్రం ఒక గూడ్స్ ముందుగా స్టేషన్ సమీపానికి చేరుకుంది. వెనకే కోరమండల్ వస్తుండటంతో గూడ్స్‌ను లూప్లైన్కు మళ్లించారు. ► కోరమండల్ వెళ్లాల్సిన మెయిన్ లైన్‌పై అప్పటికి రెడ్ సిగ్నల్ ఉంది. స్టేషన్ సిబ్బంది 17ఏ స్విచ్ నొక్కి దాన్ని గ్రీన్‌గా మార్చాలి. కానీ ఆ స్విచ్‌ను నొక్కినా పని చేయలేదు (సిగ్నల్ ఇచ్చి, మళ్లీ వెనక్కు తీసుకున్నారని కూడా చెబుతున్నారు). రెడ్ సిగ్నలే కొనసాగడంతో కోరమండల్ లూప్లైన్లోకి మళ్లి గూడ్స్‌ను ఢీకొట్టింది. ► గూడ్స్‌ని బలంగా ఢీకొట్టిన తర్వాత కోరమండల్ కోచ్‌లు ఎగిరిపడి.. పక్కన ఉన్న మరో మెయిన్‌లైన్‌పైకి వెళ్లాయి. ► అదే సమయంలో ఆ లైన్లో 130 కి.మీ. వేగంతో (116 కి.మీ. అని కూడా చెప్తున్నారు) వెళ్తున్న హౌరా ఎక్స్‌ప్రెస్ చివరి బోగీలపై కోరమండల్ బోగీలు పడ్డాయి. దాంతో ప్రమాద తీవ్రత పెరిగింది. ► హౌరా 3 నుంచి 5 సెకెన్ల ముందుగా వచ్చుంటే ప్రమాదం తప్పేది. ► సూపర్ ఫాస్ట్ రైళ్ల గరిష్ట వేగం 130 కి.మీ. ► ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. -
లూప్ లైనే యమపాశమైంది
న్యూఢిల్లీ/సాక్షి, విశాఖపట్నం: అనుమానమే నిజమైంది. లూప్‌లైనే మృత్యుపాశంగా మారింది. మెయిన్ లైన్లో వెళ్లాల్సిన కోరమండల్ ఎక్స్‌ప్రెస్ లూప్లైన్లోకి మళ్లడమే దేశమంతటినీ కుదిపేసిన మహా విషాదానికి దారితీసింది. లూప్ లైన్లో ఆగి ఉన్న గూడ్స్ రైలును మహా వేగంతో ఢీకొట్టేందుకు, వందలాది మంది దుర్మరణం పాలయ్యేందుకు కారణమైంది. శుక్రవారం ఒడిశాలో మూడు రైళ్లు ఘోర ప్రమాదానికి గురైన పెను విపత్తుపై రైల్వే శాఖ జరిపిన ప్రాథమిక విచారణ ఈ మేరకు తేల్చింది. గూడ్సును ఢీకొన్న వేగానికి ఏకంగా 21 కోరమాండల్ రైలు బోగీలు పట్టాలు తప్పాయి. చెల్లాచెదురై పక్క ట్రాక్‌పై పడిపోయాయి. దానిపై వస్తున్న బెంగళూరు–హౌరా సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ ఆ బోగీలను ఢీకొన్ని పట్టాలు తప్పింది. ప్రమాద సమయంలో కోరడమండల్ గంటలకు 128 కిలోమీటర్లు, హౌరా 130 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్నాయి! దాంతో జంట ప్రమాదాల తీవ్రత ధాటికి పలు బోగీలు తలకిందులయ్యాయి. ఒక ఇంజన్‌తో పాటు బోగీలకు బోగీలే గూడ్స్‌పైకి దూసుకెళ్లాయి. బహనగా బజార్ స్టేషన్ సమీపంలో జరిగిన ఈ ప్రమాదంపై ప్రాథమిక నివేదికను అధికారులు ఇప్పటికే రైల్వే బోర్డుకు సమర్పించారు. రైల్వే శాఖ ప్రమాద కారణాన్ని అధికారికంగా వెల్లడించలేదు. విద్రోహ కోణానికీ ఆధారలేవీ ఇప్పటిదాకా లేవని రైల్వే వర్గాలంటున్నాయి. మొత్తం ఉదంతంపై పూర్తిస్థాయి విచారణకు సౌత్ ఈస్టర్న్ సర్కిల్ రైల్వే సేఫ్టీ కమిషనర్ ఎ.ఎం.చౌదరి సారథ్యంలో ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటైంది. పౌర విమానయాన సంస్థ ఆధ్వర్యంలో పని చేసే రైల్వే సేఫ్టీ కమిషనర్ ఇలాంటి ప్రమాద ఘటనలను దర్యాప్తు చేస్తారు. లూప్‌లైన్ అంటే...? సులువుగా చెప్పాలంటే ఇవి రైల్వే స్టేషన్లలో ఉండే అదనపు రైల్వే లైన్లు. ఒకటికి మించిన ఇంజన్లతో కూడిన భారీ గూడ్సులకు కూడా సరిపోయేలా ఈ లూప్ లైన్లు సాధారణంగా కనీసం 750 మీటర్ల పొడవుంటాయి. ► కారణంపై తలో మాట... ప్రమాద కారణంపై తలో మాట వినిపిస్తున్నారు... ► ఇది కచ్చితంగా సిగ్నలింగ్ వైఫల్యమేనని కొందరంటున్నారు. ► రైల్వే శాఖ వర్గాలు మాత్రం కోరమండల్ నేరుగా లూప్లైన్లోకి వెళ్లి ఆగి ఉన్న గూడ్సును ఢీకొందా, లేక పట్టాలు తప్పి, ఆ క్రమంలో కొన్ని బోగీలు తలకిందులై, మిగతా రైలు లూప్లోన్లోకి మళ్లి గూడ్సును గుద్దిందా అన్నదానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉందని చెబుతున్నారు. డ్రైవర్ల తప్పిదం కాదు ప్రమాదం జరిగిన తీరును పరిశీలిస్తే డ్రైవర్ల తప్పిదం ఏమీ లేనట్టే కనిపిస్తోందని చెన్నై ఇంటిగ్రెల్ కోచ్ ఫ్యాక్టరీ మాజీ జనరల్ మేనేజర్, తొలి వందేభారత్ రైలును రూపొందించిన బృందానికి సారథ్యం వహించిన సుధాన్షు మణి స్పష్టం చేశారు. ‘‘కేవలం ప్రయాణికుల రైలు పట్టాలు తప్పడం మాత్రమే జరిగి ఉంటే దానివన్నీ అత్యాధునిక లింక్ హాఫ్మన్ బుష్ (ఎల్‌హెచ్‌బీ) కోచ్‌లే. అవి ఇలా తిరగబడిపోవడం జరగదు. ఇంతమంది దుర్మరణం పాలయ్యే అవకాశమే ఉండదు’’ అని వివరించారు. ‘‘ప్రమాద సమయంలో కోరమండల్‌కు అది వెళ్లిన లైన్‌పై గ్రీన్ సిగ్నల్ ఉన్నట్టు డేటా లాగర్లో స్పష్టంగా ఉంది. అంటే డ్రైవర్ సిగ్నళ్లను ఉల్లంఘించడం వంటిదేమీ జరగలేదన్నది స్పష్టం’’ అని ఆయనన్నారు. అంతటి వేగంలో ప్రమాదాన్ని నివారించేందుకు రెండో రైలు (హౌరా) డ్రైవర్ చేయగలిగిందేమీ ఉండదని రైల్వే బోర్డు మాజీ సభ్యుడు (ట్రాఫిక్) శ్రీప్రకాశ్ అభిప్రాయపడ్డారు. ప్రయాణికుల రైళ్లు వాటంతట అవి పట్టాలు తప్పడం చాలా అరుదని వివరించారు. ప్రమాద సమయంలో... కోరమండల్ ఎక్స్‌ప్రెస్ వేగం గంటకు 128 కి.మీ. బెంగళూరు–హౌరా సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ వేగం గంటలకు 116 కి.మీ. గూడ్స్ లూప్ లైన్లో ఆగి ఉంది ప్రమాద సమయంలో రెండు రైళ్లలో ప్రయాణికులు 2,700 పై చిలుకు (కోరమాండల్‌లో 1257, హౌరాలో 1039 మంది రిజర్వ్డ్ ప్రయాణికులున్నారు. రెండింటి జనరల్ బోగీల్లో వందలాది మంది ఉంటారని రైల్వే వర్గాలు అధికారికంగానే వెల్లడించాయి) ప్రమాద ప్రాంత విస్తీర్ణం దాదాపు ఒక కిలోమీటర్ -
Train Accident: లూప్లైన్లోకి మళ్లించినందుకే?
సాక్షి, విశాఖపట్నం: ఊహించని ఉత్పాతం.. రెండు ఎక్స్‌ప్రెస్ రైళ్లు ప్రమాదానికి గురై, వందల సంఖ్యలో ప్రయాణికులు మృత్యువాత పడగా, మరికొన్ని వందల మంది క్షతగాత్రులయ్యారు. ప్రమాదం జరిగిన సమయంలో రైలు వేగాన్ని పరిగణనలోకి తీసుకున్న అధికారులు దాని తీవ్రతను అంచనా వేశారు. శుక్రవారం సాయంత్రం 6 గంటల 55 నిమిషాల 28 సెకన్లకు గంటకు 128 కిలోమీటర్ల వేగంతో కోరమండల్ ఎక్స్‌ప్రెస్ ప్రయాణిస్తోంది. అదే సమయంలో ప్రమాదం సంభవించడంతో 6 గంటల 55 నిమిషాల 51 సెకన్లకు వేగం సున్నాకు పడిపోయింది. సాధారణంగా గంటకు దాదాపు 130 కి.మీ. వేగంతో వెళ్లే రైలు వేగం సున్నాకు చేరుకునేందుకు అకస్మాత్తుగా బ్రేక్ వేస్తే 60 నుంచి 80 సెకన్లకు పైగా సమయం పడుతుంది. కానీ, ప్రమాదం జరిగి 23 సెకన్లలోనే జీరో స్పీడ్‌కు చేరుకుందంటే పట్టాలపై ఉన్న గూడ్సు రైలును ఎంత బలంగా ఢీకొట్టిందో అర్థం చేసుకోవచ్చని, దీన్నిబట్టి ప్రమాద తీవ్రతను ఊహించడానికే భయం కలుగుతోందని రైల్వే అధికారులు చెబుతున్నారు. అధికారులు ఏం చెబుతున్నారంటే... రైల్వే అధికార ప్రతినిధి అమితాబ్ శర్మ ప్రమాదం ఎలా జరిగిందన్న అంశంపై స్పందించారు. సాయంత్రం 6.55 గంటల సమయంలో బహనాగ రైల్వేస్టేషన్ వద్ద స్టాప్ లేకపోవడంతో వేగంగా వెళ్తున్న కోరమండల్ ఎక్స్‌ప్రెస్ బోగీలు ఒక్కసారిగా పట్టాలు తప్పాయి. పక్కన ఉన్న ట్రాక్‌పైకి కోరమండల్ కోచ్‌లు పడిపోయాయి. అదే సమయంలో ఆ ట్రాక్‌పై వస్తున్న యశ్వంత్‌పూర్–హౌరా ఎక్స్‌ప్రెస్ పడిపోయిన కోచ్‌లని ఢీకొట్టడంతో ఆ ట్రైన్‌కు సంబంధించిన నాలుగు బోగీలు పట్టాలు తప్పాయని వివరించారు. అసలు జరిగిందేమిటి? అధికారులు చెబుతున్న దానికి, ప్రమాదం సంభవించిన పరిస్థితుల్ని గమనిస్తే.. ఒకదానికొకటి పొంతన లేకుండా ఉన్నాయి. వేగంగా వెళ్తున్న కోరమండల్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పిందని అధికారులు చెబుతున్నారు. కానీ, ప్రమాదానికి సంబంధించిన ఫొటోలు చూస్తే అక్కడ గూడ్స్ రైలు కూడా ఉందని స్పష్టమవుతోంది. స్టేషన్ వద్ద.. మధ్యలో ఉన్న లూప్లైన్లో గూడ్స్ రైలు ఆగి ఉంది. స్టేషన్లో స్టాప్ లేనప్పుడు రైలుకు మెయిన్ లైన్లో ట్రాక్ సిగ్నల్ ఇవ్వాల్సి ఉంటుంది. అయితే, కోరమాండల్‌కు లూప్లైన్లో సిగ్నల్ ఇచ్చారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మెయిన్ లైన్లో నుంచి వెళ్లకుండా లూప్లైన్లోకి రావడం వల్ల అక్కడ ఆగి ఉన్న గూడ్స్ రైలుని బలంగా ఢీకొట్టడమే ప్రమాదానికి ప్రధాన కారణమన్న వాదన వినిపిస్తోంది. ఇది ముమ్మాటికీ రైల్వే శాఖ తప్పిదమని కొందరు సిబ్బంది చెబుతున్నారు. గంటకు 128 కి.మీ. వేగంతో వస్తున్న కోరమండల్ ఎక్స్‌ప్రెస్ లోకో గూడ్స్ రైలు బోగీపైకి వెళ్లినట్లు స్పష్టంగా కనిపిస్తున్నా అలాంటిదేమీ జరగలేదన్నట్లుగా రైల్వే అధికారులు చేస్తున్న ప్రకటనలు మరిన్ని అనుమానాలకు తావిస్తున్నాయి. ఈ ప్రమాదంపై పూర్తిస్థాయి దర్యాప్తునకు రైల్వే శాఖ ఆదేశాలు జారీ చేసింది. -
ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం, 207 మంది మృతి
ఒడిశా: ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. స్టేషన్లో ఆగి ఉన్న గూడ్స్ రైలును కోరమండల్ ఎక్స్‌ప్రెస్ ఢీకొట్టింది. ఈ ఘటనలో 12 బోగీలు బోల్తా పడ్డాయి. 207 మంది మృతి చెందారు.. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. 900 మందికి పైగా ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. చెన్నై నుంచి హౌరా వెళ్తుండగా ప్రమాదం జరిగింది. బాలేశ్వర్ జిల్లా బహనాగ రైల్వే స్టేషన్ వద్ద ఘటన చోటుచేసుకుంది. మరో ట్రాక్ మీద పడి ఉన్న కోరమండల్ ఎక్స్‌ప్రెస్ బోగీలను ఢీకొని యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్ 4 బోగీలు పట్టాలు తప్పాయి. సారో, గోపాల్పూర్, ఖంటపాడ పీహెచ్‌సిలకు బాధితులను తరలిస్తున్నారు. సహాయక సిబ్బంది బోగీల్లో చిక్కుకున్న వారిని బయటకు తీస్తున్నారు. మృతుల కుటుంబాలకు రైల్వే మంత్రి రూ. 10 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ. 2 లక్షలు పరిహారం ప్రకటించారు. రైలు ప్రమాద ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. ఘటనాస్థలిలో 50 అంబులెన్స్‌లు ఏర్పాటు చేశారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గాయపడిన వారిని బాలాసోర్ ఆసుపత్రికి తరలిస్తున్నారు. హెల్ప్‌లైన్ నంబర్లు: 044-2535 4771, 67822 62286 Terrible Train accident in odisha India, with multiple dead bodies can be seen #TrainAccident #CoromandelExpress #Odisha pic.twitter.com/NsJ04P3hlT — Rizwan 💙 (@Rizwan88826075) June 2, 2023 Coromandel Express derails near Bahanaga station in Odisha's Balasore after collision with a goods train Rescue operations continue @RailMinIndia #TrainAccident pic.twitter.com/9w24Qvpt9f — Nazaket Rather (@RatherNazaket) June 2, 2023 -
ఖమ్మం: తాతా.. ఈ భూమ్మీద ఇంకా నూకలున్నాయే!
ఖమ్మం: చావు అంచుల దాకా వెళ్లొచ్చిన.. ఓ తాతను చూసి అదృష్టవంతుడని అంతా అనుకుంటున్నారంతా. జిల్లాలోని ఎర్రుపాలెం రైల్వే స్టేషన్లో ఓ వృద్ధుడు నిర్లక్ష్యం ప్రదర్శించాడు. గూడ్స్ రైలు కింద నుంచి అవతలి ప్లాట్‌ఫామ్‌కు చేరే యత్నం చేశాడు. ఆ సమయంలో ఆ గూడ్స్ ఒక్కసారిగా కదిలింది. దీంతో ఆ తాత రైలు కిందపడిపోయాడు. అయితే.. అయితే తాత సమయస్ఫూర్తితో పట్టాల మధ్యే పడుకుండి పోయాడు. ఆ సమయంలో పక్కనే పట్టాల మధ్య ఓ వృద్ధురాలు(బహుశా ఆయన తాలుకానేమో) ఆయనకి ఏమవుతుందో ఏమోఅనుకుంటూ.. రోదిస్తూ సొమ్మసిల్లి పడిపోయింది. ఈ క్రమంలో అక్కడే ఉన్న కొందరు ప్రయాణికులు.. గూడ్స్ డ్రైవర్‌ను అప్రమత్తం చేయడంతో ఆయన రైలును ఆపేశాడు. ఆ వెంటనే పట్టాల మధ్య బొక్కబోర్లా పడుకున్న తాతను బయటకు లాగేశారు ప్రయాణికులు. ఈ ప్రమాదంలో ఆ వృద్ధుడికి చిన్న చిన్న గాయాలైనట్లు సమాచారం. -
Greece Train Crash: పెను విషాదం: ప్యాసింజర్ రైలును ఢీకొన్న గూడ్స్
రెండు రైళ్లు ఢీకొన్న ఘటనలో దాదాపు 32 మంది మృతిచెందగా 80 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఈ దారుణ విషాద ఘటన గ్రీస్ దేశంలో చోటుచేసుకుంది. ఈ ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. వివరాల ప్రకారం.. గ్రీస్‌లోని టెంపే ప్రాంతంలో బుధవారం తెల్లవారుజామున ఓ ప్యాసింజర్ రైలు, మరో గూడ్స్ ట్రైన్‌ని ఢీకొట్టింది. రెండు వేగంలో ఉండటంతో ప్రమాదం ధాటికి అనేక బోగీలు పట్టాలు తప్పాయి. కొన్ని బోగీలకు మంటలు అంటుకున్నాయి. కాగా.. ప్రమాదానికి గురైన ప్యాసింజర్ రైలు.. ఏథెన్స్ నుంచి థెస్సలోనికి అనే ప్రాంతానికి వెళుతున్నట్టు తెలిసింది. ప్రమాదం జరిగిన సమయంలో అందులో 350మందికిపైగా ప్రయాణికులు ఉన్నట్టు సమాచారం. ఇక, ఈ ప్రమాద ఘటనపై థెస్సాలీ ప్రాంత గవర్నర్ కాన్సంటీనోస్ అగోరాస్టోస్ స్పందించి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అగోరాస్టోస్ మీడియాతో మాట్లాడుతూ.. ప్రమాద ధాటికి ప్యాసింజర్ రైలులోని మొదటి నాలుగు కోచ్‌లు పట్టాలు తప్పాయి. మొదటి రెండు కోచ్‌లు దాదాపు పూర్తిగా ధ్వంసమయ్యాయని ఆయన తెలిపారు. దాదాపు 250 మంది ప్రయాణికులను సురక్షితంగా తరలించినట్లు స్పష్టం చేశారు. ప్రమాద సమాచారం అందిన వెంటనే గ్రీస్ ప్రభుత్వం సైన్యాన్ని రంగంలోకి దింపింది. సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయని అధికారులు తెలిపారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. VIA @Quicktake: WATCH: Multiple cars derailed and at least three burst into flame after a passenger train collided with an oncoming freight train in northern Greece early Wednesday https://t.co/3BQLRxVHKt pic.twitter.com/IhiMG0sSpJ — Traffic Updates + Useful Info (@trafficbutter) March 1, 2023 -
Viral Video: పట్టాలు దాటుతుండగా దూసుకొచ్చిన రైలు.. తర్వాత ఏం జరిగిందంటే?
పాట్నా: బిహార్ గయా జిల్లాలో ఓ మహిళ సమయస్ఫూర్తితో వ్యవహరించి తన ప్రాణాలు కాపాడుకుంది. టన్‌కుప్ప రైల్వే స్టేషన్లో ఆమె పట్టాలు దాటి మరో ప్లాట్‌ఫైంకి వెళ్తుండగా గూడ్స్ రైలు ఒక్కసారిగా కదిలింది. దీంతో ఆమె చాకచక్యంగా పట్టాలపైనే పడుకుంది. రైలు ఆమెపై నుంచి వెళ్లింది. ఈ ఘటనలో మహిళకు స్వల్పగాయాలై క్షేమంగా ప్రాణాలతో బయటపడింది. స్థానికులు వెంటన ఆమెను ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. ఈ మహిళ ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నట్లు సమాచారం. రైల్వే స్టేషన్లో ఓ ప్లాట్‌ఫాంపై గూడ్స్ రైలు, మరో ప్లాట్‌ఫాంపై ఆమె వెళ్లాల్సిన ప్యాసెంజర్ రైలు ఉన్నాయి. దీంతో ప్యాసెంజర్ రైలు ఎక్కేందుకు ఆమె పట్టాలు దాటే ప్రయత్నం చేసింది. ఈ సమయంలోనే గూడ్స్ రైలు కదలడంతో ఏం చేయాలో తెలియక పట్టాలపైనే పడుకుంది. ఫలితంగా తన ప్రాణాలు కాపాడుకుంది. #Watch: Woman Falls Under Moving Train In Bihar#Bihar #railwaytrack #Gaya #Train #RailwayStation #injury #Accident #viral #Trending #news #LatestNews #IndianJourno pic.twitter.com/vxmvkvLKnY — Indian Journo (@indianjournoapp) February 11, 2023 రైల్వే స్టేషన్లో ప్రయాణికులు పట్టాలపై నుంచి వెళ్లాల్సిన అవసరం లేకుండా ఫుటోవర్ బ్రిడ్జ్‌లు నిర్మించారు. కానీ కొంతమంది ప్యాసెంజర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఒక్కోసారి ప్రాణాల మీదకు తెచ్చుకుంటారు. పట్టాలపైనుంచే అవతలి వైపు వెళ్తుంటారు. ఈ క్రమంలోనే ప్రమాదాల బారిన పడుతుంటారు. చదవండి: నటికి రూ.100 కోట్ల పరువునష్టం నోటీసులు పంపిన సుఖేష్ -
బోగీలను వదిలి వెళ్లిపోయిన గూడ్స్ రైలు ఇంజన్
పిడుగురాళ్ల: గూడ్స్ రైలు ఇంజన్ బోగీలను వదిలి వెళ్లిన ఘటన పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో బుధవారం జరిగింది. సికింద్రాబాద్ నుంచి గుంటూరు వైపు వెళ్తోన్న గూడ్స్ రైలు పిడుగురాళ్ల రైల్వేస్టేషన్ సమీపంలోని 65వ గేటు వద్ద బోగీలను వదిలి ఇంజన్ వెళ్లిపోయింది. ఇది గమనించిన గూడ్స్ రైలు గార్డ్ రైల్వే అధికారులకు, గూడ్స్ రైలు డ్రైవర్‌కు సమాచారమిచ్చారు. జానపాడు రైల్వే గేటు దాటి వెళ్లిన ఇంజన్‌ను రైల్వే గూడ్స్ డ్రైవర్ బోగీలు ఆగిన ప్రదేశానికి తీసుకొని వచ్చాడు. రైల్వే అధికారులు, సిబ్బంది గూడ్స్ బండి ఇంజన్, బోగీలను కలిపించారు. ఇదంతా 15 నిమిషాల సమయం పట్టింది. ఆ సమయంలో పిడుగురాళ్ల రైల్వేస్టేషన్ వైపు వచ్చే రైళ్లు ఏమీ లేకపోవడంతో ఎటువంటి ప్రమాదం జరగలేదని, లేదంటే పెద్ద ప్రమాదమే జరిగేదని అధికారులు తెలిపారు. ఇదీ చదవండి: ‘ఉపాధి’ పనులను పరిశీలించిన కేంద్ర బృందం -
షాకింగ్.. పట్టాలు తప్పి ప్లాట్‌ఫాం పైకి దూసుకెళ్లిన రైలు.. ముగ్గురు మృతి..
భువనేశ్వర్: ఒడిశాలో సోమవారం ఉదయం రైలు ప్రమాదం జరిగింది. జాజ్‌పూర్ జిల్లా కొరాయి రైల్వే స్టేషన్లో గూడ్సు రైలు పట్టాలు తప్పి ప్లాట్‌ఫాంపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ముగ్గురు మృతిచెందారు. మరికొందరు గాయపడ్డారు. పలువురు రైలు కింద చిక్కుకున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో రైల్వే స్టేషన్ కూడా పాక్షికంగా ధ్వంసమైనట్లు తెలుస్తోంది. ప్యాసెంజర్ల వెయిటింగ్ హాల్లోకి గూడ్స్ రైలు దూసుకెళ్లినట్లు సమాచారం. రైలు పట్టాలు తప్పడంతో స్టేషన్‌లోని రెండు ట్రాక్‌లు బ్లాక్ అయి రాకపోకలు నిలిచిపోయాయి. రైల్వే అధికారులు హుటాహుటిన సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో మొత్తం 12 బోగీలు పట్టాలు తప్పాయి. నాలుగు భోగీలు బోల్తాపడ్డాయి. రైల్వే స్టషన్లో ఫుటోవర్ బ్రిడ్జి కూడా ధ్వైంసమైంది. అధికారులు యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టి రైల్వే స్టేషనలో సేవలు పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తున్నారు. రూ.5లక్షల పరిహారం.. ఈ ఘటనపై రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు పరిహారంగా ప్రకటించారు. తీవ్రంగా గాయపడినవారికి రూ.లక్ష, స్వల్ప గాయాలైన వారికి రూ.25 వేలు సాయంగా అందిస్తామన్నారు. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కూడా ఈ దుర్ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల పరిహారం ప్రకటించారు. #JustIn Three passengers killed, while two others sustained grave injuries as a goods train derailed and rammed into passengers waiting at Korai station in #Odisha on Monday.@NewIndianXpress @Siba_TNIE pic.twitter.com/RtjYyhST2z — TNIE Odisha (@XpressOdisha) November 21, 2022 -
గూడ్సు రైలుకు ఊడిన లింక్
ఎర్రుపాలెం: ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం రైల్వేస్టేషన్ సమీపాన గురువారం ఒక గూడ్స్ రైలు బోగీలు, ఇంజన్‌కు లింక్ తెగిపోయింది. విజయవాడ నుండి ఖమ్మం వైపు అప్‌లైన్‌లో వెళ్తున్న గూడ్స్ ఇంజన్ నుంచి బోగీలకు లింక్ ఊడిపోవడంతో.. ఇంజన్ కొన్ని బోగీలతో కిలోమీటర్ మేర ముందుకు వెళ్లిపోయింది. ఈ విషయాన్ని గుర్తించిన రైల్వే అధికారులు, సిబ్బంది మరమ్మతుల అనంతరం గూడ్సును పంపించారు. ఈ ఘటనతో రైళ్ల రాకపోకలకు ఎలాంటి అంతరాయం ఏర్పడలేదని అధికారులు స్పష్టం చేశారు. -
గూడ్స్ రైలుని హైజాక్ చేసిన మావోయిస్టులు
సాక్షి, విశాఖపట్నం: దంతెవాడ–కిరండూల్ సెక్షన్లో వెళ్తోన్న కేవీఎస్ 11 నంబర్ గూడ్స్ రైలుని మావోయిస్టులు ఆదివారం సాయంత్రం 10 నిమిషాల పాటు తమ ఆదీనంలోకి తీసుకున్నారు. బచెలి–భాన్సీ బ్లాక్ సెక్షన్ 433 కి.మీ సమీపంలో గూడ్స్ వెళ్లే ట్రాక్ పైకి 50 మంది మావోయిస్టులు చేరుకున్నారు. ట్రాక్‌కి అడ్డంగా నిలబడి రెడ్ క్లాత్ చూపుతూ..ట్రైన్‌ని నిలిపివేయాలని ఆదేశించారు. అప్రమత్తమైన సిబ్బంది.. ఎమర్జెన్సీ బ్రేక్ వేసి. రైలుని ఆపారు. ట్రైన్‌లోకి మారణాయుధాలతో మావోయిస్టులు ప్రవేశించి డ్రైవర్, ఇతర సిబ్బంది, వెనుక భాగంలో ఉండే గార్డ్ నుంచి వాకీ టాకీలు తీసుకున్నారు. మిగిలిన కొందరు ట్రాక్‌పై కాపలా కాయగా..కొంతమంది లోకోమోటివ్‌కి బ్యానర్ కట్టారు. అనంతరం కొన్ని కరపత్రాల్ని గూడ్స్ రైలు సిబ్బందికి ఇచ్చి దంతెవాడ వరకూ వెళ్లి అక్కడ పంపిణీ చేయాలని ఆదేశించారు. 10 నిమిషాల తర్వాత రైలు దిగి మావోయిస్టులు అడవిలోకి వెళ్లడంతో అక్కడి నుంచి రైలు బయలుదేరి భన్సీకి చేరుకుంది. వాల్తేరు డీఆర్ఎం అనూప్‌కుమార్ సత్పతి ఆ సెక్షన్ పరిధిలో మిగిలిన రైళ్ల రాకపోకల్ని నిలిపివేయాలని ఆదేశించారు. కోరస్ కమాండో బృందాన్ని ఆయా ప్రాంతాలకు పంపించారు. దీనిపై ఉన్నతాధికారులకు సమాచారమిచ్చామని వారి ఆదేశాల మేరకు తదుపరి చర్యలు చేపట్టి..రైళ్ల రాకపోకల్ని పునరుద్ధరిస్తామని డీఆర్ఎం తెలిపారు. కాగా, సెప్టెంబర్ 21 నుంచి 27 వరకు 18వ క్రాంతి కారీ వార్షికోత్సవాన్ని దేశమంతా నిర్వహిస్తున్నామని, దాన్ని విజయవంతం చేయాలని కరపత్రాల్లో పేర్కొన్నారు. -
Super Vasuki: ఈ గూడ్స్‌కు 295 వ్యాగన్లు!
న్యూఢిల్లీ: సాధారణ గూడ్స్ రైలు కంటే 3 రెట్లు పెద్దదైన ‘సూపర్ వాసుకి’ని ఆగ్నేయ మధ్య(సౌత్ ఈస్ట్ సెంట్రల్) రైల్వే ప్రయోగాత్మకంగా నడిపింది. మూడున్నర కిలోమీటర్ల పొడవు, 295 వ్యాగన్లతో 27 వేల టన్నులకు పైగా బొగ్గును తీసుకుని ఈ భారీ రైలు ఛత్తీస్‌గఢ్‌లోని కోర్బా నుంచి నాగ్‌పూర్ సమీపంలోని రాజ్‌నంద్‌గావ్‌కు చేరుకుంది. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా సోమవారం సూపర్ వాసుకిని నడిపి చూసినట్లు అధికారులు చెప్పారు. కోర్బా నుంచి మధ్యాహ్నం 1.50 గంటలకు బయలుదేరిన ఈ గూడ్స్ 267 కిలోమీటర్ల దూరాన్ని 11.20 గంటల్లో చేరుకుంది. ఒక్కో స్టేషన్‌ను దాటేందుకు వాసుకికి సుమారు 4 నిమిషాలు పట్టింది. ఇప్పటి వరకు నడిపిన అత్యంత పొడవైన, అతి భారీ గూడ్స్ రైలు ఇదేనని రైల్వే శాఖ వెల్లడించింది. సూపర్ వాసుకి తీసుకువచ్చిన బొగ్గుతో 3,000 మెగావాట్ల విద్యుత్ కేంద్రం ఒక రోజంతా నడుస్తుందని అధికారులు చెప్పారు. సాధారణ గూడ్స్ రైలు 90 వ్యాగన్లలో 9 వేల టన్నుల బొగ్గును మాత్రమే రవాణా చేయగలుగుతుంది. -
రైలు ఢీకొని 82 గొర్రెలు మృతి
కోరుట్ల: జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం చినమెట్‌పల్లి సమీపంలోని రైల్వేట్రాక్ వద్ద ఆదివారం మధ్యాహ్నం గూడ్సు రైలు ఢీకొని 82 గొర్రె లు మృతి చెందాయి. కాపరి గొర్రెలను పట్టాలు దాటిస్తున్న సమయంలో ప్రమాదం జరిగింది. సుమారు రూ.8 లక్షల వరకు నష్టం వాటిల్లినట్టు బాధితుడు లక్కం రాజం ఆవేదన వ్యక్తం చేశా డు. లక్కం రాజంను ప్రభుత్వపరంగా ఆదుకునేందుకు ప్రయత్నిస్తామని సర్పంచుల ఫోరం జిల్లా అధ్యక్షుడు దారిశెట్టి రాజేశ్ తెలిపారు. -
తెలంగాణపై కేంద్రం అక్కసు
గజ్వేల్: తెలంగాణ అభివృద్ధిని ఓర్వలేక కేంద్రం అక్కసు వెళ్లగక్కుతోందని.. నిధులు ఇవ్వకుండా ఆర్థికంగా దెబ్బతీసి ప్రజల్లో తమ ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసే కుట్రకు తెరలేపిందని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు నిప్పులు చెరిగారు. సోమవారం ఆయన సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో ఎరువుల రేక్ పాయింట్, గూడ్స్ రైలును వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డితో కలసి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్రానికి వచ్చే బీజేపీ నేతలు వరంగల్‌కు మంజూరైన రైల్వే కోచ్ ఫ్యాక్టరీని గుజరాత్‌కు తరలించుకుపోయామని చెబుతారా?, నీతి ఆయోగ్ చెప్పినా.. రాష్ట్రానికి రూ.24 వేల కోట్లు ఇవ్వలేదని చెబుతారా?, ఐటీఐఆర్‌ను రద్దు చేశామని చెబుతారా? అంటూ ప్రశ్నిం చారు. మనోహరాబాద్–కొత్తపల్లి రైల్వేలైన్ పనుల్లో రాష్ట్రం ఖర్చుపెట్టిందే ఎక్కువన్నారు. భూసేకరణ, ఇతర పనులకు ఇప్పటి వరకు రూ.650 కోట్లు ఖర్చు పెట్టామని వెల్లడించారు. రైలు లాభాలు ఇలా.. మెదక్ జిల్లా మనోహరాబాద్ నుంచి కరీంనగర్ జిల్లా కొత్తపల్లి వరకు 151.36 కిలోమీటర్ల మేర కొత్తగా బ్రాడ్‌గేజ్ రైల్వేలైన్ నిర్మాణానికి రూ.1,160.47 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఈ లైన్ సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి మనోహరాబాద్ మీదుగా కొత్తపల్లి వరకు, అక్కడి నుంచి పెద్దపల్లి గ్రాండ్ ట్రంక్ లైన్‌తో అనుసంధానం కానుంది. ఫలితంగా ఈ లైన్ హైదరాబాద్, ఢిల్లీ, కోల్‌కతా లాంటి మహానగరాలను కలుపుతూ జాతీయ లైన్ గా ఆవిర్భవించనుంది. ఇది పూర్తయితే.. ప్రయాణికులకు దూరభారం తగ్గనుంది. సిద్ది పేట జిల్లాతోపాటు మెదక్, సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాలకు లబ్ధి చేకూరనుంది. ప్రస్తుతం మనోహరాబాద్ నుంచి సిద్దిపేట జిల్లా గజ్వేల్ మీదుగా కొడకండ్ల వరకు 43 కి.మీ. పనులు పూర్తయ్యాయి. కాగా, హైదరాబాద్‌లోని ప్రధాన రైల్వేస్టేషన్లకు గజ్వేల్‌ను ప్రత్యామ్నాయంగా మార్చి.. దేశంలోని ముఖ్యమైన నగరాలకు కొన్ని కొత్త రైళ్లను ఇక్కడి నుంచి నడపాలని నిర్ణయించారు. ఇక్కడి రేక్ పాయింట్‌కు తొలిరోజు సోమవారం గూడ్స్ రైలు ద్వారా ఏపీలోని కాకినాడ నుంచి నాగార్జున ఫర్టిలైజర్స్‌కు చెందిన 1,300 మెట్రిక్ టన్నుల ఎరువులు వచ్చాయి. భవిష్యత్‌లో ఎఫ్‌సీఐ గోదాములకు, అన్ని రకాల వ్యవసాయోత్పత్తుల తరలింపు, కూరగాయల రవాణా కోసం వినియోగించనున్నారు. -
సరుకు రవాణా హబ్‌గా గజ్వేల్
సాక్షి, హైదరాబాద్: గజ్వేల్ స్టేషన్‌ను సరుకు రవాణా హబ్‌గా మార్చాలని దక్షిణమధ్య రైల్వే భావిస్తోంది. ఈ మేరకు త్వరలో సరుకు రవాణా రైళ్లను ప్రారంభించాలని సంబంధిత విభాగం ప్రతిపాదించింది. ఈ ప్రాంతం నుంచి వ్యవసాయ ఉత్పత్తులను ఇతర ప్రాంతాలకు తరలించడంతోపాటు, ఎరువులను ఇతర ప్రాంతాల నుంచి గజ్వేల్‌కు చేరవేయాలని అధికారులు భావిస్తున్నారు. గజ్వేల్ స్టేషన్ వద్ద మొత్తం ఐదు లైన్లు ఉండగా, ఒక లైన్‌ను గూడ్సుకు కేటాయించారు. ఇక్కడ 755 మీటర్ల పొడవు, 25 మీటర్ల వెడల్పుతో సరుకుల కోసం ప్రత్యేక ప్లాట్‌ఫామ్ నిర్మించారు. ప్రయాణికుల రైళ్లు ప్రారంభించేందుకు అన్నీ సిద్ధంగా ఉన్నా, కోవిడ్ ఆంక్షలతో ఇంతకాలం ప్రారంభించలేదు. ఆంక్షలు సడలినా ఆ జాప్యం కొనసాగుతూనే ఉంది. సరుకు రవాణా రైలు అంశం జోన్ పరిధిలోనిది అయినందున, వెంటనే ప్రారంభించాలని అధికారులు కోరుతున్నారు. రైల్వే రవాణా ఖర్చు తక్కువ... గజ్వేల్ పరిసర ప్రాంతాల్లో, సిద్దిపేట వరకు విస్తారంగా సాగుభూములున్నాయి. వరి, మొక్కజొన్న, కూరగాయలు, పత్తి, మిరప లాంటివి బాగా పండుతున్నాయి. ఇక్కడి నుంచి సేకరించే ధాన్యా న్ని రోడ్డు మార్గాన వ్యాపారులు ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇప్పుడు వీటి తరలింపునకు రైళ్లను ప్రారంభిస్తే మంచి డిమాండ్ ఉంటుందని రైల్వే యంత్రాంగం నిర్ధారించింది. దీంతోపాటు పాలు కూడా సేకరించవచ్చని నిర్ణయించారు. ఇక ఈ ప్రాంతంలో ఎరువుల వినియోగం ఎక్కువ. నిత్యం ఇతర రాష్ట్రాల నుంచి లారీల ద్వారా ఎరువులు వస్తుంటాయి. రైళ్లను ప్రారంభిస్తే వాటి ద్వారానే ఎరువులను గజ్వేల్‌కు చేరవేసే వీలుంటుంది. లారీలతో పోలిస్తే రైళ్ల ద్వారా రవాణా ఖర్చు తక్కువే అయినందున వ్యాపారులు కూడా ముందుకొస్తారని అధికారులంటున్నారు. త్వరలోనే గజ్వేల్ నుంచి సరుకు రవాణా రైళ్లు ప్రారంభమవుతాయని వారు పేర్కొంటున్నారు. -
ఆ ఊరికి రైలొచ్చిందోచ్!... పట్టాలపై వెళ్తున్న గూడ్స్ రైలు!
రామాయంపేట(మెదక్): మెదక్–అక్కన్నపేట మధ్య మొదటిసారిగా శనివారం గూడ్స్ రైలు నడిచింది. పట్టాల మధ్యన కంకరను గూడ్స్‌లో తరలించినట్లు రైల్వే అధికారులు పేర్కొన్నారు. మండలంలోని అక్కన్నపేట స్టేషన్ నుంచి నాలుగైదు కిలోమీటర్ల మేర పట్టాలపై కంకరపరిచారు. గూడ్స్‌లో కంకరను ఇక్కడికి తరలించారు. క్లియరెన్స్ రాకపోవడంతో సదరు గూడ్సును రెండు గంటలపాటు అక్కన్నపేట స్టేషన్లోనే నిలిచి పోయింది. సేఫ్టీ అధికారులు క్లియరెన్స్ ఇచ్చిన తర్వాతనే గూడ్స్ కదిలింది. నూతనంగా నిర్మించిన బ్రిడ్జిల వద్ద రైలు నెమ్మదిగా వెళ్లింది. అంతకుముందు రైలు ఎదుట పూజా కార్యక్రమాలు నిర్వహించారు. -
ఒకరు బీటెక్, మరొకరు బీఎస్సీ.. చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్.. ఏ కష్టమొచ్చిందో.!
సాక్షి, అనంతపురం/ కడప కోటిరెడ్డిసర్కిల్: వారిద్దరూ చిన్నప్పటి నుంచి కలిసి పెరిగారు. యాడికిలో ఒకే బడిలో చదువుకున్నారు. ప్రాణం కంటే మిన్నగా వారి మధ్య స్నేహం చిగురించింది. ఆ స్నేహమే చివరికి వారిద్దరి ప్రాణాలను ఒకేసారి తీసుకునేటట్లు చేసింది. అనంతపురం జిల్లా యాడికి ప్రాంతానికి చెందిన ఇద్దరు స్నేహితురాళ్లు సోమవారం మధ్యాహ్నం కడప నగర పరిధిలోని భాకరాపేట రైల్వే గేటు వద్ద గూడ్స్ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటన కన్నవారికి తీరని శోకం మిగిల్చింది. రైల్వే ఎస్ఐ రారాజు కథనం మేరకు... యాడికి మండలం కమలపాడు గ్రామానికి చెందిన కల్యాణి (18) గుత్తిలోని గేట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో బీటెక్ ఈసీఈ చదువుతోంది. ఈమె తండ్రి రామాంజనేయులు యాడికిలో కూల్‌డ్రింక్ షాపు నిర్వహించుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. యాడికి పట్టణంలోని హాస్పిటల్ కాలనీలో నివాసముంటున్న పూజిత (18) తాడిపత్రిలోని సరస్వతి డిగ్రీ కళాశాలలో బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చదువుతోంది. వీరిద్దరూ వేములపాడు మోడల్ స్కూలులో ఇంటర్ వరకు కలిసి చదివారు. చదవండి: (బ్యూటీ పార్లర్లో ఉద్యోగం అన్నారు.. రిసార్టులకు పంపి..) ఈ క్రమంలో సోమవారం ఉదయం 9 గంటలకు యాడికిలో బయలుదేరి మధ్యాహ్నం కడపకు చేరుకున్నారు. 1.30 గంటల ప్రాంతంలో కడప సమీపంలోని భాకరాపేట (ఎర్రముక్కపల్లె) రైలు పట్టాల వద్దకు వెళ్లారు. ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుని ఆ సమయంలో వస్తున్న గూడ్స్ రైలు కిందపడ్డారు. సంఘటన స్థలంలోనే కల్యాణి మృతి చెందింది. శరీర భాగాలు విడిపోయాయి. మరో యువతి పూజిత ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుండగా రిమ్స్‌కు తరలిస్తుండగా మృతి చెందింది. ఇద్దరూ ఒకేసారి ప్రాణాలు ఎందుకు తీసుకున్నారో తెలియరాలేదు. రైల్వే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. తల్లిదండ్రులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
సెల్ఫీ కోసం రైలు బోగీ పైకి.. హైటెన్షన్ విద్యుత్ వైర్లు తగలడంతో
పిడుగురాళ్ల: ఆగి ఉన్న గూడ్స్ రైలు పైకెక్కి సెల్ఫీ తీసుకుంటుండగా విద్యుదాఘాతానికి గురై యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. పిడుగురాళ్ల పట్టణ రైల్వే స్టేషన్ శివారులో బుధవారం ఈ ఘటన జరిగింది. పట్టణానికి చెందిన కటికం వీరబ్రహ్మం రైల్వే స్టేషన్ సమీపంలో నివసిస్తున్నాడు. తన బైక్‌పై రైల్వేస్టేషన్ వద్దకు వచ్చాడు. అప్పటికే గూడ్స్ రైలు ఆగి ఉండటంతో వెనుక బోగీపైకి ఎక్కాడు. బోగీపై నిలబడి సెల్ఫీ దిగేందుకు చేతిని పైకిలేపడంతో పైన ఉన్న హైటెన్షన్ విద్యుత్ వైర్లు తగిలి విద్యుదాఘాతానికి కింద పడ్డాడు. కిందపడటంతో తలకు గాయం కావడంతో పాటు, శరీరం కూడా తగలబడుతోంది. అక్కడే ఉన్న మరో యువకుడు బుచ్చయ్య దీనిని గమనించి వెంటనే రైల్వేస్టేషన్ మాస్టర్ కృపాకర్‌కు సమాచారం ఇచ్చాడు. రైల్వే ఎస్ఐ పోలయ్య, ఏఎస్ఐ కె.క్రీస్తుదాసు, కానిస్టేబుల్ సురేష్‌లు ఘటన స్థలానికి చేరుకుని మంటలార్పారు. బాధితుడిని 108లో ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. రైల్వే పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
రైల్ కార్గో రవాణాలో ‘త్రివేణి’
సాక్షి, అమరావతి/రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ): కార్గో రవాణాలో విజయవాడ రైల్వే డివిజన్ మరో ఘనత సాధించింది. తక్కువ సమయంలో ఎక్కువ సరుకు రవాణా చేసేలా ఇటీవల మూడు గూడ్స్ రైళ్లను కలిపి ఒకే రైలుగా ‘త్రిశూల్’ పేరుతో విజయవంతంగా నడిపిన విజయవాడ డివిజన్ అధికారులు త్రివేణి మిషన్ పేరిట ఆదివారం నాలుగు అతి పొడవైన గూడ్స్ రైళ్లను నడిపి మరో ఘనత సాధించారు. రెండేసి గూడ్స్ రైళ్లను జతచేసి 118 వ్యాగన్లు ఉన్న ఓ భారీ రైలుగా మలిచారు. ఆ విధంగా ఎనిమిది రైళ్లను నాలుగు భారీ రైళ్లుగా చేసి మూడు గమ్యస్థానాలకు కార్గో రవాణా చేశారు. వాటిలో ఒక రైలును విజయవాడ నుంచి విశాఖపట్నం మీదుగా తాల్చేర్ వరకు 900 కిలోమీటర్లు నడిపారు. మరో గూడ్స్ రైలును కృష్ణపట్నం పోర్టు నుంచి ఓబులవారిపల్లి మీదుగా కేశోరామ్ సిమెంట్ కంపెనీకి 645 కిలోమీటర్లు కార్గో రవాణా చేశారు. బీసీఎన్ రేక్స్ గల రెండు భారీ గూడ్స్ రైళ్లను విజయవాడ నుంచి కొండపల్లి వరకు నడిపారు. తద్వారా కార్గో రవాణా సామర్థ్యాన్ని అమాంతంగా పెంచుకుని విజయవాడ రైల్వే డివిజన్ దేశంలోనే గుర్తింపు పొందింది. రోలింగ్ స్టాక్ నిర్వహణలో ఉత్తమ పనితీరు కనబరిచింది. తద్వారా కార్గో రవాణా వేగం పెరగడంతోపాటు తక్కువ సమయంలో లోడింగ్/అన్లోడింగ్ ప్రక్రియ పూర్తిచేశారు. ఖాళీ అయిన వ్యాగన్లు తక్కువ సమయంలో గమ్యస్థానాలకు చేరతాయి. సిబ్బంది అవసరం తగ్గడంతోపాటు రైలు మార్గంలో రద్దీ తగ్గడంతో రైళ్ల నిర్వహణ సామర్థ్యం పెరుగుతుంది. భారీ రైళ్లను సమర్థంగా నిర్వహించినందుకు విజయవాడ రైల్వే డివిజన్ ఉన్నతాధికారులను దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్య అభినందించారు. -
గూడ్స్ రైలు ఎక్కి వ్యక్తి వీరంగం
సాక్షి,విజయనగరం: రైల్వే స్టేషన్లో మతి స్థిమితం లేని వ్యక్తి హల్చల్ చేశాడు. రైల్వే సిబ్బందితో పాటు పోలీసులను కాసేపు ముప్పుతిప్పలు పెట్టాడు. ఈ ఘటన విజయనగరంలో చోటు చేసుకుంది. గురువారం స్టేషన్లోకి ప్రవేశించిన ఓ వ్యక్తి నిలిచి ఉన్న గూడ్స్ రైలు పైకి ఎక్కి వీరంగం సృష్టించాడు. విషయం తెలుసుకున్న జీఆర్పీ పోలీసులు అక్కడికి చేరుకుని వ్యయప్రయాసలతో అతన్ని కిందకు దింపి, అదుపులోకి తీసుకున్నారు. రైల్వే అధికారులు , పోలీసులు సకాలంలో స్పందించడంతో ఆ వ్యక్తికి ప్రాణాపాయం తప్పింది. చదవండి: పది కోళ్లను తిన్న కొండచిలువ -
మూడు నెలల్లో సీఎం కేసీఆర్ ఇలాకాకు గూడ్స్ రైళ్లు
సాక్షి, హైదరాబాద్: కోవిడ్ నిబంధనలతో గజ్వేల్‌కు ప్రయాణికుల రైలు నడపటంలో ఆలస్యం జరుగుతున్నప్పటికీ, మరో మూడు నెలల్లో సరుకు రవాణా రైలు ప్రారంభం కాబోతోంది. ఇంతకాలం అటు సిద్దిపేట మొదలు గజ్వేల్ పరిసర ప్రాంతాల్లో పండుతున్న వ్యవసాయ ఉత్పత్తులను ఇతర ప్రాంతాలకు రవాణా చేసేందుకు రోడ్డు మార్గాన్నే వినియోగిస్తున్నారు. ఇప్పుడు తొలిసారి రైలు మార్గం అనుసంధానం కాబోతోంది. చదవండి: సీఎం జగన్‌ను కలిసిన తెలంగాణ పర్వతారోహకుడు తుకారాం గజ్వేల్ వరకు రైలు మార్గం పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చింది. కానీ కోవిడ్ వల్ల దేశవ్యాప్తంగా ప్యాసింజర్ రైళ్లను నడపటం లేదు. ఈపాటికే ప్రయాణికుల రైలు సర్వీసు గజ్వేల్ వరకు ప్రారంభం కావాల్సి ఉండగా, ఈ కారణంతో మొదలు కాలేదు. అయితే వీలైనంత తొందరలో గూడ్సు రైళ్లను నడపాలని దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించింది. గూడ్సు షెడ్డు నిర్మాణాన్ని మూడు నెలల్లో పూర్తి చేసి గూడ్సు రైళ్లను ప్రారంభించాలని నిర్ణయించారు. సమీపంలోని ప్రాంతాల్లోని రైతులు, వ్యాపారులు వ్యవసాయ ఉత్పత్తులను లారీల ద్వారా గజ్వేల్ వరకు తరలిస్తే అక్కడి నుంచి గూడ్సు రైళ్లలో వాటిని తరలించొచ్చు. గజ్వేల్ రైల్వే స్టేషన్‌ను గురువారం దక్షిణ మధ్య రైల్వే హైదరాబాద్ డివిజన్ డీఆర్ఎం శరత్ చంద్రాయన్ తనిఖీ చేశారు. డిప్యూటీ సీఈ (కన్స్ట్రక్షన్) సదర్మ దేవరాయ, అధికారులులతో కలిసి పనులు జరుగుతున్న తీరును పరిశీలించారు. చదవండి: తెలంగాణ శాసన సభాసమరానికి సర్వం సిద్ధం -
పట్టాలు తప్పిన గూడ్సు
భువనేశ్వర్: ఈస్ట్ కోస్ట్ రైల్వే పరిధిలోని అంగుల్–తాల్చేరు సెక్షన్‌లోని 167/1–2 కిలోమీటరు ప్రాంతంలో సోమవారం అర్ధరాత్రి 2.35 గంటలకు గూడ్సు రైలు పట్టాలు తప్పింది. ఫిరోజ్‌పూర్ నుంచి ఖుర్దారోడ్డుకు గోధుమలు రవాణా చేస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సరిగ్గా వంతెనపై జరిగిన ఈ దుర్ఘటనలో 9 వ్యాగన్లు పలీ్టకొట్టి ఒకదానిపై మరొకటి పేరుకుపోగా, ఇంజిన్ పట్టాలపైనే ఉండటంతో లోకో పైలట్, ఇతర సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటనతో ఢెంకనాల్–సంబల్పూర్ సెక్షన్ మధ్య రైలు రవాణాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. 12 రైళ్లను రద్దు చేయగా, మరికొన్ని రైల్వే సేవలను పాక్షికంగా రద్దు చేసి, దారి మళ్లించి, నడిపిస్తున్నారు. చురుగ్గా పునరుద్ధరణ పనులు.. ఖుర్దారోడ్డు డివిజన్ డీఆర్ఎమ్ ఆధ్వర్యంలో ఉన్నతాధికారుల బృందం ఘటనా స్థలం సందర్శించింది. దుర్ఘటనకు సంబంధించిన పరిస్థితులు, కారణాలను బృందం పరిశీలిస్తోంది. కుండపోత వర్షాలతో సంభవించిన ఆకస్మిక వరదల కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. వరద నీరు ఉధృతికి వంతెన ఇరువైపుల భాగాలు దెబ్బతిన్నట్లు గుర్తించారు. ప్రస్తుతం సంబల్పూర్ నుంచి క్రేన్‌ని తెప్పించి, వ్యాగన్ల పునరుద్ధరణ చేపడుతున్నారు. ప్రయాణికులకు ఆహారం సరఫరా.. ఈ ప్రమాదం దృష్ట్యా మధ్యలో నిలిచిపోయిన బికనీర్–పూరీ స్పెషల్ రైలు, దుర్గ్–పూరీ స్పెషల్ రైలులోని ప్రయాణికులకు సంబల్పూర్ రైల్వే డివిజన్ కేకులు, బిస్కెట్లు, టీ, తాగునీరు సరఫరా చేసింది. టిట్లాగడ్ రైల్వే స్టేషనులో దుర్గ్–పూరీ స్పెషల్, హతియా–పూరీ స్పెషల్, ఎల్టీటీ– పూరీ స్పెషల్ రైలు ప్రయాణికులకు మధ్యాహ్నం భోజనం ప్యాకెట్లను కూడా రైల్వే సరఫరా చేసింది. -
ట్రయల్ రన్ సక్సెస్ !
సుజాతనగర్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం రోడ్డు (కొత్తగూడెం) నుంచి ఏపీలోని కొవ్వూరు వరకు రైలు మార్గం నిర్మాణం వేగంగా సాగుతోంది. తొలి దశలో కొత్తగూడెం నుంచి సత్తుపల్లి వరకు 55.2 కిలోమీటర్ల మేర రైల్వే లైన్ నిర్మాణానికి సింగరేణి, రైల్వే శాఖల ద్వారా రూ.875 కోట్లు కేటాయించారు. ఈ మేరకు లైన్ పనులు పూర్తికాగా, కొత్తగూడెం నుంచి సుజాతనగర్ మండలంలోని లక్ష్మీదేవిపల్లి వరకు పూర్తిస్థాయిలో లైన్ సిద్ధమైంది. దీంతో రైల్వే అధికారులు గురువారం ట్రయల్ రన్ నిర్వహించారు. భద్రాచలం రోడ్డు నుంచి లక్ష్మీదేవిపల్లి వరకు గూడ్స్ బోగీలు, ఇంజన్ నడిపించగా ప్రజలు ఆసక్తిగా చూశారు. కాగా, కొవ్వూరు రైల్వే లైన్ సాధన కమిటీ ఆధ్వర్యాన 1980 నుంచి రైల్వే లైన్ కోసం అనేక పోరాటాలు చేపట్టగా, ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. భద్రాచలం రోడ్ నుంచి కొవ్వూరు వరకు 150 కిలోమీటర్ల మేర లైన్ నిర్మించాల్సి ఉండగా... ప్రస్తుతం సత్తుపల్లి వరకు అంటే 55.2 కిలోమీటర్ల మేర పనులు పూర్తయ్యాయి. ఇందులో సుజాతనగర్ మండలంలోని లక్ష్మీదేవిపల్లి గ్రామం వరకు రైలు పట్టాలు కూడా సిద్ధం కావడంతో ట్రయల్ రన్ చేపట్టారు. కాగా, ఈ ప్రాంతంలో వెలికితీసే బొగ్గును ప్రస్తుతం లారీల ద్వారా తరలిస్తున్నారు. రైల్వేమార్గం అందుబాటులోకి వస్తే బొగ్గు రవాణా సులభతరం అవుతుంది. అలాగే, తెలంగాణ నుంచి ఏపీకి ఈ మార్గంలో వెళ్లే 150 కిలోమీటర్ల మేర దూరం తగ్గనుంది. -
ఆక్సిజన్ ట్యాంకర్‌పై మంటలు
సాక్షి, పెద్దపల్లికమాన్: కరోనా బాధితులకు అందించేందుకు గూడ్స్‌లో తరలిస్తున్న ఆక్సిజన్ ట్యాంకర్‌పై మంటలు చెలరేగాయి. ఈ ఘటన పెద్దపల్లి రైల్వే స్టేషన్లో చోటుచేసుకుంది. సకాలంలో అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలు ఆర్పడంతో పెనుప్రమాదం తప్పింది. హైదరాబాద్‌లోని సనత్‌నగర్ నుంచి రాయ్‌పూర్‌కు ఆరు ఖాళీ ట్యాంకర్లతో బయల్దేరిన గూడ్స్ రైలు శనివారం పెద్దపల్లి రైల్వే జంక్షన్‌కు చేరుకుంది. ఉదయం 11.02 గంటలకు చీకురాయి సమీపంలోని ఎల్సీ గేట్ నంబర్ 38కి చేరుకోగానే ఓ ట్యాంకర్ నుంచి పెద్దగా శబ్ధం వచ్చి మంటలు చెలరేగాయి. గమనించిన గేట్‌మన్ రాజసాగర్ డ్యూటీలో ఉన్న పెద్దపల్లి స్టేషన్ మాస్టర్‌కు సమాచారమందించారు. స్పందించిన స్టేషన్‌మాస్టర్ వెంకట్ ఫైర్‌స్టేషన్‌కు సమాచారమిచ్చారు. వెం టనే రైలును ఆపించి మంటలున్న ట్యాంకర్ నుంచి మిగతా బోగీలను వేరుచేశారు. సమయానికి సంఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది ట్యాంకర్‌కున్న మంటలను అదుపులోకి తెచ్చారు. రైల్వే అధికారులు, లిండే ఆక్సిజన్ కంపెనీ ప్రతినిధులు ప్రాథమికంగా దర్యాప్తు చేశారు. ట్యాంకర్ ఖాళీచేసిన తర్వాత కొంత ఆక్సిజన్ ట్యాంకర్‌లోనే ఉంటుందని, అది లీకై మంటలు చెలరేగి ఉంటాయని ప్రాథమికంగా తెలిపారు. చదవండి: అంబులెన్స్ ధరలు.. మోటారుసైకిల్‌పై మృతదేహం తరలింపు -
ఆక్సిజన్ తెచ్చింది
జార్ఖండ్ నుంచి ఒక రైలు బయలుదేరింది. అయితే అది మామూలు రైలు కాదు. ‘ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్’. దాదాపు 2000 కిలోమీటర్ల దూరం.... 27 గంటల ప్రయాణం. ముగ్గురు టీమ్. వారిలో లోకో పైలెట్ నీలిమా కుమారి కూడా ఉంది. ప్రాణాలు కాపాడే ప్రాణవాయువును తీసుకొని ఆఘమేఘాల మీద ఆమె బెంగళూరు చేర్చి ప్రశంసలు అందుకుంది. కోవిడ్ సమయంలో ఆక్సిజన్ ఉత్పత్తి, సరఫరా దేశంలోకి చాలా కీలకమైన విషయంగా మారాయి. ఆక్సిజన్ తయారీ ప్లాంట్ల నుంచి ఆఘమేఘాల మీద ఆక్సిజన్‌ను చేరవేయడానికి భారత ప్రభుత్వం ‘ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్’లను మొదలెట్టింది. అంటే ఆక్సిజన్ ట్యాంకర్లు ఉన్న గూడ్స్ రైళ్లు ఇవి. వీటిని గమ్యానికి చేర్చడం చాలా బాధ్యతతో కూడుకున్న పని. మామూలు గూడ్సు రైళ్లు అయితే ఆగినా, ఆలస్యమైనా పర్వాలేదు. కాని ఆక్సిజన్ రైలు మాత్రం సమయానికి చేరుకోవాల్సిందే. ఇటీవల అలా సమయానికి చేర్చి ప్రశంసలు అందుకున్న లోకో పైలెట్ (డ్రైవర్) నీలిమా కుమారి. జార్ఖండ్ నుంచి సోమవారం (మే 17) ఉదయం 7 గంటలకు జార్ఖండ్‌లోని జోలార్‌పేట్ డివిజన్ నుంచి 120 టన్నుల లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్‌తో ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ బయలుదేరింది. బెంగళూరు డివిజన్‌కు చెందిన ముగ్గురు సిబ్బంది ఈ ట్రైనును గమ్యానికి చేర్చాలి. వారిలో సీనియర్ సిబ్బంది అయిన కుమార్ (బిహార్), వలి (కర్ణాటక) ఉంటే అసిస్టెంట్ డ్రైవర్‌గా నీలిమా కుమారికి బెంగళూరు డివిజన్ బాధ్యత అప్పజెప్పింది. ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌లు మొదలయ్యాక మహిళా డ్రైవర్‌ను ఈ బాధ్యతకు ఉపయోగించడం ఇదే మొదటిసారి. బిహార్‌కు చెందిన నీలిమా కుమారి ఒక సంవత్సర కాలంగా బెంగళూరు డివిజన్లో లోకో పైలెట్‌గా పని చేస్తోంది. ఆమె వివాహిత. ఐదేళ్ల కుమారుడు ఉన్నాడు. జార్ఖండ్ నుంచి ఆక్సిజన్‌ను తీసుకొచ్చే బాధ్యత ను ఆమె సవాలుగా స్వీకరించింది. 100 కిలోమీటర్ల వేగంతో ముగ్గురు సిబ్బంది తమ భుజాల మీద ఉన్న బాధ్యతను సీరియస్‌గా తీసుకున్నారు. దాదాపు 25 గంటలు నాన్‌స్టాప్‌గా రైలును నడపాలి. అందుకు సిద్ధమయ్యారు. ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ బెంగళూరు చేరడానికి మధ్యలో సిగ్నళ్ల అంతరాయం లేకుండా లైన్లు క్లియర్ చేయబడ్డాయి. 100 కిలోమీటర్ల వేగంతో రైలు గమ్యానికి చేరాల్సి ఉంటుంది. అనుకున్నట్టుగానే మధ్యలో ఒకటి రెండు చోట్ల తప్ప ముగ్గురూ కలిసి రైలును మరుసటి రోజు (మే 18) ఉదయం 8 గంటల సమయంలో బెంగళూరుకు చేర్చారు. ‘ఇది నాకెంతో సంతోషం కలిగించింది. కష్టాల్లో ఉన్నవారిని సకాలంలో ఆదుకునేందుకు మా రైలు సమయానికి చేరడం ఎంత ముఖ్యమో నాకు తెలుసు. ఆ పనిని సక్రమంగా చేయగలిగాను’ అని నీలిమా కుమారి అంది. సీనియర్ డ్రైవర్ కుమార్ ‘నా సర్వీసులో ఇంత ఉపయోగకరమైన డ్యూటీ ఎప్పుడూ చేయలేదు’ అనంటే మరో సీనియర్ డ్రైవర్ వలి ‘నేను రైలు మొదలైనప్పటి నుంచి గమ్యం చేరేంత వరకు ఇంజన్లో నిలబడే ఉన్నాను. కంటి మీద కునుకు వేయలేదు’ అన్నాడు. ఎందరో మహానుభావులు. అందుకే కరోనా బాధితులు సమయానికి సహాయం పొందగలుగుతున్నారు. కాకుంటే ఒక మహానుభావురాలు కూడా ఉండటం విశేషం కదా. -
ఇంజన్లో ఇరుక్కున్న బైక్, ఆగిన రైలు
నెక్కొండ: గూడ్స్ రైలు ఇంజన్లో టూ వీలర్ వాహనం ఇరుక్కోవడంతో రైలు అర గంటపాటు నిలిచిపోయింది. వరంగల్ రూరల్ జిల్లా నెక్కొండ మండలంలోని గేటుపల్లిలో మంగళవారం ఈ ఘటన జరిగింది. మండలం లోని గొల్లపల్లికి చెందిన ఓ రైతు తన ద్విచక్ర వాహనాన్ని గేటుపల్లి వద్ద రైలు పట్టాలను దాటిస్తున్నాడు. ఈ క్రమంలో వరం గల్ నుంచి విజయవాడ వెళ్తున్న గూడ్స్ రైలు దగ్గరకు రావడం తో గమనించిన రైతు తన వాహనాన్ని విడిచి వెళ్లిపోయాడు. అప్పటికే అప్రమత్తమైన డ్రైవర్ రైలు వేగాన్ని తగ్గించినప్పటికీ ఇంజన్‌లోకి బైక్ ఇరుక్కుపోయింది. అరగంటపాటు శ్రమించి టూవీలర్‌ను తొలగించాక రైలు తిరిగి బయలుదేరింది. చదవండి: టీచర్ మందలించాడని.. ఆత్మహత్య చేసుకున్న పదోతరగతి విద్యార్థి -
పట్టాలు తప్పిన గూడ్స్ రైలు
ఘజియాబాద్ : ఆగ్రా - ఢిల్లీ మార్గంలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. గూడ్స్ రైలుకు చెందిన నాలుగు బోగీలు పట్టాల పక్కకి ఒరిగిపోయాయి. ఘజియాబాద్ వల్లభ్‌గఢ్ రైల్వే స్టేషన్ల మధ్య ఆదివారం ఉదయం 10 గంటల సమయంలో ఈ ఘటన జరిగిది. ఢిల్లీ వైపు వెళ్తున్న గూడ్స్ రైలు ఛటికర గ్రామం ఓవర్ బ్రిడ్జ్ సమీపంలో పిల్లర్ నంబర్ 1408 వద్ద నాలుగు బోగీలు పట్టాలు తప్పింది. దీంతో ఈ మార్గంలో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. లైన్లు మరమ్మతు పనులు జరుగుతున్నాయి. -
సరుకు రవాణా ఇక సులభంగా..
సాక్షి, హైదరాబాద్: సాధారణ ప్రయాణికుల రైలు తరహాలో నిర్ధారిత వేళల ప్రకారం నడిచే (టైంటేబుల్డ్) సరుకు రవాణా ఎక్స్‌ప్రెస్‌ను రైల్వే తొలిసారి పట్టాలెక్కించబోతోంది. దీన్ని హైద రాబాద్ కేంద్రంగా దక్షిణ మధ్య రైల్వే నిర్వహించనుండటం విశేషం. ఇది ఎక్స్‌ప్రెస్ రైలు కావటం మరో విశేషం. సనత్‌నగర్ స్టేషన్ నుంచి కొత్త ఢిల్లీలోని ఆదర్శ్‌నగర్‌కు రైలు నడవనుంది. ఆగస్టు 5న ప్రారంభమయ్యే ఈ సరుకు రవాణా ఎక్స్‌ప్రెస్ ప్రతి బుధవారం సనత్‌నగర్ స్టేషన్ నుంచి బయలుదేరుతుంది. సాధారణంగా ఒక రేక్ (రైలు బోగీలన్నీ కలిపి)కు సరిపడా సరుకు ఉంటేనే సరుకు రవాణా రైలును నడుపుతారు. ముందస్తు బుకింగ్స్ ఆధారంగా ఈ రైళ్లు నడుస్తుంటాయి. దానికి భిన్నంగా సరుకు ఉన్నా లేకున్నా, ప్రయాణికుల రైళ్ల తరహాలో నిర్ధారిత వేళల్లో ఈ రైలు బయలుదేరుతుంది. చిరు వ్యాపారులను ఆకట్టుకునేలా.. కనిష్టంగా 60 టన్నుల సరుకు వరకు అనుమతి స్తారు. ఇది చిన్న వ్యాపారులకు ఎంతో ఉపయోగం. ఇప్పటివరకు ఓ రైలు మొత్తాన్ని బుక్ చేసుకోవాల్సి వచ్చేది. లేదా, చిన్న వ్యాపారులు అంతా కలిపి అయినా బుక్ చేసుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు అలా కాకుండా, 60 టన్నుల సరుకు ఉంటే చాలు అనుమతిస్తారు. ఇప్పటివరకు ఈ వసతి లేకపోవ టం వల్ల చిరు వ్యాపారులు విధిగా లారీలతో రోడ్డు మార్గాల ద్వారా సరుకు పంపేవారు. దీని వల్ల వ్యయం ఎక్కువగా ఉంటోంది. సరుకు రవాణా రూపంలో ఆదాయాన్ని పెంచుకోవాలని తీవ్రంగా యత్నిస్తున్న దక్షిణ మధ్య రైల్వే, చిరు వ్యాపారుల కోసం ఈ వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టింది. దీనికి రైల్వే బోర్డు అనుమతించటంతో సమయ పాలనతో కూడిన తొలి సరుకు రవాణా ఎక్స్‌ప్రెస్‌ను పట్టాలెక్కిం చేందుకు సిద్ధమైంది. సనత్‌నగర్ స్టేషన్ పారిశ్రామిక కేంద్రాలకు సమీ పంలో ఉన్నందున దాన్ని ఎంపిక చేశారు. ఇక్కడి నుంచి ఢిల్లీకి నిత్యం సరుకు రవాణా అవుతూనే ఉంటుంది. దీంతో ఆ రూపంలో ఆదాయాన్ని పెంచుకునేందుకు ఈ కొత్త రైలు దోహదం చేస్తుందని దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్ మాల్యా పేర్కొన్నారు. రైల్వేకు ఆదాయపరంగానే కాకుండా చిరు వ్యాపారులకు ఇది ఎంతో ఉపయు క్తంగా ఉంటుందని ఆయన చెప్పారు. సనత్‌నగర్ నుంచి 1,700 కి.మీ. దూరంలో ఉన్న కొత్త ఢిల్లీలోని ఆదర్శ్‌నగర్ స్టేషన్‌కు కేవలం 34 గంటల్లో ఈ రైలు చేరుకోనుంది. ప్రతి బుధవారం సాయంత్రం బయలుదేరి శుక్రవారం ఉదయం ఇది గమ్యం చేరుతుంది. టన్నుకు రూ.2,500 చార్జీ వసూలు చేస్తారు. కొన్ని రకాల వస్తువులకు ఈ ధర వేరుగా ఉండనుంది. రోడ్డు మార్గాన సరుకు చేరÐఇంటి నుంచి పని..ólయాల న్నా, ప్రస్తుత సరుకు రవాణా రైల్వే టారిఫ్‌తో పోలిస్తే ఈ ధర 40 శాతం తక్కువ కావటం విశేషం. వివరాలకు 9701371976, 040–27821393 నంబ ర్లలో సంప్రదించవచ్చని అధికారులు పేర్కొన్నారు. -
అనకొండ ట్రైన్, రైల్వే శాఖ రికార్డు
బిలాస్పూర్: మూడు గూడ్స్ రైళ్లను ఒకే ట్రైన్‌గా మార్చి భారతీయరైల్వే బుధవారం సరికొత్త రికార్డును సృష్టించింది. బిలాస్పూర్ డివిజన్ సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే జోన్‌కు చెందిన మూడు గూడ్స్ రైళ్లను జతచేసి ఒకే ట్రైన్‌గా విజవంతంగా నడిపింది. లోడుతో ఉన్న మూడు రైళ్లను జతకలిపి బిలాస్‌పుర్-చక్రధర్పూర్ డివిజన్ల మధ్య విజయవంతంగా నడిపినట్లు రైల్వే శాఖ వెల్లడించింది. కొండను మింగిన కొండచిలువలాగా ఈ రైలు పట్టాలపై సాగిపోతుందని రైల్వే శాఖ అభివర్ణించింది. దీనిని అనకొండ రైలుగా పిలుస్తున్నారు. (ఆగస్టు 12 వరకు రైళ్లు బంద్) దీని గురించి భారతీయ రైల్వే శాఖ మాట్లాడుతూ, తక్కువ సమయంలో ఎక్కువ సరుకును రవాణా చేసేందుకు మూడు రైళ్లను కలిపి ఒకే రైలుగా మార్చే ప్రయోగం చేసినట్లు వివరించింది. 15 వేల టన్నులకు పైగా సరుకుతో ఈ గ్రూడ్స్ రైలు ప్రయాణం చేసినట్లు వెల్లడించింది. దీన్ని బట్టి చూస్తే భవిష్యత్‌లో సరుకు రవాణా సమయాన్ని ఆదా చేసేందుకు మరికొన్ని పొడగాటి రైళ్లను నడిపే యోచనలో రైల్వే శాఖ ఉన్నట్లు కనబడుతోంది. ఇదిలా ఉండగా, దేశంలో కరోనా విజృంభిస్తున్న క్రమంలో ప్రజా రవాణా రైళ్లను రైల్వే శాఖ పరిమితసంఖ్యలోనే నడుపుతున్న విషయం తెలిసిందే. అయితే కేంద్రం విధించిన అన్‌లాక్ 2.0 నిబంధనల ప్రకారం ప్రజా రవాణా రైళ్లను పెంచే యోచనలో కేంద్రం ఉన్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.రైల్వేశాఖ ప్యాసింజర్ రైళ్ల కదలికను పరిమితం చేసినప్పటికీ గూడ్స్ రైలు సేవలు యథాతథంగా అందిస్తున్న సంగతి తెలిసిందే. (రైల్వే ఇక మేడిన్ ఇండియా) Taking a big leap in reducing the transit time of freight trains, Bilaspur division of SECR broke yet another frontier by joining & running 3 loaded trains (more than 15000 tonnes) in 'Anaconda' formation through Bilaspur & Chakradharpur divisions. pic.twitter.com/5lZlQHDpkI — Ministry of Railways (@RailMinIndia) June 30, 2020 -
భూమి కుంగడంతోనే ప్రమాదం
టంగుటూరు: మండల పరిధిలోని టి.నాయుడుపాలెం సమీపంలో బుధవారం అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో ఆయిల్ ట్యాంకర్ గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. విజయవాడ నుంచి 58 ట్యాంకర్లతో కడప వెళుతున్న గూడ్స్ రైలు 580 ఎగువ రైల్వే బ్రిడ్జి వద్దకు రాగానే పట్టాలు తప్పింది. మొత్తం ఏడు ట్యాంకర్లు పట్టాలు తప్పగా నాలుగు ట్యాంకర్లు బ్రిడ్జి కింద పడి ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడి దగ్ధమయ్యాయి. ఈ సంఘటన జరిగిన ప్రాంతం నుంచి ఐఓసీ లే అవుట్ పక్కనే ఉండటంతో భయాందోళన నెలకొంది. మంటలు క్రమం క్రమంగా పెద్దవి కావడంతో స్థానిక గ్రామస్తులు ఆందోళన చెందారు. సమాచారం అందుకున్న ఐఓసీ రెస్క్యూ టీం, సౌత్ సెంట్రల్ రైల్వే రెస్క్యూ టీం, రైల్వే అధికారులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. ప్రమాదం ఎలా జరిగింది.. ప్రమాద విషయం తెలుసుకున్న రైల్వే అడిషనల్ ఆర్ఎం రామరాజు సంఘటనా స్థలానికి చేరుకొని ఇంజినీరింగ్ బృందంతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రమాదం ఎలా జరిగిందనే దానిపై కమిటీ వేశామని, వారం రోజుల్లో నివేదిక వస్తుందని తెలిపారు. ప్రాథమిక అంచనా ప్రకారం మూడవ రైల్వే నిర్మాణ పనుల వల్ల భూమి కుంగి రైలు పట్టాలు తప్పినట్లు భావిస్తున్నామన్నారు. అగ్నిమాపక శాఖ అధికారులు సకాలంలో మంటలను అదుపు చేయడంతో పెను ప్రమాదం తప్పిందని తెలిపారు. మిగిలిన 50 ట్యాంకర్లను టంగుటూరుకు చేర్చామన్నారు. గురువారం ఉదయం 300 మంది కార్మికులు మరమ్మతులు చేసి రైళ్ల రాకపోకలు పునరుద్ధరించారు. సంఘటనా స్థలాన్ని రైల్వే అధికారులు, ఒంగోలు డీఎస్పీ ప్రసాద్, సింగరాయకొండ సీఐ శ్రీనివాసులు, ఎస్సై రమణయ్యలు పరిశీలించారు. -
టిక్‌టాక్.. ఎంత పని చేసింది?
