Tamil Nadu Couple Fake Accident, Hijack Tomato Lorry - Sakshi
Sakshi News home page

సినిమా రేంజ్‌లో.. దంపతుల పక్కా స్కెచ్‌.. టమాటా లారీ హైజాక్..

Jul 23 2023 3:30 PM | Updated on Jul 23 2023 4:08 PM

Tamil Nadu Couple Fake Accident Hijack Tomato Lorry  - Sakshi

బెంగళూరు: ధరలు పెరిగిపోయిన దగ్గర నుంచి టమాటాను దోపిడీ చేసిన ఘటనలు తరచూ వెలుగులోకి వస్తున్నాయి. పంటపై ఉండగానే రాత్రికి రాత్రే.. పొలంలోనే టమాటాలను మాయం చేసిన సందర్భాలు కూడా ఎదురయ్యాయి. తాజాగా బెంగళూరులో సినిమాని సీన్‌ని తలపించే ఘటన వెలుగులోకి వచ్చింది. తమిళనాడుకు చెందిన దంపతులు పక్కా స్కెచ్‌తో యాక్సిడెంట్ కట్టుకథ అల్లి.. రైతు దగ్గర నుంచి రూ. 2.5 లక్షల విలువ చేసే 2.5 టన్నుల టమాటా లారీని హైజాక్ చేశారు. 

చిత్రదుర్గ జిల్లాలోని ఉరయూరుకు చెందిన వ్యక్తి మల్లేష్. టమాటా లారీ లోడ్‌ను జులై 8న కొలార్‌కు తీసుకువెళ్తున్నాడు. లారీ బెంగళూరుకు రాగానే ఓ దంపతులు లారీని అడ్డగించారు. లారీ తమ కారుకు తాకిందని కట్టుకథ  సృష్టించి డబ్బులు డిమాండ్ చేశారు. మల్లేష్ అందుకు నిరాకరించాడు. దీంతో లారీ నుంచి మల్లేష్‌ను బయటుకు లాగి లారీతో హుడాయించారు. 

చేసేదేమీ లేక మల్లేష్ స్థానిక పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. లారీ వెళ్లిన మార్గాన్ని ట్రాక్‌ చేసి నిందితులను పట్టుకున్నారు. నిందితులను వెల్లూరుకు చెందిన దంపతులు భాస్కర్‌(28), సింధుజా(26)గా గుర్తించి అరెస్టు చేశారు. వీరు ఓ దారిదోపిడీ దొంగల ముఠాలో సభ్యులుగా కూడా ఉన్నట్లు గుర్తించారు.  

ఇదీ చదవండి: ఘోర ప్రమాదం.. అదుపుతప్పి చెరువులోకి దూసుకెళ్లిన బస్సు.. క్షణాల్లోనే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement