
కాంగ్రెస్‌కు కడుపు మంట ఎందుకు?
టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్
సాక్షి, హైదరాబాద్: రైతు సమన్వయ సమితుల ఏర్పాటుపై కాంగ్రెస్‌కు కడుపుమంట ఎందుకో అర్థం కావడం లేదని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ మండిపడ్డారు. సమన్వయ సమితులను అడ్డుకుంటే రైతులే వారిని తరిమి కొడతారని హెచ్చరించారు. కాంగ్రెస్‌కు తమ పాలనలో గుర్తుకురాని రైతులు, అధికారం పోగానే గుర్తుకు వస్తున్నారని ఎద్దేవా చేశారు.
రైతు సమన్వయ సమితులు ఎందుకంటున్న కాంగ్రెస్ నేతలు తమ హయాంలో ఆదర్శ రైతులను ఎలా నియమించారని శుక్రవారమిక్కడ ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళుతున్నారని, కొత్త సచివాలయం నిర్మాణానికి సీఎం సంకల్పిస్తే విపక్షాలు దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాయని అన్నారు. ప్రజాకోర్టులో పోరాడే దమ్ము లేక న్యాయస్థానాలకు పోతున్నారన్నారు. రేవంత్‌రెడ్డి అర్థం పర్థం లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు.