Speeding
-
మెరుపు వేగంతో నిలుచున్న లారీని ఢీకొట్టి..
లక్నో: తమిళనాడులో బుధవారం తెల్లవారుజామున ఘోరం జరిగింది. తెల్లవారుజామున 4 గంటల సమయంలో వేగంగా వెళ్తున్న వ్యాన్ అదుపుతప్పి నిలబడి ఉన్న లారీని ఢీకొట్టింది. సేలం-ఈరోడ్ హైవేపై ఈ ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో ఏడాది చిన్నారితో సహా ఆరుగురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సీసీటీవీలో రికార్డ్ అయిన దృశ్యాలు భీతికొల్పుతున్నాయి. Tragic road accident on Tamil Nadu highway kills 6 people. CCTV video emerges. #TamilNadu pic.twitter.com/grWJeeofoY — Vani Mehrotra (@vani_mehrotra) September 6, 2023 ఈంగూర్‌కు చెందిన ఎనిమిది మంది సభ్యులు వ్యాన్‌లో పెరుంతురై వైపు వెళుతున్నారు. ఈ క్రమంలో రోడ్డుకు పక్కన నిలిచి ఉన్న లారీని వ్యాన్ ఢీకొట్టారు. డ్రైవర్ నిద్రలో ఉండటమే ఇందుకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతులను సెల్వరాజ్, మంజుల, ఆరుముగం, పళనిసామి, పాపతితో పాటు ఏడాది వయసున్న చిన్నారిగా గుర్తించారు. వ్యాన్ డ్రైవర్ విఘ్నేష్, మరో ప్రయాణికురాలు ప్రియా తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి పంపించారు. ఇదీ చదవండి: ఎయిర్ హోస్టెస్ రూపాకేసులో వీడిన మిస్టరీ -
గవర్నర్ కాన్వాయ్‌లోకి ఒక్కసారిగా దూసుకొచ్చిన కారు..
లక్నో: కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ కాన్వాయ్‌లోకి ఓ కారు దూసుకొచ్చింది. నోయిడాలో ఓ కార్యక్రమంలో పాల్గొని దిల్లీ వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ఈ వ్యవహారంలో ఇద్దరు వ్యక్తులను ఉత్తరప్రదేశ్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితులు మద్యం మత్తులో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటన పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ అంశంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల కర్ణాటక సీఎం సిద్ధరామయ్య సెక్యూరిటీ విషయంలో కూడా భద్రతా వైఫల్యాలు వెలుగులోకి వచ్చాయి. సీఎం ఇంటి ఎదురుగా నివసిస్తున్న ఓ సీనియర్ సిటిజన్ ఏకంగా సిద్ధరామయ్య వాహనాన్ని అడ్డగించి నిలదీశాడు. ముఖ్యమంత్రి ఇంటికి వస్తున్న అతిథుల కారణంగా తమ కుటుంబం కొన్నేళ్లుగా పార్కింగ్ సమస్యను ఎదుర్కొంటుందని, దీనిని పరిష్కరించాలని డిమాండ్ చేశాడు. ఇదీ చదవండి: పార్కింగ్ సమస్య.. ఏకంగా సీఎం సిద్ధరామయ్య కారునే అడ్డగించి -
బైక్‌పై లవర్స్ రొమాన్స్.. రహదారిపై అందరూ చూస్తుండగానే..!
ఢిల్లీ: ఈ మధ్య యువత రెచ్చిపోతున్నారు. పబ్లిసిటీ కోసం పబ్లిక్‌గానే హద్దులు మీరి ప్రవర్తిస్తున్నారు. చుట్టూ ఎవరున్నారనేది కూడా గమనించకుండా.. న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారు. అదేదో ఫ్యాషన్, ట్రెండ్‌గా ఫీల్ అయిపోయి అసభ్యకర చేష్టలతో వార్తల్లో కెక్కుతున్నారు. తాజాగా దేశ రాజధాని ప్రధాన రహదారిపై ఓ యువతీ యువకులు బైక్‌పై అభ్యంతకరంగా ప్రయాణించారు. Idiot's of Delhi Time - 7:15pm Day - Sunday 16-July Outer Ring Road flyover, Near Mangolpuri@dtptraffic pic.twitter.com/d0t6GKuZS5 — 𝖀𝖗𝖇𝖆𝖓 𝖀𝖙𝖘𝖆𝖛 🗨️🦂 (@Buntea) July 16, 2023 ఢిల్లీలోని అవుటర్ రింగ్ రోడ్ ఫ్లైఓవర్ మంగోల్పురీ సమీపంలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. స్పీడ్‌గా వెళ్తోన్న బైక్ పెట్రోల్ ట్యాంక్‌పై యువకుడికి ఎదురుగా కూర్చున్న యువతి అతన్ని గట్టిగా కౌగిలించుకోవడం వీడియోలో కనిపిస్తోంది. యువకునితో పాటు యువతి కూడా హెల్మెట్ పెట్టుకుని ఉంది. ఈ అంశంపై నెటిజన్లు ఫైరవుతున్నారు. రోడ్డుపై వెళ్తున్న వాహనదారులు దీన్ని ఈ దృశ్యాలను వీడియో తీశారు. అనంతరం ట్విటర్లో పోస్టు చేయడంతో నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఈ వీడియోపై స్పందించిన పోలీసులు.. ట్రాఫిక్ నిబంధనలను అతిక్రమించినందుకు కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇదీ చదవండి: దారుణం.. తాజ్‌మహల్ చూసేందుకు వచ్చిన టూరిస్ట్‌ను వెంబడించి.. ఇనుపరాడ్లతో దాడి -
హోటల్లోకి దూసుకెళ్లిన ట్రక్కు: తీవ్ర విషాదం
సాక్షి, పట్నా: బిహార్‌లోని నలందా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జెహానాబాద్ జిల్లా నుంచి వేగంగా దూసుకొచ్చిన ట్రక్కు రోడ్డు పక్కనే ఉన్న హోటల్లోకి దూసుకెళ్లింది. దీంతో సిబ్బందితో సహా 8 మంది మృతి చెందారు. మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర ఉద్రిక్తతను రాజేసింది. నలందా జిల్లాలోని తెలహాడ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో ఆదివారం సాయంత్రం ఈ విషాదం చోటు చేసుకుంది. అతివేగంతో దూసుకువచ్చిన ట్రక్కు అదుపుతప్పి టెల్హడా ప్రాంతంలోని హోటల్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాంతో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో హోటల్ సిబ్బందితోపాటు కస్టమర్లు కూడా ఉన్నారు. ప్రమాదం తర్వాత డ్రైవర్ ట్రక్కును అక్కడే వదిలేసి పరారయ్యారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రిలకు తరలిస్తున్న క్రమంలో కోపోద్రిక్తులైన స్థానికులు ట్రక్కుకు నిప్పంటించారు. పోలీసులు, అధికారులు, వాహనాలపై కూడా రాళ్లు విసిరారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావారణం ఏర్పడింది. మరోవైపు ఈ ఘటనపై బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బాధితులకు తక్షణమే సాయం అందించాలని అధికారులను ఆదేశించారు.మృతిచెందిన వారి కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున నష్టపరిహారం ప్రకటించారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. గాయపడిన వారు వెంటనే కోలుకోవాలన్నారు. -
మద్యం మత్తులో పారిశ్రామికవేత్త కుమార్తె హల్ చల్
కేకే.నగర్: ఓ ప్రముఖ పారిశ్రామికవేత్త కుమార్తె మద్యం మత్తులో కారు నడిపి ఒకరి ప్రాణాన్ని బలితీసుకుంది. ఈ సంఘటన తమిళనాడులోని తిరువాన్మియూరులో చోటుచేసుకుంది. మద్యం మత్తులో ఇష్టానుసారంగా డ్రైవింగ్ చేయడంతో కారు కింద పడి ఒకరు మృతి చెందగా మరొకరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. చెన్నై తిరువాన్మియూరు తిరువళ్లువర్ నగర్ కామరాజ్ వీధికి చెందిన మునస్వామి అతని మిత్రుడు శరవణన్‌తో రోడ్డుపై నడచి వెళుతుండగా ఆ సమయంలో వేగంగా అదుపుతప్పిన కారు వారిని ఢీ కొంది. ఈ ప్రమాదంతో మునస్వామి మృతి చెందాడు. శరవణన్‌కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు కారును అడ్డుకున్నారు. కారులో ముగ్గురు యువతులు మద్యం మత్తులో ఉన్నట్లు తెలిసింది. కారు నడిపిన యువతి చెట్పెట్కు చెందిన ఐశ్వర్య (25) అని తెలిసింది. ఆ కారులో నందంబాక్కం సాఫ్ట్వేర్ సంస్థలో పని చేస్తున్న సోనియా (23), సుష్మ (23) అనే యువతులు ఉన్నారు. ఈ ముగ్గురు మద్యం మత్తులో ఉన్నట్లు తెలిసింది. కారు నడిపిన ఐశ్వర్య ప్రముఖ పారిశ్రామికవేత్త కుమార్తె అని తెలుస్తోంది. గిండి ట్రాఫిక్ పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. -
బీభత్సం సృష్టించిన బీఎండబ్ల్యూ
న్యూఢిల్లీ: ఢిల్లీలో నివాస సముదాయాల మధ్య మెర్సిడెజ్ బెంజ్ కారును అతివేగంగా నడుపుకుంటూ వెళ్లి ఓ వ్యక్తి మరణానికి దారితీసిన ఘటన మర్చిపోకముందే, మరో ఖరీదైన కారు ఢిల్లీకి సమీపంలో బీభత్సం సృష్టించింది. తాజాగా ఢిల్లీకి సమీపంలోని నోయిడాలో మరో హిట్ అండ్ రన్ ఘటన నమోదైంది. దీంతో ఆరుగురు వ్యక్తులు గాయాల పాలయ్యారు. పోలీసులు అందించిన సమాచారం ప్రకారం వేగంగా దూసుకు వచ్చిన బీఎండబ్ల్యూ కారు మూడు ద్విచక్రవాహనాలను ఢీకొట్టింది. దీంతో మూడు బైకుల మీద ఉన్న ఆరుగురు వ్యక్తులు ప్రమాదానికి గురయ్యారు. ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్ అక్కడే తన కారును వదిలి పరారయ్యాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ బాధితులను పోలీసులు ఆసుపత్రికి తరలించారు. వీరిలో నలుగురిని ప్రేమ్ కుమార్, జోగిందర్, అన్వర్ , భూలే రామ్ గా గుర్తించారు. వీరి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉండగా మరో ఇద్దరుస్వల్ప గాయాలతో బయటపడ్డారు. ప్రమాదానికి కారణమైన కారు ఎవరిదన్న వివరాలు తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసిన పోలీసులు డ్రైవర్ ఆచూకీ కోసం విచారిస్తున్నారు. కాగా ఈ నెలలోనే మెర్సిడెజ్ బెంజ్ కారుతో వీధుల్లోకి వచ్చిన ఓ మైనర్ బాలుడు తన కారును వేగంగా నడిపి ఓ వ్యక్తి మరణానికి కారణమయ్యాడు. సీసీటీవీ ఫుటేజీల్లో నమోదైన ఈ ప్రమాద దృశ్యాలు దేశవ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. -
వోల్వో బస్సు లారీ ఢీ,నలుగురు మృతి