మహబూబ్‌నగర్ క్రైం/ జడ్చర్ల టౌన్: ఓ ప్రైవేట్ పాఠశాల బస్సును వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టడంతో బస్సులో ఉన్న 17 మంది విద్యార్థులు గాయపడ్డారు. ఈ ఘటన సోమవారం ఉదయం మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల– పాలమూరు ప్రధాన రహదారిపై జాలీహిల్స్ సమీపంలో చోటుచేసుకుంది. జడ్చర్ల నుంచి 43 మంది విద్యార్థులతో వస్తున్న బస్సు పాఠశాలకు సమీపంలో యూటర్న్ తీసు కోగా.. రోడ్డు డౌన్ ఉండటం వల్ల వెనకాల వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది. దీంతో బస్సు అదుపు తప్పి ఎదురుగా ఉన్న డివైడర్‌ను ఢీకొని బోల్తాపడింది.
ఆ సమయంలో ఎదురుగా ఎలాంటి వాహనాలు రాకపోవడంతో పెను ప్రమాదం త ప్పింది. బస్సు బోల్తా పడగానే స్థానికులు వెంటనే గా యపడిన విద్యార్థులను చికిత్స కోసం ఎస్‌వీఎస్ ఆస్పత్రికి తరలించారు. వీరిలో 9మంది విద్యార్థుల తలల కు గా యాలు కాగా.. మరో 8 మందికి స్వల్ప గాయాల వడంతో వైద్యులు చికిత్స అందించారు. విద్యార్థులందరూ క్షేమంగానే ఉన్నారని, ఎవరికీ ఎలాంటి ప్రాణాపాయం లేదని పాఠశాల ప్రిన్సిపాల్ సురేశ్ తెలిపారు. కాగా, ప్రమాదం జరిగిన వెంటనే కొందరు లారీ డ్రైవర్‌ను చితకబాది పోలీసులకు అప్పగించారు.
పరామర్శించిన మంత్రి శ్రీనివాస్‌గౌడ్
బస్సు ప్రమాదంలో గాయపడి ఎస్‌వీఎస్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను రాష్ట్ర ఎక్సైజ్, క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పరామర్శించారు. ఘటనకు సంబంధించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. భవిష్యత్‌లో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా వేగ నియంత్రణ పాటించడంతో పాటు సైన్ బోర్డులు, లైనింగ్స్ పెంచేలా చూస్తామన్నారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఏపీ జితేందర్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు వీరబ్రహ్మచారి, సీనియర్ నాయకుడు నాగురావు నామాజీ కూడా విద్యార్థులను పరామర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment