ట్రాక్‌పై సిమెంట్‌ దిమ్మలు.. మరో రైలుకు తప్పిన ప్రమాదం | Second Train Derailment Bid In Rajasthans Ajmer, Cement Blocks Found On Track In Ajmer | Sakshi
Sakshi News home page

ట్రాక్‌పై సిమెంట్‌ దిమ్మలు.. మరో రైలుకు తప్పిన ప్రమాదం

Published Tue, Sep 10 2024 11:00 AM | Last Updated on Tue, Sep 10 2024 1:51 PM

Train Derailment Bid In Rajasthans Ajmer

photo credit: INDIATV

జైపూర్‌: రాజస్థాన్‌లోని అజ్మీర్‌లో గూడ్స్‌ రైలును పట్టాలు తప్పించేందుకు దుండగులు ప్రయత్నించారు. ఆదివారం(సెప్టెంబర్‌8) జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.  ట్రాక్‌పై ఏకంగా రెండు భారీ సిమెంట్‌ దిమ్మలను ఉంచారు. ఈ సిమెంట్‌ దిమ్మలు ఒక్కోటి 70 కిలోల బరువున్నవి కావడం గమనార్హం.రైలు ఎప్పటిలానే ఆ రూట్‌లో వచ్చింది. 

సిమెంట్‌ దిమ్మలను ఢీకొట్టింది. అయినా రైలు పట్టాలు తప్పకుండా వెళ్లడంతో ప్రమాదం తప్పింది. ఈ ఘటనకు సంబంధించి రైల్వే అధికారులు కేసు పెట్టారు. సిమెంట్‌ దిమ్మలు ట్రాక్‌ మీద ఉన్నట్లు సమాచారం అందిన వెంటనే సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. అప్పటికే రైలు ఢీకొని ఒక సిమెంట్‌ దిమ్మ పగిలిపోగా మరొకటి ట్రాక్‌పైనే కొంత దూరం జరిగి ఉంది.

ఈ కేసులో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, యూపీ కాన్పూర్‌లోని అన్వర్‌గంజ్-కాస్‌గంజ్ మార్గంలో కాళింది ఎక్స్‌ప్రెస్‌ను పట్టాలు తప్పించేందుకు సిలిండర్‌ ఉంచిన ఘటన తాజాగా సంచలనం సృష్టించింది. ఈ వ్యవహారంపై ఎన్‌ఐఏ దర్యాప్తు కొనసాగుతోంది. 

ఇదీ చదవండి: రైలు పట్టాలపై సిలిండర్‌..ఉగ్రవాదుల పనేనా..?

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement