టికెట్ కొనకుండా 20 దేశాలు దాటేశారు! | they travelled 20 countires without buying a single ticket | Sakshi
Sakshi News home page

టికెట్ కొనకుండా 20 దేశాలు దాటేశారు!

Published Sat, Sep 19 2015 3:36 PM | Last Updated on Fri, Mar 22 2019 1:53 PM

టికెట్ కొనకుండా 20 దేశాలు దాటేశారు! - Sakshi

టికెట్ కొనకుండా 20 దేశాలు దాటేశారు!

ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ ఈమధ్య గోవా వెళ్లారు. అక్కడ ఆయనకు స్పెయిన్ దేశానికి చెందిన మార్తా, బోరిస్ అనే దంపతులు కలిశారు. వాళ్లు తమ దేశం నుంచి ఒక్క చోట కూడా టికెట్ కొనకుండా 20 దేశాలు దాటుకుంటూ వచ్చారు. అన్నిచోట్లా ఎవరో ఒకరిని లిఫ్టు అడుగుతూ దారి మొత్తం దాటేశారు. సరిహద్దుల వద్ద కూడా వాళ్లకు ఎలాంటి సమస్యా ఎదురు కాలేదు.

చివరకు అలా తిరుగుతూ గోవా చేరుకున్నారు. అక్కడ వాళ్లు ఓ పిల్లి పిల్లను చూసి, దాన్ని పెంచుకోడానికి తీసుకున్నారు. దానికి 'బర్మా' అని పేరుపెట్టారు. తమ దేశం తీసుకెళ్తామని, దానికి తమ దేశపు పాస్ పోర్టు కూడా ఇప్పిస్తామని వాళ్లు చెబుతున్నారట. వాళ్లు తన సినిమాలో కూడా నటించారని, 'లోఫర్' సినిమాలో వాళ్లను చూడొచ్చని తెలిపారు. ఈ విషయం అంతటినీ దర్శకుడు పూరీ జగన్నాథ్ తన ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేశారు. భలే విచిత్రంగా ఉంది కదూ!

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement