గుంతకల్లు(అనంతపురం): అనంతపురం జిల్లా గుంతకల్లులో గురువారం ఉదయం ఒక గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. రైలుకు చెందిన ఏడు బోగీలు పట్టాలకు రెండువైపులా అటూఇటూ పడిపోవటంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రైల్వే డీఆర్‌ఎం జోషి సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. అనంతరం రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడకుండా యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరణ చర్యలు చేపట్టారు.