rams
-
జనంపైకి దూసుకొచ్చిన కారు.. 35 మంది దుర్మరణం
బీజింగ్: చైనాలోని జుహాయి నగరంలో ఘోర ప్రమాదం జరిగింది. నగరంలోని స్పోర్ట్స్ సెంటర్ బయట గుమిగూడి ఉన్న జనంపైకి అతి వేగంతో అదుపు తప్పిన ఓ కారు ఒక్కసారిగా దూసుకొచ్చింది.ఈ ప్రమాద ఘటనలో 35 మంది మరణించగా 43 మంది దాకా గాయపడ్డారు. కారు నడిపిన వ్యక్తిని పోలీసులు ఇప్పటికే అరెస్టు చేసినట్లు స్థానిక మీడియా వెల్లడించింది.ఇదీ చదవండి: కెనడా ఆలయంలో ఇండియన్ కాన్సులేట్ కార్యక్రమం రద్దు -
నవరాత్రి సందడిలో కారు ప్రమాదం.. 12 మందికి గాయాలు
బరాన్: నవరాత్రి సందడి మధ్య కారు ప్రమాదం చోటుచేసుకుంది. రాజస్థాన్‌లోని బరాన్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. అత్రు పట్టణంలోని ఖేద్లిగంజ్ కూడలి వద్ద మద్యం మత్తులో ఉన్న కారు డ్రైవర్ నవరాత్రి సందడిలో మునిగితేలుతున్న జనాలపైకి కారును పోనిచ్చాడు.ఈ ఘటనలో 12 మంది గాయపడ్డారు. వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నదని తెలుస్తోంది. కానిస్టేబుల్ మనోజ్ గుర్జార్ మాట్లాడుతూ కారు డ్రైవర్ హనీ హెడా నుండి రాత్రి 10 గంటల సమయంలో మద్యం మత్తులో బస్టాండ్ నుండి వేగంగా కారులో వస్తున్నాడన్నారు. ఖేద్లిగంజ్ కూడలిలో అమ్మవారి హారతి కార్యక్రమంలో పాల్గొన్న జనంపైకి కారును పోనిచ్చాడు. ఆ కారు ఒక స్తంభాన్ని ఢీకొట్టి ఆగిందన్నారు. ఈ ఘటనలో ఒక ఆవు అక్కడికక్కడే మృతి చెందింది. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.సమాచారం అందుకున్న వెంటనే సబ్ ఇన్స్పెక్టర్ మహేష్ మెహతా, పోలీస్‌స్టేషన్ హెడ్ రామ్‌ప్రసాద్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని చక్కదిద్దారు. ఈ ఘటన గురించి తెలుసుకున్న భజరంగ్ దళ్ జిల్లా కోఆర్డినేటర్ హిమాన్షు శర్మ, టికం ప్రజాపతి, అడ్వకేట్ హరీష్ గలావ్, ఏబీవీపీ రాహుల్ వర్మ సహా వందలాది మంది ఆస్పత్రికి చేరుకుని బాధితులను పరామర్శించారు. పోలీసులు కారును స్వాధీనం చేసుకుని, కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఇది కూడా చదవండి: పట్టాలపై ఇసుక పోసి.. రైలు ప్రమాదానికి మరో కుట్ర -
ఫుడ్ ఇవ్వలేదని.. ఏకంగా హోటల్‌పైకి ట్రక్కుతో దూసుకెళ్లిన డ్రైవర్
ముంబై: మహారాష్ట్రలో ఓ ట్రక్కు డ్రైవర్ మద్యం మత్తులో బీభత్సం సృష్టించాడు. అతడికి ఆహారం ఇవ్వలేదనే కోపంతో ఏకంగా హోటల్‌పైకి ట్రక్కుతో దూసుకెళ్లాడు. ఈ ఘటన శుక్రవారం రాత్రి పుణెలోని ఇంద్రాపూర్ హింగాన్గావ్లో చోటుచేసుకుంది.కంటైనర్‌తో ట్రక్కు తో ఓ వ్యక్తి షోలాపూర్ నుంచి పుణె వెళ్తు మధ్యలో హోటల్ గోకుల్ వద్ద ఆగాడు. తర్వాత లోపలికి వెళ్లి ఆహారం అడిగాడు.కారణం తెలీదు కానీ హోటల్ యజమాని అతనికి ఫుడ్ ఇచ్చేందుకు నిరాకరించాడు. అప్పటికే మద్యం మత్తులో ఉన్న డ్రైవర్ కోపోద్రిక్తుడై తన ట్రక్కులో కూర్చుని హోటల్ భవనంపైకి పోనిచ్చాడు. అంతటితో ఆగకుండా హోటల్ బయట ఆగి ఉన్న కారును కూడా ఢీకొట్టాడు.ఇంతలో డ్రైవర్‌ను ఆపేందుకు కొందరు వ్యక్తులు ట్రక్కుపై రాళ్లు రువ్వడం చేశారు. చివరికి ట్రక్కు చక్రాలుకింద రాళ్లు పడటంతో అవి ముందుకు కదల్లేక ఆగిపోయాడు. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు కానీ హోటల్ తీవ్రంగా దెబ్బతింది సమాచారం అందుకున్న పోలీసులు ట్రక్కు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నారు. ఈ దృశ్యాలను అక్కడే ఉన్న కొంతమంది తమ ఫోన్లలో రికార్డు చేయడంతో..సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్‌గా మారింది.VIDEO | Maharashtra: A truck driver rammed his vehicle into a hotel building in #Pune after he was reportedly denied food. The truck driver was allegedly drunk. The incident took place on Friday night.#PuneNews #maharashtranews (Source: Third Party)(Full video available on… pic.twitter.com/TrPEF1ZxrA— Press Trust of India (@PTI_News) September 7, 2024 -
మెరుపు వేగంతో నిలుచున్న లారీని ఢీకొట్టి..
లక్నో: తమిళనాడులో బుధవారం తెల్లవారుజామున ఘోరం జరిగింది. తెల్లవారుజామున 4 గంటల సమయంలో వేగంగా వెళ్తున్న వ్యాన్ అదుపుతప్పి నిలబడి ఉన్న లారీని ఢీకొట్టింది. సేలం-ఈరోడ్ హైవేపై ఈ ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో ఏడాది చిన్నారితో సహా ఆరుగురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సీసీటీవీలో రికార్డ్ అయిన దృశ్యాలు భీతికొల్పుతున్నాయి. Tragic road accident on Tamil Nadu highway kills 6 people. CCTV video emerges. #TamilNadu pic.twitter.com/grWJeeofoY — Vani Mehrotra (@vani_mehrotra) September 6, 2023 ఈంగూర్‌కు చెందిన ఎనిమిది మంది సభ్యులు వ్యాన్‌లో పెరుంతురై వైపు వెళుతున్నారు. ఈ క్రమంలో రోడ్డుకు పక్కన నిలిచి ఉన్న లారీని వ్యాన్ ఢీకొట్టారు. డ్రైవర్ నిద్రలో ఉండటమే ఇందుకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతులను సెల్వరాజ్, మంజుల, ఆరుముగం, పళనిసామి, పాపతితో పాటు ఏడాది వయసున్న చిన్నారిగా గుర్తించారు. వ్యాన్ డ్రైవర్ విఘ్నేష్, మరో ప్రయాణికురాలు ప్రియా తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి పంపించారు. ఇదీ చదవండి: ఎయిర్ హోస్టెస్ రూపాకేసులో వీడిన మిస్టరీ -
ఫుట్ పాత్ పైకి వచ్చిన ట్రక్.... రెప్పపాటులో తప్పిన పెను ప్రమాదం: వీడియో వైరల్
ఎప్పడూ ఎలాంటి ఘోరం జరుగుతుందో చెప్పలేం. మనం సురక్షితమైన ప్రదేశంలో ఉన్నప్పటకీ విధిరాత బాగోకపోతే ఏదైన జరగవచ్చు. మనకి భూమ్మీద ఆయుషు ఉంటే ఎంతటి ఘోరమైన ప్రమాదం నుంచే అయినా బయటపడవచ్చు. అచ్చం అలానే ఇక్కడొక వ్యక్తి పెద్ద పెను ప్రమాదం నుంచి బయటపడ్డాడు. వివరాల్లోకెళ్తే...ఒక వ్యక్తి ఫుట్ పాత్ పై నిలబడి ఉండగా అనుహ్యంగా ఒక ట్రక్ అతనిపైకి దూసుకుపోతుంది. ఆ ట్రక్ చాలా ప్రమాదకరంగా అతని పైకి దూసుకుపోయింది. కానీ అదృష్టవశాత్తు ఆ వ్యక్తికి ఏం కాలేదు. ఆ వ్యక్తి ట్రక్కు గేట్ మధ్య ఇరుక్కుపోయాడు. తృటిలో ప్రాణాపాయం తప్పింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోని ఐపీఎస్ ఆఫీసర్ దీపాంశు కబ్రా ఈ వీడియోని ట్విట్టర్లో పోస్టు చేశారు. ఐతే ఈ వీడియో పై తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ కూడా స్పందించడం విశేషం. Life is Sooooooo unpredictable! pic.twitter.com/tFZQ1kJf74 — Dipanshu Kabra (@ipskabra) July 7, 2022 (చదవండి: రెస్టారెంట్‌పై దాడులకు తెగబడ్డ మహిళలు...వీడియో వైరల్) -
Pachchis Movie: ‘పచ్చీస్’ మూవీ రివ్యూ
చిత్రం: ‘పచ్చీస్’ తారాగణం: రామ్స్, శ్వేతావర్మ సంగీతం: స్మరణ్; కెమెరా: కార్తీక్ పర్మార్ నిర్మాతలు: కౌశిక్, రామసాయి దర్శకత్వం: శ్రీకృష్ణ, రామ సాయి ఓటీటీ: అమెజాన్ కరోనా సెకండ్ వేవ్, లాక్ డౌన్లతో థియేటర్లు మూసేసిన పరిస్థితుల్లో ఇప్పుడు చూపంతా ఓటీటీల పైనే! వరుసగా బోలెడన్ని సినిమాలు, సిరీస్‌లు ఏదో ఒక ఓటీటీలో వస్తున్నాయి. ఖాళీ ఉంటే కాలం ఖర్చు చేయడానికి ఓకే కానీ, వీటిలో క్వాలిటీవి ఎన్ని వస్తున్నాయి? ఇలాంటి ఆలోచనలెన్నో రేకెత్తిస్తుంది – లేటెస్ట్ ఓటీటీ రిలీజ్ ‘పచ్చీస్’. కథేమిటంటే..: కలవారి బిడ్డ అయినా ఈజీ మనీకి అలవాటు పడి, గ్యాంబ్లింగ్‌లో తిరిగే కుర్రాడు అభిరామ్ (రామ్స్). ఎలాగోలా డబ్బు సంపాదించాలనే కాంక్షతో అనేక అబద్ధాలతో, అడ్డదోవలు తొక్కుతుంటాడు. జీవితాన్ని జూదంగా నడిపేస్తుంటాడు. అదే సమయంలో రాజకీయ నాయకులైన గంగాధర్ (‘శుభలేఖ’ సుధాకర్), బసవరాజు (విశ్వేందర్ రెడ్డి) మధ్య ఆధిపత్యం కోసం పోరాటం సాగుతుంటుంది. బెట్టింగ్‌లో ఓడిపోయిన లక్షల కొద్దీ డబ్బు కోసం బసవరాజును ఆశ్రయిస్తాడీ కుర్రాడు. రాజకీయ నేతల మధ్య గొడవలో డబ్బు కొట్టేసి, దాంతో పబ్బం గడుపుకోవాలని అనుకుంటాడు. ఆ క్రమంలోనే కనిపించకుండా పోయిన అన్న కోసం వెతికే చెల్లెలు అవంతి (శ్వేతావర్మ) ఎదురవుతుంది. అక్కడ నుంచి సవాలక్ష మలుపులు, మరిన్ని పాత్రల మధ్య ఈ జూదం ఏమై, ఎవరి పచ్చీస్ (పాచికలు) పారి, చివరికి ఏమైందన్నది సుదీర్ఘమనిపించే 2 గంటల పైగా నిడివి సిన్మా. ఎలా చేశారంటే..: నాగార్జున, విజయ్ దేవరకొండ, రామ్, రానా, అడివి శేషు – ఇలా తెలుగు సినీ తారలెందరికో ఫ్యాషన్ డిజైనరైన భీమవరం కుర్రాడు రామ్స్ ఇందులో జులాయి కుర్రాడిగా, మరో ఇద్దరు స్నేహితుల్ని వెంటేసుకొని కనిపిస్తారు. నటనలో ఈజ్ ఉన్నా, రాసిన పాత్రలో దమ్ము లేకపోవడం లోపమైంది. కొద్ది వారాలుగా కనిపించని అన్నయ్య కోసం వెతికే చెల్లెలి పాత్రలో, తానే ఓ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ లా ప్రవర్తిస్తుంటారు శ్వేతావర్మ. ఆ పాత్రకూ తీరూతెన్నూ కష్టపడి వెతుక్కోవాల్సి ఉంటుంది. సొంత పవర్ ప్రాజెక్ట్ కోసం శ్రమించే పొలిటీషియన్‌గా ‘శుభలేఖ’ సుధాకర్ ఉన్నంతలో బాగా చేశారు. జయ్‌చంద్ర, క్యాసినో ఓనర్ > రవివర్మ సహా ఇంకా చాలామంది ఉన్నారు. అయితే, చిట్టి పొట్టి మాటల డైలాగులతో లేనిపోని ఉద్విగ్నత రేపాలనే రచనా లోపం భావోద్వేగ నటనకు తావు లేకుండా చేసిందనిపిస్తుంది. ఎలా తీశారంటే..: ఓటీటీ ట్రెండ్‌కు తగ్గట్టే ఇదో క్రైమ్, సస్పెన్స్, యాక్షన్ చిత్రం అని ప్రకటించారు. కానీ, సస్పెన్స్ మాటెలా ఉన్నా... బోలెడంత గందరగోళం కథలో, కథనంలో మూటగట్టుకున్న చిత్రం ఇది. ఈ డార్క్ క్రైమ్ థ్రిల్లర్ కథలో ఎప్పటికప్పుడు కొత్త పాత్రలొస్తూ పోతుంటాయి. దేనికీ ప్రాధాన్యం ఉండదు. ప్రతి పాత్రా ఏదో ఫిలాసఫీనో, గంభీరమైన విషయమో చెబుతున్నట్టు మాట్లాడుతుంది. పైగా, ఎక్కడో జరిగే ఏవో విషయాలూ జైలులో ఉన్నవాళ్ళతో సహా అన్ని పాత్రలకూ తెలిసిపోతుంటాయి. పాత్రలు, వాటి మధ్య సంబంధాలు ప్రేక్షకులకు అర్థమయ్యేలా చేయడానికే దాదాపు సగం సినిమా గడిచిపోతుంది. అలాగే ప్రధాన పాత్రధారి ఒక చోట ఓ పోలీసాఫీసర్‌తో ‘‘ఏం జరుగుతోందో తెలియడం లేదు’’ అంటాడు. సినిమా చూస్తున్నప్పుడు ప్రేక్షకులకు కలిగే ఫీలింగూ అదే. అభిరామ్ పాత్రను జులాయిలా చూపించారు. కాసేపేమో జర్నలిస్టు అని డైలాగుల్లో అనిపిస్తారు. ఇక, చివరలో వచ్చే పోలీసాఫీసర్ శంకర్ (దయానంద్ రెడ్డి) పాత్రలైతే, పోలీసు పని కాకుండా, నిందితుల వైపు నిలబడినట్టు అనిపిస్తుంది. చాలా సందర్భాల్లో ఏం జరుగుతున్నా... నోరెళ్ళబెట్టుకొని పోలీసులు చూస్తున్నట్టనిపిస్తుంది. సినిమా అంతా అభిరామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నడిచినట్టు అనిపించి, చివరకు వచ్చేసరికి వేరెవరికో ఇన్వెస్టిగేషన్ క్రెడిట్ ఇవ్వడం కూడా వీక్షకులు జీర్ణించుకోలేరు. ఎక్కువగా నైట్ ఎఫెక్ట్‌లో డార్క్‌గా కనిపించే ఈ సినిమాలో కెమేరా వర్క్, ప్రొడక్షన్ డిజైనింగ్ బాగుంటాయి. పాటలేమీ లేవన్న మాటే కానీ, ఆ లోటేమీ పెద్దగా ఫీల్ కాము. ఎడిటర్ తన కత్తెర పదును చూపితే, రచన – దర్శకత్వ లోపాలు కొన్నయినా కవరయ్యేవి. ‘‘ముగించలేనిది ఎప్పుడూ మొదలుపెట్టద్దు’’ అని ఇందులో ఓ పాత్ర అంటుంది. బహుశా, ఆ విషయం ఈ దర్శక, రచయితలకూ వర్తిస్తుంది. కథాకథనాన్ని సరిగ్గా మొదలుపెట్టలేకపోవడంతో పాటు ముగింపూ చేయలేదనిపిస్తుంది. కంటెంట్ లేని సీన్లు సవాలక్ష వచ్చిపోయే నేపథ్యంలో... పాత్రలతో పాటు ప్రేక్షకులనూ కన్ఫ్యూజ్ చేస్తుంది. కొసమెరుపు: ఫాస్ట్ ఫార్వర్డ్లోనూ ముందుకెళ్ళని స్లో నేరేషన్ – ప... ప... ఛీ.. ఛీ...స్. – రెంటాల జయదేవ -
ఓటీటీలోనే ‘పచ్చీస్’..స్ర్టీమింగ్ ఎప్పుడంటే..
టాలీవుడ్ సెలబ్రిటీ డిజైనర్ రామ్స్ హీరోగా నటించిన తొలి చిత్రం ‘పచ్చీస్’. ఇందులో శ్వేతా వర్మ హీరోయిన్గా నటించారు. శ్రీ కృష్ణ, రామసాయి సంయుక్త దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. కౌశిక్ కుమార్ కొత్తూరి, రామసాయి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 12న ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్‌లో విడుదల కానుంది. ఈ సినిమా ట్రైలర్‌ను హీరో రానా విడుదల చేశారు. జీవితంలో పైకి రావాలనుకునే ఓ యువకుడు అనుకోకుండా ఓ క్రైమ్‌లో చిక్కుకున్నప్పుడు అతని జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి అనే కథనంతో ఈ క్రైమ్ థ్రిల్లర్ రూపొందింది. జయచంద్ర, రవివర్మ, కేశవ్ దీపక్, ధ్యాన్‌చంద్ రెడ్డి, శుభలేఖ సుధాకర్ కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రానికి సహనిర్మాత: పుష్పక్ జైన్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: దినేష్ యాదవ్ బొల్లేబోయిన. -
మెర్సిడెస్ స్పీడుకు ఇంటర్ విద్యార్థి బలి
-
మెర్సిడెస్ స్పీడుకు ఇంటర్ విద్యార్థి బలి
న్యూఢిల్లీ: బడాబాబుల విలువైన కార్లు ఢిల్లీ పౌరుల పాలిట శాపంగా మారుతున్నాయి. హై ఎండ్ వాహనాలు.. అదుపులేని వేగంతో దూసుకొస్తూ మనుషుల ప్రాణాలు బలిగొనడం ఇటీవల దేశ రాజధానిలో పరిపాటిగా మారింది. తాజాగా అక్కడ ఓ 17 ఏళ్ల ఇంటర్ కుర్రాడు మెర్సిడెస్ కారు స్పీడుకు బలైపోయాడు. అతుల్ అరోరా అనే విద్యార్థి ఆదివారం రాత్రి స్కూటర్‌పై తన స్నేహితుడిని డ్రాప్ చేసి వస్తుండగా.. మెర్సిడెస్ కారు ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. పశ్చిమ్ విహార్ ప్రాతంలో చోటు చేసుకున్న ఈ ఘటనలో.. 100 కిలోమీటర్లకు పైగా వేగంతో ప్రయాణించిన కారు విద్యార్థిని సుమారు 50 మీటర్ల మేర ఈడ్చుకెళ్లింది. ప్రమాదం జరిగాక కనీసం ఆగి కూడా చూడకుండా.. మెర్సిడెస్ కారులోని వ్యక్తి పరారయ్యాడు. సీసీటీవీ ఫోటేజీ ఆధారంగా ప్రమాదానికి కారణమైన వ్యక్తిని కనుగొనేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. దక్షిణ ఢిల్లీ ప్రాంతంలో బీఎమ్‌డబ్ల్యూ కారు అతివేగం మూలంగా ఓ ఉబర్ డ్రైవర్ ప్రాణాలు కోల్పోయిన ఘటన జనవరిలో జరిగింది. అదే నెలలో ఢిల్లీ శివార్లలో జరిగిన మరో ఘటనలో ఆడీ స్పీడు.. ఓ మహిళా సాఫ్ట్వేర్ ఇంజనీర్‌తో సహా నలుగురిని పొట్టనబెట్టుకుంది. రోడ్డు ప్రమాదాల్లో 97 శాతం అతివేగం, నిర్లక్ష్య పూరిత డ్రైవింగ్ మూలంగానే జరుగుతున్నాయని రిపోర్టులు వెల్లడిస్తున్నాయి. -
నారావారిపల్లిలో పొట్టేళ్ల ఫైట్
-
గుండెలు తీసిన పొట్టేళ్లు
శివసత్తుల పూనకాలు, పోతురాజుల వీరంగాలు, డప్పుచప్పుళ్లకు బెదరకుండా ప్రత్యేక శిక్షణ పొందిన పొట్టేళ్లు బోనాల జాతరకు సిద్ధమయ్యాయి. ఆది, సోమవారాల్లో జరిగే జాతరలో కీలక ఘట్టాలైన తొట్టెలు, ఫలహారంబళ్ల ఊరేగింపులో పొట్టేళ్లు కీలకపాత్ర పోషించనున్నాయి. అమ్మవారికి ప్రీతిపాత్రమైన పొట్టేళ్లను తొట్టెలు, ఫలహారంబళ్లు లాగేందుకు వినియోగిస్తారు. బలిష్టమైన శరీర ఆకృతి, మెలితిరిగిన కొమ్ములతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచే పొట్టేళ్లను పెంచేందుకు పలువురు ఆసక్తి చూపిస్తున్నారు. చిలకలగూడ, కిందిబస్తీ, మైలార్‌గడ్డ, వారాసిగూడ, సీతాఫల్మండి తదితర ప్రాంతాల్లో బోనాల జాతర కోసం ప్రత్యేకంగా పొట్టేళ్ల పెంపకం చేపట్టి ఆర్థిక లబ్ధి పొందుతున్నారు. జాతర సమయంలో వీటికి డిమాండ్ ఎక్కువగా ఉండడంతో రోజుకు రూ. 3 నుంచి 5 వేలకు పొట్టేళును అద్దెకు ఇస్తుంటామని పెంపకందారులు తెలిపారు. మార్నింగ్‌వాక్‌తో శిక్షణ.. జనసందోహంతోపాటు హోరెత్తించే డప్పుచప్పుళ్లకు బెదరకుండా ఉండేందుకు పొట్టేళ్లకు ప్రత్యేక శిక్షణ ఇస్తామని చిలకలగూడకు చెందిన సాయియాదవ్ వివరించారు. ప్రతిరోజు ఉదయాన్నే మార్నింగ్‌వాక్‌కు తీసుకువెల్లడంతో పొట్టేళ్లకు శిక్షణ మొదలవుతుందని, బ్రేక్‌ఫాస్ట్‌గా కందిచున్నీ, ఆవుపాలు ఇస్తామన్నారు. మెలితిరిగేందుకు కొమ్ములకు నువ్వులనూనెతో మాలిష్ చేస్తామని, రెండు పొట్టేళ్లు పెంపకానికి రోజుకు సుమారు రూ. 500 ఖర్చు అవుతుందన్నారు. హాబీగా పొట్టేళ్ల పెంపకం చేపట్టానని, జాతర సమయంలో తొట్టెలు, ఫలహారంబళ్లు లాగేందుకు వినియోగిస్తానని సాయియాదవ్ తెలిపాడు. -
ఈ పొట్టేలు నాన్ వెజిటేరియన్ గురూ!
ప్రకాశం : ఆకులు అలములు, పచ్చిక తిని కడుపు నింపుకొని, చెరువులు, కుంటల్లో నీరు తాగే శాకాహార పొట్టేళ్లను చూసి ఉంటాం. మాంసం తిని, మద్యం సేవించే మాంసాహార పొట్టేళ్లున్నాయంటే ఆశ్చర్యం కలుగక మానదు. ప్రకాశం జిల్లా పంగులూరు మండలం కొండమంజులూరు గ్రామానికి చెందిన పువ్వాడ వెంకటనారాయణకు చెందిన ఐదు నెలల వయసున్న పొట్టేలు పచ్చగడ్డికి బదులు మాంసం ముక్కలు ఆరగిస్తోంది. ప్రతి ఆదివారం కేజీ మాంసం, బాటిల్ మందు తీసుకుంటోంది. యజమాని మద్యాన్ని కూల్‌డ్రింక్ సీసాలో పోసి, దానికో పాలపీక ఏర్పాటు చేసి పట్టిస్తుంటే చప్పరించేస్తోంది. నెల రోజులుగా మాంసం, మద్యం లాగించేస్తున్న ఈ పొట్టేలును చూసి స్థానికులు ముక్కున వేలేసుకుంటున్నారు. - పంగులూరు -
ఎమ్మెల్యే తనయుడి కారు బీభత్సం
ముగ్గురు మృతి జైపూర్: రాజస్తాన్‌లోని జైపూర్‌లో శనివారం ఘోర ప్రమాదం జరిగింది. స్వతంత్ర ఎమ్మెల్యే నంద కిషోర్ మహారియా తనయుడు సిద్ధార్థ్ మహారియా మద్యం మత్తులో వేగంగా కారు నడుపుతూ ఆటోను, అనంతరం పీసీఆర్ వాహనాన్ని ఢీకొట్టడంతో ముగ్గురు మరణించగా, నలుగురు పోలీసులు గాయపడ్డారు. సీ-స్కీమ్ ప్రాంతంలో రాత్రి 1.30 గంటలకు ఈ ఘటన జరిగింది. కారు మొదట ఆటోను ఢీకొట్టి అనంతరం పక్కనే ఉన్న పీసీఆర్ వాహనంపైకి దూసుకెళ్లింది. ఆటోలోని ప్రయాణికుల్లో ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. విధుల్లో ఉన్న అసిస్టెంట్ సబ్‌ఇన్‌స్పెక్టర్‌తో పాటు మరో ముగ్గురు పోలీస్ సిబ్బంది గాయపడ్డారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఒకరు మరణించారు. కారులోని నలుగురిలో ఇద్దరు పరారు కాగా, ఎమ్మెల్యే తనయుడిని, మరొకర్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే తాను డ్రైవింగ్ చేయలేదని, మద్యం సేవించలేదని సిద్ధార్థ చెప్పారు. -
బస్సు నడిపిన కోతి.. డ్రైవర్‌కు చుక్కలు
