Viral Video Of Delhi Couple Romancing On Speeding Bike In Delhi, Delhi Traffic Police Reacts - Sakshi
Sakshi News home page

Delhi Lovers Romancing On Bike: బైక్‌పై లవర్స్‌ రొమాన్స్‌.. రహదారిపై అందరూ చూస్తుండగానే..!

Published Tue, Jul 18 2023 4:58 PM | Last Updated on Tue, Jul 18 2023 5:51 PM

Couple Romancing On Speeding Bike In Delhi - Sakshi

ఢిల్లీ: ఈ మధ్య యువత రెచ్చిపోతున్నారు. పబ్లిసిటీ కోసం పబ్లిక్‌గానే హద్దులు మీరి ప్రవర్తిస్తున్నారు. చుట్టూ ఎవరున్నారనేది కూడా గమనించకుండా.. న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారు. అదేదో ఫ్యాషన్, ట్రెండ్‌గా ఫీల్‌ అయిపోయి అసభ్యకర చేష్టలతో వార్తల్లో కెక్కుతున్నారు. తాజాగా దేశ రాజధాని ప్రధాన రహదారిపై ఓ యువతీ యువకులు బైక్‌పై అభ్యంతకరంగా ప్రయాణించారు. 

ఢిల్లీలోని అవుటర్ రింగ్ రోడ్‌ ఫ్లైఓవర్ మంగోల్‌పురీ సమీపంలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. స్పీడ్‌గా వెళ్తోన్న బైక్‌ పెట్రోల్‌ ట్యాంక్‌పై యువకుడికి ఎదురుగా కూర్చున్న యువతి అతన్ని గట్టిగా కౌగిలించుకోవడం వీడియోలో కనిపిస్తోంది. యువకునితో పాటు యువతి కూడా హెల్మెట్ పెట్టుకుని ఉంది. ఈ అంశంపై నెటిజన్లు ఫైరవుతున్నారు.   

రోడ్డుపై వెళ్తున్న వాహనదారులు దీన్ని ఈ దృశ్యాలను వీడియో తీశారు. అనంతరం ట్విటర్‌లో పోస్టు చేయడంతో  నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఈ వీడియోపై స్పందించిన పోలీసులు.. ట్రాఫిక్ నిబంధనలను అతిక్రమించినందుకు కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. 

ఇదీ చదవండి: దారుణం.. తాజ్‌మహల్‌ చూసేందుకు వచ్చిన టూరిస్ట్‌ను వెంబడించి.. ఇనుపరాడ్లతో దాడి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement