బరాన్: నవరాత్రి సందడి మధ్య కారు ప్రమాదం చోటుచేసుకుంది. రాజస్థాన్‌లోని బరాన్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. అత్రు పట్టణంలోని ఖేద్లిగంజ్ కూడలి వద్ద మద్యం మత్తులో ఉన్న కారు డ్రైవర్ నవరాత్రి సందడిలో మునిగితేలుతున్న జనాలపైకి కారును పోనిచ్చాడు.
ఈ ఘటనలో 12 మంది గాయపడ్డారు. వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నదని తెలుస్తోంది. కానిస్టేబుల్ మనోజ్ గుర్జార్ మాట్లాడుతూ కారు డ్రైవర్ హనీ హెడా నుండి రాత్రి 10 గంటల సమయంలో మద్యం మత్తులో బస్టాండ్ నుండి వేగంగా కారులో వస్తున్నాడన్నారు. ఖేద్లిగంజ్ కూడలిలో అమ్మవారి హారతి కార్యక్రమంలో పాల్గొన్న జనంపైకి కారును పోనిచ్చాడు. ఆ కారు ఒక స్తంభాన్ని ఢీకొట్టి ఆగిందన్నారు. ఈ ఘటనలో ఒక ఆవు అక్కడికక్కడే మృతి చెందింది. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
సమాచారం అందుకున్న వెంటనే సబ్ ఇన్‌స్పెక్టర్ మహేష్ మెహతా, పోలీస్‌స్టేషన్ హెడ్ రామ్‌ప్రసాద్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని చక్కదిద్దారు. ఈ ఘటన గురించి తెలుసుకున్న భజరంగ్ దళ్ జిల్లా కోఆర్డినేటర్ హిమాన్షు శర్మ, టికం ప్రజాపతి, అడ్వకేట్ హరీష్ గలావ్, ఏబీవీపీ రాహుల్ వర్మ సహా వందలాది మంది ఆస్పత్రికి చేరుకుని బాధితులను పరామర్శించారు. పోలీసులు కారును స్వాధీనం చేసుకుని, కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: పట్టాలపై ఇసుక పోసి.. రైలు ప్రమాదానికి మరో కుట్ర
Comments
Please login to add a commentAdd a comment