Ajmer
-
ట్రాక్‌పై సిమెంట్ దిమ్మలు.. మరో రైలుకు తప్పిన ప్రమాదం
జైపూర్: రాజస్థాన్‌లోని అజ్మీర్‌లో గూడ్స్ రైలును పట్టాలు తప్పించేందుకు దుండగులు ప్రయత్నించారు. ఆదివారం(సెప్టెంబర్8) జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ట్రాక్‌పై ఏకంగా రెండు భారీ సిమెంట్ దిమ్మలను ఉంచారు. ఈ సిమెంట్ దిమ్మలు ఒక్కోటి 70 కిలోల బరువున్నవి కావడం గమనార్హం.రైలు ఎప్పటిలానే ఆ రూట్లో వచ్చింది. సిమెంట్ దిమ్మలను ఢీకొట్టింది. అయినా రైలు పట్టాలు తప్పకుండా వెళ్లడంతో ప్రమాదం తప్పింది. ఈ ఘటనకు సంబంధించి రైల్వే అధికారులు కేసు పెట్టారు. సిమెంట్ దిమ్మలు ట్రాక్ మీద ఉన్నట్లు సమాచారం అందిన వెంటనే సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. అప్పటికే రైలు ఢీకొని ఒక సిమెంట్ దిమ్మ పగిలిపోగా మరొకటి ట్రాక్‌పైనే కొంత దూరం జరిగి ఉంది.ఈ కేసులో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, యూపీ కాన్పూర్‌లోని అన్వర్గంజ్-కాస్గంజ్ మార్గంలో కాళింది ఎక్స్‌ప్రెస్‌ను పట్టాలు తప్పించేందుకు సిలిండర్ ఉంచిన ఘటన తాజాగా సంచలనం సృష్టించింది. ఈ వ్యవహారంపై ఎన్ఐఏ దర్యాప్తు కొనసాగుతోంది. ఇదీ చదవండి: రైలు పట్టాలపై సిలిండర్..ఉగ్రవాదుల పనేనా..? -
నూపుర్ శర్మ వ్యతిరేక నినాదాల కేసులో నిందితులకు ఊరట
జైపూర్: బీజేపీ సస్పెండెడ్ నేత నూపుర్ శర్మపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో నిందితులకు ఊరట లభించింది. మొయినుద్దీన్ చిష్తీ దర్గా(రాజస్థాన్) పెద్దతో పాటు మరో ఆరుగురిని మంగళవారం నిర్దోషులుగా ప్రకటించింది అజ్మీర్ కోర్టు. రెండేళ్ల కిందట.. మహమ్మద్ ప్రవక్తపై నూపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆమెపై పలు రాష్ట్రాల్లో కేసులు కూడా నమోదు అయ్యాయి. అయితే.. మరోవైపు ఆమెకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలోనూ ఇస్లాం గ్రూపులు విరుచుకుపడ్డాయి. ఈ క్రమంలో.. మొయినుద్దీన్ చిష్తీ దర్గా నిర్వాహకుడు ఖాదీమ్ గౌహర్ చిస్తీ, మరో ఆరుగురు కలిసి నూపుర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆమెకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి అప్పట్లో వైరల్ కూడా అయ్యింది. దీంతో.. అజ్మీర్ షరీఫ్ దర్గా ఖాదీమ్ గౌహర్ చిస్తీతో పాటు మరో ఆరుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన తర్వాత పరారీలో ఉన్న గౌహర్ చిస్తీని పోలీసులు జూలై 14, 2022న హైదరాబాద్‌లో అరెస్ట్ చేశారు. తాజాగా ఈ కేసులో అందరినీ కోర్టు నిర్దోషులుగా పేర్కొంటూ విడుదలకు ఆదేశాలిచ్చింది. -
దేశ మనోభావాలను కించపర్చారు
అజ్మీర్: పార్లమెంట్ నూతన భవన ప్రారంభోత్సవాన్ని బహిష్కరించిన ప్రతిపక్ష కాంగ్రెస్‌పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మండిపడ్డారు. దేశ మనోభావాలను కాంగ్రెస్ కించపర్చిందని, 60,000 మంది కార్మికుల కఠోర శ్రమను అగౌరవపర్చిందని ధ్వజమెత్తారు. రాజస్తాన్‌లోని అజ్మీర్‌లో బుధవారం ఓ ర్యాలీలో మోదీ ప్రసంగించారు. కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వానికి తొమ్మిదేళ్లు పూర్తయిన నేపథ్యంలో ఈ ర్యాలీ నిర్వహించారు. మూడు రోజుల క్రితం పార్లమెంట్ కొత్త భవనం ప్రారంభించుకున్నామని, ప్రజలంతా గర్విస్తున్నారని, దేశ ప్రతిష్ట మరింత పెరగడంతో వారంతా సంతోషిస్తున్నారని మోదీ తెలిపారు. అన్నింటిలోనూ బురదజల్లే రాజకీయాలు చేసే కాంగ్రెస్, ఇతర పార్టీలు పార్లమెంట్ కొత్త భవనం విషయంలోనూ అదే పని చేస్తున్నాయని విమర్శించారు. పార్లమెంట్ కొత్త భవవాన్ని ప్రారంభించుకొనే అవకాశం కొన్ని తరాలకు ఒకసారి మాత్రమే వస్తుందని, కాంగ్రెస్ దాన్ని ‘స్వార్థపూరిత నిరసన’ కోసం వాడుకుందని ఆరోపించారు. మన దేశం సాధిస్తున్న ప్రగతిని కాంగ్రెస్ జీర్ణించుకోలేకపోతోందని వ్యాఖ్యానించారు. వారి అవినీతిని, కుటుంబ వారసత్వ రాజకీయాలను తాము ప్రశ్నిస్తున్నామని, అందుకే తమపై కోపంగా ఉన్నారని పరోక్షంగా సోనియా గాంధీ కుటుంబంపై విమర్శలు ఎక్కుపెట్టారు. వారి ఆరాచకాలను ఒక ‘నిరుపేద బిడ్డ’ సాగనివ్వడం లేదని, అది వారు తట్టుకోలేకపోతున్నారని ఆక్షేపించారు. కాంగ్రెస్ పాలనలో అవినీతి వ్యవస్థ ‘‘పేదరికాన్ని సమూలంగా నిర్మూలిస్తామని 55 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ హామీ ఇచ్చింది. కానీ, పేదలను దగా చేసింది. పేదలను తప్పుదోవ పట్టించడం, వారిని ఎప్పటికీ పేదలుగానే ఉంచడం కాంగ్రెస్ విధానం. కాంగ్రెస్ పాలనలో రాజస్తాన్ ప్రజలు ఎంతగానో నష్టపోయారు. తొమ్మిదేళ్ల బీజేపీ ప్రభుత్వాన్ని ప్రజాసేవకు, సుపరిపాలనకు, నిరుపేదల సంక్షేమానికి అంకితం చేస్తున్నాం. 2014కు ముందు దేశంలో అవినీతికి వ్యతిరేకంగా ప్రజలు వీధుల్లోకి వచ్చేవారు. నగరాల్లో ఉగ్రవాద దాడులు జరిగేవి. అప్పట్లో రిమోట్ కంట్రోల్‌తో పాలన సాగేది. కాంగ్రెస్ పాలనలో ప్రజల రక్తాన్ని పీల్చే అవినీతి వ్యవస్థను అభివృద్ధి చేశారు. దేశ అభివృద్ధిని నిర్లక్ష్యం చేశారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక పరిస్థితులు మారిపోయాయి. ఇప్పుడు ప్రపంచం మొత్తం భారత్ గురించి మాట్లాడుకుంటోంది. దేశంలో పేదరికం అంతమవుతోందని నిపుణులు చెబుతున్నారు. మన దేశం సాధించిన ప్రతి విజయం వెనుక ప్రజల చెమట చుక్కలు ఉన్నాయి. దేశాన్ని ముందుకు తీసుకెళ్లడానికి భారతీయులు ప్రదర్శిస్తున్న అంకితభావం ప్రశంసనీయం. కొందరు వ్యక్తులకు మాత్రం ఇది అర్థం కావడం లేదు’’ అని ప్రధాని మోదీ తప్పుపట్టారు. అజ్మీర్‌లో సభలో అభివాదం చేస్తున్న ప్రధాని మోదీ -
అశోక్ గహ్లోత్, సచిన్ పైలట్ వర్గీయుల మధ్య ఘర్షణ..వీడియో వైరల్..
జైపూర్: రాజస్థాన్‌లో కాంగ్రెస్‌లో సీఎం అశోక్ గహ్లోత్, సచిన్ పైలట్ మధ్య చాలాకాలంగా వర్గపోరు నడుసున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడిది పతాక స్థాయికి చేరింది. ఇరు నేతల మద్ధతురాలు బాహాబాహీకి దిగారు. ఒకరిపై ఒకరు పిడిగుద్దుల వర్షం కురిపించుకున్నారు. అజ్మేర్లో డీసీసీ నిర్వహించిన సమావేశం ఇందుకు వేదికైంది. కాంగ్రెస్ బేరర్లు, కార్యకర్తల నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకునేందుకు ఏఐసీసీ కార్యదర్శి, రాజస్థాన్ కో-ఇంఛార్జ్ అమృత ధావన్ గురువారం అజ్మేర్ వెళ్లారు. అయితే ఈ సమావేశానికి వచ్చిన అశోక్ గహ్లోత్, సచిన్ పైలట్ మద్దతుదారుల మధ్య సీట్ల అరేంజ్మెంట్ విషయంలో గొడవ జరిగింది. ఇరువర్గాల మధ్య మాటా మాటా పెరిగి ఘర్షణకు దారితీసింది. అజ్మేర్లో సచిన్ పైలట్ మద్దతుదారులు ఎక్కువ ఉండటంతో వారంతా తమ నేతకు అనుకూలంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు. ఇరువర్గాలను శాంతింప చేసేందుకు జిల్లా కాంగ్రెస్ నాయకులు ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. దీంతో చివరకు పోలీసులు రంగ ప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. అనంతరం అమృత ధావన్.. కాంగ్రెస్ ఆఫీస్ బేరర్లు, కార్యకర్తల నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకుని వెళ్లిపోయారు. కాగా.. అశోక్ గహ్లోత్ ప్రభుత్వంపై సొంత పార్టీ నేత అయిన సచిన్ పైలట్ తీవ్ర విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. బీజేపీ హయాంలో జరిగిన అవినీతిపై ఆయన ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని, మాజీ సీఎం వసుందర రాజేతో ఒప్పందాలు కుదుర్చుకున్నారని పైలట్ ఆరోపిస్తున్నారు. ఈ విషయంపైనే ఐదురోజుల పాదయాత్ర కూడా చేసి నిరసన వ్యక్తం చేశారు. చదవండి: ముళ్ల కిరీటం కర్ణాటక ముఖ్యమంత్రి పీఠం.. ఐదేళ్లూ కొనసాగడం కత్తిమీద సామే -
Video: రోడ్డుమీద రెచ్చిపోయిన ప్రేమ జంట.. బైక్‌పై రొమాన్స్..
ఈ మధ్య కొంతమంది ప్రేమ జంటలు రెచ్చిపోతున్నారు. పబ్లిక్‌గానే హద్దులు మీరి ప్రవర్తిస్తున్నారు. చుట్టూ ఎవరున్నారనేది కూడా గమనించకుండా.. న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారు. అదేదో ఫ్యాషన్, ట్రెండ్ అన్నట్లుగా అసభ్యకర చేష్టలతో వార్తల్లోకెక్కుతున్నారు. ఇటీవల కాలంలోఇలాంటి ఘటనలు జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, చత్తీస్‌గఢ్ వంటి చోట్లు వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా నెట్టింట్లో వైరల్ అయ్యాయి. తాజాగా అలాంటి ఘటనే రాజస్థాన్‌లో చోటు చేసుకుంది. అజ్మీర్‌లో నడిరోడ్డుపై ఓ ప్రేమ జంట బైక్ మీద విచ్చలవిడి చేష్టలతో కనిపించారు. రీజనల్ కాలేజ్ క్రాస్ రోడ్స్ – నౌసర్ వ్యాలీ రహదారిపై స్పీడ్‌గా వెళ్తున్న బైక్ మీద ఇద్దరు ప్రేమికులు రొమాన్స్ చేస్తూ కెమెరాకు చిక్కారు. ఈ ఘటన సోమవారం సాయంత్రం చోటు చేసుకోగా.. అదే సమయంలో రోడ్డుపై వెళ్తున్న వాహనదారులు దీన్ని వీడియో తీశారు. ఇందులో ఓ యువకుడు ఫ్యూయల్ ట్యాంక్‌పై అమ్మాయిని ఎదురుగా కూర్చోబెట్టుకుని బైక్ డ్రైవ్ చేస్తున్నాడు. అంతా చూస్తుండగానే యువతి యువకుడిని కౌగిలించుకుకోవడం, ముద్దు పెట్టడం కనిపిస్తోంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీరిద్దరి ప్రవర్తనపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. సదరు జంటపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రాజస్థాన్ పోలీసులను ట్యాగ్ చేశారు. దీనిపై స్పందించిన అజ్మీర్ పోలీసులు.. వీడియో ఆధారంగా బైక్‌ను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. రైడర్ ఫై సాగర్ రోడ్‌కు చెందిన సాహిల్‌గా గుర్తించామని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన్నట్లు పేర్కొన్నారు. చదవండి: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన ట్రాన్స్‌జెండర్ జంట.. బేబీ ఫొటో వైరల్.. -
వైరల్: తల్లి రిటైర్మెంట్ రోజు అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చిన కొడుకు
జైపూర్: తన తల్లి ఉద్యోగ విరమణ రోజుని జీవితాంతం గుర్తుండిపోయేలా కొడుకు సర్ప్రైజ్ అందించాడు. అందరిని ఆశ్చర్యపరుస్తూ అద్భుతమైన బహుమతి ఇచ్చి.. తల్లి కళ్లలో ఆనందాన్ని చూసుకున్నాడు. ఇంతకీ ఆ వ్యక్తి ఏం చేశాడంటే.. రాజస్థాన్ రాష్ట్రం అజ్మీర్‌కు చెందిన సుశీలా చౌహాన్ అనే మహిళ పిసంగన్‌లోని కేసర్‌పురా హైస్కూల్లో ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వర్తిస్తున్నారు. గత 33 ఏళ్లుగా టీచర్‌గా సేవలందించిన సుశీలా శనివారం పదవి విరమణ చేశారు. తల్లి రిటైర్మెంట్ కార్యక్రమం గురించి తెలుసుకున్న అమెరికాలో ఉన్న ఆమె కుమారుడు యోగేశ్ చౌహాన్ నాలుగు రోజుల క్రితం స్వగ్రామానికి చేరుకున్నాడు. పదవీ విరమణ రోజును తల్లికి మధురమైన జ్ఞాపకంగా మలిచేందుకు యోగేశ్ అదిరిపోయే ఆలోచన చేశాడు. ఆమె కోసం ఏకంగా హెలికాప్టర్ రైడ్‌ను బుక్ చేశాడు. హెలికాప్టర్లో తల్లిని స్కూల్ నుంచి స్వగ్రామానికి తీసుకెళ్లాడు. ఇందుకు అధికారుల నుంచి ప్రత్యేక అనుమతి కూడా తీసుకున్నాడు. కాగా దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. తల్లి ఆనందం కోసం కొడుకు చేసిన మంచి పనిని పలువురు ప్రశంసిస్తున్నారు. చదవండి: Zomato: వీల్‌చైర్‌లో ఆన్లైన్ ఫుడ్ డెలివరీ.. నెటిజన్ల ప్రశంసలు Rajasthan| A son gifted his mother helicopter ride as a retirement gift in Ajmer My mother retired as a teacher. I wanted to do something special for her& decided to book her a memorable helicopter ride to reach home. Didn't expect crowd,but feels great:Son Yogesh Chauhan (30.7) pic.twitter.com/adBoBIhOEV — ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) July 31, 2022 దీనిపై యోగేశ్ చౌహాన్ మాట్లాడుతూ..‘ మా అమ్మ టీచర్‌గా రిటైరయ్యింది. నేను ఆమె కోసం ప్రత్యేకంగా ఏదైనా చేయాలనుకున్నాను. అందుకే అమ్మను ఇంటికి తీసుకెళ్లడానికి హెలికాప్టర్‌ను బుక్ చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. కానీ ఆ సమయంలో ఇంత మంది గుమికూడతారని ఊహించలేదు. అది మాకు మరింత సంతోషాన్నిచ్చింది.’ అని తెలిపాడు. ఇక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన యోగేష్ ప్రస్తుతం అమెరికాలో పనిచేస్తున్నారు. -
Photo Feature: పాపం ఏనుగు.. వర్షంలో పాట్లు
గోతిలో పడిన ఏనుగును అటవీ శాఖ అధికారులు, స్థానికులు కలిసి కాపాడారు. కేరళలో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్టలో లక్ష్మీ నర్సింహస్వామి ఆలయ పునర్నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. చుట్టూ పరుచుకున్న పచ్చదనంతో యాదాద్రి హరిత శోభను సంతరించుకుంది. మరోవైపు దేశవ్యాప్తంగా కోవిడ్ టీకా కార్యక్రమం కొనసాగుతోంది. భారీ వర్షాలతో ముంబైకర్ల పాట్లు రెట్టింపయ్యాయి. -
ఆ ఇద్దరి కోసమే వ్యవ‘సాయం’
జైపూర్: వ్యవసాయ చట్టాలకు సంబంధించి ప్రధాని మోదీపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శనాస్త్రాలు సంధిస్తూనే ఉన్నారు. దేశంలో వ్యవసాయ రంగ వాణిజ్యం మొత్తాన్ని మోదీ తన ఇద్దరు స్నేహితులకు ధారాదత్తం చేయడానికే కొత్త సాగు చట్టాలను తీసుకువచ్చారని ఆరోపించారు. రాజస్తాన్‌లో రెండో రోజు పర్యటనలో భాగంగా శనివారం రాహుల్ అజ్మీర్‌లోని రూపన్‌గర్హ్, నగౌర్‌లోని మక్రానాల్లో జరిగిన రైతు ర్యాలీల్లో పాల్గొన్నారు. రంగురంగుల రాజస్తానీ తలపాగా(సఫా)ధరించి రాహుల్ ర్యాలీలో ట్రాక్టర్ నడిపారు. కొత్త సాగు చట్టాల్లో మొదటిది మండీ వ్యవస్థను దెబ్బతీయడానికి, రెండోది వ్యవసాయోత్పత్తుల నిల్వలపై నియంత్రణ తొలగించడానికి, మూడోది రైతులు తమ సమస్యలపై కోర్టులకు వెళ్లడాన్ని అడ్డుకునేందుకు ఉద్దేశించినవి అని ఈ సందర్భంగా రాహుల్ పేర్కొన్నారు. ‘నిజాన్ని తెలియజెప్పడం నా బాధ్యత. వినడం, వినకపోవడం మీ ఇష్టం’అని ఆయన వ్యాఖ్యానించారు. ‘రైతులు, చిన్న, మధ్య వ్యాపారులు, కార్మికులు కలిపి దేశంలోని వ్యవసాయ వాణిజ్యంలో 40% వాటా కలిగి ఉన్నారు. మోదీ ఈ వాణిజ్యం మొత్తాన్ని తన ఇద్దరు దోస్తులకు కట్టబెట్టాలని ప్రయత్నిస్తున్నారు. కొత్త వ్యవసాయ చట్టాల వెనుక అసలు ఉద్దేశం ఇదే’అంటూ ఎవరి పేరునూ ప్రస్తావించకుండా విమర్శలు గుప్పించారు. ‘దేశ ప్రజలకు ఎన్నో అవకాశాలను కల్పిస్తున్నట్లు నరేంద్ర మోదీ చెప్పుకుంటున్నారు. కానీ, ప్రజలకు ఆయన ఇచ్చిన అవకాశాలు ఆకలి, నిరుద్యోగం, ఆత్మహత్యలు అనేవి మాత్రమే’అని రాహుల్ పేర్కొన్నారు. ‘కరోనా మహమ్మారి కారణంగా దేశం తీవ్రంగా నష్టపోతుందని గత ఏడాది ఫిబ్రవరిలో కనీసం 15 సార్లు చెప్పాను. రైతులు, కార్మికులు, నిరుపేదలపై ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుందన్న నా మాటలకు మీడియా.‘నన్ను రైతును కాదు, జాతి వ్యతిరేకి అంటూ ముద్రవేసింది’అని ఆవేదన వ్యక్తం చేశారు. ‘ నిరసనల్లో ప్రాణాలు కోల్పోయిన 200 మంది రైతులకు నివాళిగా పార్లమెంట్లో నేను లేచి నిలబడి మౌనం పాటించా. బీజేపీ ఎంపీల్లో ఒక్కరూ అలా చేయలేదు’అని తెలిపారు. -
రాగా తంత్రమా ? నమో మంత్రమా ?
రాజస్తాన్‌లో ప్రధాని మోదీ గాలి వీస్తోందా ? 2014 ఎన్నికల మాదిరిగా ప్రభంజనం సృష్టించకపోయినా భారీగానే సీట్లు కొల్లగొడతారా ? గత అసెంబ్లీ ఎన్నికల్లో వసుంధరా రాజెపై వ్యతిరేకతతో రాణిగారి కోటను కూలగొట్టిన ఓటర్లు ఇప్పుడు లోక్‌సభ ఎన్నికలనేసరికి మళ్లీ నమో మంత్రమే జపిస్తారా ? పాక్‌కు సరిహద్దు రాష్ట్రంలో దేశభక్తే ఉప్పొంగుతుందా ? స్థానిక సమస్యలనే ఎన్నికల అస్త్రంగా మలచుకున్న కాంగ్రెస్ తంత్రం నెగ్గుతుందా ? మొత్తం 25 స్థానాలకు గాను 13 సీట్లలో నాలుగోదశలో పోలింగ్ జరిగింది. మిగిలిన పన్నెండు సీట్లలో మే 6న పోలింగ్ జరగబోతోంది. ఈ దశలో ఉన్న కీలక నియోజకవర్గాల్లో పరిస్థితులేంటి ? రాజస్తాన్ ప్రజల మొగ్గు ఎటు ? ఓట్లు, సీట్లు లెక్కలు ఏం చెబుతున్నాయ్ ? 2014 ఎన్నికల్లో మోదీ ప్రభంజనంతో బీజేపీ 25కి 25 సీట్లు క్లీన్ స్వీప్ చేసింది. ఓట్లు కూడా ఇంచుమించుగా 56 శాతం వచ్చాయి. కానీ అయిదేళ్లలో పరిస్థితుల్లో భారీగా మార్పులు వచ్చాయి. ప్రధానంగా వసుంధరా రాజెపై వ్యతిరేకత, కొన్ని కొత్త పార్టీలు పుట్టుకొచ్చి భారీగా ఓట్లను చీల్చడం, కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ హామీతో గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ప్రతిపక్షానికి పరిమితమైంది. 38.8శాతం మాత్రమే ఓట్లతో 73 స్థానాలను దక్కించుకుంది. అలాగని కాంగ్రెస్ పార్టీ కూడా ఆశించిన స్థాయిలో రాణించలేదు. రాజేపై నెలకొన్న వ్యతిరేకతకి భారీగా సీట్లు, ఓట్లు కొల్లగొట్టాలి. కానీ 39.3 శాతం ఓట్లతో 100 స్థానాల్లో మాత్రమే గెలుపొంది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. రెండు ప్రధాన పార్టీల మధ్య ఓట్లలో తేడా కేవలం 0.5శాతం మాత్రమే. అసెంబ్లీ ఎన్నికల్లో కొన్ని కొత్త పార్టీలు పుట్టుకొచ్చి ఓట్లను భారీగా చీల్చాయి. కొత్త పార్టీలే 9 శాతం ఓటు షేర్‌తో 12 స్థానాల్లో గెలుపొందాయి. బీజేపీకి గుడ్‌బై కొట్టేసి కొత్త పార్టీ పెట్టిన రాష్ట్రీయ లోక్తాంత్రిక్ పార్టీ (ఆర్ఎల్పీ) హనుమాన్ బేనీవాల్ 2.4శాతం ఓట్లతో మూడు అసెంబ్లీ స్థానాలను సాధించడం విశేషంగా చెప్పుకోవాలి. అసెంబ్లీ ఎన్నికలు వేరు, లోక్‌సభ ఎన్నికలు వేరు అన్న చైతన్యం ఈ మధ్య ఓటర్లలో బాగా పెరుగుతోంది. అదే ఈ సారి బీజేపీకి కలిసి వస్తుందని ఎన్నికల విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. జాతీయత వర్సస్ స్థానికత పాకిస్థాన్‌కు సరిహద్దు రాష్ట్రం కావడంతో రాజస్తాన్‌లో బీజేపీ ప్రధానంగా సర్జికల్ స్ట్రయిక్స్, దేశభక్తినే ప్రచార అస్త్రాలుగా మార్చుకుంది. జై జవాన్, జైకిసాన్, జై విజ్ఞాన్ అన్న నినాదంతో ప్రచారం చేస్తోంది. ఈ రాష్ట్రం నుంచి యువకులు ఎక్కువగా సైన్యంలో చేరుతూ ఉండడంతో పుల్వామా దాడులు, అభినందన్‌ని వెనక్కి తీసుకురావడం వంటి అంశాలతో సెంటిమెంట్ రగిలించే ప్రయత్నం చేస్తోంది. కాంగ్రెస్ ఇచ్చిన రుణమాఫీ అమలు సరిగా జరగకపోవడం కూడా బీజేపీకి కలిసివస్తోంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ స్థానిక సమస్యలపై దృష్టి పెడుతూ ప్రచారం చేస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో అశోక్ గహ్లోత్, సచిన్ పైలట్లు ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా వ్యవహరించారు. సీఎం పదవికి పోటీ ఉండడంతో కలిసికట్టుగా పనిచెయ్యలేదు. కానీ ఈ సారి ఉమ్మడిగా వ్యూహాలు రచించారు. కాంగ్రెస్ పార్టీ కనీస ఆదాయ పథకం (న్యాయ్) సరిగ్గా ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో విఫలమైనప్పటికీ, గ్రామీణ సంక్షోభం, రైతు సమస్యలనే ఎక్కువగా ప్రస్తావిస్తున్నారు. కేంద్రంలో, రాష్ట్రంలో ఒకే పార్టీ ఉంటే అభివృద్ధి పరుగులు పెడుతుందని విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. అల్వార్, అజ్మీర్ పరిస్థితులు మారుతున్నాయా ? రాజస్తాన్ లోక్‌సభ ఎన్నికల్లో ఈ సారి అందరి దృష్టి అల్వార్, అజ్మీర్ నియోజకవర్గాలపైనే ఉంది. గత లోక్‌సభ ఎన్నికల్లో క్లీన్‌స్వీప్ చేసిన బీజేపీ ఆ తర్వాత తన హవాను నిలబెట్టుకోలేక 2018 జనవరిలో జరిగిన ఉప ఎన్నికల్లో ఈ రెండు స్థానాలను కోల్పోయింది. ఎవరికీ అందుబాటులో ఉండకుండా, ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకున్న నాటి బీజేపీ సీఎం వసుంధర రాజె వ్యవహారశైలిపై నెలకొన్న అసంతృప్తి సెగలు ఉప ఎన్నికల్లోనే తగిలాయి. 2014 లోక్‌సభ ఎన్నికల్లో అల్వార్, అజ్మీర్‌ల నుంచి బీజేపీ తరఫున నెగ్గిన చాంద్‌నాథ్, సన్వర్‌లాల్ జాట్ మృతి చెందడంతో ఈ రెండు స్థానాలకు ఎన్నికలు నిర్వహించాల్సి వచ్చింది. ఈ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులైన రఘుశర్మ అజ్మీర్ నుంచి 84 వేల ఓట్ల తేడాతో, కరణ్ సింగ్ యాదవ్ అల్వార్ నుంచి ఇంచుమించుగా 2 లక్షల ఓట్ల మెజార్టీతో నెగ్గారు. ఈ సారి ఈ స్థానాల్లో గెలుపు ఎవరిదన్న ఉత్కంఠ నెలకొంది. ఇప్పుడు మళ్లీ పరిస్థితులు మారుతున్నాయని, ప్రధానమంత్రి నరేంద్రమోదీ హవా పనిచేస్తుందని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. అభ్యర్థుల్ని మార్చేసిన కాంగ్రెస్ అల్వార్, అజ్మీర్ ఈ రెండు స్థానాల్లోనూ కాంగ్రెస్ పార్టీ ఉప ఎన్నికల్లో నెగ్గిన అభ్యర్థుల్ని మార్చేసింది. అజ్మీర్‌లో రఘుశర్మని తప్పించిన కాంగ్రెస్ పార్టీ కొత్త ముఖమైన రిజు ఝున్‌ఝున్‌వాలాకు టికెట్ ఇచ్చింది. ఆయన స్థానికుడు కాకపోవడంతో కొంత వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వస్తోంది. ప్రస్తుతం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, 2014 ఎన్నికల్లో సన్వర్‌లాల్ చేతిలో ఓటమిపాలైన సచిన్‌పైలట్ మద్దతు కలిగిన ఝన్‌ఝన్‌వాలా పైలట్‌కున్న పాపులారిటీనే నమ్ముకున్నారు. ఇక బీజేపీ తరపున స్థానిక వ్యాపారవేత్త, కశింగఢ్ ఎమ్మెల్యే భగీరథ్ చౌ«ధరీ పోటీ చేస్తున్నారు. లోకల్ అభ్యర్థి కావడం ఆయనకు కలిసివస్తోంది. ఇక అల్వార్ మూకదాడులతో దేశవ్యాప్తంగా వార్తల్లోకెక్కిన ప్రాంతం. హరియాణాకు చెందిన పాలవ్యాపారి పెహ్లూఖాన్‌ను హిందూ మతోన్మాదులు కొట్టి చంపిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ నియోజకవర్గంలో యాదవుల ఓట్లే కీలకం. ఆ తర్వాత మియో ముస్లింలు కూడా గణనీయ సంఖ్యలోనే ఉన్నారు. గోసంరక్షణ పేరిట జరిగిన మూక దాడుల ప్రభావం ఉప ఎన్నికల్లో బీజేపీపై పడింది. అయినప్పటికీ ఈ సారి కూడా మతపరమైన విభజననే ఆ పార్టీ నమ్ముకుంది. గత ఎన్నికల్లో నెగ్గి మృతిచెందిన చాంద్‌నాథ్ శిష్యుడు, బాబా బాలక్‌నాథ్‌ను బరిలోకి దింపింది. ఇక కాంగ్రెస్ పార్టీ తరఫున భన్వర్ జితేంద్ర సింగ్ ఆయనకి గట్టిపోటీయే ఇస్తున్నారు. బీఎస్పీ ముస్లిం సామాజికవర్గానికి చెందిన ఇమ్రాన్‌ఖాన్‌కు టికెట్ ఇవ్వడంతో త్రిముఖ పోటీ నెలకొంది. కాంగ్రెస్ ఓట్లు చీలిపోయి బీజేపీకి లాభం చేకూరే అవకాశాలున్నాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరోవైపు దౌసా లోక్‌సభ ఎంపీ హరీశ్ మీనా బీజేపీకి గుడ్ బై కొట్టేసి కాంగ్రెస్ శిబిరానికి చేరుకోవడం కమలనాథులకి ఎదురు దెబ్బే. పింక్ సిటీ జైపూర్‌లో ఒక మహిళా అభ్యర్థికి 48 ఏళ్ల తర్వాత పోటీ చేసే అవకాశం రావడం ఈసారి ఎన్నికల్లో ప్రత్యేకత. గత ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రామ్‌చరణ్ బొహ్రా ఏకంగా 5.40 లక్షల ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ నేత మహేశ్ జోషిని మట్టికరిపించారు. క్లీన్ ఇమేజ్ కలిగిన బొహ్రాకు కార్యకర్తల్లో కూడా మంచి ఆదరణ ఉంది. . పార్లమెంటు సమావేశాల్లో కూడా చురుగ్గా పాల్గొన్నారు. 110 చర్చల్లో పాల్గొన్ని 312 ప్రశ్నలు వేశారు.అయితే నియోజకవర్గానికి ఆయన చేసిందేమీ లేదన్న విమర్శలూ ఉన్నాయి. అలాంటి గట్టి అభ్యర్థిని ఢీకొనడానికి ఏరికోరి ఒక మహిళకు సీటు ఇవ్వాలని నిర్ణయించిన కాంగ్రెస్ నగర మాజీ మేయర్ జ్యోతి ఖండేల్వాల్ను బరిలో దింపింది. దీంతో ఇక్కడ హోరాహోరి పోరు నెలకొంది. చివరిసారిగా1971లోజైపూర్ మాజీ మహారాణి గాయత్రిదేవి స్వతంత్రపార్టీ తరఫున ఎన్నికయ్యారు. బ్రాహ్మణులు, రాజపుత్రుల ఓట్లే ఇక్కడ కీలకం.రాజస్థాన్‌లోని జైపూర్ (రూరల్) నియోజకవర్గంలో ఇద్దరు క్రీడాకారుల మధ్య పోరాటానికి తెరలేచింది. బీజేపీ ఎంపీ, కేంద్ర క్రీడా శాఖ మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ గురితప్పని షూటర్. 2014లో మోదీ హవాతో రాథోడ్ జయపూర్ రూరల్ నుంచి సులభంగా నెగ్గారు. ఆ వెంటనే మంత్రి పదవి వరించింది. కాంగ్రెస్ అభ్యర్థి కృష్ణ పూనియా డిస్కస్ త్రోలో అంతర్జాతీయంగా భారత కీర్తిపతాకను రెపపలాడించారు. 2013 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. అయిదేళ్లలో సీన్ మారిపోయింది. వసుంధర రాజెకి వ్యతిరేక పవవాలు వీయడంతో గత ఏడాది జరిగిన ఎన్నికల్లో పూనియా సదూల్పూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి నెగ్గారు. ఇప్పటికే కేంద్ర క్రీడా మంత్రిగా రాథోడ్ మంచిపేరే సంపాదించుకున్నారు. ఆయనపై పోటీకి నిలబడడమే ఒక సాహసం. అలాంటి సాహసాన్ని ఒక క్రీడాకారిణి చేయడంతో కృష్ణ పూనియాపై కూడా అంచనాలు పెరిగాయి. బీజేపీ, ఆరెస్సెస్ అండదండలు, మోదీ ఇమేజ్ రాథోడ్‌కు కలిసి వస్తే, జాట్ సామాజిక వర్గానికి చెందిన పూనియాకు కులసమీకరణలు అనుకూలం. రాథోడ్‌ని ఎదుర్కోవడానికి చేతికి గ్లౌజులు ధరించి సిద్ధంగా ఉన్నానంటూ పంచ్ డైలాగ్‌లతో పూనియా ప్రచారంలో ఆకట్టుకుంటున్నారు. ‘‘నేను రైతు బిడ్డని. నాకు గ్రామీణుల పడే బాధలేంటో తెలుసు. క్రీడల్లో కూడా నేను గ్రామీణ ప్రాంతాల్లో యువత ఆడే డిస్కస్ త్రోనే ఎంచుకున్నా. ఏసీ హాళ్లలో కూర్చొని ఆటలాడే గేమ్స్ నాకు తెలీవు‘‘అని రాథోడ్ పైకి మాటల తూటాలు పేల్చారు.. మరోవైపు గత అయిదేళ్లలో నియోజకవర్గానికి తాను ఎంత చేస్తున్నారో చెబుతున్న రాథోఢ్ యువతరం ఓట్లపై ఆశలు పెట్టుకున్నారు. బికనీర్ అన్నదమ్ముల సవాల్ బికనీర్ నియోజకవర్గం (ఎస్సీ రిజర్వ్డ్) బీజేపీకికంచుకోట. గత 15 ఏళ్లుగా ఈ సీటు బీజేపీకే దక్కుతోంది. 2004లో బాలీవుడ్ నటుడు ధర్మేంద్ర ప్రాతినిధ్యం వహించిన స్థానం. ఈ సారి ఒక మాజీ ఐఎఎస్ మాజీ ఐపీఎస్ మధ్య ఉత్కంఠభరిత పోరాటానికి తెరలేచింది. వీళ్లిద్దరూ బంధువులు కూడా కావడం విశేషం. గత రెండు దఫాలుగా బీజేపీకిచెందిన అర్జున్ రామ్ మేఘవాల్ ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మాజీ ఐఎఎస్ అధికారి, కేంద్ర మంత్రి అయిన అర్జున్ రామ్‌కు నియోజకవర్గంలో మంచిపేరు ఉంది. చేనేత కుటుంబానికి చెందిన ఆయన కష్టపడిచదువుకొని ఐఎఎస్ అయ్యారు. చురు జిల్లాకు కలెక్టర్‌గా పని చేసిన అర్జున్‌రామ్ 2009లో రాజకీయాల్లోకి వచ్చారు. ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా భూ వివాదం కేసు ఆయన పర్యవేక్షణలోనే సాగింది. నీటివనరులు, గంగాప్రక్షాళన శాఖ సహాయ మంత్రిగా ఉన్న అర్జున్‌రామ్ ఇప్పటికీ పార్లమెంటుకి సైకిల్‌పై వచ్చే అతి కొద్ది మంది ఎంపీల్లో ఒకరు. ఈయనపై పోటీకి కాంగ్రెస్ పార్టీ ఆయన పిన్ని కుమారుడు ఐపీఎస్అధికారి అయిన మదన్‌గోపాల్‌ను రంగంలోకి దింపింది. ‘‘అర్జున్‌రామ్ మా పెద్దమ్మ కొడుకు. నా కన్నా పెద్దవాడు. కానీ మా ఇద్దరి భావజాలంలో చాలా తేడాలున్నాయి. నేనుఎన్నికల్లో పోటీపడడం . అయినా దీనిని సవాల్‌గా తీసుకున్నా‘అని మదన్ అంటున్నారు. జాట్లు ఆధిక్యం కలిగినబికనీర్లో ముస్లింలు, రాజపుత్రులు కూడా గణనీయమైన సంఖ్యలోనే ఉన్నారు. మే6న పోలింగ్ జరిగే స్థానాలు(మొత్తం – 12) ►గంగానగర్, బికనీర్, చురు, ఝున్ఝునూ, సీకర్, ►జైపూర్ (రూరల్), జైపూర్, అల్వార్, భరత్పూర్, ►కరౌలీ–ధోల్పూర్, దౌసా, నాగౌర్ ►‘‘ఉప ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకే ఓటు వేశాను. ఎందుకంటే ఆ ఓటు ప్రధానిని ఎన్నుకోవడానికి కాదు. కేవలం వసుంధరా రాజెను ఇంటికి పంపించడానికే. మా లక్ష్యం నెరవేరింది. మోదీపై మాకు ఎప్పుడూ వ్యతిరేకత లేదు’’ – జితేంద్ర చౌదరి, ధర్మపుర గ్రామస్తుడు ►‘‘అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన రుణమాఫీ హామీ అమలు అధికారంలోకి వచ్చిన పదిరోజుల్లో జరగకపోతే పదకొండో రోజునే సీఎంను మారుస్తానని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పదే పదే చెప్పారు. మా రుణాలు మాఫీ కూడా కాలేదు. ఆయన సీఎంనూ మార్చలేదు. ఇక కాంగ్రెస్‌కి మేమెందుకు ఓటు వేయాలి‘‘ – బుద్ధరామ్ జాట్, అల్వార్ రైతు ►‘‘మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం అని మోదీ చెప్పారు. గుజరాత్ మోడల్ అంటూ ఊదరగొట్టారు. కానీ గత అయిదేళ్లలో మాకు ఒక్క రోజు కూడా పని దొరకలేదు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాతే గ్రామాల్లో పనులు జరుగుతున్నాయి’’ – రాహుల్ మీనా, గమ్రీ గ్రామస్తుడు ►‘‘ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజ్యాంగాన్నే మార్చాలని చూస్తున్నారు. మళ్లీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తారు. ఎస్సీ, ఎస్టీ చట్టాలను మార్చేసి, ఆదివాసీలను అటవీ ప్రాంతాల నుంచి ఖాళీ చేయిస్తారు. సుప్రీం తీర్పుల్ని కూడా ఆయన లెక్కచేసే పరిస్థితి ఉండదు’’ – కన్నయ్యలాల్ భుజ్, ఆదివాసీ యువకుడు -
అన్యాయంగా మా అమ్మను చంపారు
అజ్మీర్: మూఢనమ్మకాల జాడ్యం ఓ మహిళ ప్రాణాలు తీయగా, ఆపై గ్రామపెద్దలు హేయనీయమైన తీర్పునిచ్చిన ఘటన రాజస్థాన్ అజ్మీర్ లో చోటుచేసుకుంది. కెక్రీ గ్రామంలో మంత్రెగత్తె అన్న ఆరోపణలపై నగ్నంగా ఊరేగించి దారుణంగా చిత్రహింసలకు గురిచేయటంతో ఆమె చనిపోగా, అందుకు కారణమైన వారిని నదిలో మునిగి పాప ప్రక్షాళన చేసుకోవాలంటూ పంచాయితీ పెద్దలు వెల్లడించారు. ఆలస్యంగా ఘటన వెలుగులోకి వచ్చింది. ఘటనను ఆమె కొడుకైన 15 ఏళ్ల రాహుల్ కళ్లకు కట్టినట్లు వివరిస్తున్నాడు. "ఆగష్టు 2న సాయంత్రం నేను, ఓ బంధువుల అమ్మాయి, ఆమె స్నేహితురాళ్లతో ఇంటి బయట మాట్లాడుకుంటున్నాం. ఇంతలో ఇద్దరమ్మాయిలు దెయ్యం పట్టినట్లు ఊగిపోతూ విచిత్రంగా ప్రవర్తించారు. అందులో ఓ అమ్మాయి మా అమ్మను మంత్రగత్తె అంటూ జట్టు పట్టుకుని రోడ్డుకు ఈడ్చింది. ఇంతలో మరో ఎనిమిది మంది గ్రామస్తులు గుమిగూడి మా అమ్మను చితకబాదటం ప్రారంభించారు. తనకే పాపం తెలీదని ఆమె కాళ్లావేళ్లా పడినా కనికరం చూపలేదు. మరోకరు దగ్గర్లోని పోలం నుంచి మలం తెచ్చి మా అమ్మతో తినిపించారు. ఆపై మురుగు నీరు తాగించారు. వివస్త్రను చేసి ఊరంతా తిప్పించారు'' అని బాలుడు వెల్లడించాడు. కాసేపయ్యాక కాల్చిన కర్రలతో వాతలు పెడుతూ చిత్రహింసలకు గురిచేశారని, రోదిస్తూనే వారిని అడ్డుకోవాలని యత్నించినప్పటికీ తననూ చంపుతామని వాళ్లు బెదరించారని తెలిపాడు. తీవ్రంగా గాయపడిన ఆ మహిళ చికిత్స పొందుతూ మరుసటి రోజు చనిపోయింది. ఓ బంధువు సాయంతో బాలుడు ఈ ఘోరాన్ని గ్రామ పెద్దల దగ్గరకు తీసుకెళ్తే వారి మరీ దారుణంగా వ్యవహరించారని చెప్పాడు. మొత్తం ఘటనకు కారణమైన ఈ ఇద్దరు యువతులకు చెరో 2,500 రూపాయల జరిమానా విధించి, పుష్కర్ లో స్నానం చేసి ఆ పాపం నుంచి విముక్తి పొందంటూ తీర్పు ఇచ్చారంట. అంతేకాదు పోలీసుల వద్దకు వెళ్లదంటూ తనను హెచ్చరించారని బాలుడు అంటున్నాడు. సామాజిక ఉద్యమకారుడు తారా అహ్లువాలియా ఈ మొత్తం ఉదంతాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. మహిళపై దాష్టీకానికి పాల్పడిన ఆమె మరణానికి కారణమైనవాళ్లతోపాటు తీర్పు ఇచ్చిన పంచాయితీ పెద్దలపైనా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
‘అజ్మీర్’ దోషులకు జీవితఖైదు
నిర్దోషులుగా అసీమానంద్, సాధ్వీ జైపూర్/సాక్షి, హైదరాబాద్: అజ్మీర్ దర్గాలో పేలుళ్లకు పాల్పడిన కేసులో భవేశ్ పటేల్(39), దేవేంద్ర గుప్తా(41)లకు జీవిత ఖైదు విధిస్తూ ఎన్ఐఏ ప్రత్యేక న్యాయస్థానం బుధవారం తీర్పునిచ్చింది. పటేల్‌కు రూ.10వేలు, గుప్తాకు రూ.5వేల జరిమానా విధించింది. స్వామి అసీమానంద్, ప్రజ్ఞా సాధ్వీలను నిర్దోషులుగా విడుదల చేసింది. 2007 అక్టోబర్ 11న అజ్మీర్‌లోని ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీ దర్గాలో పేలుళ్లలో ముగ్గురు చనిపోగా, 15 మంది గాయపడ్డారు. ఈ కేసులో విచారణ ప్రారంభించిన రాజస్తాన్ ఏటీఎస్ తర్వాత కేసును జాతీయ దర్యాప్తు సంస్థకు(ఎన్ఐఏ) బదిలీ చేసింది. కోర్టు మార్చి 8న పటేల్, గుప్తా, సునీల్ జోషీలను దోషులుగా నిర్ధారించింది. పేలుళ్లలో ఇంద్రేశ్ కుమార్, ప్రజ్ఞా సాధ్వీ, జయంత్ భాయ్, ప్రిన్స్, రమేశ్ గొహిల్, స్వామీ అసీమానంద్ పాత్రపై సరైన ఆధారాలు లేవని ఎన్ఐఏ తన తుది నివేదికలో కోర్టుకు తెలిపింది. దేవేంద్రగుప్త.. హైదరాబాద్‌లోని మక్కా మసీదులో పేలుడు కేసులో నింది తుడు. 2007 మే 18న మక్కా మసీదులో పేలిన బాంబు, అజ్మీర్ దర్గాలో పేలింది ఒకే తరహాకు చెందినవని నిపుణులు తేల్చారు. ఈ రెండు విధ్వంసాలకు ఒడిగట్టింది ఒకే ఉగ్రవాద మాడ్యుల్ అని గుర్తించారు. ప్రస్తుతం మక్కా మసీదులో బాంబు పేలుడు కేసు కోర్టు విచారణలో ఉంది. ‘అజ్మీర్’ మృతుల్లో హైదరాబాద్‌వాసి.. అజ్మీర్ దర్గా పేలుడులో మరణించిన వారిలో హైదరాబాద్‌కు చెందిన సయ్యద్ సలీమ్ (42) ఉన్నారు. టోలిచౌకిలోని నదీమ్కాలనీకి చెందిన ఆయన అజ్మీర్ దర్గా సమీపంలో ఉన్న దర్గా బజార్లో గాజుల వ్యాపారం నిర్వహించేవాడు. ఆయన కుటుంబం మాత్రం నగరంలోనే ఉండేది. పేలుడు జరిగిన రోజు సాయంత్రం ప్రార్థనల కోసం దర్గాకు వెళ్ళారు. -
2కోట్ల ఆస్తి ఉన్నా.. పేదరాలిగా మృతి
అజ్మీర్: జీవిత చరమాంకంలో చుట్టుపక్కల ఇళ్లలో అడుక్కుతిని బతికింది రాజస్థాన్‌లోని అజ్మీర్‌కు చెందిన 70 ఏళ్ల ముసలావిడ. దినమంతా భిక్షాటన చేసి, ఓ గుడి ఆవరణలోని చిన్న గదిలో పడుకునేది. ఉన్నట్లుండి ఆవిడ గురువారం చనిపోయింది. దీంతో చుట్టుపక్కలవాళ్లే డబ్బులు పోగుచేసి ఈమెకు అంత్యక్రియలు నిర్వహించారు. ఆ తర్వాత ఆమె గదిని సర్దేందుకు యత్నిస్తుండగా.. చిరిగిన దుస్తులతోపాటు ఆశ్చర్యకరంగా రూ.రెండు కోట్ల విలువైన ఫిక్స్డ్ డిపాజిట్ బాండ్లు కనిపించాయి. చిత్రమేమంటే ఈ బాండ్లకు నామినీ ఎవరూ లేరు. అయితే ఆమె కుటుంబీకులు ఎవరైనా వస్తే ఈ మొత్తాన్ని అప్పగిస్తామని బ్యాంకు వెల్లడించింది. -
చనిపోయిన ఆమె కోట్ల రూపాయలు ఎవరికో..
అజ్మీర్: పేద వారిగా జన్మించడం తప్పుకాదుగానీ.. పేదవాడిగానే చనిపోవడం మాత్రం తప్పని చెప్తుంటారు. కొంతమంది దురదృష్టం కొద్ది కోట్లు ఉన్నా నిజంగా పేదవారిలాగే ప్రాణాలు విడుస్తారు. భద్రతా భయమో.. డబ్బుపై ఆశో.. కొంతమంది నోరుకడుపు కట్టుకొని కష్టపడి నాలుగు రాళ్లు వెనకేసుకుంటారు. అందులో ఒక్కరాయి కూడా వాడుకోకుండానే చనిపోతుంటారు. రాజస్థాన్ లో ఇలాగే జరిగింది. దాదాపు రూ.2కోట్ల ఆస్తి ఉన్నా కటిక బీదరాలుగా ఓ డెబ్బై ఏళ్ల వృద్ధురాలు కన్నుమూసింది. ఆమెకు ఏ దిక్కు లేదనుకుని తలా ఒక రూపాయి వేసుకొని అంత్యక్రియలు నిర్వహించిన చుట్టుపక్కలవారు ఆ ఆస్తుల విషయం తెలిసి అవాక్కయ్యారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. కానక్లతా అనే 70 ఏళ్ల అజ్మీర్‌లోని నుల్లా బజార్లో భిక్షాటన చేస్తూ బతుకుతూ ఉండేది. ఆమెకు పిల్లలు లేరు. భర్త ప్రేమ నారయణ్ గత ఏడాది చనిపోయాడు. ఒక చిన్న గదిలో ఆమె ఉంటోంది. గత గురువారమే ఆమె ప్రాణాలు విడిచింది. దీంతో ఆమెకు ఏ దిక్కూ లేదని భావించిన ఆ కాలనీ వాసులు తలా ఒక రూపాయి వేసుకొని అంత్యక్రియలు నిర్వహించారు. అనంతరం ఆమె ఉంటున్న గదిలో తనిఖీలు చేయగా వివిధ బ్యాంకుల్లో దాదాపు రూ.2 కోట్లు ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్న పత్రాలు వెలుగు చూశాయి. ఆ పత్రాల్లో నామినీ కూడా ఎవరూ లేరు. దీంతో ప్రస్తుతం ఆ రెండు కోట్ల రూపాయలు ఎవరికి ఇవ్వాలని బ్యాంకులు ఎదురుచూస్తున్నాయి. అయితే, సినిమాలో ట్విస్ట్ మాదిరిగా తాను చనిపోయిన ఆ ముసలవ్వ అల్లుడినంటూ ఛత్తీస్ గడ్ నుంచి ఓ వ్యక్తి వచ్చాడు. తానొక్కడినే చనిపోయిన ఆమెకు బంధువునని, ఆమెకు అల్లుడిని అవుతానని చెప్పినట్లు స్థానికులు చెబుతున్నారు. అయితే, అంతకుముందెప్పుడు అతడిని తాము చూడలేదని వారు చెబుతున్నారు. ఏదేమైనా తుది నిర్ణయం మాత్రం బ్యాంకుల చేతుల్లో ఉంది. -
రాయితో కొట్టి.. బట్టలు చింపి..
అజ్మీర్: రాజస్థాన్ పర్యటనకు వచ్చిన నలుగురు విదేశీయులపై ఆరుగురు వ్యక్తులు దాడులకు పాల్పడ్డారు. అనంతరం వారిని దోచుకున్నారు. ఈ క్రమంలో వారికి గాయాలు కూడా అయ్యాయి. అయితే, ఆ ఆరుగురిలో ఐదుగురుని పోలీసులు అరెస్టు చేశారు. ఒక మైనర్ బాలికను అదుపులోకి తీసుకున్నారు. అజ్మీర్ ఎస్పీ నితీన్ దీప్ తెలిపిన వివరాల ప్రకారం అమెరికా, బ్రిటన్ కు చెందిన ఇద్దరు వ్యక్తులు స్పెయిన్, టర్కీ కి చెందిన ఇద్దరు మహిళలు రెండు బైక్ లపై అజయ్ పాల్ దామ్ కు వెళ్లారు. బాగా తాగిన ఆరుగురు దోపిడీ దారులు తొలుత వారిని వెంబడించారు. బాగా తాగి అనకూడని మాటలు అన్నారు. అదే సమయంలో ఓ టూరిస్టు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో రాయితో కొట్టారు. ఆ తర్వాత అందులో ఓ మహిళనకు కిందకు లాగి ఆమె దుస్తులు చింపేశారు. వారు ఏదో ఒకలా వారి నుంచి తప్పించుకొని స్థానికుల సహాయంతో బయటపడ్డారు. ఈ దాడిపై స్పందించిన పోలీసులు వేగంగా కదిలి ఆరుగురుని ఈరోజు అదుపులోకి తీసుకున్నారు. -
మద్యంమత్తులో విదేశీ జంటపై..
అజ్మీర్: రాజస్థాన్‌లోని పర్యాటక ప్రాంతం అజ్మీర్‌లో మద్యంమత్తులో కొందరు వీరంగం సృష్టించారు. ఈ ప్రాంతాన్ని సందర్శించేందుకు వచ్చిన స్పెయిన్ జంటపై దాడి చేసి కొట్టారు. స్పెయిన్ యువతిని లైంగికంగా వేధించినట్టు ఆరోపణలు వచ్చాయి. మద్యంతాగిన కొందరు స్థానికులు స్పెయిన్ జంట పట్ల అనుచితంగా ప్రవర్తించినట్టు ఎస్పీ నితిన్ దీప్ చెప్పారు. విదేశీయులతో మాట్లాడేందుకు ప్రయత్నిస్తూ, వారి వెంటపడినట్టు తెలిపారు. విదేశీ మహిళను వేధించినట్టు సమాచారం. బాధితులు అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్లి స్నేహితుడిని పిలిచారు. స్థానికులు విదేశీయులతో గొడవపడి దాడి చేశారు. ఈ దాడిలో ఓ యువకుడు గాయపడ్డాడు. అతని తలకు గాయాలయ్యాయి. గాయపడ్డ స్పెయిన్ యువకుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. దాడి చేసిన నిందితుల వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని ఎస్పీ చెప్పారు. -
భర్త అలాంటివాడా?
‘‘మీ కొడుకు ఇలాంటి వాడని తెలిసి పెళ్లి ఎలా చేశారు?’’ - అత్తమామలని అడిగిన కోడలు ఆకాశంలో మిగతా సగం మోసమైతే ఏం చేయాలి? పక్కలో ఉన్నదేమిటో అర్థంకాకపోతే ఏం చేయాలి? చెప్పుకోలేని కష్టమొస్తే ఏం చేయాలి? సంసార దుఃఖం ఎవరితో పంచుకోవాలి? పది రూపాయలు పెట్టి కాసిని కూరగాయలు కొనుక్కుంటేనే పదిసార్లు పరీక్షిస్తాం. కూతురిని పదికాలాలపాటు కలిసుండే ఓ అయ్య చేతిలో పెట్టేటప్పుడు ఏంచేయాలి? ఇది ఏ ఆడపిల్లకీ జరగకూడని కథ. చదువు, అందం, సంస్కారం, ఉద్యోగం... అన్నీ ఉండి కూడా ఒక హోమోసెక్సువల్కి భార్య అయి ఇటీవల అర్ధంతరంగా జీవితాన్ని చాలించిన ఓ యువ డాక్టర్ కథ... ఆమె ఓ పేదింటి బిడ్డ. తండ్రి టైలర్. ఒక అన్న, తమ్ముడి మధ్య గారాల పట్టి. తండ్రి ఆశయానికి తగ్గట్టే చదువుకుంది. అజ్మీర్ మెడికల్ కాలేజ్‌లో చేరి మెరిట్ స్టూడెంట్‌గా నిలిచింది. చదువు పూర్తికాక ముందే రాజస్థాన్‌లోని సికర్ నుంచి మంచి సంబంధం వచ్చింది. కోరి కాళ్ల దగ్గరకు వరుడొస్తే కాదనడమెందుకు? పైగా పెళ్లికొడుకూ డాక్టరే. ఎయిమ్స్ (ఢిల్లీ)లో ఉద్యోగం... బిడ్డా, అల్లుడూ ఇద్దరూ డాక్టర్లే అన్న ఆనందం ఆమె తండ్రిది. బాజాభజంత్రీలు మోగాయి. ఆ బంధం వాళ్లను ఒకింటి వాళ్లను చేసింది. తొలిరోజులు... పారాణి ఆరకముందే ఉద్యోగబాధ్యతను సాకుగా చూపి వెంటనే ఢిల్లీ వెళ్లిపోయాడతడు. తన చదువూ మధ్యలోనే ఉంది కాబట్టి పూర్తి చేసుకోవడానికి ఆమె అజ్మీర్ వెళ్లిపోయింది. ఇంట్లో బంధువుల హడావిడి తగ్గక ముందే ఆ ఆలుమగలు చెరోవైపు ప్రయాణమవడంతో ఇద్దరి మధ్య చనువు పెరగలేదు. తర్వాత ఆమెకూ ఎయిమ్స్‌లోని ఎనస్థిషియా డిపార్ట్మెంట్లో ఉద్యోగం దొరికింది. ఇద్దరూ కలిసి ఉండడం మొదలుపెట్టారు. ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. కారణమేంటో కానీ కలహాలు ఆ కాపురాన్ని కలిసుండనివ్వట్లేదు. తను మాత్రం అతనికి దగ్గరకాలేకపోతోంది. లైబ్రరీలోనే.. అతడు హాస్పిటల్ లైబ్రరీలోనే కాలం గడిపేవాడు. ఆమె అతనిని కలవాలనుకుంటే లైబ్రరీకే వెళ్లి కాసేపు మాట్లాడి డ్యూటీకొచ్చేసేది. అతడు ఏ సోషల్ గ్యాదరింగ్స్కీ ఆమెను తీసుకెళ్లేవాడు కాదు. దాంతో వీళ్ల సంసారం స్నేహితుల మధ్య బయటపడలేదు. ఆమె మాత్రం తన స్నేహితులకు, కొలీగ్స్‌కి ఎప్పుడూ ఆయన గురించి గొప్పగా చెప్పేది. తామిద్దరూ దిగిన ఫోటోలను చూపించేది సెల్ఫోన్లో. వాట్స్‌ప్‌లో అప్డేట్ చేసేది. ఇవన్నీ ఆమె ఫ్రెండ్స్ దగ్గర ఆ జంటకు చిలకాగోరింకల ఇమేజ్ను తెచ్చిపెట్టాయి. తప్పటడుగులు కానీ పెళ్లయి ఆర్నెల్లవుతున్నా భర్తతో ఏ ముద్దూ మురిపెమూ లేదు. ‘అసలు సమయానికి’ ఎప్పుడూ అసహనమే అతడికి. తనంటే ఇంత వికర్షణెందుకు? ఎవరితోనైనా అఫైర్ ఉందా.. ఏమో ఒకేచోట పనిచేస్తున్నాం.. ఏ అమ్మాయితోనూ అంత క్లోజ్‌గా మూవ్ అయినట్టు కనిపించలేదెప్పుడు. పైగా ఎప్పుడూ మగవాళ్లతోనే ఉంటాడు అనుకుంటున్నప్పుడు ఆమె మనసు ఏదో కీడు శంకించింది. మొదటిసారి అతని సెక్సువాలిటీ మీద అనుమానం వచ్చింది. అప్పటి నుంచి ఆయన ప్రవర్తనను జాగ్రత్తగా పరిశీలించసాగింది. నిజం తెలిసింది. తనతో పంచుకోవలసిన చనువును భర్త ఇతర మగాళ్లతో పంచుకుంటున్నట్టు తేలింది. తన భర్త హోమోసెక్సువల్! దిగ్భ్రాంతి. నిజాన్ని దాచి పెళ్లి చేసుకున్నాడా? మోసపోయిన భావన ఆవేశంగా మారింది. కాలర్ పట్టుకొని అడిగింది. సమాధానం చెప్పే బదులు భార్యను హింసించడం మొదలుపెట్టాడు. చిత్రవధను తట్టుకోలేక అత్తామామలకు ఫోన్ చేసింది. ‘మీ కొడుకు ఇలాంటి వాడని తెలిసీ పెళ్లెలా చేశారు? ’ ‘వాడు అలాంటి వాడని ఇప్పుడు నువ్వు చెప్తుంటేనే తెలుస్తోంది!’ మామగారి సమాధానం. వాళ్ల కొడుకుకి ఉన్న మగ సంబంధాల గురించి చెప్పింది. తమకేమీ తెలియదనే జవాబు అవతలి నుంచి. నిస్సహాయంగా నిలబడిపోయింది. ఓ రోజు పెద్ద పోట్లాటే అయింది. మళ్లీ అత్తమామలకు ఫోన్ చేసింది ఉన్న పళంగా ఢిల్లీ రమ్మని. కోడలి గొంతులో ఏదో గాభరా, ఆందోళన వినిపించాయి. హుటాహుటిన బయలుదేరారు. వీళ్లు ఢిల్లీ చేరేటప్పటికే కోడలు ప్రాణంలేని బొమ్మలా అయింది. ఫేస్బుక్లో సంచలనం.. తనపట్ల భర్తకున్న నిర్లిప్తత, తనను అతను వంచించిన తీరు ఆమెను నిస్పృహలోకి నెట్టాయి. అది ఆమెను ఆత్మహత్యకు ఉసిగొల్పింది. ప్రాణం తీసుకునే ముందు భర్త గురించి ఫేస్బుక్లో పోస్ట్ ఒకటి పెట్టింది. తెల్లవారి అది చదివిన ఆమె స్నేహితులు, కొలీగ్స్, అతని కొలీగ్స్ హతాశులయ్యారు. ఈ విషయం గురించి కనీసం తమతో ఓ మాట కూడా పంచుకోలేదని బాధపడ్డారు. ‘మా అబ్బాయికి ఇలాంటి సమస్య ఉందని వాడు మాతో ఎప్పుడూ చెప్పలేదు. అయినా ఇవ్వాళ రేపు ఇవన్నీ సహజమని తెలిసి కూడా మా కోడలు ఎందుకంత డిస్టర్బ్ అయిందో అర్థం కావట్లేదు’ అన్నారు అత్తమామలు. ‘పెళ్లయిన ఆర్నెల్లకు తెలిసింది అల్లుడు అలాంటి వాడని. ఆ సంబంధాల నుంచి అతణ్ణి బయటకు తేవడానికి చాలా ప్రయత్నించింది’ అంటారు అమ్మాయి అమ్మానాన్నలు. ఇంత జరిగినా ‘అసలు నేను ఎలాంటి హోమోసెక్సువల్ యాక్టివిటీస్‌లో పార్టిసిపేట్ కాలేదు’ అనే అంటాడు కటకటకాల్లో ఉన్న భర్త. ఏది ఏమైనా ఆమె ప్రాణాలు తీసుకోవాల్సింది కాదు అంటారు ఆమె బంధువులు. తప్పెవరిది అన్నది ముఖ్యం కాదు. ఇలాంటి తప్పులు ఎలా నివారించాలి అనేది ముఖ్యం. వ్యక్తిగత స్వభావాలను ఎవరికి వారు సరిదిద్దుకోవాలి. అది వీలుకానప్పుడు వాటి కారణంగా ఎదుటివారి జీవితాలు బలికాకూడదన్న సంస్కారం అన్నా పాటించాలి. ఏమైనా ఈ ఉదంతం ఒక హెచ్చరిక. యువతీ యువకులకూ ఇరువైపులా తల్లిదండ్రులకూ ఇది మేలుకొలుపు కావాలి. - సరస్వతి రమ, ఫ్యామిలీ ప్రతినిధి ఈ కేసులో ఏమంటున్నారు? కౌన్సెలింగ్ తప్పనిసరి.. ప్రీ మ్యారిటల్ కౌన్సెలింగ్ ఒక్క అమ్మాయి, అబ్బాయికే ఇరు కుటుంబాలకు కూడా. పెళ్లంటే ఏంటి, పెళ్లికూతురు, పెళ్లికొడుకు పాత్రలేంటి? సెక్స్ అంటే ఏంటి? సెక్సువాలిటీ అంటే ఏంటి? పెళ్లిలో సెక్స్ పాత్ర ఏంటి? అత్తమామలు వ్యవహరించాల్సిన తీరు, ఈ కౌన్సెలింగ్ ఇండివిడ్యువల్‌గా ఉంటుంది కాబట్టి సెక్సువాలిటీకి సంబంధించి ఏ సమస్యలున్నా బయటపడే అవకాశం ఉంటుంది. - డాక్టర్ సి. వీరేందర్, మనస్తత్వ విశ్లేషకులు. యాక్సెప్టెన్స్ రావాలి.. సెక్సువాలిటీకి సంబంధించిన ఏ స్థితినైనా డిజార్డర్‌గా పరిగణించడం ఎప్పుడో మానేసింది సైకియాట్రిక్ సొసైటీ. అల్లుడిని అత్తమామలు గుర్తించే కన్నా ముందు కొడుకును తల్లిదండ్రులు అర్థంచేసుకోవాలి. పిల్లలతో చనువుగా ఉండాలి. వాళ్లు ఎలా ఉన్నా ఓన్ చేసుకుంటామనే భరోసా ఇవ్వాలి. ఇది ఎయిమ్స్ కేస్‌లో ఉంటే కొడుకు ఎలాంటి వాడో ముందే తెలిసేది. పరిస్థితి పెళ్లిదాకా వచ్చేది కాదు. - డాక్టర్ పద్మాపాల్వాయ్, మానసిక నిపుణులు ఫిజికల్ ఎట్రాక్షన్ బ్లడ్ టెస్ట్‌లతో పాటు బిహేవియరల్ టెస్టూ అవసరమే. అందుకే ఎంగేజ్‌మెంట్‌కూ, పెళ్లికీ మధ్య కొంత గ్యాప్ ఉండేలా చూసుకోవాలి. ఈ సమయంలో అబ్బాయిని అమ్మాయి వాళ్లింటికి, అమ్మాయిని అబ్బాయి వాళ్లింటికీ పంపించి, ఇద్దరి మధ్యా కంపాటబులిటీ కుదురుతుందో లేదో తెలుసుకోవాలి. అన్నిటికన్నా ముందు.. అమ్మాయి, అబ్బాయికి మధ్య అసలు ఫిజికల్ ఎట్రాక్షన్ ఉందో లేదో గమనించాలి. - దేవి, సామాజిక కార్యకర్త కొత్త చట్టాలు కావాలి: అమ్మాయి సూసైడ్ చేసుకోకుండా డైవోర్స్‌కి అప్లయ్ చేసుకోవాల్సింది. అయితే భర్త ‘గే’ అని నిరూపించే సాక్ష్యాన్ని చూపించాలి. అసలు విషయం ఇక్కడిదాకా రాకుండా ఉండాలంటే ‘గేస్’ లైఫ్‌స్టయిల్‌కి సంబంధించి కొన్ని కొత్త చట్టాలు కావాలి. హోమోసెక్సువల్స్ మధ్య పెళ్లిళ్లు, వాళ్ల రిలేషన్షిప్స్ని సపోర్ట్‌చేస్తూ చట్టాలు వస్తే పేరెంట్స్ ఫోర్స్‌కి, సొసైటీ వేసే ముద్రకి భయపడే అవకాశం ఉండదు. - నిశ్చల సిద్ధారెడ్డి, అడిషనల్ గవర్నమెంట్ ప్లీడర్, సికింద్రాబాద్ -
అజ్మీర్ దర్గాకు తెలంగాణ చాదర్
అధికారులను పంపిన సీఎం కేసీఆర్ హైదరాబాద్: రాజస్థాన్ రాష్ట్రంలోని అజ్మీర్‌లోని ప్రఖ్యాత హజరత్ ఖాజా మొయినొద్దీన్ చిస్తీ దర్గా ఉర్సు ఉత్సవాల సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం తరపున సమర్పించనున్న చాదర్‌ను ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు శుక్రవారం ఉదయం తన క్యాంపు కార్యాలయంలో మైనార్టీ శాఖ అధికారులకు అందజేశారు. దీన్ని హైదరాబాద్ పాతబస్తీలో ప్రత్యేకంగా తయారు చేయించారు. చాదర్‌పై మక్కా మదీనాచిత్రాల ముద్రణతో పాటు, ‘హండ్రెడ్స్ ఆఫ్ రిగార్డ్స్ ఫ్రమ్ కె. చంద్రశేఖర్ రావు’ అని రాయించారు. దీనితో పాటు రూ.2.51 లక్షల నజరానా కూడా దర్గాకు పంపించారు. హైదరాబాద్ రుబాత్పై మాట్లాడాలని అధికారులకు ఆదేశం... తెలంగాణ రాష్టం తరపున అజ్మీర్ షరీఫ్ దర్గాకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం నిర్మించ తలపెట్టిన హైదరాబాద్ రుబాత్ (అతిథి గృహం)పై తాజా స్థితిని అక్కడి అధికారులతో మాట్లాడాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సంబంధిత అధికారులను ఆదేశిం చారు. ఉర్సు ఉత్సవాలు ఘనంగా జరగాలని, అందరికి శుభం కలగాలని సీఎం ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ తదితరులు పాల్గొన్నారు. జైపూర్‌కు బయలుదేరిన అధికారులు సీఎం కేసీఆర్ అందజేసిన చాదర్‌ను తీసుకొని శుక్రవారం రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్, రాష్ట్ర మైనార్టీ శాఖ డెరైక్టర్ జలాలుద్దీన్ అక్బర్ జైపూర్‌కు వెళ్లారు. శనివారం ప్రార్థనల అనంతరం వారు చాదర్‌ను సమర్పించనున్నారు. -
స్మార్ట్ సిటీల కోసం టాస్క్‌ఫోర్స్
వైజాగ్, అజ్మీర్, అలహాబాద్‌ల కోసం కార్యాచరణ ప్రణాళిక సాక్షి, న్యూఢిల్లీ: విశాఖపట్నం(ఆంధ్రప్రదేశ్), అజ్మీర్(రాజస్తాన్), అలహాబాద్(ఉత్తరప్రదేశ్) నగరాలను స్మార్ట్ సిటీలుగా అభివృద్ధి పరిచేందుకు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేయాలని భారత్, అమెరికాలు నిర్ణయించాయి. ఆ టాస్క్‌ఫోర్స్ మూడు నెలల్లోగా కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాల్సి ఉంటుంది. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం. వెంకయ్యనాయుడు, యూఎస్ వాణిజ్య శాఖ మంత్రి పెన్నీ ప్రిజ్కర్ల మధ్య మంగళవారం జరిగిన భేటీలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. నగరాల వారీగా టాస్క్‌ఫోర్స్ కమిటీలు ఏర్పాటుచేసి ఈ కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని ఈ భేటీలో నిర్ణయించారు. ఈ టాస్క్‌ఫోర్స్ కమిటీల్లో ఆయా రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధులు, కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు, అమెరికా వాణిజ్య, అభివృద్ధి సంస్థ(యూఎస్టీడీఏ) ప్రతినిధులు ఉంటారు. ఆయా టాస్క్‌ఫోర్స్ కమిటీలు సంబంధిత నగరాల నిర్ధిష్ట లక్షణాలు, ప్రాజెక్టు అవసరాలు, పెట్టుబడుల ఆకర్షణ కోసం రాబడి నమూనాలు తదితర అంశాలను చర్చించి కార్యాచరణ రూపొందించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. విశాఖ, అజ్మీర్, అలహాబాద్ నగరాలను స్మార్ట్ సిటీలుగా అభివృద్ధి పరిచేందుకు మూడు రాష్ట్రాలతో జనవరి 25న యూఎస్టీడీఏ ఒప్పందం కుదుర్చుకుందని పెన్నీ ప్రిజ్కర్ వివరించారు. ఆంధ్రప్రదేశ్, రాజస్తాన్ ముఖ్యమంత్రులతో మాట్లాడానన్నారు. తాజా పరిణామాలతో స్మార్ట్ సిటీల స్వప్నం వాస్తవ రూపం దాల్చనుందని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. స్మార్ట్ సిటీల నిర్మాణానికి అవసరమైన నిధులను ఎఫ్‌డీఐ లేదా ఎఫ్ఐఐల ద్వారా సేకరిస్తామన్నారు. టాస్క్‌ఫోర్స్ కమిటీల్లో కేంద్రం తరపున పట్టణాభివృద్ధి శాఖ అదనపు కార్యదర్శి దుర్గా శంకర్ మిశ్రా, సంయుక్త కార్యదర్శులు డాక్టర్ సమీర్ శర్మ, ప్రవీణ్ ప్రకాశ్‌లు ప్రాతినిథ్యం వహిస్తారని వివరించారు. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను వెంటనే ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్ ముఖ్యమంత్రులకు వెంకయ్యనాయుడు ఫోన్లో వివరించారు. అలాగే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రితో కూడా త్వరలో మాట్లాడనున్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ టాస్క్‌ఫోర్స్ కమిటీలో రాష్ట్రం తరపున పురపాలక శాఖ మంత్రి పి.నారాయణతో పాటు విశాఖ మున్సిపల్ కమిషనర్, పురపాలన కార్యదర్శి ప్రాతినిధ్యం వహించనున్నట్టు తెలిపారని వెంకయ్యనాయుడు మీడియాకు వివరించారు. విశాఖపట్నం విద్యార్థి చెక్కపై రూపొందించిన నరేంద్ర మోదీ, ఒబామాల కరచాలనం చిత్రాన్ని సమావేశం అనంతరం పెన్నీకి వెంకయ్యనాయుడు బహూకరించారు. -
కేంద్ర కేబినెట్ లో సన్వర్‌లాల్
లోక్‌సభకు పోటీ చేసిన తొలిసారే ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడిని కంగు తినిపించారు సన్వర్‌లాల్ జాట్. అధ్యాపక వృత్తి నుంచి రాజకీయ నాయకుడిగా మారిన 59 ఏళ్ల సన్వర్‌లాల్ - నరేంద్ర మోదీ కేబినెట్ మంత్రి పదవి దక్కించుకున్నారు. వసుంధరా రాజేకు అత్యంత నమ్మకస్తుడైన సన్వర్‌లాల్ రాజస్థాన్ లోని అజ్మీర్ లోక్‌సభ స్థానానికి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో పీసీసీ అధ్యక్షుడు సచిన్ పైలట్ పై ఆయన విజయం సాధించారు. అంతకుముందు ఐదు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. వ్యక్తిగత, కుటుంబ వివరాలు పూర్తిపేరు: సన్వర్‌లాల్ జాట్ జన్మదినం:1955 జనవరి 1 జన్మస్థలం: బినాయ్, అజ్మీర్ జిల్లా వయసు: 59 భార్య: నర్బదా పిల్లలు: ఇద్దరు కుమారులు, కుమార్తె విద్యార్హత: ఎంకామ్, పీహెచ్ డీ పార్టీ: బీజేపీ రాష్ట్రం: రాజస్థాన్ రాజకీయ ప్రస్థానం 1990లో బినాయ్ ఎమ్మెల్యేగా ఎన్నిక 1993, 1998, 2003 వరుసగా ఎమ్మెల్యేగా గెలుపు 2008 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి 2013లో నాసిరాబాద్ లో ఎమ్మెల్యేగా విజయం 1993లో బైరాన్ సింగ్ షికావత్ కేబినెట్ లో మంత్రి పదవి 2003-2008లో వసుంధరాజే ప్రభుత్వంలో ఇరిగేషన్ మంత్రిగా సేవలు 2014 లోక్‌సభ ఎన్నికల్లో అజ్మీర్ నుంచి ఎంపీగా గెలుపు 2014 నవంబర్ 9న కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం -
సేవల్ని తగ్గించిన డీటీసీ
న్యూఢిల్లీ : 2007 ఏప్రిల్ నుంచి ఈ ఏడాది మార్చివరకూ 68 అంతర్రాష్ట్ర మార్గాల్లో ఢిల్లీ రవాణా సంస్థ (డీటీసీ) త న సేవలను తగ్గించింది. డీటీసీ గణాంకాల ప్రకారం 2007-08 మధ్యకాలంలో మొత్తం 80 అంతర్రాష్ట్ర మార్గాల్లో బస్సు సేవలను అందించాల్సి ఉంది. అయితే కేవలం 12 మార్గాలకే దీని సేవలు పరిమితమయ్యాయి. నోయిడా, ఘజియాబాద్, మీరట్, బులంద్‌షహర్, గుర్గావ్ తదితర అంతర్రాష్ట్ర మార్గాల్లో మాత్రమే డీటీసీ తన బస్సులను నడుపుతోంది. నాలుగైదు సంవత్సరాల క్రితం అనేక అంతర్రాష్ట్ర మార్గాల్లో డీటీసీ బస్సులు ప్రయాణికులను వారి వారి గమ్యస్థానాలకు చేరవేశాయి. ఉత్తరప్రదేశ్, హర్యా నా రాష్ట్రాల్లోని అనేక ప్రాంతాలకు నగరం నుంచి డీటీసీ బస్సులు ప్రతిరోజూ రాకపోకలు సాగించాయి.