
ఎప్పడూ ఎలాంటి ఘోరం జరుగుతుందో చెప్పలేం. మనం సురక్షితమైన ప్రదేశంలో ఉన్నప్పటకీ విధిరాత బాగోకపోతే ఏదైన జరగవచ్చు. మనకి భూమ్మీద ఆయుషు ఉంటే ఎంతటి ఘోరమైన ప్రమాదం నుంచే అయినా బయటపడవచ్చు. అచ్చం అలానే ఇక్కడొక వ్యక్తి పెద్ద పెను ప్రమాదం నుంచి బయటపడ్డాడు.
వివరాల్లోకెళ్తే...ఒక వ్యక్తి ఫుట్ పాత్ పై నిలబడి ఉండగా అనుహ్యంగా ఒక ట్రక్ అతనిపైకి దూసుకుపోతుంది. ఆ ట్రక్ చాలా ప్రమాదకరంగా అతని పైకి దూసుకుపోయింది. కానీ అదృష్టవశాత్తు ఆ వ్యక్తికి ఏం కాలేదు. ఆ వ్యక్తి ట్రక్కు గేట్ మధ్య ఇరుక్కుపోయాడు. తృటిలో ప్రాణాపాయం తప్పింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోని ఐపీఎస్ ఆఫీసర్ దీపాంశు కబ్రా ఈ వీడియోని ట్విట్టర్‌లో పోస్టు చేశారు. ఐతే ఈ వీడియో పై తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ కూడా స్పందించడం విశేషం.
Life is Sooooooo unpredictable! pic.twitter.com/tFZQ1kJf74
— Dipanshu Kabra (@ipskabra) July 7, 2022
(చదవండి: రెస్టారెంట్‌పై దాడులకు తెగబడ్డ మహిళలు...వీడియో వైరల్)
Comments
Please login to add a commentAdd a comment