derailment
-
ట్రాక్‌పై సిమెంట్ దిమ్మలు.. మరో రైలుకు తప్పిన ప్రమాదం
జైపూర్: రాజస్థాన్‌లోని అజ్మీర్‌లో గూడ్స్ రైలును పట్టాలు తప్పించేందుకు దుండగులు ప్రయత్నించారు. ఆదివారం(సెప్టెంబర్8) జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ట్రాక్‌పై ఏకంగా రెండు భారీ సిమెంట్ దిమ్మలను ఉంచారు. ఈ సిమెంట్ దిమ్మలు ఒక్కోటి 70 కిలోల బరువున్నవి కావడం గమనార్హం.రైలు ఎప్పటిలానే ఆ రూట్లో వచ్చింది. సిమెంట్ దిమ్మలను ఢీకొట్టింది. అయినా రైలు పట్టాలు తప్పకుండా వెళ్లడంతో ప్రమాదం తప్పింది. ఈ ఘటనకు సంబంధించి రైల్వే అధికారులు కేసు పెట్టారు. సిమెంట్ దిమ్మలు ట్రాక్ మీద ఉన్నట్లు సమాచారం అందిన వెంటనే సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. అప్పటికే రైలు ఢీకొని ఒక సిమెంట్ దిమ్మ పగిలిపోగా మరొకటి ట్రాక్‌పైనే కొంత దూరం జరిగి ఉంది.ఈ కేసులో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, యూపీ కాన్పూర్‌లోని అన్వర్గంజ్-కాస్గంజ్ మార్గంలో కాళింది ఎక్స్‌ప్రెస్‌ను పట్టాలు తప్పించేందుకు సిలిండర్ ఉంచిన ఘటన తాజాగా సంచలనం సృష్టించింది. ఈ వ్యవహారంపై ఎన్ఐఏ దర్యాప్తు కొనసాగుతోంది. ఇదీ చదవండి: రైలు పట్టాలపై సిలిండర్..ఉగ్రవాదుల పనేనా..? -
పట్టాలు తప్పిన నార్త్ ఈస్ట్ ఎక్స్‌ప్రెస్ కోచ్‌లు.. ఐదుగురి మృతి!
బక్సర్: నార్త్ ఈస్ట్ ఎక్స్‌ప్రెస్ కోచ్‌లు బిహార్‌లోని బక్సర్ జిల్లా రఘునాథ్‌పూర్ రైల్వేస్టేషన్ సమీపంలో పట్టాలు తప్పాయి. ఈ రైలు ఢిల్లీ నుంచి అస్సాంకు బయలుదేరింది. బుధవారం రాత్రి 9.35 గంటలకు కొన్ని కోచ్‌లు పట్టాలు తప్పినట్లు రైల్వే అధికారులు చెప్పారు. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందినట్లు సమాచారం. 100 మందికిపైగా ప్రయాణికులు గాయపడినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న వెంటనే అధికారులు రంగంలోకి దిగారు. సహాయక చర్యలు ప్రారంభించారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. రైలు కోచ్‌లు పట్టాలు తప్పడం వెనుక కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. -
లోకోపైలట్ నిర్వాకం..రైలును ప్లాట్ఫారం ఎక్కించేశాడు..
లక్నో: ఉత్తర్‌ప్రదేశ్‌లోని మథుర రైల్వే స్టేషన్లో ఓ లోకో పైలట్ వీడియో కాల్ మాట్లాడుతూ నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఆగిన రైలు కాస్తా ప్లాట్‌ఫారంపైకి ఎక్కి కరెంటు స్తంభాన్ని ఢీకొట్టింది. ప్రమాదంలో ఒక మహిళ విద్యుదాఘాతానికి గురయ్యారు. దీనికి సంబంధించిన వీడియో కూడా బయటపడగా అందులో లోకోపైలట్ భాగోతం బయటపడింది. వీడియోలో ఢిల్లీ షకుర్ బస్తీ నుంచి వచ్చిన ఎలెక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్(ఈఎంయూ) రైలు మధుర జంక్షన్ స్టేషన్‌కు చేరుకోగానే అప్పటివరకు విధులు నిర్వహించిన లోకోపైలట్ రైలు ఆగిన తర్వాత కిందకు దిగాడు. అంతలో మరో లోకో పైలట్ సచిన్ విధులు నిర్వహించేందుకు ఫోన్లో వీడియో కాల్ మాట్లాడుతో రైలులోకి ఎక్కాడు. వీడియో కాల్లో బిజీగా ఉన్న సచిన్ భుజానికున్న బ్యాగును తీసి ఇంజిన్ రాడ్ పైన పెట్టాడు. ఆ బరువుకు ఇంజిన్ హ్యాండిల్ ముందుకు కదలడంతో రైలు ముందుకు కదిలింది. मथुरा ट्रेन हादसे के समय मोबाइल देख रहा था ड्राइवर। CCTV से ट्रेन के प्लेटफॉर्म पर चढ़ने का राज खुला। इसका वीडियो सोशल मीडिया पर वायरल हो रहा है। #MathuraJunction #TrainAccident #CCTV pic.twitter.com/muia6Zu2Gi — FirstBiharJharkhand (@firstbiharnews) September 28, 2023 ఇది గమనించకుండా సచిన్ వీడియో కాల్లో బిజీగా ఉన్నాడు. చూస్తుండగానే రైలు ప్లాట్‌ఫారంపైకి ఎక్కి ఎదురుగా ఉన్న కరెంటు స్తంభాన్ని బలంగా ఢీకొట్టింది. ప్రమాదంలో ఒక మహిళా మాత్రం విద్యుదాఅఘాతానికి గురవడంతో ఆమెను ఆసుపత్రికి తరలించారు. అప్పటికే రైలులోని ప్రయాణికులంతా రైలు దిగిపోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందంటున్నారు అక్కడి వారు. దీని కారణంగా మాల్వా సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, అమృత్సర్-బాంద్రా ఎక్స్‌ప్రెస్, దక్షిణ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు అంతరాయం కలిగింది. వెంటనే స్పందించిన రైల్వే యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరించిన సచిన్ తోపాటు మరో నలుగురిని కూడా సస్పెండ్ చేసింది. यूपी के मथुरा में एक अजीबोगरीब हादसे में मथुरा जंक्शन रेलवे स्टेशन पर एक लोकल ट्रेन प्लेटफॉर्म से टकरा गई. किसी के हताहत होने की सूचना नहीं है.#Mathura #MathuraJunction pic.twitter.com/ODdtgKinUl — iMayankofficial 🇮🇳 (@imayankindian) September 26, 2023 ఇది కూడా చదవండి: పాముకాటుతో అటెండర్ మానస మృతి -
రాజధాని ఎక్స్‌ప్రెస్ నుంచి దురంతో వరకూ...
న్యూఢిల్లీః రైలెక్కితే గమ్యస్ధానానికి క్షేమంగా చేరుకుంటామో..లేదోనని ప్రయాణీకులు బిక్కుబిక్కుమని గడపాల్సిన పరిస్థితి. రైళ్లు ఢీకొనడం, లెవెల్ క్రాసింగ్‌ల వద్ద ప్రమాదం, పట్టాలు తప్పడం..ఇలా ఏ రూపంలో ఎలాంటి ఉపద్రవం ముంచుకొస్తుందోననే ఆందోళన సగటు జీవిని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. 2015-16లో జరిగిన రైలు ప్రమాదాల్లో అత్యధికంగా 60 శాతం ప్రమాదాలు రైళ్లు పట్టాలు తప్పడం వల్ల కాగా, 33 శాతం లెవెల్ క్రాసింగ్ ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. భారత రైల్వేలో భద్రత అతిపెద్ద సవాల్‌గా ముందుకొస్తున్నది. గత కొన్నేళ్లుగా మొత్తం రైలు ప్రమాదాల సంఖ్య కొద్దిగా తగ్గినా..వాటి సంఖ్య మాత్రం 100 పైనే ఉంది. మంగళవారం ఉదయం చోటుచేసుకున్న దురంతో ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పిన ఘటన సహా రైలు ప్రమాదాల నేపథ్యంలో రైల్వే భద్రతకు ఎదురువుతున్న సవాళ్లు ఆందోళనకు గురిచేసేవే.... రైళ్లు పట్టాలు తప్పడం.. దేశంలో చోటుచేసుకుంటున్న రైలు ప్రమాదాల్లో సింహభాగం రైలు పట్టాలు తప్పడం వల్లనే జరుగుతున్నాయి. ఉత్తరాదిలో ఇటీవల చోటుచేసుకున్న ఘోర రైలు ప్రమాదాలకు కూడా ఇదే కారణమని భావిస్తున్నారు. మొత్తం లక్షా14వేల997 కిమీ రైల్వే ట్రాక్‌లో ఏటా 4500 కిమీ మేర ట్రాక్‌ను పునరుద్ధరించాలి. అయితే 2015-16లో 5000 కిమీ ట్రాక్‌ను పునరుద్ధరించాల్సి ఉండగా కేవలం 2700 కిమీ ట్రాక్‌లోనే పునరుద్ధరణ పనులు జరపాలని నిర్ధేశించారు. మరోవైపు పట్టాలు తప్పిన సందర్భాల్లో కోచ్‌లు ఒకదానిపై ఒకటి పడకుండా ఉండేందుకు లింకే హాఫ్మాన్ కోచ్‌లను ఏర్పాటు చేయాలని స్టాండింగ్ కమిటీ సిఫార్సు అమలుకు నోచుకోలేదు. కాపలా లేని లెవెల్ క్రాసింగ్‌లు రైలు ప్రమాదాల్లో ఎక్కువ ప్రాణనష్టాలకు కాపలా లేని లెవెల్ క్రాసింగ్‌లు ఇప్పటికీ కారణమవుతున్నాయి. దేశవ్యాప్తంగా రైల్వే నెట్‌వర్క్‌లో ఇప్పటికీ 14,440 కాపలాలేని లెవెల్ క్రాసింగ్‌లున్నాయి. 2014-15లో 40 శాతం రైలు ప్రమాదాలు ఇక్కడే చోటుచేసుకున్నాయి. 2015-16లో వీటి సంఖ్య 28 శాతంగా నమోదైంది. కాపలాలేని లెవెల్ క్రాసింగ్లను తొలగించాలని రైల్వే మంత్రిత్వ శాఖ లక్ష్యాలు కార్యాచరణకు నోచుకోలేదు. కాపలా లేని లెవెల్ క్రాసింగ్‌ల వద్ద రైళ్లు వచ్చే సమయంలో రోడ్డుపై వెళ్లేవారిని అప్రమత్తం చేసేలా ఆడియో,విజువల్ సిగ్నల్స్ ఏర్పాటు చేయాలని స్టాండింగ్ కమిటీ చేసిన సూచనను పరిగణనలోకి తీసుకోలేదు. రైల్వే సిబ్బంది వైఫల్యంతో.... రైల్వేల్లో భద్రతను సమీక్షిస్తూ రైలు ప్రమాదాల్లో యాభై శాతం పైగా సిబ్బంది వైఫల్యాల వల్లే సంభవిస్తున్నాయని స్టాండింగ్ కమిటీ నిగ్గుతేల్చింది. పనిపట్ల నిర్లక్ష్యం కనబరచడం, పేలవమైన మెయింటెనెన్స్ వర్క్, భద్రతా నిబంధలను గాలికొదిలేయడం వంటి కారణాలను కమిటీ ఎత్తిచూపింది. ప్రమాదాలను నియంత్రించేందుకు రైల్వే సిబ్బందికి విభాగాల వారీగా వర్క్‌షాపులు నిర్వహించాలని సూచించింది. ఇక లోకో పైలట్లు ( ట్రైన్ ఆపరేటర్లు)చేసే సిగ్నలింగ్ పొరపాట్ల వల్ల కూడా ప్రమాదాలు జరుగుతున్నాయని పేర్కొంది. లోకో పైలట్ల విధినిర్వహణలో సమర్ధంగా పనిచేసేందుకు అవసరమైన సాంకేతిక మద్దతు కొరవడింది. వీరు సమయానికి మించి పనిచేయాల్సి రావడంతో లోకో పైలట్లపై పనిభారం, ఒత్తిడి వేలాది ప్రయాణీకుల ప్రాణాలను రిస్క్‌లో పడవేస్తున్నది.లోకోపైలట్లకు మెరుగైన వైద్య వసతులు, పని పరిస్థితులను కల్పించాలని స్టాండింగ్ కమిటీ సిఫార్సు చేసింది. నిధుల లేమితో భద్రతకు గండి రైల్వేలు భద్రతపై భారీ మొత్తం వెచ్చించాల్సిన క్రమంలోనిధుల సమస్య ప్రధాన అవాంతరంగా ముందుకొస్తున్నదని పలు కమిటీల నివేదికలు స్పష్టం చేశాయి. భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరాన్ని రైల్వేలపై స్టాండింగ్ కమిటీ సహా అనిల్ కకోద్కర్ కమిటీ సైతం నొక్కిచెప్పింది. కకోద్కర్ కమిటీ 2012-17 వరుకూ రైల్వేలు భద్రతపై రూ లక్ష కోట్లు వెచ్చించాలని పేర్కొంది. మొత్తంమీద గత కొన్నేళ్లుగా రైలు ప్రమాదాలు గణనీయంగా తగ్గినా వాటి సంఖ్య 100కు పైగానే ఉండటం రైల్వే అధికారులు, పాలనా యంత్రాగం, ప్రయాణీకులను కలవరపరుస్తున్నది. -
పట్టాలు తప్పిన గూడ్స్ రైలు..
-
పట్టాలు తప్పిన గూడ్సు రైలు
నిజామాబాద్‌సిటీ: నిజామాబాద్ జిల్లాకేంద్రంలోని రైల్వే బ్రిడ్జి వద్ద గూడ్సు రైలు పట్టాలు తప్పింది. గూడ్సు రైలు చివరి బోగీ పట్టాలు తప్పి పక్కకు ఒరిగిపోయింది. గూడ్సు రైలు ఇంజన్ సరిగ్గా బ్రిడ్జిపై నిలిచిపోయింది. కింద రోడ్డుపై బోగీ పడి ఉంటే పెను ప్రమాదమే జరిగి ఉండేది. ప్రమాద సమాచారాన్ని రైలు డ్రైవర్ అధికారులకు చేరవేశాడు. -
పట్టాలు తప్పిన గూడ్స్ రైలు
గుంతకల్లు(అనంతపురం): అనంతపురం జిల్లా గుంతకల్లులో గురువారం ఉదయం ఒక గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. రైలుకు చెందిన ఏడు బోగీలు పట్టాలకు రెండువైపులా అటూఇటూ పడిపోవటంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రైల్వే డీఆర్ఎం జోషి సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. అనంతరం రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడకుండా యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరణ చర్యలు చేపట్టారు. -
పట్టాలు తప్పిన రైలు.. ఐదుగురి మృతి
మహారాష్ట్రలోని నాసిక్ సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున రైలు ప్రమాదం జరిగింది. నాసిక్‌కు దగ్గరలో ఉన్న ఘోటి అనే ప్రాంతం వద్ద మంగళ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పింది. ఆరు బోగీలు పట్టాలు తప్పినట్లు తెలుస్తోంది. కేరళలోని ఎర్నాకులం నుంచి హజ్రత్ నిజాముద్దీన్ వెళ్తున్న ఈ రైలు పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మరణించగా సుమారు 50 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్సలు అందిస్తున్నారు. రైలు ఎందుకు పట్టాలు తప్పిందన్న విషయం ఇంకా తెలియరాలేదు. మరిన్ని వివరాలు ఇంకా అందాల్సి ఉంది.