లక్నో: తమిళనాడులో బుధవారం తెల్లవారుజామున ఘోరం జరిగింది. తెల్లవారుజామున 4 గంటల సమయంలో వేగంగా వెళ్తున్న వ్యాన్ అదుపుతప్పి నిలబడి ఉన్న లారీని ఢీకొట్టింది. సేలం-ఈరోడ్ హైవేపై ఈ ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో ఏడాది చిన్నారితో సహా ఆరుగురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సీసీటీవీలో రికార్డ్ అయిన దృశ్యాలు భీతికొల్పుతున్నాయి.
Tragic road accident on Tamil Nadu highway kills 6 people. CCTV video emerges. #TamilNadu pic.twitter.com/grWJeeofoY
— Vani Mehrotra (@vani_mehrotra) September 6, 2023
ఈంగూర్‌కు చెందిన ఎనిమిది మంది సభ్యులు వ్యాన్‌లో పెరుంతురై వైపు వెళుతున్నారు. ఈ క్రమంలో రోడ్డుకు పక్కన నిలిచి ఉన్న లారీని వ్యాన్ ఢీకొట్టారు. డ్రైవర్ నిద్రలో ఉండటమే ఇందుకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతులను సెల్వరాజ్, మంజుల, ఆరుముగం, పళనిసామి, పాపతితో పాటు ఏడాది వయసున్న చిన్నారిగా గుర్తించారు.
వ్యాన్ డ్రైవర్ విఘ్నేష్, మరో ప్రయాణికురాలు ప్రియా తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి పంపించారు.
ఇదీ చదవండి: ఎయిర్ హోస్టెస్ రూపాకేసులో వీడిన మిస్టరీ
Comments
Please login to add a commentAdd a comment