ఫుడ్‌ ఇవ్వలేదని.. ఏకంగా హోటల్‌పైకి ట్రక్కుతో దూసుకెళ్లిన డ్రైవర్‌ | Video: Denied Food Drunk Driver Rams Truck Into Hotel In Pune | Sakshi
Sakshi News home page

ఫుడ్‌ ఇవ్వలేదని.. ఏకంగా హోటల్‌పైకి ట్రక్కుతో దూసుకెళ్లిన డ్రైవర్‌

Published Sat, Sep 7 2024 1:54 PM | Last Updated on Sat, Sep 7 2024 3:44 PM

Video: Denied Food Drunk Driver Rams Truck Into Hotel In Pune

ముంబై: మహారాష్ట్రలో ఓ ట్రక్కు డ్రైవర్‌ మద్యం మత్తులో బీభత్సం సృష్టించాడు. అతడికి ఆహారం ఇవ్వలేదనే కోపంతో ఏకంగా హోటల్‌పైకి ట్రక్కుతో దూసుకెళ్లాడు. ఈ ఘటన శుక్రవారం రాత్రి పుణెలోని ఇంద్రాపూర్‌ హింగాన్‌గావ్‌లో చోటుచేసుకుంది.

కంటైనర్‌తో ట్రక్కు తో ఓ వ్యక్తి షోలాపూర్‌ నుంచి పుణె వెళ్తు మధ్యలో హోటల్‌ గోకుల్‌ వద్ద ఆగాడు. తర్వాత లోపలికి వెళ్లి ఆహారం అడిగాడు.కారణం తెలీదు కానీ హోటల్ యజమాని అతనికి ఫుడ్‌ ఇచ్చేందుకు నిరాకరించాడు. అప్పటికే మద్యం మత్తులో ఉన్న డ్రైవర్‌ కోపోద్రిక్తుడై తన ట్రక్కులో కూర్చుని హోటల్ భవనంపైకి పోనిచ్చాడు. అంతటితో ఆగకుండా హోటల్‌ బయట ఆగి ఉన్న కారును కూడా ఢీకొట్టాడు.

ఇంతలో డ్రైవర్‌ను ఆపేందుకు కొందరు వ్యక్తులు ట్రక్కుపై రాళ్లు రువ్వడం చేశారు. చివరికి ట్రక్కు చక్రాలుకింద రాళ్లు పడటంతో అవి ముందుకు కదల్లేక ఆగిపోయాడు. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు కానీ హోటల్‌ తీవ్రంగా దెబ్బతింది సమాచారం అందుకున్న పోలీసులు ట్రక్కు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నారు.  ఈ దృశ్యాలను అక్కడే ఉన్న కొంతమంది తమ ఫోన్లలో రికార్డు చేయడంతో..సోషల్‌ మీడియాలో ఈ వీడియో వైరల్‌గా మారింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement