Sanwar Lal Jat
-
బీజేపీ ఎంపీ కన్నుమూత
-
బీజేపీ ఎంపీ కన్నుమూత
న్యూఢిల్లీ: అజ్మీర్ బీజేపీ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి సన్వర్‌లాల్ జాట్ బుధవారం ఉదయం కన్నుమూశారు. ఎయిమ్స్ చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. గత నెలలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అధ్యక్షతన నిర్వహించిన సభలో ఆయన కుప్పకూలిపోయారు. వెంటనే ఆయనను జైపూర్‌లోని సవాయ్ మాన్ సింగ్(ఎస్ఎంఎస్) ఆస్పత్రికి తరలించారు. తర్వాత ఢిల్లీ ఎయిమ్స్‌లో చేర్చారు. పరిస్థితి విషమించడంతో నేడు కన్నుమూశారు. సన్వర్‌లాల్‌కు ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నారు. సన్వర్‌లాల్ 1955, జనవరి 1న అజ్మీర్‌లో జన్మించారు. ఎంకామ్, పీహెచ్డీ చేసి ప్రొఫెసర్‌గా పనిచేశారు. తర్వాత బీజేపీలో చేరి కేంద్ర మంత్రి స్థాయికి ఎదిగారు. రాజస్థాన్ మంత్రిగానూ పనిచేశారు. నరేంద్ర మోదీ మంత్రివర్గంలో 2014 నుంచి 2016 వరకు జలవనరుల సహాయ మంత్రిగా ఆయన పనిచేశారు. రాజస్థాన్ కిసాన్ ఆయోగ్ చైర్మన్‌గానూ ఉన్నారు. -
'ప్రాజెక్టుల నిర్మాణంలో చట్ట ఉల్లంఘన లేదు'
► విభజన అనంతరం కొత్తవేవీ చేపట్టలేదని తెలంగాణ చెప్పింది ► అందువల్ల విభజన చట్టంలో ఉల్లంఘనేమీ లేదు- రాజ్యసభలో కేంద్రం స్పష్టీకరణ న్యూఢిల్లీ : తాము జూన్ 2, 2014 తరువాత కొత్త ప్రాజెక్టులు ఏవీ చేపట్టలేదని తెలంగాణ ప్రభుత్వం తమకు లేఖ రాసిందని, అందువల్ల పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల, నక్కలగండి ఎత్తిపోతల పథకాల నిర్మాణం ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టాన్ని ఉల్లంఘించి జరుపుతున్నట్టు కాదని కేంద్రం స్పష్టం చేసింది. టీడీపీ ఎంసీ సి.ఎం.రమేశ్ సోమవారం రాజ్యసభలో అడిగిన రాతపూర్వక ప్రశ్నకు కేంద్ర జల వనరుల శాఖ సహాయ మంత్రి సన్వర్‌లాల్ జాట్ సమాధానం ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టం-2014లోని 11వ షెడ్యూలులో గల సెక్షన్ 84(3), 85(8) డి మరియు పేరా 7ను ఉల్లంఘిస్తూ, సమగ్ర ప్రాజెక్టు నివేదికను కేంద్ర జల సంఘం ఆమోదించకుండానే తెలంగాణ ప్రభుత్వం పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, నక్కలగండి ఎత్తిపోతల పథకాలకు పునాది రాయి వేసినట్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఫిర్యాదు ఏదైనా వచ్చిందా? వస్తే ఈ పథకాలను ఆపేందుకు కేంద్రం తీసుకున్న చర్యలేవీ అంటూ సి.ఎం.రమేశ్ ప్రశ్నించారు. దీనికి సన్వర్ లాల్ జాట్ సమాధానమిస్తూ ‘ఏపీ ప్రభుత్వం సంబంధిత అంశంపై కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు, కేంద్ర జల సంఘానికి ఫిర్యాదు చేశాయి. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల, నక్కలగండి ఎత్తిపోతల పథకాలకు సంబంధించి ఇప్పటివరకు సాంకేతిక-ఆర్థిక అంచనా నివేదిక ఏదీ రాలేదు. అయితే తెలంగాణ ప్రభుత్వం 22.08.2015న ఒక లేఖ మాకు రాసింది. విభజన తేదీ అయిన 2 జూన్ 2014 తరువాత తాము ఏ కొత్త ప్రాజెక్టులు చేపట్టలేదని ఆ లేఖలో పేర్కొంది. అందువల్ల ఈ పునర్ వ్యవస్థీకరణ చట్టంలో ఎలాంటి ఉల్లంఘన జరగలేదు’ అని పేర్కొన్నారు. -
గంగానది పుట్టుపుర్వోత్తరాలపై లోక్‌సభలో ప్రశ్నలు!
న్యూఢిల్లీ: హిందువులు పవిత్రంగా భావించే గంగా నదిపై ఈ రోజు లోక్‌సభలో విచిత్రమైన ప్రశ్నలు అడిగారు. గంగా నది ఎక్కడ నుంచి వచ్చింది? ఎవరు తెచ్చారు? ఆ నదిలో సాన్నం చేస్తే కలిగే ప్రయోజనాలు ఏమిటి? ...ఇలా సాగింది ప్రశ్నల పరంపర. సభలో బీజేపీ ఎంపీ ప్రభాత్సిన్హ్ ప్రతాప్‌సిన్హ్ చౌహాన్ ఈ ప్రశ్నలు అడిగారు. 'ఏంటిది? ఇది కూడా ఓ ప్రశ్నేనా?' అంటూ స్పీకర్ సుమిత్రా మహాజన్ సైతం ఆశ్చర్యం వ్యక్తంచేశారు. ప్రశ్నోత్తరాల సమయంలో జలవనరుల శాఖ సహాయమంత్రి సాన్వర్ లాల్ జాట్ సమాధానమిస్తున్న సమయంలో చౌహాన్ ఈ ప్రశ్నలు అడిగారు. దీంతో కొందరు సభ్యులు ఆయనని ఆశ్చర్యంగా చూశారు. మరికొందరు నవ్వుకున్నారు. మంత్రి కూడా కాసేపటికి తేరుకొని, జనావళి సంక్షేమం కోసం ఆ నదిని భగీరథుడు భూమి మీదకు తీసుకువచ్చినట్లు పురాణాలు చెబుతున్నాయని వివరించారు. గంగానదికి పూర్వవైభవం తీసుకువచ్చేందుకు, పరీవాహక ప్రాంతాలను అభివద్ధి పరిచేందుకు ఐఐటీ నిపుణుల కమిటీ జనవరిలో సమర్పించిన నివేదికను పరిశీలిస్తున్నామని మంత్రి సాన్వర్ మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఎనిమిది అంశాలపై కమిటీ సిఫారసులు చేసిందని వివరించారు. -
కేంద్ర కేబినెట్ లో సన్వర్‌లాల్
లోక్‌సభకు పోటీ చేసిన తొలిసారే ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడిని కంగు తినిపించారు సన్వర్‌లాల్ జాట్. అధ్యాపక వృత్తి నుంచి రాజకీయ నాయకుడిగా మారిన 59 ఏళ్ల సన్వర్‌లాల్ - నరేంద్ర మోదీ కేబినెట్ మంత్రి పదవి దక్కించుకున్నారు. వసుంధరా రాజేకు అత్యంత నమ్మకస్తుడైన సన్వర్‌లాల్ రాజస్థాన్ లోని అజ్మీర్ లోక్‌సభ స్థానానికి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో పీసీసీ అధ్యక్షుడు సచిన్ పైలట్ పై ఆయన విజయం సాధించారు. అంతకుముందు ఐదు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. వ్యక్తిగత, కుటుంబ వివరాలు పూర్తిపేరు: సన్వర్‌లాల్ జాట్ జన్మదినం:1955 జనవరి 1 జన్మస్థలం: బినాయ్, అజ్మీర్ జిల్లా వయసు: 59 భార్య: నర్బదా పిల్లలు: ఇద్దరు కుమారులు, కుమార్తె విద్యార్హత: ఎంకామ్, పీహెచ్ డీ పార్టీ: బీజేపీ రాష్ట్రం: రాజస్థాన్ రాజకీయ ప్రస్థానం 1990లో బినాయ్ ఎమ్మెల్యేగా ఎన్నిక 1993, 1998, 2003 వరుసగా ఎమ్మెల్యేగా గెలుపు 2008 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి 2013లో నాసిరాబాద్ లో ఎమ్మెల్యేగా విజయం 1993లో బైరాన్ సింగ్ షికావత్ కేబినెట్ లో మంత్రి పదవి 2003-2008లో వసుంధరాజే ప్రభుత్వంలో ఇరిగేషన్ మంత్రిగా సేవలు 2014 లోక్‌సభ ఎన్నికల్లో అజ్మీర్ నుంచి ఎంపీగా గెలుపు 2014 నవంబర్ 9న కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం