కేంద్ర కేబినెట్ లో సన్వర్లాల్
లోక్సభకు పోటీ చేసిన తొలిసారే ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడిని కంగు తినిపించారు సన్వర్లాల్ జాట్. అధ్యాపక వృత్తి నుంచి రాజకీయ నాయకుడిగా మారిన 59 ఏళ్ల సన్వర్లాల్ - నరేంద్ర మోదీ కేబినెట్ మంత్రి పదవి దక్కించుకున్నారు. వసుంధరా రాజేకు అత్యంత నమ్మకస్తుడైన సన్వర్లాల్ రాజస్థాన్ లోని అజ్మీర్ లోక్సభ స్థానానికి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. 2014 లోక్సభ ఎన్నికల్లో పీసీసీ అధ్యక్షుడు సచిన్ పైలట్ పై ఆయన విజయం సాధించారు. అంతకుముందు ఐదు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
వ్యక్తిగత, కుటుంబ వివరాలు
పూర్తిపేరు: సన్వర్లాల్ జాట్
జన్మదినం:1955 జనవరి 1
జన్మస్థలం: బినాయ్, అజ్మీర్ జిల్లా
వయసు: 59
భార్య: నర్బదా
పిల్లలు: ఇద్దరు కుమారులు, కుమార్తె
విద్యార్హత: ఎంకామ్, పీహెచ్ డీ
పార్టీ: బీజేపీ
రాష్ట్రం: రాజస్థాన్
రాజకీయ ప్రస్థానం
1990లో బినాయ్ ఎమ్మెల్యేగా ఎన్నిక
1993, 1998, 2003 వరుసగా ఎమ్మెల్యేగా గెలుపు
2008 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి
2013లో నాసిరాబాద్ లో ఎమ్మెల్యేగా విజయం
1993లో బైరాన్ సింగ్ షికావత్ కేబినెట్ లో మంత్రి పదవి
2003-2008లో వసుంధరాజే ప్రభుత్వంలో ఇరిగేషన్ మంత్రిగా సేవలు
2014 లోక్సభ ఎన్నికల్లో అజ్మీర్ నుంచి ఎంపీగా గెలుపు
2014 నవంబర్ 9న కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం