srinivasgoud
-
ఓడే సీట్లు బీసీలకు.. గెలిచే సీట్లు ఓసీలకా? : మంత్రి శ్రీనివాస్‌గౌడ్
సాక్షి, మహబూబ్‌నగర్: బీజేపీ వచ్చే ఎన్నికల్లో ఓడే సీట్లు బీసీలకు కేటాయించి.. గెలిచే సీట్లు ఓసీలకు కేటాయించిందని, ఇదేనా మీరు బీసీలకు ఇచ్చే గౌరవం అని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ప్రశ్నించారు. శనివారం స్థానిక ఫాంహౌస్‌లో మంత్రి విలేకరులతో మాట్లాడారు. బీసీ ప్రధాని అని చెప్పుకొనే బీజేపీ కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖ కేటాయించడం లేదని విమర్శించారు. 80 శాతం ఉన్న బీసీలకు కేవలం రూ.2 వేల కోట్ల బడ్జెట్ కేటాయించడమేనా బీసీలపై ఉన్న చిత్తశుద్ధి అని నిలదీశారు. బీసీల అభ్యున్నతి కోసం కేంద్ర బడ్జెట్లో రూ.లక్ష కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. బీసీలపై ప్రేమ ఉంటే అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్‌పై చేసిన తీర్మానం మేరకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా బీసీలకు వెయ్యి గురుకులాలు ఏర్పాటు చేసిన ఘనత తమ ప్రభుత్వానిది అన్నారు. ఇద్దరు ఎమ్మెల్యేలుగా అవకాశం ఇస్తూ.. ప్రతిపాదిస్తే కుట్ర పూరితంగా వెనక నుంచి తిరస్కరించేలా కుట్ర చేసింది బీజేపీ కాదా అని విమర్శించారు. బీసీ ప్రధాని ఉన్నంత మాత్రాన బీసీల బతుకులు బాగుపడవని.. ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందేలా కృషిచేయాలన్నారు. బీసీలకు విద్యను ప్రోత్సహించేందుకు రూ.20 లక్షల నిధులు ఇస్తూ ఓవర్సీస్ విద్యను అందిస్తున్నట్లు చెప్పారు. సమావేశంలో జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణసుధాకర్‌రెడ్డి, డీసీసీబీ వైస్ చైర్మన్ వెంకటయ్య, కౌన్సిలర్ మునీరొద్దీన్, రవీందర్‌రెడ్డి, రాములు, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రైవేట్ స్కూల్ బస్సు బోల్తా
మహబూబ్‌నగర్ క్రైం/ జడ్చర్ల టౌన్: ఓ ప్రైవేట్ పాఠశాల బస్సును వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టడంతో బస్సులో ఉన్న 17 మంది విద్యార్థులు గాయపడ్డారు. ఈ ఘటన సోమవారం ఉదయం మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల– పాలమూరు ప్రధాన రహదారిపై జాలీహిల్స్ సమీపంలో చోటుచేసుకుంది. జడ్చర్ల నుంచి 43 మంది విద్యార్థులతో వస్తున్న బస్సు పాఠశాలకు సమీపంలో యూటర్న్ తీసు కోగా.. రోడ్డు డౌన్ ఉండటం వల్ల వెనకాల వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది. దీంతో బస్సు అదుపు తప్పి ఎదురుగా ఉన్న డివైడర్‌ను ఢీకొని బోల్తాపడింది. ఆ సమయంలో ఎదురుగా ఎలాంటి వాహనాలు రాకపోవడంతో పెను ప్రమాదం త ప్పింది. బస్సు బోల్తా పడగానే స్థానికులు వెంటనే గా యపడిన విద్యార్థులను చికిత్స కోసం ఎస్వీఎస్ ఆస్పత్రికి తరలించారు. వీరిలో 9మంది విద్యార్థుల తలల కు గా యాలు కాగా.. మరో 8 మందికి స్వల్ప గాయాల వడంతో వైద్యులు చికిత్స అందించారు. విద్యార్థులందరూ క్షేమంగానే ఉన్నారని, ఎవరికీ ఎలాంటి ప్రాణాపాయం లేదని పాఠశాల ప్రిన్సిపాల్ సురేశ్ తెలిపారు. కాగా, ప్రమాదం జరిగిన వెంటనే కొందరు లారీ డ్రైవర్‌ను చితకబాది పోలీసులకు అప్పగించారు. పరామర్శించిన మంత్రి శ్రీనివాస్‌గౌడ్ బస్సు ప్రమాదంలో గాయపడి ఎస్వీఎస్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను రాష్ట్ర ఎక్సైజ్, క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పరామర్శించారు. ఘటనకు సంబంధించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. భవిష్యత్‌లో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా వేగ నియంత్రణ పాటించడంతో పాటు సైన్ బోర్డులు, లైనింగ్స్ పెంచేలా చూస్తామన్నారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఏపీ జితేందర్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు వీరబ్రహ్మచారి, సీనియర్ నాయకుడు నాగురావు నామాజీ కూడా విద్యార్థులను పరామర్శించారు. -
తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్ ఓఎస్డీ సస్పెన్షన్
సాక్షి, హైదరాబాద్, శామీర్‌పేట: లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో హకీంపేటలోని తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్ ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (ఓఎస్డీ) హరికృష్ణను సస్పెండ్ చేస్తున్నట్టు మంత్రి వి. శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. హరికృష్ణ స్థానంలో ఇన్చార్జ్ ఓఎస్డీగా సుధాకర్ రావును నియమించారు. లైంగిక వేధింపుల ఆరో పణలపై నివేదిక సమర్పించాలని ఐదుగురు సభ్యు లతో కూడిన కమిటీని మంత్రి ఏర్పాటు చేశారు. ఈ మేరకు మంత్రి తన నివాసంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ప్రిన్సిపల్ సెక్రటరీ (స్పోర్ట్స్) శైలజా రామయ్యర్, రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ (శాట్స్) వైస్‌చైర్మన్, ఎండీ, క్రీడా శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కమిటీ సభ్యు లు ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు స్పోర్ట్స్ స్కూల్లోని బాలికలు, సిబ్బందిని వేర్వేరు గా విచారించారు. పాఠశాలతోపాటు బాలికల హాస్టల్లోని సీసీ టీవీ ఫుటేజీలను సేకరించారు. విచారణ ముగిశాక ఈ కమిటీ నివేదికను జిల్లా, రాష్ట్రస్థాయి అధికారులకు అందించనుంది. కమిటీ నివేదిక ప్రకారం బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని శ్రీనివాస్‌గౌడ్ వెల్లడించారు. కాగా తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్లో బాలికలపై లైంగిక వేధింపుల ఆరోపణలపై ఆదివారం ఉదయం ఎమ్మెల్సీ కవిత మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌కు ట్వీట్ చేశారు. ఓఎస్డీని వెళ్లొద్దంటూ కారుకు అడ్డుగా నిలిచిన బాలికలు సస్పెండ్ అయిన హరికృష్ణను స్పోర్ట్స్ స్కూల్ నుంచి వెళ్లొద్దంటూ కొందరు బాలికలు కారుకు అడ్డుగా నిలిచారు. మీరు లేకుంటే స్కూల్ అభివృద్ధి జరగదని, మీరు ఎలాంటి తప్పు చేయలేదని క్యాంపస్‌లోనే ఉండాలంటూ వారు భావోద్వేగానికి లోనయ్యారు. -
పాలమూరుపై బీజేపీ.. కాంగ్రెస్ స్ట్రాంగ్ ఫోకస్
మహబూబ్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో వచ్చే ఎన్నికల్లో పోటీ రసవత్తరంగా సాగనుంది. త్రిముఖపోటీ జరుగనుంది. అధికార బీఆర్ఎస్ దీటుగా ఇటు బీజేపీ, అటు కాంగ్రెస్‌లు సత్తాచాటేందుకు సమాయత్త మవుతున్నాయి. చేసిన అభివృద్ది.. తెలంగాణ తెచ్చిన పార్టీగా బీఆర్ఎస్కు జనాలు మరోసారి పట్టం కాడతారని ఆ పార్టీ భావిస్తుంది. పాత సీటును నిలుపుకునేందుకు కాంగ్రెస్ చూస్తుంటే.. బీజేపీ పాలమూరు సీటుపై ఫోకస్ పెట్టింది. సామాజిక వర్గాల వారిగా చూస్తే ముస్లీం మైనార్టీల ఓట్లు అధికంగా ఉన్నాయి. ముదిరాజ్, యాదవ సామాజిక వర్గం ఓట్లు ఫలితం కూడా ప్రభావితం చేసే స్దాయిలో ఉన్నాయి. ఇతర ప్రాంతాల నుంచి వచ్చి నివాసం ఉంటున్నవారు, ఉద్యోగుల ఓట్లు కూడ ఎక్కువగ ఉన్నాయి. దీంతో ఫలితంపై అన్ని అంశాలు ప్రభావితం చూపే అవకాశం ఉంది. తెలంగాణ ఆవిర్భావం తర్వాత 2014, 2018లో మహబూబ్‌నగర్ సెగ్మెంట్లో జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం సాధించింది. గెజిటెడ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడిగా ఉన్న శ్రీనివాస్‌గౌడ్ పోటీ చేసి విజయం సాధించారు. రెండవసారి గెలిచిన తర్వాత ఆయన మంత్రి అయ్యారు. మూడోసారి ఆయన ఇక్కడి నుంచి పోటీ చేయనున్నారు. మంత్రిగా నియోజకవర్గ అభివృద్దికి కృషి చేస్తున్న ఆయన మరోసారి గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. మంత్రి ఆరోపణలు.. బీఆర్ఎస్కు అదే మైనస్! బైపాస్ రహదారి పర్యాటకం మయూరి పార్క్, పెద్ద చెరువు ట్యాంక్‌బండ్, శిల్పారామం, నెక్లెస్ రోడ్డు, పట్టణంలో కూడళ్ల అభివృద్ది, సుందరీకరణ ఆయనకు కలిసివచ్చే అంశాలుగా ఉన్నాయి. డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణంలో అన్ని నియోజవర్గాల కంటే ముందు వరుసలో ఉన్నా నిర్మాణం జరిగిన ఇళ్లను లబ్దిదారులకు పంపిణీ చేయటంలో జాప్యం జరగటం.. అందులో అవినీతి ఆరోపణలు రావటం కొంత ఇబ్బందిగా మారింది. పరిస్ధితి తనకు తెలిసిన వెంటనే మంత్రి శ్రీనివాస్ గౌడ్ దిద్దుబాటు చర్యలు దిగారు. అక్రమార్కులపై కేసులు కూడ నమోదయ్యాయి. ఎన్నికల అఫ్రిడవిటిల్లో తప్పుడు వివరాలు నమోదు చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. తరచుగా జరిగే కొన్ని ఘటనలు ఆయనకు ఇబ్బందిగా మారాయి. ఓ కార్యక్రమ ర్యాలీలో బహిరంగంగా గాలిలో కాల్పులు జరపటంతో విమర్శలు ఎదుర్కొన్నారు. హత్య కుట్ర కేసు వ్యవహారం కూడ ఆయనకు కొంత మైనస్‌గా మారింది. అనారోగ్యం బారిన పడిన వారి బాగుకోసం నిత్యం అందుబాటులో ఉండి వారికి ముఖ్యమంత్రి సహయనిధి నుంచి భారీగా నిధులు ఇప్పించి మెప్పుపొందారు. జిల్లా జనరల్ ఆస్పత్రి అభివృద్ది కోసం విశేష కృషి చేశారు. ముఖ్యంగా కరోనా సందర్భంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కరోనా బాధితులు ఇక్కడ మెరుగైన వైద్యసేవలు అందేలా వసతులు కల్పించారు. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు బలవంతంగా ఇతర పార్టీల వారిని తన పార్టీలో చేర్చుకుంటున్నారని, లేకుంటే కక్షసాధింపులకు దిగుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అనుచరులు భూ ఆక్రమణలకు దిగుతున్నారనే అపవాదు కూడ ఉంది. తన అనుచరులకు పెద్దపీట వేసి ఉద్యమకాలంలో పనిచేసిన వారిని విస్మరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ఇతర పార్టీల్లో ఆయనను తట్టుకుని నిలిచే నేతలు ఇటు కాంగ్రెస్, బీజేపీలో స్దానికంగా లేకపోవటం కలిసి వచ్చే అంశం. రంగంలోకి బీకే అరుణ.. బీఆర్ఎస్కు గట్టి పోటీ తప్పదు అయితే బీజేపీ నుంచి డీకే అరుణ పోటీలో ఉంటే కొంత ఇబ్బందిగా మారుతుందనే అభిప్రాయం ఆయన వర్గీయుల్లో వ్యక్తం అవుతుంది. మహబూబ్‌నగర్ నియోజకవర్గం నుంచి అత్యధికంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలే ఎమ్మెల్యేలుగా గెలిచారు. చాలా మంది మంత్రి పదవులు సైతం పొందారు. కానీ ఇప్పుడు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ పరిస్ధితి అధ్వాన్నంగా మారింది. పోటీకి బలమైన అభ్యర్ది లేడనే అభిప్రాయం ఉంది. ఉన్నదాంట్లో ఎవరంతకు వాళ్లు తమకు సీటుకావాలనే అశతో ఉన్నారు. పార్టీ బలోపేతంపై పెద్దగా శ్రద్ద కనబరిచిన దాఖలాలు లేవు. చాలా మంది పార్టీని వీడటం కూడ తలనొప్పిగా మారింది. మైనార్టీ ఓట్లు అధికంగా ఉన్న ఈ సెగ్మెంట్లో ఆ సామాజికవర్గాల ఓట్లను తమవైపు మలుపుకునే దిశగా ఎలాంటి కార్యాచరణ చేయటం లేదు. కాంగ్రెస్ పార్టీని గెలిపించినా గెలిచినా అభ్యర్ది ఆ పార్టీలో ఉంటాడో లేదో తెలియని అయోమయం నెలకొంది. దీంతో ప్రజలు కాంగ్రెస్‌కు ఓట్లు వేసేందుకు విశ్వసించటం లేదనే అభిప్రాయం ఉంది. ప్రభుత్వ వ్యతిరేకత కలిసి వస్తుందని అంటున్నారు. డబుల్ బెడ్రూం ఇళ్ల పంపిణీలో అక్రమాలు జరిగాయని పేద ప్రజలు గుర్రుగా ఉన్నారని చెప్పుకొస్తున్నారు. ఒబేదుల్లా కోత్వాల్, సంజీవ్ ముదిరాజ్‌లు సీటు ఆశిస్తున్నారు. అయితే కాంగ్రెస్ అధిష్టానం మాత్రం మంత్రి శ్రీనివాస్ గౌడ్ ధీటుగా నిలిచే అభ్యర్దిని బరిలోకి దింపేందుకు కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. బీజేపీ మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి కూడ కాంగ్రెస్ పార్టీలో చేరుతారని ఆయన ఇక్కడి నుంచి పోటీ చేస్తారనే ప్రచారం జోరుగా సాగుతుంది. ఇంకోవైపు టీటీడీ బోర్డు సభ్యుడు, పారిశ్రామికవేత్త మన్నె జీవన్‌రెడ్డి పేరు కూడ ప్రముఖంగా వినిపిస్తోంది. జోడో యాత్ర, కార్ణాటక గెలుపు కాంగ్రెస్ కలిసి వస్తుందా? రాహుల్ గాంధీ జోడో యాత్ర విజయవంతం కావటం.. కర్ణాటకలో పార్టీ గెలుపు కలిసి వచ్చే అంశంగా మారింది. గతంలో పార్టీని వీడిన నేతలు తిరిగి కాంగ్రెస్ గూటికి చేరుతుండటంతో ఆ పార్టీలొ కొత్తజోష్ నెలకొంది. 2012 ఉపఎన్నికల్లో ఇక్కడ బీజేపీ నుంచి పోటీ చేసిన యెన్నం శ్రీనివాస్‌రెడ్డి విజయం సాధించారు. పొత్తులో భాగంగా బీజేపీ నుంచి 1999లో ఏపీ జితేందర్‌రెడ్డి మహబూబ్‌నగర్ నుంచి ఎంపీగా గెలుపొందారు. ప్రస్తుతం బీజేపీ పాలమూరుపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. ఇక్కడి నుంచి ఈ సారి కషాయం జెండా ఎగురవేయాలని యోచిస్తున్నారు. డీకే అరుణను ఇక్కడి నుంచి బరీలో దింపాలనే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో డీకే అరుణకు.. అసెంబ్లీ ఎన్నికల్లో శ్రీనివాస్ గౌడ్‌కు వచ్చిన ఓట్లకంటే అధికంగా రావటంతో పార్టీకి బూస్ట్ ఇచ్చినట్టయ్యింది. జితేందర్‌రెడ్డి కూడ బీజేపీలో ఉండటం, బండి సంజయ్ కుమార్‌కు ప్రజాసంగ్రామయాత్ర ఈ జిల్లాలో విజయవంతం కావటం పార్టీ శ్రేణుల్లో నూతనోత్సహం నింపింది. ఈసారి మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి, మాజీమంత్రి చంద్రశేఖర్, ఎన్పీ వెంకటేష్‌తో పాటు మరో రెండు మూడు పేర్లు పోటీ చేసే అభ్యర్దుల జాబితాలో కనిపిస్తున్నాయి. అయితే పార్టీలో అంతర్గత విభేదాలు కూడ నష్టం కలిగించే అవకాశం ఉంది. పాత, కొత్త నేతలకు పొసగటం లేదు. పాతవాళ్లు గ్రూపుగా ఏర్పడి కొత్తవారిని ఎదగనీయటం లేదనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత.. మోదీ ప్రభావంతో ఈసారి తప్పకుండా బీజేపీ గెలుస్తుందని ధీమా వ్యక్తంచేస్తున్నారు. మొత్తంగా మహబూబ్‌నగర్ సెగ్మెంట్లో ఎవరికి వారు తమ అస్త్రాలు సిద్దం చేసుకుంటున్నారు. నియోజకవర్గంలో భౌగోళిక పరిస్థితులు: వ్యవసాయంమే ప్రధానంగా జీవనం సాగించే జనం ఉన్నారు. పెద్దగా పరిశ్రమలు లేవు. నూతనంగా ఐటీ కారిడార్ ఏర్పాటైనా ఇంకా అందులోకి కంపెనీలు రాలేదు. అడవులు: అప్పన్నపల్లి పరిసరాల్లో అడవులు ఉన్నాయి ఆలయాలు--పేదల తిరుపతిగా పిలిచే మన్యంకొండ శ్రీ లక్ష్మీవేంకటేశ్వరస్వామి ఆలయం పర్యాటకం: మయూరీ నర్సరీ,కోయిల్‌సాగర్ ప్రాజెక్టు -
ఇక అన్ని ప్రయాణాలకూ ఒకే కార్డు
సాక్షి, హైదరాబాద్: ప్రయాణికులు అన్ని ప్రభుత్వ, ప్రైవేటు వాహనాల్లో ప్రయాణించడానికి వీలుగా ఒకే కార్డును తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆగస్టు రెండో వారంలోగా ‘కామన్ మొబిలిటీ కార్డు’లను సిద్ధం చేయాలని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. ఈ అంశంపై సచివాలయంలో గురువారం ఉన్నతాధికారులతో సమీక్షించిన మంత్రులు... తొలుత హైదరాబాద్‌లోని ప్రజారవాణా వ్యవస్థ మొత్తానికి కలిపి వినియోగించేలా ఈ కార్డును అందుబాటులోకి తేనున్నట్లు చెప్పారు. మొదట మెట్రోరైల్, ఆర్టీసీ బస్సులో ప్రయాణానికి వీలుగా ఈ కార్డులను జారీ చేస్తామని, సమీప భవిష్యత్తులో ఇదే కార్డుతో ఎంఎంటీఎస్, క్యాబ్ సేవలు, ఆటోలను కూడా వినియోగించుకొనేలా విస్తరి స్తామని మంత్రులు తెలిపారు. పౌరులు వారి ఇతర కార్డుల మాదిరే దీన్ని కొనుగోళ్లకు కూడా వినియోగించేలా వన్ కార్డ్ ఫర్ అల్ నీడ్స్ మాదిరి కామన్ మొబిలిటీ కార్డు ఉండాలని మంత్రులు అధికారులకు సూచించారు. ఈ కార్డుగల ప్రయా ణికులు దేశవ్యాప్తంగా నేషనల్ కామన్ మొబిలిటీ కార్డు వినియోగించేందుకు అవకాశం ఉన్న ప్రతి చోటా వినియోగించుకొనేందుకు అవకాశం ఉంటుందని మంత్రులు తెలిపారు. మరోవైపు కామన్ మొబిలిటీ కార్డుకు ఒక పేరును సూచించాలని కోరారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ పౌరుల నుంచి పేర్లను కోరుతూ ట్వీట్ చేశారు. ఈ సమావేశంలో అరవింద్ కుమార్, మెట్రోరైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తదితరులు పాల్గొన్నారు. -
నీరా కేఫ్, క్యాంటీన్ ప్రారంభం
పంజగుట్ట: తాటి, ఈత చెట్ల నుంచి సేకరించే నీరాతోపాటు వాటి ఉప ఉత్పత్తులను విక్రయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 20 కోట్లతో నిర్మించిన నీరా కేఫ్, క్యాంటీన్ హైదరాబాద్‌వాసులకు అందుబాటులోకి వచ్చాయి. నగరంలోని నెక్లెస్ రోడ్డులో ఏర్పాటు చేసిన నీరా కేఫ్, క్యాంటీన్లను రాష్ట్ర ఎక్సై జ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, పశు సంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో కలసి బుధవారం ప్రారంభించారు. నీరాపై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించేందుకు, నీరా దేవతల పానీయం అని చెప్పేందుకు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన మఠాధిపతులు, స్వామీజీలతో కలసి మంత్రులు ఈ సందర్భంగా నీరా తాగారు. నీరాలో ఎలాంటి ఆల్కహాల్ ఉండదని... ఇది తాగడంవల్ల మత్తు రాదని శ్రీనివాస్‌గౌడ్ స్పష్టం చేశారు. ఇందులో పుష్కలంగా విటమిన్లు, క్యాల్షియం వంటి ఖనిజాలు ఉంటాయని చెప్పారు. సహజంగా లభించే పానియాలపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని... వారికి గీత కార్మికుల ఆత్మగౌరవ ప్రతీకగా తీసుకొచ్చిన నీరా కేఫ్ చెంపపెట్టులాంటిదన్నారు. నీరా వంటకాలు సైతం.. క్యాంటీన్లో నీరా విత్ బోటీ, నీరా విత్ తెలంగాణ వంటకాలు, నీరా విత్ బిర్యానీ, నీరా విత్ వెజ్ స్నాక్స్‌ను అందుబాటులోకి తెచ్చినట్లు మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. నీరాతోపాటు తాటి బెల్లం, తాటి చక్కెర, తేనె, నీరాతో చేసిన ‘బూస్ట్’ పొడి కూడా అందుబాటులోకి తెచ్చామన్నారు. త్వరలోనే నీరా ఐస్‌క్రీం, తాటి ముంజ ఐస్క్రీంలను అందుబాటులోకి తెస్తామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గీత కార్మికుల సంక్షేమానికి ఎన్నో చర్యలు తీసుకుంటున్నారని... అందులో భాగంగానే రైతు బీమా తరహాలో గీత కార్మికులకు రూ. 5 లక్షల బీమా తీసుకొచ్చారని శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా గౌడ కులస్తులకు వైన్ షాపుల్లో రిజర్వేషన్ కల్పించారని, ట్యాంక్‌బండ్‌పై సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాన్ని నెలకొల్పారని గుర్తుచేశారు. నీరా కేఫ్ ప్రారంభించినందుకు, గీత కార్మికులకు బీమా ప్రకటించినందుకు సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్‌గౌడ్ చిత్రపటాలకు అఖిల భారత గౌడ సంఘం నాయకులు పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో శాసనమండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్, ఎమ్మెల్సీలు బాలసాని లక్ష్మీనారాయణ, గంగాధర్ గౌడ్, రాష్ట్ర పర్యాటక, అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ గెల్లు శ్రీనివాస్ యాదవ్, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ ఆంజనేయ గౌడ్, మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
బుద్ధవనం..గర్వకారణం
సాక్షి, హైదరాబాద్: ఆసియాలోనే అతిపెద్ద బుద్ధవనం ప్రాజెక్టు నాగార్జునసాగర్‌లో ఏర్పాటు చేయడం గర్వకారణమని రాష్ట్ర పురావస్తు, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. శనివారం హైదరాబాద్‌లోని ఎంసీఆర్హెచ్ఆర్డీలో రెండు రోజుల పాటు నిర్వహిస్తున్న బౌద్ధసంగీతి –2019 కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 274 ఎకరాల్లో బుద్ధవనం నిర్మించడం చారిత్రాత్మకమైన నిర్ణయమని తెలిపారు. మన రాష్ట్రంలోని చారిత్రక సంపద పరిరక్షణకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు. బౌద్ధమతానికి సంబంధించి దేశంలోనే తొలి సదస్సును ౖహైదరాబాద్‌లో నిర్వహించడం ఎంతో అదృష్టమన్నారు. రాష్ట్రంలో కోటిలింగాల, ఫణిగిరి, పార్శిగాన్, ధూళికంట, గాజులబండ, తిరుమలగిరి, నేలకొండపల్లి, ఏలేశ్వరం లాంటి ప్రాంతాల్లో బౌద్ధుల చారిత్రక ఆనవాళ్లు ఉన్నాయన్నారు.బుద్ధవనం ప్రాజెక్టు ప్రత్యేకాధికారి మల్లేపల్లి లక్ష్మయ్య మాట్లాడుతూ బౌద్ధచరిత్ర చాలా గొప్పదన్నారు. శివనాగిరెడ్డి రచించిన తెలంగాణ బుద్ధిజం అనే పుస్తకాన్ని మంత్రి శ్రీనివాసగౌడ్ ఆవిష్కరించారు. తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ (టీఎస్‌టీడీసీ) చైర్మన్ భూపతిరెడ్డి, టీఎస్‌టీడీసీ ఎండీ డి.మనోహర్, 17 దేశాలకు చెందిన పురావస్తు శాఖ పరిశోధకులు, పురావస్తు శాఖ నిపుణులు తదితరులు పాల్గొన్నారు. ఆధ్యాత్మికతకు ప్రాధాన్యమివ్వాలి బుద్ధిజాన్ని కూడా ఇతర మతాలలాగే చూడాలి. రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం బౌద్ధాన్ని కేవలం టూరిజం కోణంలోనే చూస్తున్నాయి. అలాకాకుండా కాకుండా ఆధ్యాత్మికతకు కూడా ప్రాధాన్యమిచ్చేలా చర్యలు చేపడితే బుద్దుడి ఆలోచనలు ప్రజలకు మరింత చేరువయ్యే అవకాశం ఉంటుంది. – సద్దారకిత బంతేజ్, బౌద్ధ సన్యాసి -
బీసీ రిజర్వేషన్ ఆర్డినెన్స్ రద్దు చేయాలి
హైదరాబాద్: పంచాయతీల్లో బీసీ రిజర్వేషన్ తగ్గింపు ఆర్డినెన్స్‌ను వెంటనే రద్దు చేయాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ డిమాండ్ చేశారు. 34 శాతం ఉన్న రిజర్వేషన్ 22కు తగ్గించడం హేయమైన చర్య అని విమర్శించారు. బీసీలను అణగదొక్కేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపించారు. ఆదివారం ఇక్కడ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో బీసీ సంక్షేమ సంఘం, ఇతర ప్రజాసంఘాల ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్‌పై 15 రోజులుగా పోరాటం చేస్తున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేదన్నారు. అఖిలపక్ష నాయకులు, న్యాయనిపుణులతో 10 నిమిషాలు మాట్లాడే సమయం కూడా సీఎంకు లేదా అని ప్రశ్నించారు. బీసీ జనాభా లెక్కలు తేల్చాకే పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు తీర్పునిచ్చిందని, దానిని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే బీసీ రిజర్వేషన్‌పై సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేయాలని డిమాండ్ చేశారు. రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపకుడు వి.జి.ఆర్. నారగోని మాట్లాడుతూ కేసీఆర్ బీసీలను దుర్మార్గమైన పరిస్ధితుల్లోకి నెట్టివేస్తున్నారని విమర్శించారు. 94 పంచాయతీరాజ్ చట్టంలో 34 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని ఉందని, ఈ హక్కును తీసేసి కేసీఆర్ బీసీల ద్రోహిగా మారారని సామాజికవేత్త ఉ.సాంబశివరావు అన్నారు. కార్యక్రమంలో గంగపుత్ర సంఘం నాయకులు ఎ.ఎల్.మల్లయ్య, లెల్లెల బాలకృష్ణ, బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు కుల్కచర్ల శ్రీనివాస్, ఉపాధ్యక్షులు రామగౌడ్, ఓయూ విద్యార్థి సంఘం అధ్యక్షుడు జాజుల లింగం, ప్రొఫెసర్ వెంకటేశ్, ఎం.జీతయ్య, ఎం. రాజేందర్, డాక్టర్ నీలకంఠేశ్వర్ రావు తదితరులు పాల్గొన్నారు. -
బీసీలకు అన్యాయం చేస్తున్న పార్టీలు: జాజుల
హైదరాబాద్: రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ల కేటాయింపులో అన్ని రాజకీయ పార్టీలు బీసీలకు అన్యాయం చేస్తూ అగ్రవర్ణాలకే కొమ్ము కాస్తున్నాయని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ ఆరోపించారు. దోమలగూడలోని బీసీ భవన్లో ఆదివారం జరిగిన బీసీ సంఘాల కోర్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు బీసీలను రాజకీయంగా అణిచివేస్తూ అగ్రవర్ణాలకు ప్రాధాన్యత ఇస్తున్నాయని విమర్శించారు. రెండు, మూడు రోజుల్లో హైదరాబాద్‌లో 112 కుల సంఘాల రాష్ట్ర అధ్యక్షులతో సమావేశం ఏర్పాటు చేసి కీలక నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. సమావేశంలో బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు కుల్కచర్ల శ్రీనివాస్, బీసీ యువజన సంఘం అధ్యక్షుడు కనకాల శ్యాం, తదితరులు పాల్గొన్నారు. -
కాంగ్రెస్‌కు కడుపు మంట ఎందుకు?
టీఆర్ఎస్ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ సాక్షి, హైదరాబాద్: రైతు సమన్వయ సమితుల ఏర్పాటుపై కాంగ్రెస్‌కు కడుపుమంట ఎందుకో అర్థం కావడం లేదని టీఆర్ఎస్ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ మండిపడ్డారు. సమన్వయ సమితులను అడ్డుకుంటే రైతులే వారిని తరిమి కొడతారని హెచ్చరించారు. కాంగ్రెస్‌కు తమ పాలనలో గుర్తుకురాని రైతులు, అధికారం పోగానే గుర్తుకు వస్తున్నారని ఎద్దేవా చేశారు. రైతు సమన్వయ సమితులు ఎందుకంటున్న కాంగ్రెస్ నేతలు తమ హయాంలో ఆదర్శ రైతులను ఎలా నియమించారని శుక్రవారమిక్కడ ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళుతున్నారని, కొత్త సచివాలయం నిర్మాణానికి సీఎం సంకల్పిస్తే విపక్షాలు దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాయని అన్నారు. ప్రజాకోర్టులో పోరాడే దమ్ము లేక న్యాయస్థానాలకు పోతున్నారన్నారు. రేవంత్‌రెడ్డి అర్థం పర్థం లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. -
'తెలంగాణ అభివృద్ధిని బీజేపీ అడ్డుకుంటోంది'
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని భారతీయ జనతా పార్టీ అడ్డుకుంటోందని టీఆర్ఎస్ ఎమ్మెల్యే వి. శ్రీనివాసగౌడ్ విమర్శించారు. సోమవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడారు. తెలంగాణకు రావాల్సిన ప్యాకేజీపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి ఎందుకు మౌనంగా ఉంటున్నారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీ తన ఉనికిని కాపాడుకోవటానికే సీఎం కేసీఆర్‌పై విమర్శలు చేస్తోందని మండిపడ్డారు.