సాక్షి, బెంగళూరు: టిక్‌టాక్ మోజులో యువత ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. తాజాగా ఇలాంటి ఓ ఘటన కర్ణాటక రాజధాని బెంగళూరులో వెలుగు చూసింది. టిక్‌టాక్ వీడియో చిత్రీకరిస్తూ ఒక యువకుడు కరెంట్ షాక్‌తో గాయపడ్డాడు. 22 ఏళ్ల యువకుడు కదులుతున్న గూడ్స్ రైలుపై నిలబడి టిక్‌టాక్ వీడియో చిత్రీకరిస్తుండగా హైటెన్షన్ విద్యుత్ వైర్లు తగిలాయి. ఈ ప్రమాదంలో యువకుడికి 20 శాతం కాలిన గాయాలు అయ్యాయి. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ సంఘటనలో అతడి ప్రాణానికి ప్రమాదం తప్పిందని తెలిసింది. ('అయినా.. నేను కొట్టింది నా భర్తనే కదా') మైసూర్ నుంచి వస్తున్న గూడ్స్ రైలు బుధవారం సాయంత్రం ఆరు గంటలకు బెంగళూరు మెజెస్టిక్ రైల్వేస్టేషన్‌కు చేరుకుంది. ఈ సమయంలో నెమ్మదిగా నడుస్తున్న గూడ్స్ రైలుపై టిక్‌టాక్ వీడియో చేసేందుకు ఒక యువకుడు నిలబడి ఉన్నాడు. వీడియో తీసుకునే సమయంలో హైటెన్షన్ విద్యుత్ వైరు తగలడంతో షాక్ తగిలి కిందపడిపోయాడు. ఇది గమనించిన రైల్వే అధికారులు ఆ యువకుడిని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అతడినిక ప్రాణాపాయం తప్పిందని వైద్యులు తెలిపారు. టిక్‌టాక్ వీడియోలు చేస్తూ యువత ప్రాణాలకు మీదకు తెచ్చుకోవడం పరిపాటిగా మారిపోయింది. అధికారులు, అయినవారు చెబుతున్నా వినకుండా యువత టిక్‌టాక్‌కు బానిసలుగా మారుతుండటం ఆందోళన కలిగిస్తోంది. (ప్రధాని ప్రసంగం అయిపోగానే.. తెగ వెతికారు!) -
కూలీలను చిదిమేసిన రైలు
ఔరంగాబాద్: మహారాష్ట్రలో విషాదం చోటు చేసుకుంది. లాక్డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయి సొంతూళ్లకు పయనమయిన వలస కార్మికులను గూడ్స్ రైలు చిదిమేసింది. కాలినడకన రైలు పట్టాల వెంబడి నడిచి వెళ్తూ అలసిపోయి పట్టాలపై పడుకున్నవారిపై నుంచి శుక్రవారం తెల్లవారు జామున ఒక గూడ్స్ రైలు దూసుకెళ్లింది. మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లా కర్మాడ్ వద్ద ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 16 మంది వలస కూలీలు ప్రాణాలు కోల్పోయారు. ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. పట్టాలకు కొద్ది దూరంలో పడుకున్న ముగ్గురు ప్రాణాలు దక్కించుకున్నారు. మహారాష్ట్రలోని జల్నాలో ఉన్న ఒక స్టీలు ఫ్యాక్టరీలో పని చేసే మధ్యప్రదేశ్‌కు చెందిన కార్మికులు గురువారం రాత్రి కాలినడకన సుమారు 150 కిలో మీటర్ల దూరంలోని సొంతూళ్లకు ప్రయాణమయ్యారు. రైలు పట్టాల వెంబడి దాదాపు 40 కి.మీ.లు నడిచిన తరువాత ఔరంగాబాద్‌కు దగ్గరలో అలసిపోయి, ఆగిపోయారు. అక్కడే రైలు పట్టాలపై నిద్రించారు. ముగ్గురు మాత్రం పట్టాలకు కొద్ది దూరంలో పడుకున్నారు. తెల్లవారు జాము 5.15 గంటల ప్రాంతంలో ఒక గూడ్స్ రైలు వారిపై నుంచి దూసుకెళ్లింది. రైలు రావడాన్ని పట్టాలకు దూరంగా పడుకున్నవారు గుర్తించారు. పట్టాలపై పడుకున్నవారిని అప్రమత్తం చేసేందుకు గట్టిగా అరిచారు. కానీ, పట్టాలపై నిద్రిస్తున్నవారు ప్రమాదాన్ని గుర్తించేలోపే దుర్ఘటన జరిగిపోయింది. నాందేడ్ డివిజన్లోని బద్నాపూర్– కర్మాడ్ స్టేషన్ల మధ్య ఈ దుర్ఘటన జరిగింది. చెల్లాచెదురుగా పడి ఉన్న వలస కూలీల మృతదేహాలు, వారి వస్తువులతో ఘటనాస్థలి భీతావహంగా మారింది. ఆ దృశ్యాలున్న వీడియో ఒకటి వైరల్‌గా మారింది. దూరంగా పట్టాలపై మనుషులున్నట్లు గుర్తించిన రైలు లోకోపైలట్.. హారన్ మోగిస్తూ, రైలు ఆపేందుకు విఫలయత్నం చేశాడని స్థానిక మీడియా పేర్కొంది. లాక్డౌన్ కారణంగా రైళ్లు నడవవన్న ధీమాతోనే వారు పట్టాలపై పడుకున్నారని బాధితులను ఉటంకిస్తూ వివరించింది. పోలీసులు ఆపకుండా ఉండేందుకే.. ఈ ఘటనపై రైల్వే శాఖ సమగ్ర విచారణకు ఆదేశించింది. కార్మికులు మహారాష్ట్రలోని జల్నా నుంచి మధ్యప్రదేశ్‌లోని భుసావల్‌కు వెళ్తున్నారని ఎస్పీ మోక్షద పాటిల్ తెలిపారు. లాక్డౌన్ కారణంగా పోలీసులు తమను అడ్డుకోకుండా ఉండేందుకే వారు రోడ్డు మార్గాలను కాకుండా, పట్టాలను అనుసరించి ప్రయాణించాలని నిర్ణయించుకున్నట్లు తెలిసిందన్నారు. మృతుల కుటుంబాలకు మహారాష్ట్ర ప్రభుత్వం రూ. 10 లక్షల చొప్పున, మధ్యప్రదేశ్ ప్రభుత్వం రూ. 5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించాయి. మానవ హక్కుల కమిషన్ నోటీసులు రైలు ప్రమాద ఘటనపై జాతీయ మానవహక్కుల కమిషన్ స్పందించింది. మీడియా కథనాలను సుమోటోగా తీసుకుని మహారాష్ట్ర ప్రధాన కార్యదర్శికి, ఔరంగాబాద్ జిల్లా కలెక్టర్‌కు నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లోగా సమగ్ర నివేదిక సమర్పించాలని ఆదేశించింది. లాక్డౌన్ సమయంలో కార్మికులకు అందిస్తున్న ఆహార, వసతి, ఇతర సౌకర్యాల వివరాలను కూడా తెలపాలని ఆ నోటీసుల్లో పేర్కొంది. ప్రముఖుల సంతాపం ఈ దుర్ఘటనపై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని మోదీ, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. కార్మికుల మృతి తనను కలచివేసిందని రాష్ట్రపతి ఆవేదన వ్యక్తం చేశారు. ‘రైలు ప్రమాదంలో కార్మికులు ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరం. రైల్వే మంత్రి పీయూష్ గోయల్‌తో మాట్లాడాను. ఆయన స్వయంగా పరిస్థితిని సమీక్షిస్తున్నారు’అని మోదీ ట్వీట్ చేశారు. మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్‌సింగ్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘కార్మికులను సొంత ప్రాంతాలకు పంపించేందుకు మరిన్ని రైళ్లు కావాలని కేంద్రాన్ని కోరాం. త్వరలో ఆ ఏర్పాట్లు చేస్తాం’అని ఠాక్రే అభ్యర్థించారు. విపక్షాల విమర్శలు జాతి నిర్మాతలైన కార్మికులతో కేంద్రం వ్యవహరిస్తున్న తీరుకు దేశమంతా సిగ్గుతో తలదించుకోవాలని రాహుల్ గాంధీ విమర్శించారు. ఇవి ప్రభుత్వం చేసిన హత్యలని స్థానిక ఎంఐఎం ఎంపీ ఇమ్తియాజ్ జలీల్ విమర్శించారు. ఇందుకు కారణమైన ప్రధానమంత్రి కార్యాలయం, రైల్వే శాఖ, మహారాష్ట్ర ప్రభుత్వాలపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలన్నారు. -
పట్టాలు తప్పిన గూడ్స్ రైలు
సాక్షి, విజయనగరం : బొడ్డవర సమీపంలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. దాంతో కొత్త వలస కిరండోల్ మార్గంలో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. ఫలితంగా విశాఖ అరకు ప్యాసింజర్ రైలును కొత్త వలస వద్ద నిలిపేశారు. దాంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎస్. కోట రైల్వే స్టేషన్లో నిలిచిన ప్యాసింజర్ రైలును వెనక్కి పంపే దిశగా అధికారులు చర్యలు చేపడుతున్నారు. -
డ్యూటీ ముగిసిందని.. రైలును మధ్యలోనే ఆపేశాడు
సాక్షి, చెన్నై: తన డ్యూటీ ముగిసిందంటూ లోకో పైలెట్ మార్గమధ్యంలో గూడ్స్ రైలును ఆపేసిన ఘటన తమిళనాడులోని నాగపట్నం జిల్లా శీర్గాలి సమీపంలో చోటు చేసుకుంది. శుక్రవారం ఉదయం నేలబొగ్గుతో కరైక్కాల్ పోర్టు వైపు వెళ్తున్న గూడ్స్ రైలు హఠాత్తుగా శీర్గాలి సమీపంలో ఆగింది. సరిగ్గా లెవల్ క్రాసింగ్, రైల్వే గేటుకు మధ్యలో రైలును ఆపేసి లోకో పైలెట్ ముత్తురాజ్ కిందకు దిగేశాడు. తన డ్యూటీ సమయం ముగిసి అరగంట అవుతున్నా వేరే లోకో పైలెట్ రాలేదని, ఇక తాను రైలును ముందుకు నడపనంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. అంతేకాకుండా తన బ్యాగ్‌ను సర్దుకుని అక్కడి నుంచి వెళ్లిపోయేందుకు సిద్ధమయ్యాడు. ఎంతకూ రైలు ముందుకు కదలకపోవడం, గేటు తెరుచుకోకపోవడంతో వాహనచోదకుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. రైల్వే గేట్‌మెన్‌ను ప్రశ్నిస్తే అసలు విషయం బయటపడింది. సుమారు గంట పాటు గూడ్స్ రైలు అక్కడే ఆగడంతో శీర్గాలి – పుంగనూరు మార్గంలో ఎక్కడి వాహనాలు అక్కడే ఆగిపోయాయి. సమాచారం అందుకున్న రైల్వే ఉన్నతాధికారులు వైర్లెస్ సెట్ ద్వారా ముత్తురాజ్‌తో మాట్లాడారు. మైలాడుదురై జంక్షన్ వరకు గూడ్స్ నడపాలని కోరడంతో ఎట్టకేలకు ముత్తురాజ్ గూడ్స్‌ను ముందుకు కదిలించాడు. -
పట్టాలు తప్పిన గూడ్స్‌రైలు
శ్రీకాకుళం, కాశీబుగ్గ: పలాస రైల్వేష్టేషన్ పరిధిలో గూడ్సు రైలు పట్టాలు తప్పడంతో ఒక్కసారిగా అధికారులు పరుగులు పెట్టారు. విశాఖపట్నం నుంచి భువనేశ్వర్ వైపు సిమెంట్ లోడుతో వెళ్తున్న గూడ్స్‌రైలు సాంకేతిక లోపంతో పలాస వద్ద కొంచెం వెనక్కి వచ్చింది. దీనిని గమనించి, సిబ్బంది అప్రమత్తం అయ్యేలోపే పట్టా తప్పి, విరిగిపోయింది. ఘటనలో మూడు బోగీలు పట్టాల నుంచి పక్కకు ఒరిగాయి. అయితే ప్రాణ, ఆస్తినష్టం లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. తిరిగి ట్రాక్‌పైకి బోగీలను తీసుకొచ్చే పనుల్లో రైల్వే సిబ్బంది నిమగ్నమయ్యారు. రైల్వే ఇంజినీరింగ్ సిబ్బంది పునరుద్ధరణ చర్యలు చేపట్టారు. పలాస రైల్వే ష్టేషన్ పరిధిలో ఎటా ఎక్కడో ఒకచోట గూడ్సు రైలు పట్టాలు తప్పుతునే ఉన్నాయని, అధికారులు మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని ప్రయాణికులు కోరుతున్నారు.ఇదిలా ఉండగా... పలాస రైల్వేష్టేషన్ పరిధిలో పట్టాలు తప్పిన గూడ్సురైలు ఉదయం నుంచి పనరుద్ధరణ పనులు నిర్వహించగా సాయంత్రానికి రెండు బోగీలు, రాత్రి 7 గంటలకు మరో పెట్టెను పట్టాలెక్కించి పనులు పూర్తి చేశారు. ఈ నేపథ్యంలో పలాస రైల్వేష్టేషన్ మీదుగా రాకపోకలు సాగించాల్సిన పలు రైళ్లు ఆలస్యంగా నడిచాయి. -
సెల్ఫీ పిచ్చి.. హైటెన్షన్ వైర్లు తగిలి యువకుడి మృతి
జంషెడ్ పూర్ : సెల్ఫీసరదా ఓ యువకుడి ప్రాణాలు తీసింది. గూడ్స్ రైలుపై ఎక్కి సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నిస్తుండగా ఓ యువకుడు, మరో బాలుడికి హైటెన్షన్ వైర్లు తాకి షాక్ కొట్టింది. ఈ ఘటనలో ఎండీ ఫైజల్ (20) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, నవేద్ అక్తర్ (11)కు తీవ్రగాయాలయ్యాయి. జంషెడ్‌పూర్‌లోని టాటానగర్ రైల్వే స్టేషన్ సమపంలోని సల్గాజ్ హురిలోఈ ప్రమాదం జరిగింది. ఫైజల్ హైటెన్షన్ వైర్‌కే అతుక్కుపోగా, అక్తర్ షాక్‌కు రైలు నుంచి కిందపడిపోయాడు. గాయపడిన నవేద్ అక్తర్ ను టాటా మెయిన్ ఆస్పత్రికి తరలించారు. గూడ్స్ రైలు నింపురా యార్డు వెళ్లాల్సిన సమయంలో సిగ్నల్ కోసం వేచి చూస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. -
యథేచ్ఛగా ఇసుక రవాణా
రాయగడ : జిల్లాలోని కల్యాణసింగుపురం పట్టణ పరిధిలోని లెల్లిగుమ్మ రైల్వేస్టేషన్ నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్నట్లు వస్తున్న వార్తలు ప్రసుతం జిల్లాలో సంచలనం రేపుతున్నాయి. కోట్లాది రూపాయాలు విలువ చేసే ఇసుకను అనేక బస్తాలలో నింపి, గూడ్స్ రైలులో తరలిస్తున్నారంటూ పలువురు ఆరోపిస్తున్నారు. కొంతమంది రైల్వే అధికారుల అండతోనే దుండగులు ఇసుకమాఫియాకు పాల్పడుతున్నారని స్థానికులు చెబుతున్నారు. దీంతో పాటు రాజకీయ నేతల అండదండలు కూడా తోడవ్వడంతో అక్రమదారుల ఆగడాలు పెచ్చుమీరుతున్నాయి. కల్యాణసింగుపురం పరధిలోని నాగావళి నది, ఇతర చిన్న నదుల నుంచి పొక్లెయిన్ల సహాయంతో పెద్ద ఎత్తున ఇసుకను అక్రమదారులు తరలించడం విశేషం. స్థానిక తహసీల్దార్ అనుమతి లేకుండా ఇసుక తరలించడం చట్ట రీత్యా నేరమని తెలిసినా అక్రమదారులు పట్టించుకోకపోవడం గమనార్హం. ఇదే విషయమై జిల్లా అధికారులకు, స్థానిక తహసీల్దార్‌కు పలుమార్లు ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో రెండు సార్లు కల్యాణసింగుపురం తహసీల్దార్ అక్రమార్కులపై దాడులు చేసి, వేల సంఖ్యలో ఇసుక బస్తాలను స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు మళ్లీ ఇసుక రవాణా పెద్ద ఎత్తున జరుగుతుండడంతో దోపిడీదారులపై అధికారులు చర్యలు తీసుకోకపోవడాన్ని పలువురు విమర్శిస్తున్నారు. నాగావళి నది నుంచి భారీ స్థాయిలో ఇసుకను తరలించడంతో నాగావళి నది వరదలకు గురవుతోందని నదీ పరిసర ప్రాంత ప్రజలు వాపోతున్నారు. దీంతో కల్యాణసింగుపురం పట్టణంలో ఉన్న కోట్లాది రూపాయలు విలువ చేసే ఆస్తులు ధ్వంసమైన విషయం తెలిసిందే. ఇంత జరుగుతున్నా జిల్లా అధికారులు నిర్లక్ష్యం వహిస్తుండడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. -
గూడ్స్ బోగీలో రక్తపు సంచి తీరా చూస్తే..
రైల్వేగేట్: ఓ గూడ్స్ రైలులోని ఖాళీ బోగీలో రక్తం కారుతున్న కట్టు కట్టి ఉన్న ఓ సంచి సిబ్బందికి కనిపించింది. దీంతో వారు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. తీరా దానిని తెరచి చూస్తే చనిపోయిన కుక్క కనిపించింది. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ సంఘనటన ఆదివారం మధ్యాహ్నం వరంగల్ గూడ్స్ షెడ్లోని రైలు బోగీలో జరిగింది. వరంగల్ జీఆర్పీ ఏఎస్సై పరశురాములు కథనం ప్రకారం.. పీడీఎస్ బియ్యం లోడ్ చేసుకుని తీసుకెళ్లేందుకు గద్వాల నుంచి హైదరబాద్ కాచిగూడ, అక్కడి నుంచి వరంగల్‌కు వచ్చిన గూడ్స్‌రైలులోని ఓ ఖాళీ బోగీలో సంచి కనిపించింది. అది కూడా రక్తం కారుతుండడంతో అనుమానం వచ్చిన గూడ్స్ షెడ్ సిబ్బంది స్టేషన్ డిప్యూటీ మేనేజర్‌కు సమాచారం ఇవ్వడంతో అతను జీఆర్పీ పోలీసులకు చెప్పారు. దీంతో సంఘటన స్థలానికి వచ్చిన పోలీసులు సంచిని బయటకు తీయించి విప్పగా అందులో చనిపోయి ఉన్న కుక్క కనిపించింది. దీంతో అక్కడ ఉన్నవారంతా ఊపిరి పీల్చుకున్నారు.. -
పాసింజరా... గూడ్సా?
జయపురం: విశాఖపట్నం నుంచి కిరండూల్ వెళ్లే పాసింజర్ రైలు ప్రయాణికుల కోసమా లేక సరుకులు రవాణా కోసమా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ప్రయాణికులకు భద్రత కల్పించటంలో, రక్షణ ఏర్పరచటంలో రైల్వే విభాగం విఫలమవుతుందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొరాపుట్ జిల్లాకు చెందిన ఒక ప్రయాణికుడు విశాఖపట్నం–కిరండూల్ రైలులో తన అనుభవాన్ని సోషల్ మీడియాలో గురువారం వ్యక్తపరిచాడు. ఆయన విశాఖపట్నం నుంచి విశాఖ–కిరండూల్ రైలులో వస్తుండగా రైలు భోగీలలో సీట్లపై ప్రయాణికులకు బదులు కాయకూరల మూటలు దర్శనమిచ్చాయి. వాటిని తీయమనగా వినేనాథుడులేడు. ఈ విషయం టీటీకి తెలుపగా ఆయన అసలు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం సీట్లపైనే కాదు సీట్ల కింద, నడిచే మార్గంలో కాయకూరల మూటలు వేసి ఉండటంతో ప్రయాణికులు కూర్చొనేందుకు ఇక్కట్లు పడ్డారు. వాటిని తొలగించి ప్రయాణికులకు సౌకర్యం కల్పించేందుకు రైల్వే సిబ్బంది ఎటువంటి చర్యలు తీసుకోవటంలేదని కొంతమంది ఆరోపించారు. అసలు విశాఖపట్నం–కిరండూల్ పాసింజర్ రైలులో ప్రతి దినం ఇదే పరిస్థితి అని కొంతమంది వాపోయారు. అయినా రైల్వే అధికారులు గాని టీటీలు గాని పట్టించుకోరని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. ఈ రైలులో కేవలం కాయకూరల మూటలే కాదని అన్ని వస్తువులను భోగీలలో అడ్డంగా పడవేసి ప్రయాణికులకు అసౌకర్యం కల్గిస్తున్నారని పులువురు వెల్లడించారు. కట్టెలను బోగీల తులుపుల వద్ద ఉంచటం పరిపాటి అని, దీంతో ప్రయాణికులు ఇబ్బందులకు లోనవుతున్నారని కొంతమంది తెలిçపారు. రైల్వే అధికారులు ఈ విషయంలో దృష్టి సారించి ప్రయాణికులకు ఇబ్బంది కలుగకుండా తగు చర్యలు తీసుకోవాలని ముఖ్యంగా భోగీలలో కాయకూరల బస్తాలు, కట్టెల మోపులకు అనుమతించకుండా చూడాలని కోరుతున్నారు. -
మూగ’శోకం
జయపురం: జయపురం సమితి ఉమ్మిరి గ్రామ సమీపంలోని రైలు మార్గంలో గూడ్స్ రైలు ఢీకొనడంతో పది గేదెలు దుర్మరణం చెందాయి. మృతి చెందిన వాటిలో చూడి గేదె కూడా ఒకటి ఉంది. బుధవారం మధ్యాహ్నం గ్రామ సమీపంలో గల రైల్వేట్రాక్‌పై నుంచి 12 గేదెలు వెళ్తుండగా అదే ట్రాక్‌పై వేగంగా వస్తున్న గూడ్స్ రైలు ట్రాక్‌పై నడుస్తున్న గేదెలను ఢీకొట్టి వెళ్లిపోయింది. దీంతో పది గేదెలు సంఘటనాస్థలంలోనే మరణించగా..మరో రెండు గేదెలు ప్రమాదం నుంచి తప్పించుకుని ప్రాణాలతో బయటపడ్డాయి. మరణించిన గేదెలలో ఒకటి చూలుతో ఉంది. చూడి గేదె పొట్టపై నుంచి రైలుచక్రం వెళ్లడంతో పొట్టలో ఉన్న పిల్ల బయటకు వచ్చి దూరంగా పడి మణించింది. దాని పేగులు చిన్నాభిన్నమై చిందరవందరగా పడ్డాయి. హృదయ విదారకమైన ఈ సంఘటన సమాచారం తెలిసిన ఉమ్మిరి గ్రామ ప్రజలు సంఘటనా స్థలానికి వచ్చి చూసి విషయాన్ని రైల్వేపోలీసు అధికారులకు తెలియజేశారు. వారు సంఘటనా స్థలానికి వచ్చి పరిశీలించారు. గేదెల యజమానులు మూగ జీవుల కళేబరాలను చూసి కంటికీమింటికీ ఏకధారగా విలపిస్తున్నారు. -
అమెరికాలో రెండు రైళ్లు ఢీ..
వాషింగ్టన్: అమెరికాలో జరిగిన రైలు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా.. 70 మందికిపైగా గాయాలపాలయ్యారు. ఈ ప్రమాదం తెల్లవారుజామున 2:30 గంటల ప్రాంతంలో (భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం ఒంటిగంట) చోటుచేసుకుంది. 8 మంది సిబ్బంది, 139 మంది ప్రయాణికులతో వెళ్తున్న రైలు, ఎదురుగా వస్తున్న గూడ్స్ రైలును ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. న్యూయార్క్ నుంచి మియామికి ప్యాసింజర్ ట్రెయిన్ వెళుతుండగా దక్షిణ కరోలినా వద్ద ఒక గూడ్స్ రైలును ఢీకొట్టినట్లు అధికారులు తెలిపారు. ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందగా, గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో 5వేల గ్యాలన్ల ఇంధనం లీకయింది. స్థానికులకు దీని ద్వారా ఎలాంటి ప్రమాదం లేదని తెలియడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఒకే ట్రాక్‌పైకి రెండు రైళ్లు ఎలా వచ్చాయన్న దానిపై అధికారులు సమావేశమై చర్చించారు. -
సెల్ఫీకి బలి
అన్నానగర్ (చెన్నై): సెల్ఫీ పిచ్చితో మరో యువకుడు ప్రా ణాలు కోల్పోయిన ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. కోవైకు చెందిన సుజీస్(18) ఓ కాలేజీలో బీకామ్ చదువుతున్నాడు. సెల్ఫీల పిచ్చి ఉన్న సుజీస్ తన స్నేహితులతో కలిసి బైక్‌పై వెళుతుండగా ఓ గూడ్సు రైలు వస్తూ కన్పించింది. దీంతో పట్టాల దగ్గరకు వెళ్లిన సుజీస్, సెల్ఫీలు తీసుకోవడం ప్రారంభించాడు. రైలు సమీపిస్తున్నా పక్కకు వెళ్లకపోవడంతో గూడ్సు రైలు వ్యాగన్ అతని తలను బలంగా ఢీకొట్టింది. తీవ్ర గాయాలపాలైన సుజీస్‌ను స్నేహితులు వెంటనే సమీపంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం కోవై ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే చనిపోయాడు. కాగా, రైలు పట్టాలపై యువత సెల్ఫీలు, విన్యాసాలు లాంటి ప్రమాదకర పనులు చేయవద్దని రైల్వే మంత్రి గోయల్ కోరారు. -
గూడ్స్ రైలు ఢీ.. ముగ్గురి మృతి
కామారెడ్డి : పట్టణంలో దారుణం చోటు చేసుకుంది. రైల్వే స్టేషన్ సమీపంలోని ఈద్గా వద్ద పట్టాలు దాటుతుండగా గూడ్స్ ట్రైన్ ఢీకొని ముగ్గురు చనిపోయారు. మృతులు సంగారెడ్డి జిల్లాకు చెందిన బాలవ్వ, ఆమె మనువడు సవేంద్ర (4), కామారెడ్డి జిల్లా బీక్నూర్‌కు చెందిన నవ్య(19)లు గా గుర్తించారు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. సంక్రాంతి సెలవుల కావడంతో బాలవ్వ మనువడిని సొంత ఊరికి తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. నవ్య కామారెడ్డిలో వశిష్ట కాలేజిలో బీకాం చివరి సంవత్సరం చదువుతుంది. -
పట్టాలు తప్పిన మరో గూడ్స్.. మూడో ఘటన
ముంబయి: మరో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. మహారాష్ట్రలోని ఖాండాలకు సమీపంలో గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో రెండు బోగీలు పక్కకు వెళ్లాయి. గడిచిన కొన్ని గంటల్లోనే ఇది మూడో సంఘటన. ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉంది. అంతకుముందు ఢిల్లీలో ఓ రైలు, ఉత్తర ప్రదేశ్‌లో ఓ రైలు పట్టాలు తప్పిన విషయం తెలిసిందే. తాజాగా జరిగిన ప్రమాదంలో పట్టాలు దెబ్బతిన్నాయి. దీంతో ఆ మార్గాన వచ్చే రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగే అవకాశం ఉంది. సంబంధిత అధికారులు అక్కడి చేరుకొని ఘటన వివరాలు తెలుసుకుంటున్నారు. ఆధారాల పరిశీలన బృందాలు అక్కడి చేరుకొని తనిఖీలు చేస్తున్నాయి. -
రైళ్ల రాకపోకలకు అంతరాయం
ఆలేరు/భువనగిరిఅర్బన్: గూడ్స్ రైలులో ఏర్పడిన సాంకేతిక లోపంతో గురువారం సికింద్రాబాద్– కాజీపేట రైల్వేమార్గంలో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.ఉదయం 8.30 గంటలకు కాజీపేట నుంచి సికింద్రాబాద్ వైపు వెళ్తున్న గూడ్స్ రైలు యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం రాయగిరి రైల్వేస్టేషన్ సమీపంలోకి రాగానే సాంకేతిక సమస్య తలెత్తి పది నిమిషాల పాటు నిలిచిపోయింది. ఇదే సమయంలో కాజీపేట నుంచి సికింద్రాబాద్ వైపు వెళ్తున్న గరీభ్‌రథ్ ఎక్స్‌ప్రెస్ రైల్‌ను జమ్మాపురం, వంగపల్లి ట్రాక్ వద్ద నిలిపివేశారు.అలాగే కాకతీయ ప్యాసింజర్ గంటన్నర, పుష్పుల్ రైలును గంటపాటు ఆలేరు స్టేషన్లో నిలిపివేశారు. గూడ్స్ రైలులో ఏర్పడిన సాంకేతిక లోపాన్ని సరిచేయడంతో యథావిధిగా రైళ్ల రాకపోకలు కొనసాగాయని రైల్వే పోలీసులు తెలిపారు. -
పట్టాలు తప్పిన గూడ్స్..
బిహార్: బిహార్‌లోని గయ వద్ద ఓ గూడ్సు రైలు పట్టాలు తప్పింది. కైమూర్ గయ ముగల్‌సరాయ్ మార్గంలో 14 గూడ్సు వ్యాగన్లు పక్కకు ఒరిగాయి. దీంతో ఆ మార్గంలో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. రైల్వే అధికారులు, సిబ్బంది హుటాహుటిన ఆ ప్రదేశానికి చేరుకుని ట్రాక్ పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటున్నారు. -
పట్టాలు తప్పిన గూడ్సురైలు
నరసన్నపేట: శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం ఉర్లాం రైలు నిలయానికి సమీపంలో గురువారం గూడ్సురైలు పట్టాలు తప్పింది. విశాఖపట్నం నుంచి పలాస వైపు వెళ్తున్న సమయంలో వేరే రైలు వెళ్ళేందుకు నాలుగో నెంబర్ ట్రాక్ లో నిలుపుదల చేశారు. ఇంతలో అటువైపు నుంచి వస్తున్న రైలుకు సిగ్నల్ ఇచ్చారు. గూడ్స్ రైలు డ్రైవర్ తన రైలుకే అనుకొని బండి స్టార్ట్ చేశాడు. దీంతో నాలుగో నెంబరు ట్రాక్ లో ఆగి ఉన్న గూడ్స్... ట్రాక్ డెడ్ ఎండ్ వరకు వెళ్లిపోయింది. ఇక పట్టాలు లేకపోవడంతో ఆగిపోయి ఇంజిన్ గాల్లోకి తేలిపోయింది. ఈ మార్గంలో మిగిలిన రైలు రాకపోకలు యధావిధిగా కొనసాగుతున్నాయి. ఈ సంఘటనపై రైల్వే అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. -
ఇంజన్ లేకుండా 8 కిలోమీటర్లు వెళ్లిన రైలు
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ రాష్ట్రంలో బుధవారం భారీ ప్రమాదం తప్పింది. తనక్‌పూర్ రైల్వే స్టేషన్లో నిలిపి ఉన్న గూడ్స్ రైల్లోకి రాళ్లు లోడ్ చేస్తున్నారు. ఇందుకోసం బోగిల మధ్య ఉండే లాక్‌లను కొద్దిగా లూజ్ చేశారు. లోడింగ్ స్టార్ట్ చేసిన కొద్దిసేపటికే గూడ్స్ రైలు బోగిలు ఒక్కసారిగా కదిలి ముందుకు వెళ్లిపోయాయి. దీంతో రైలులో రాళ్లు లోడ్ చేస్తున్న వారు ఒక్కసారిగా షాక్ తిన్నారు. దాదాపు ఎనిమిది కిలోమీటర్ల పాటు ముందుకు వెళ్లిన బోగీలు పట్టాలపై ఉన్న మేకలను ఢీ కొట్టింది. అంతేకాకుండా ఓ ట్రాక్టర్‌ను కూడా తనతో పాటు లాక్కెళ్లింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ ఘటనపై రైల్వే అధికారులు విచారణకు ఆదేశించారు. -
పట్టాలు తప్పిన గూడ్స్ రైలు
విశాఖపట్నం: విశాఖపట్నం జిల్లాలోని అనంతరగిరి మండలం టైడా సమీపంలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. కిరండోల్-కొత్తవలస రైలు మార్గంలో శుక్రవారం తెల్లవారుజామున కొండచరియలు విరిగిపడటంతో శివలింగాపురం- టైడా స్టేషన్ల మధ్య గూడ్స్ పట్టాలు తప్పింది. ఈ ఘటనతో కేకే లైన్లో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం వాటిల్లుతోంది. రైల్వే అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని కొండచరియలు తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. -
పట్టాలు తప్పిన గూడ్స్ రైలు
కోసిగి: మండల పరిధిలోని ఐరన్‌గల్లు స్టేషన్లో గూడ్స్ రైలు బుధవారం పట్టాలు తప్పింది. రైల్వే అధికారులు తెలిపిన వివరాల మేరకు.. గుంతకల్లు నుంచి కంకర లోడ్‌తో రాయచూర్‌కు వెళ్తున్న గూడ్స్ రైలు.. క్రాసింగ్ ఉండడంతో ఉదయం 7.30కు ఐరన్‌గల్లు రైల్వే స్టేషన్లో నిలిపేశారు. మరో రెండు అదనపు ఇంజన్లు ఉండడంతో వాటిని కూడా గూడ్స్ రైలుకు వెనుకభాగంలో జత చేసి రాయచూర్‌కు పంపించాలని నిర్ణయించారు. ఇంజన్లను గూడ్స్ వెనక భాగంలో రైల్వే గాడ్ పెట్టెకు జత చేసేసమయంలో డ్రైవర్ కాస్త వేగంగా కదిలించడంతో ఇంజన్ గాడ్ పెట్టెను ఢీకొంది. ఈ క్రమంలో గాడ్ పెట్టె చక్రాలు పట్టాల తప్పి కిందకు పడిపోయింది. గూడ్స్ గాడ్, సిబ్బంది కొద్ది దూరంలో ఉండడంతో ప్రమాదం తప్పింది. అనంతరం గుంతకల్లు నుంచి జాకీని తెప్పించి రైలు చక్రాలను పట్టాల పై సరిచేయడంతో గూడ్స్ రైలు యథావిధిగా రాయచూర్‌కు బయలుదేరింది. -
పట్టాలు తప్పిన గూడ్స్ రైలు
షోలాపూర్: మహారాష్ట్రలోని షోలాపూర్ సమీపంలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. దుధని రైల్వే స్టేషన్లో గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో ఐదు బోగీలు పక్కకు ఒరిగాయి. ఈ ఘటన కారణంగా ఆ మార్గంలో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. హోతగి-గుంతకల్లు, వాడి-లాతూర్-మన్మాడ్ మార్గాల్లో 12 రైళ్లను దారి మళ్లించారు. సహాయక చర్యలు చేపట్టినట్లు రైల్వే అధికారులు తెలిపారు. -
కాజీపేట మార్గంలో నిలిచిన రైళ్లు
పెద్దపల్లి: పెద్దపల్లి-కాజీపేట మార్గంలో పలు రైళ్ల రాకపోకలకు బుధవారం ఉదయం అంతరాయం ఏర్పడింది. బోగీల మధ్య లింకు తెగడంతో మానేరు వంతెనపై గూడ్స్ రైలు నిలిచిపోయింది. పోత్కపల్లి-బిజిగిరిషరీఫ్ రైల్వేస్టేసన్ల మధ్య ఈ సంఘటన చోటుచేసుకుంది. రైల్వే సిబ్బంది వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని మరమ్మత్తు పనులు చేపట్టారు. గూడ్సు ఆగిపోవడంతో ఈ మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. -
మొరాయించిన రైలింజన్
- పలు రైళ్లు ఆలస్యం భువనగిరి: యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలో ఇంజన్ మొరాయించడంతో ఓ గూడ్స్ రైలు నిలిచిపోయింది. దీంతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. విజయవాడ నుంచి సికింద్రాబాద్ వెళ్లే శాతవాహన రైలు ఆలస్యంగా నడుస్తోంది. అలాగే కాజీపేట నుండి హైదరాబాద్ వెళ్లే రైళ్లు కూడా ఆలస్యంగా నడుస్తున్నాయి. -
గూడ్స్ రైలులో భారీ అగ్ని ప్రమాదం
వేలూరు: తమిళనాడులోని కాట్పాడి సమీపంలో గూడ్స్ రైలులో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. చెన్నై తురై ముగం నుంచి సేలం మోటూరులోని థర్మల్ పవర్ ప్రాజెక్టుకు బొగ్గును సరఫరా చేసేందుకు ఈ గూడ్స్ రైలు బయలుదేరింది. గురువారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో కాట్పాడి సమీపంలోని సేవూరు వద్ద రైలు నుంచి మంటలు చెలరేగాయి. మొత్తం 13 బోగీలు కూడా మంటల్లో చిక్కుకున్నాయి. అప్రమత్తమైన డ్రైవర్ రైలును నిలిపివేసి అధికారులకు సమాచారం అందజేశాడు. విషయం తెలుసుకున్న కాట్పాడి రైల్వే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని అదుపు చేసేందుకు ప్రయత్నం చేశారు. మంటలు వ్యాపించటంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు వ్యాపించాయి. సాయంత్రం 5 గంటల సమయానికి కూడా మంటలు అదుపులోకి రాలేదు. గూడ్స్ రైలులో మంటలకు కారణమేమిటనే విషయంపై అధికారులు విచారణ చేస్తున్నారు. -
సెల్ఫీ సరదా.. ఎంత పని చేసింది!
ఆయిల్ ట్యాంకర్‌పైకి ఎక్కి ఫొటో తీయించుకోబోయి విద్యుత్ షాక్‌కు గురైన వైనం తీవ్రగాయాల పాలైన గీతం వర్సిటీ విద్యార్థి అరకులోయ: ఫొటో సరదా..ఆ విద్యార్థి ప్రాణం మీదకు తెచ్చింది. ఆగి ఉన్న గూడ్స్ ఆయిల్ ట్యాంకర్ పైకి ఎక్కి ఫొటో తీయించుకోవాలన్న కోరిక అతడిని తీవ్ర గాయాలపాలయ్యేలా చేసింది. ఆటవిడుపు కోసం నలుగురు స్నేహితులతో అరుకులోయకు వచ్చిన హెండ్రీ జోన్స్ (20) సోమవారం ఉదయం అరకు రైల్వేస్టేషన్ సమీపంలో ఆగి ఉన్న గూడ్స్ రైలు పైకెక్కి ఫొటో తీయించుకోవాలనుకున్నాడు. గార్డు బోగీ పక్క ఉన్న గూడ్స్ ఆయిల్ ట్యాంకర్ పైకి ఎక్కి ఫొటో తీసుకోవడానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో పైన ఉన్న విద్యుత్ తీగలు తగలడంతో కింద పడిపోయాడు. స్పృహ కోల్పోయిన అతడిని చూసి చనిపోయాడనుకొని అక్కడకు వెళ్లడానికి ఎవరూ సాహసించలేకపోయారు. విషయం తెలుసుకున్న రైల్వే సిబ్బంది అతడిని పరిశీలించగా ఊపిరితో ఉండటాన్ని గుర్తించి అరుకులోయ ఏరియా ఆస్పత్రికి తరలించి ప్రథమ చికిత్స చేశారు. అనంతరం విశాఖలోని కింగ్‌జార్జ్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం జోన్స్ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. కాగా, క్షతగాత్రుడు జోన్స్ విశాఖలోని మద్దిలపాలెం నివాసి. గీతం వర్సిటీలో బీటెక్ మెకానికల్ బ్రాంచిలో మూడో సంవత్సరం చదువుతున్నాడు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం
♦ మహారాష్ట్రలో గూడ్స్ బోల్తాతో సమస్య ♦ కేరళ, తమిళనాడు, జీటీ నిరవధిక ఆలస్యం ♦ అయ్యప్ప మాలధారులు, ప్రయాణికుల అవస్థలు విజయవాడ(రైల్వేస్టేషన్) : రైళ్ల రాకపోకలు ఆలస్యం కావడంతో ప్రయాణికులతో పాటు అయ్యప్ప మాలధారులు శనివారం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మహారాష్ట్రలోని వీర్‌గావ్ స్టేషన్ వద్ద గూడ్స్ రైలు బోల్తా పడడంతో అటు నుంచి వచ్చే పలు రైళ్లు 20 గంటలకు పైగా ఆలస్యంగా నడుస్తున్నాయి. బల్లార్షా మార్గం మీదుగా వచ్చే పలు రైళ్లు శుక్రవారం 20 గంటలకు పైగా ఆలస్యంగా నడుస్తున్నారుు. శుక్రవారం రావాల్సిన తిరువనంతపురం వెళ్లే కేరళ ఎక్స్‌ప్రెస్ 25 గంటలపైగా ఆలస్యంగా శనివారం రాత్రికి వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. బెంగళూరు వైపు సంఘమిత్ర, చెన్నై వెళ్లే గ్రాండ్ ట్రంక్(జీటీ), నవజీవన్ తదితర రైళ్లు నిరవధిక ఆలస్యంగా నడుస్తున్నాయి. ప్రయాణికుల అవస్థలు.. శబరిమల వెళ్లే మాలధారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆహారం, తాగునీరుని అధిక ధరలు వెచ్చించి కొనుగోలు చేయాల్సి వస్తోందని వాపోతున్నారు. రైళ్ల రాకపోకలపై విచారణలో సరిైయెున సమాధానం ఇవ్వడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. 24 గంటలుగా ఇబ్బందులు తిరువనంతపురం వెళ్లే కేరళ ఎక్స్‌ప్రెస్ 25 గంటలకు పైగా ఆలస్యంగా నడుస్తుండడంతో తీవ్ర ఇబ్బందిగా ఉంది. రైలు కోసం శుక్రవారం మధ్యాహ్నం స్టేషన్‌కు వచ్చాం. ఇప్పటి వరకు రైలు రాలేదు. విచారణ కేంద్రాల వద్ద సరైన సమాచారం రావడం లేదు. రైళ్లు వచ్చే వరకు తగిన వసతులు కల్పించాలి. -రాజు. అయ్యప్ప మాలధారుడు -
పట్టాలు తప్పిన గూడ్స్ రైలు
♦ వీర్గాం సమీపంలో ఘటన ♦ రైళ్ల రాకపోకలకు అంతరాయం కాగజ్‌నగర్/రామగుండం/కాజీపేట: ఆసి ఫాబాద్ జిల్లాలోని కాగజ్‌నగర్ రైల్వే స్టేషన్‌కు సరిహద్దులో ఉన్న మహారాష్ట్రలోని వీర్గాం–మాణిక్‌గఢ్ రైల్వేస్టేషన్ల మధ్య శుక్రవారం రాత్రి 1.20 గంటలకు ఓ గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. బొగ్గు లోడ్‌తో కాగజ్‌నగర్ నుండి బల్లార్షా రూట్లో వెళ్తున్న ఈ రైలుకు సంబంధించిన 16 బోగీలు పట్టాలు తప్పడంతో న్యూ ఢిల్లీ–చెన్నై ప్రధాన రైల్వేలైన్‌లో ఉన్న కాగజ్‌నగర్–బల్లర్షా రైల్వే స్టేషన్ల మీదుగా వెళ్లాల్సిన పలు రైళ్లను రద్దు చేశారు. సమాచారం అందుకున్న రైల్వే శాఖ అధికారులు బోగీలను తొలగించేందుకు సహా యక చర్యలను ముమ్మరం చేశారు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో అక్కడి నుండి ఎక్స్‌ప్రెస్, ప్యాసింజర్ రైళ్లు రాకపో వడంతో పెద్ద ప్రమాదం తప్పిందని భావిసు ్తన్నారు. ఈ ప్రమాదం నేపథ్యంలో హైదరా బాద్–న్యూఢిల్లీ (తెలంగాణ ఎక్స్‌ప్రెస్)ను రద్దు చేశారు. శనివారం న్యూఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు వచ్చే తెలంగాణ ఎక్స్‌ప్రెస్ సైతం రద్దు చేశారు. సికింద్రాబాద్–బల్లార్షా (భాగ్యనగర్) ఎక్స్‌ప్రెస్ రైలు అప్–డౌన్ రెండు వైపుల రద్దు చేశారు. యశ్వంత పూర్–గోరఖ్‌పూర్, సికింద్రాబాద్– గోరఖ్ పూర్, బెంగళూరు–హజ్రత్ నిజాముద్దీన్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను వయా నిజామాబాద్, ముధ్కేడ్, ఆదిలాబాద్, పింపల్‌కుట్టి మీదుగా దారి మళ్లించారు. సికింద్రాబాద్–దాణాపూర్ ఎక్స్‌ప్రెస్ రైలును వయా విజయవాడ, వాడీ, షోలాపూర్ మీదుగా దారి మళ్లించారు. త్రివేండ్రం– న్యూఢిల్లీ (కేరళ) ఎక్స్‌ప్రెస్ రైలు ను వయా అరక్కోణం, రేణిగుంట, గుంత కల్, వాడీ, షోలాపూర్ మీదుగా మళ్లించారు. చెన్నై సెంట్రల్ – హజ్రత్ నిజాముద్దీన్ (తమిళనాడు), త్రివేండ్రం సెంట్రల్–కోర్భా (కోర్భా) ఎక్స్‌ప్రెస్ రైళ్లను వయా విజయ వాడ, దువ్వాడ మీదుగా మళ్లించారు. మదురై–దుర్గాపుర (జైపూర్)ఎక్స్‌ప్రెస్, వైజాగ్–న్యూఢిల్లీ (ఏపీ ఏసీ ఎక్స్ ప్రెస్), వైజాగ్–హజ్రత్ నిజాముద్దీన్ (దక్షిణ్) ఎక్స్ ప్రెస్ రైళ్ళను ఈస్ట్‌కోస్ట్ రూట్ మీదుగా మళ్లిం చారు. 0870–2576226, రైల్వే ఫోన్ నంబర్ 82660లలో ప్రయాణికులు రైళ్ల వివరాలను తెలుసుకోవచ్చని సూచించారు. -
గూడ్స్ బండి పట్టాలు తప్పి..