బరేలి: ఉత్తరప్రదేశ్ లో అరుదైన ఘటన చోటుచేసుకుంది. నిలిపి ఉన్న బస్సులోకి ఓ కోతి జోరబడటమే కాకుండా నేరుగా ఇంజిన్ స్టార్ట్ చేసి రయ్ రయ్ మంటూ హారన్ కొడుతూ ముందుకు పోనిచ్చింది. ఇది చూసిన డ్రైవర్ వెంటనే బస్సులోకి వెళ్లి దానిని నియంత్రించాడు కానీ, అప్పటికే అక్కడ పార్క్ చేసి ఉంచిన రెండు బస్సులను ఢీకొట్టింది. అయితే, పెద్దగా నష్టం జరగలేదు. వివరాల్లోకి వెళితే ఫిలిబిత్ కు చెందిన ఉత్తరప్రదశ్ రోడ్డు రవాణా సంస్థ(యూపీఎస్ఆర్టీసీ) బస్సు బరేలీకి వచ్చింది. తిరిగి బయలు దేరడానికి కొద్ది సమయం ఉండటంతో ఈలోగా ప్రయాణీకులకోసం కండక్టర్ చూస్తుండగా.. డ్రైవర్ బస్సు చివరి సీట్లో కూర్చోని ఒక చిన్న కునుకులోకి జారుకున్నాడు. ఈలోగా ఓ కోతి రయ్ మంటూ బస్సులోకి ఎక్కింది. ఎక్కిందే తడవుగా.. వెంటనే ఇంజిన్ స్టార్ట్ చేసింది. ఈ లోగా కునుకులో ఉన్న డ్రైవర్ ఒక్కసారిగా మేల్కోని క్యాబిన్ వద్దకు పరుగు తీశాడు. కోతిని అక్కడి నుంచి వెళ్లగొట్టేందుకు ప్రయత్నించాడు. కానీ, అది డ్రైవర్ ను బెదిరిస్తూ మీదపడి కరిచేందుకు ప్రయత్నించడంతోపాటు ఆ క్రమంలో సెకండ్ గేర్ వేసి కిందికి దిగిపోయింది. బస్సు డ్రైవర్ సీట్లోకి వెళ్లి కూర్చొని బస్సును నియంత్రించేలోగానే అది కాస్త రెండు బస్సులను ఢీకొట్టింది. అలా డ్రైవర్‌కు కోతి చుక్కలు చూపించింది. -
బండిని లాగిన పొట్టేళ్లు..!
వీపనగండ్ల (మహబూబ్‌నగర్) : పొట్టేళ్లు కూడా బరువు లాగుతాయా? అవుననే సమాధానం వస్తుంది. మహబూబ్‌నగర్ జిల్లా వీపనగండ్లలో శుక్రవారం జరిగిన ఎద్దుల బండి లాగుడు పోటీల సందర్భంగా ఈ విడ్డూరం చోటుచేసుకుంది. పొట్టేళ్లు ప్రత్యేక బండిపై నలుగురిని 1500 అడుగుల మేర లాగి తమ శక్తిని చూపాయి. రంగారెడ్డి జిల్లా షామీర్‌పేటకు చెందిన వెంకటేశ్వర్రావుకు చెందిన రెండు పొట్టేళ్లు బండిపై నలుగురు మనుషులు ఉండగా సులువుగా లాగి పోటీలను తిలకిస్తున్న వందలాది మందిని ఉత్తేజ పరిచాయి. పోటీల నిర్వాహకులు రూ.2500లను ప్రోత్సాహక బహుమతిగా రైతుకు అందజేశారు. కాగా ప్రత్యేకంగా రూపొందించిన బండిలో పొట్టేళ్లు లాగుతుండగా తాను ప్రతిరోజూ నాలుగు కిలోమీటర్లు వెళ్లి వస్తానని వెంకటేశ్వర్రావు చెబుతున్నారు.