మద్యంమత్తులో విదేశీ జంటపై.. | Spanish couple manhandled by drunk men in Ajmer | Sakshi
Sakshi News home page

మద్యంమత్తులో విదేశీ జంటపై..

Published Tue, Apr 5 2016 8:36 AM | Last Updated on Fri, May 25 2018 2:06 PM

మద్యంమత్తులో విదేశీ జంటపై.. - Sakshi

మద్యంమత్తులో విదేశీ జంటపై..

అజ్మీర్: రాజస్థాన్లోని పర్యాటక ప్రాంతం అజ్మీర్లో మద్యంమత్తులో కొందరు వీరంగం సృష్టించారు. ఈ ప్రాంతాన్ని సందర్శించేందుకు వచ్చిన స్పెయిన్ జంటపై దాడి చేసి కొట్టారు. స్పెయిన్ యువతిని లైంగికంగా వేధించినట్టు ఆరోపణలు వచ్చాయి.

మద్యంతాగిన కొందరు స్థానికులు స్పెయిన్ జంట పట్ల అనుచితంగా ప్రవర్తించినట్టు ఎస్పీ నితిన్ దీప్ చెప్పారు. విదేశీయులతో మాట్లాడేందుకు ప్రయత్నిస్తూ, వారి వెంటపడినట్టు తెలిపారు. విదేశీ మహిళను వేధించినట్టు సమాచారం. బాధితులు అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్లి స్నేహితుడిని పిలిచారు. స్థానికులు విదేశీయులతో గొడవపడి దాడి చేశారు. ఈ దాడిలో ఓ యువకుడు గాయపడ్డాడు. అతని తలకు గాయాలయ్యాయి. గాయపడ్డ స్పెయిన్ యువకుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. దాడి చేసిన నిందితుల వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని ఎస్పీ చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement