
హైదరాబాద్: రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ల కేటాయింపులో అన్ని రాజకీయ పార్టీలు బీసీలకు అన్యాయం చేస్తూ అగ్రవర్ణాలకే కొమ్ము కాస్తున్నాయని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ ఆరోపించారు. దోమలగూడలోని బీసీ భవన్‌లో ఆదివారం జరిగిన బీసీ సంఘాల కోర్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీలు బీసీలను రాజకీయంగా అణిచివేస్తూ అగ్రవర్ణాలకు ప్రాధాన్యత ఇస్తున్నాయని విమర్శించారు. రెండు, మూడు రోజుల్లో హైదరాబాద్‌లో 112 కుల సంఘాల రాష్ట్ర అధ్యక్షులతో సమావేశం ఏర్పాటు చేసి కీలక నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. సమావేశంలో బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు కుల్కచర్ల శ్రీనివాస్, బీసీ యువజన సంఘం అధ్యక్షుడు కనకాల శ్యాం, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment