
సమాజంలో నివసిస్తున్నప్పుడు కొన్ని నియమాలు నిబంధనలు, కట్టుబాట్లు ఉంటాయి. వాటిని అనుసరిస్తూ ప్రజలు జీవితం సాగించాల్సి ఉంటుంది. అయితే కొందరు మాత్రం ఇవేమి తమకు పట్టవంటూ విచ్చలవిడితనాన్ని ప్రదర్శిస్తూ నలుగురిలో నవ్వులు పాలవతుంటారు. తాజాగా ఓ ప్రేమికులు బైక్‌పై ప్రయాణిస్తూ రోడ్డు మీద హద్దులు మీరి ప్రవర్తించిన వింత ఘటన రాజస్థాన్‌లో జైపూర్‌లో చోటచేసుకుంది.
ఆ వీడియోలో.. హోలీ జరుపుకున్న అనంతరం ఓ జంట బైక్‌పై రొమాన్స్ చేస్తూ కెమెరాకు చిక్కింది. రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ పెట్రోల్ ట్యాంక్‌పై కూర్చొన్న లవర్.. ప్రేమికుడిని హగ్ చేసుకోని కూర్చుని రోడ్డుపై ప్రయాణిస్తూ ఉంది. దీనంతటిని వెనుక కారులో ఉన్న ఓ వ్యక్తి రికార్డు చేస్తున్నాడు. ఇదంతా తెలిసినా ఆ జంట ఏ మాత్రం భయపడకుండా వారి పనిలో వారు ఉన్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారి నెట్టింట హల్ చల్ చేస్తోంది.
ఈ జంట ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించినట్లు పోలీసులు గుర్తించారు. వాహనదారుడి నిర్లక్ష్యం, హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేసినందుకు ట్రాఫిక్ పోలీసులు మార్చి 7న మోటారు వాహనాల చట్టం 1988, రాజస్థాన్ మోటారు వాహనాల చట్టం 1990 ప్రకారం మోటారుబైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించినందుకు ఆ జంటకు రూ. 5,000 జరిమానా కూడా విధించారు పోలీసులు.
Comments
Please login to add a commentAdd a comment