spanish couple
-
బాప్రే!.. ఆ జంట దొంగలించిన వైన్ బాటిల్స్ ఖరీదు రూ.3 కోట్లా!
స్పెయిన్: మాములుగా ఇళ్లను చోరి చేస్తే బంగారం, డబ్బు ఇంత పోయింది అంటూ బెంబేలెత్తిపోతాం . కానీ ఏ రెస్టారెంట్లలోనో లేక షాపుల్లోనో చోరికి జరిగితే లక్షల్లో నష్టం జరిగే అవకాశం ఉంటుంది. కానీ ఓ రెస్టారెంట్లో ఓ జంట ఏకంగా కోట్లు ఖరీదు చేసే వైన్ బాటిల్స్‌ని చోరీ చేశారటా. అసలు ఎక్కడ ఎవరా ఆ జంటా అనుకుంటున్నారా. (చదవండి: లక్కీ హ్యండ్! 20 లాటరీ టికెట్లు.. 20 సార్లూ అదృష్టం!) అసలు విషయంలోకెళ్లితే....సౌత్వెస్టర్ స్పెయిన్‌లోని ఒక స్పానిష్ రెస్టారెంట్లో ఓ జంట సుమారు రూ.3 కోట్లు విలువ చేసే 45 వైన్ బాటిళ్లను దొంగిలించినట్లు ఆ రెస్టారెంట్ అధికారులు అనుమానిస్తున్నారు. అయితే ఆ వైన్ బాటిళ్లు అత్యంత అరుదుగా లభించే 215 ఏళ్ల నాటివి. అంతేకాదు వాటి ఖరీదు దాదాపు 4 లక్షల డాలర్లు(రూ.3 కోట్లు). ఆ హోటల్ యజామానుల్లో ఒకరైన జోస్ పోల్ మాట్లాడుతూ.... ఆజంట ఇంగ్లీష్ అనర్గళంగా మాట్లాడగలరు. ఆ రోజు ఆ జంట మా హోటల్లో భోజనం చేస్తూ తమకు మరింత భోజనం కావాలంటూ హోటల్ ఫ్రంట్ డెస్క్‌ని అడిగారు. దీంతో ఆ రోజు హోటల్ సిబ్బంది వారికి ఆహారం వడ్డించడంలో నిమగ్నమైపోయారు. అయితే ఆ సమయంలో ఆ జంటలో ఒకరు హోటల్ సెల్లారులోకి వెళ్లారు. సెల్లారులో 40 వేలకు పైన అత్యంత అరుదుగా లభించే ఖరీదైన వైన్ బాటిల్స్ ఉన్నాయి. అంతేకాదు వారు దొంగలించిన బాటిల్స్‌ని మార్కెట్లో మార్చలేరు పైగా వాటిన్నింటికి భీమా ఉంది" అన్నారు. ఈ మేరకు కాసెరెస్లోని జాతీయ పోలీసు ప్రతినిధి వైన్ బాటిల్స్ చోరి గురించి దర్యాప్తు చేస్తున్నామని అన్నారు. (చదవండి: హౌరా బ్రిడ్జ్ పై జౌరా అనిపించే డ్యాన్స్) -
మద్యంమత్తులో విదేశీ జంటపై..
అజ్మీర్: రాజస్థాన్‌లోని పర్యాటక ప్రాంతం అజ్మీర్‌లో మద్యంమత్తులో కొందరు వీరంగం సృష్టించారు. ఈ ప్రాంతాన్ని సందర్శించేందుకు వచ్చిన స్పెయిన్ జంటపై దాడి చేసి కొట్టారు. స్పెయిన్ యువతిని లైంగికంగా వేధించినట్టు ఆరోపణలు వచ్చాయి. మద్యంతాగిన కొందరు స్థానికులు స్పెయిన్ జంట పట్ల అనుచితంగా ప్రవర్తించినట్టు ఎస్పీ నితిన్ దీప్ చెప్పారు. విదేశీయులతో మాట్లాడేందుకు ప్రయత్నిస్తూ, వారి వెంటపడినట్టు తెలిపారు. విదేశీ మహిళను వేధించినట్టు సమాచారం. బాధితులు అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్లి స్నేహితుడిని పిలిచారు. స్థానికులు విదేశీయులతో గొడవపడి దాడి చేశారు. ఈ దాడిలో ఓ యువకుడు గాయపడ్డాడు. అతని తలకు గాయాలయ్యాయి. గాయపడ్డ స్పెయిన్ యువకుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. దాడి చేసిన నిందితుల వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని ఎస్పీ చెప్పారు. -
టికెట్ కొనకుండా 20 దేశాలు దాటేశారు!
ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ ఈమధ్య గోవా వెళ్లారు. అక్కడ ఆయనకు స్పెయిన్ దేశానికి చెందిన మార్తా, బోరిస్ అనే దంపతులు కలిశారు. వాళ్లు తమ దేశం నుంచి ఒక్క చోట కూడా టికెట్ కొనకుండా 20 దేశాలు దాటుకుంటూ వచ్చారు. అన్నిచోట్లా ఎవరో ఒకరిని లిఫ్టు అడుగుతూ దారి మొత్తం దాటేశారు. సరిహద్దుల వద్ద కూడా వాళ్లకు ఎలాంటి సమస్యా ఎదురు కాలేదు. చివరకు అలా తిరుగుతూ గోవా చేరుకున్నారు. అక్కడ వాళ్లు ఓ పిల్లి పిల్లను చూసి, దాన్ని పెంచుకోడానికి తీసుకున్నారు. దానికి 'బర్మా' అని పేరుపెట్టారు. తమ దేశం తీసుకెళ్తామని, దానికి తమ దేశపు పాస్ పోర్టు కూడా ఇప్పిస్తామని వాళ్లు చెబుతున్నారట. వాళ్లు తన సినిమాలో కూడా నటించారని, 'లోఫర్' సినిమాలో వాళ్లను చూడొచ్చని తెలిపారు. ఈ విషయం అంతటినీ దర్శకుడు పూరీ జగన్నాథ్ తన ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేశారు. భలే విచిత్రంగా ఉంది కదూ! pic.twitter.com/6vjWeqq2s1 — PURI JAGAN (@purijagan) September 19, 2015