చెన్నై: ఉత్తరభారత దేశంలో వర్షాలు బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. వానల ధాటికి కాలువలు, వాగులు వంకలు నదులను తలపిస్తున్నాయి. రోడ్లు దెబ్బతిని రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. వీటితో పాటు సరుకు రవాణా కూడా బంద్ అయ్యింది. ఈ నేపథ్యంలో ఉత్తరాదిలోని వివిధ రాష్ట్రాలకు వెళ్లాల్సిన వేలాది ట్రక్కులు తమిళనాడులో నిలిచిపోయాయి.
ఈ ట్రక్కులలో కొబ్బరికాయలు, సజ్జలు, స్టార్చ్, ఆరోగ్య సంరక్షణ మందులలో పదార్థాలుగా ఉపయోగించే ముడి పదార్థాలు, అగ్గిపెట్టెలు, క్రాకర్లు, వస్త్రాలు ఉక్కు మరియు ఇనుము పదార్థాలు వంటివి లోడ్లతో కూడిన 75 వేలకుపైగా ట్రక్కుల సరుకుని ఉత్తరాది రాష్ట్రాలకు రవాణా చేయాల్సి ఉంది. ప్రస్తుతం ఈ ట్రక్కులన్నీ తమిళనాడులోని వివిధ పట్టణాలు, నగరాల్లో ఆగిపోయాయి. ఇవి ఢిల్లీ, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్‌లకు చేరుకోవాల్సి ఉంది.
మరోవైపు తమిళనాడుకు రావాల్సిన 25,000కు పైగా ట్రక్కులు ఉత్తరాది రాష్ట్రాల్లో నిలిచిపోయినట్లు లారీ ఓనర్స్ ఫెడరేషన్-తమిళనాడు అధ్యక్షుడు తెలిపారు. పరిస్థితులు సాధారణ స్థితికి చేరిన తర్వాత, ప్రయాణానికి అనుకూలంగా మారిన తర్వాతే తమిళనాడు నుంచి లారీలు బయలుదేరుతాయని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా భారీ వర్షాల వల్ల వస్తువులను ఆర్డర్ పెట్టిన కంపెనీలు, ట్రక్ కంపెనీలతో పాటు డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.
చదవండి: ఇకపై కేదార్‌నాథ్ ఆలయంలో పిచ్చి పనులు చేస్తే జైలుకే..
Comments
Please login to add a commentAdd a comment