loafer movie
-
ఆమెకు ఫాలోయింగ్ ఎక్కువైపోయిందట!
గట్టిగా మూడు సినిమాలు చేసిందో లేదో గానీ.. అప్పుడే ఆ అమ్మడికి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువైపోయిందట. పూరి జగన్నాథ్ తీసిన లోఫర్ సినిమాతో పాటు.. బాలీవుడ్లో మంచి సక్సెస్ సాధించిన 'ధోనీ: ద అన్‌టోల్డ్ స్టోరీ', ఓ మాదిరి విజయం పొందిన 'కుంగ్‌ఫూ యోగ' సినిమాల్లో నటించిన హీరోయిన్ దిశా పటానీ. విడిగా బయటకు వెళ్తే చాలామంది హీరోయిన్లను గుర్తుపట్టడమే కష్టం. కానీ ఆమెను మాత్రం ఓ అభిమాని గుర్తు పట్టడమే కాదు, దిశ ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తూ వెంట పడుతున్నాడని తాజా సమాచారం. ఆమె ఢిల్లీలో ఓ హోటల్‌కు వెళ్లినప్పుడు.. వరుసగా రెండు రోజులు ఆమెను కలిసేందుకు హోటల్‌కు వెళ్లాడట. అయితే, హోటల్ వాళ్లు తనను రానివ్వకపోవడంతో యాజమాన్యంతో గొడవ కూడా వేసుకున్నాడు. సినిమా సెట్లోను, షాపింగ్ మాల్లోను, సినిమా థియేటర్‌లోను.. ఇలా ఎక్కడకు వెళ్లినా వదలకుండా వెంబడిస్తూనే ఉన్నాడు. ప్రస్తుతానికి అతడి గొడవ వదిలిపోయిందని, అయితే అభిమానులు తనపై ఇంత ప్రేమ కురిపిస్తుంటే తట్టుకోలేకపోతున్నానని దిశాపటానీ చెప్పింది. ఈ ప్రత్యేకమైన అభిమాని గురించి తెలిసి మాత్రం తాను షాకయ్యానని, ఇది చాలా చిత్రమైన అనుభవమని వ్యాఖ్యానించింది. ఈ వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు అయితే చేయలేదు గానీ.. రక్షణ కోసం ఓ బాడీగార్డును పెట్టుకోవాలని మాత్రం నిర్ణయించుకుందట. -
‘పూరీపై దాడి చేసినవారిని అరెస్టు చేయాలి'
హైదరాబాద్: సినీ దర్శకుడు పూరీ జగన్నాథ్‌పై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలంటూ జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో సోమవారం తెలుగు రాష్ట్రాల పూరీ ఫ్యాన్స్ అసోసియేషన్ తరపున కొందరు ఫిర్యాదు చేశారు. జగన్నాథ్ పై మరోసారి ఇలాంటి ఘటనలు జరిగితే తాము కూడా ప్రతీకార దాడులు చేయాల్సి వస్తుందంటూ ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతే కాకుండా, తెలుగు రాష్ట్రాల్లో సినిమా హాళ్లలో టికెట్ కౌంటింగ్‌ను కంప్యూటరైజ్ చేయాలని అందులో కోరారు. కొన్ని సినిమా థియేటర్లలో మల్టీప్లెక్స్ టికెట్ల అమ్మకాల్లో అక్రమాలు జరుగుతున్నాయని, ఇటువంటి వాటికి పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలంటూ త్వరలో సీఎం కేసీఆర్‌ను కలిసి కోరనున్నట్లు వెల్లడించారు. కాగా దర్శకుడు పూరి జగన్నాథ్ పై తాము దాడి చేయలేదని తెలుగు సినిమా డిస్ట్రిబ్యూటర్లు స్పష్టం చేశారు. తమపై తప్పుడు కేసు పెట్టారని ఆరోపించారు. తెలుగు సినిమా డిస్ట్రిబ్యూషన్ ప్రతినిధులు సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. -
పూరి జగన్నాథ్ పై డిస్ట్రిబ్యూటర్ల ఫైర్
హైదరాబాద్: దర్శకుడు పూరి జగన్నాథ్ పై తాము దాడి చేయలేదని తెలుగు సినిమా డిస్ట్రిబ్యూటర్లు స్పష్టం చేశారు. తమపై తప్పుడు కేసు పెట్టారని ఆరోపించారు. తెలుగు సినిమా డిస్ట్రిబ్యూషన్ ప్రతినిధులు సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పూరి జగన్నాథ్ పై తాము ఎటువంటి వేధింపులకు పాల్పడలేదని అన్నారు. 'లోఫర్' సినిమా ఫ్లాప్ కావడంతో తమ డబ్బులు తిరిగివ్వాలని నిర్మాత చిల్లర కల్యాణ్ ను అడిగామని తెలిపారు. పూరి జగన్నాథ్ ఇంటికి వెళ్లలేదు, ఆయనతో మాట్లాడలేదని స్పష్టం చేశారు. తమపై ఆరు సెక్షన్ల కింద ఏకపక్షంగా కేసులు నమోదు చేయడాన్ని వారు బట్టారు. పూరి జగన్నాథ్ పై దాడి చేశారని చెబుతున్న డిస్ట్రిబ్యూటర్లు అభిషేక్, సుధీర్, ముత్యాల రాందాస్ ఆ రోజున హైదరాబాద్ లోనే లేరని వెల్లడించారు. ఇంత ఏకపక్షంగా కేసులు ఎలా పెడతారని ప్రశ్నించారు. నిజానిజాలు దర్యాప్తులో వెల్లడవుతాయన్నారు. సినిమా విజయవంతమయితే లాభాల్లో 20 శాతమే తమకు ఇస్తారని చెప్పారు. సినిమా ఫ్లాప్ అయినప్పుడు కనీసం 20 శాతం డబ్బులు వెనక్కు ఇవ్వాలని వేడుకుంటున్నామన్నారు. రజనీకాంత్, సూర్య, మహేశ్ బాబు తమ సినిమాలు ఫ్లాప్ అయినప్పడు డబ్బులు వెనక్కు తిరిగిచ్చేసిన విషయాలను వారు గుర్తు చేశారు. 'అఖిల్' విడుదలైన రెండో రోజే దర్శకుడు వివి వినాయక్ తమకు ఫోన్ చేసి 'మీ వెనుక నేనున్నాను' అంటూ భరోసా యిచ్చారని వెల్లడించారు. తాము కూడా సినిమా పరిశ్రమలో భాగమేనని, తమను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని పేర్కొన్నారు. అభిషేక్, సుధీర్, ముత్యాల రాందాస్ లతో పాటు సుధాకర్ రెడ్డి విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. -
ఈ లోఫర్ చాలా మంచోడు!
-
‘లోఫర్’ చిత్రం పాటల వేడుక
-
సూపర్ స్టార్ అవ్వాలంటే...పూరీ చేతుల్లో పడాలి
- ప్రభాస్ ‘‘స్టార్ నుంచి సూపర్ స్టార్ అవ్వాలంటే పూరీగారి చేతుల్లో పడితే చాలు. అందుకే నేను ‘బుజ్జిగాడు’ కోసం ఆరు నెలల వెయిట్ చేశా. వరుణ్ వాళ్ల బాబాయి (పవన్ కల్యాణ్)లా కచ్చితంగా పెద్ద హీరో అవుతాడు’’ అని హీరో ప్రభాస్ అన్నారు. వరుణ్‌తేజ్, దిశా పాట్ని జంటగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో సీకె ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సి.కల్యాణ్ నిర్మించిన చిత్రం ‘లోఫర్’. సునీల్ కశ్యప్ స్వరాలందించిన ఈ చిత్రం పాటల వేడుక సోమవారం రాత్రి హైదరాబాద్‌లో జరిగింది. పాటల సీడీని ప్రభాస్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ- ‘‘ఇండియాలో హీరో క్యారెక్టరైజేషన్ మీద స్టోరీ రాయగల ఒకే ఒక్క బెస్ట్ రైటర్ పూరీగారు. ‘నేను సీన్ తీయాలంటే వంద రోజులు తీయాలి. కానీ ఆ సీన్‌ని పూరి ఓ డైలాగ్‌లో రాస్తారు’ అని రాజమౌళి అన్నారు. దటీజ్ పూరి జగన్నాథ్’’ అని అన్నారు. పూరి తనలోని షేడ్స్ అన్నీ తెర మీద అద్భుతంగా చూపిస్తాడని రామ్‌గోపాల్ వర్మ పేర్కొన్నారు. పూరి జగన్నాథ్ మాట్లాడుతూ - ‘‘నేను కొన్నేళ్ల క్రి తం ‘అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి’ తీశా. రామూగారు అప్పుడే ముంబై నుంచి మా ఆఫీసుకు వచ్చారు. ఏ సినిమా తీస్తున్నావంటే టైటిల్ చెప్పాను. వెంటనే తిట్టారు. ఆయనకు అలాంటి కథలు ఇష్టం ఉండవు. కానీ ఈ ‘లోఫర్’ సినిమా చూసి టైటిల్ మార్చి, ‘మా అమ్మ మహాలక్ష్మి’ అని పెట్టమన్నారు. నేనప్పుడే సక్సెస్ అయ్యాననుకున్నా. చాలా కాలం తర్వాత నేను తీసిన మదర్ సెంటిమెంట్ సినిమా ఇది. వరుణ్ చిన్నతనం నుంచి మా ముందే పెరిగాడు. అప్పుడు చాలా లావుగా ఉండేవాడు. నేను నాగబాబుగారిని ‘ఏంటండీ... మీ అబ్బాయి హీరో అవుతాడా?’ అంటే ‘నాకు తెలీదు, వాడికీ తెలియట్లేదు ’అని అన్నారు. ఎనిమిదేళ్ల క్రితం నా దగ్గరకు వచ్చి డెరైక్షన్ డిపార్ట్మెంట్లో చేరతానన్నాడు. కానీ, చివరికి నాకు డెరైక్షన్ ఛాన్స్ ఇచ్చాడు. వరుణ్ ఈ సినిమాలో చాలా బాగా చేశాడు. త్వరలో పెద్ద స్టార్ అవుతాడు. నాకిష్టమైన డార్లింగ్ ప్రభాస్ ఈ ఆడియో వేడుకకు వచ్చినందకు అతనికి థ్యాంక్స్. నేను చాలామంది హీరోయిన్లను హగ్ చేసుకుంటాను. కానీ, ప్రభాస్‌ని హగ్ చేసుకున్నప్పుడు బాగుంటుంది’’ అని చెప్పారు (నవ్వుతూ). సి. కల్యాణ్ మాట్లాడుతూ -‘‘ప్రభాస్‌కూ, నాకూ ఓ విచిత్రమైన అనుబంధం ఉంది. తన ఫస్ట్ సినిమా ‘ఈశ్వర్’లో నేను విలన్‌గా నటించా. అప్పటి నుంచి పరిచయం. ‘లోఫర్’తో పూరి నాకో సూపర్ హిట్ సినిమా ఇవ్వబోతున్నాడు. వరుణ్ భవిష్యత్తులో మంచి స్టార్ అవుతాడు’’ అని అన్నారు. వరుణ్ తేజ్ మాట్లాడుతూ - ‘‘ప్రభాస్‌గారు వచ్చాక ఈ వేడుకకు కళ వచ్చింది. ‘ఈశ్వర్’ సినిమా నుంచి నేనాయనకు అభిమానిని. ఇంటర్ సెకండియర్ చదువుతున్నప్పుడు నేను పూరి జగన్నాథ్ గారి దగ్గర అసిస్టెంట్ డెరైక్టర్‌గా చేరదామని వెళ్లాను. పూరీగారు తర్వాత రోజు రమ్మన్నారు. నేను వెళ్లలేదు. ఇప్పుడు ఆయన సినిమాలో హీరోగా చేయడం నిజంగా మంచి ఎక్స్పీరియన్స్’’ అని అన్నారు. ఈ వేడుకలో పూరి జగన్నాథ్ చిత్రాల్లోని డైలాగ్స్‌తో సరదాగా ఓ లక్కీ డిప్ నిర్వహించారు. అతిథులతో ఒక్కో డైలాగ్ చెప్పించారు. నాగబాబు, అలీ, నిర్మాతలు డి.సురేశ్ బాబు, ‘దిల్’ రాజు, ‘ఠాగూర్’ మధు, నల్లమలుపు బుజ్జి, అశోక్‌కుమార్, దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల, నటి రేవతి తదితరులు ఈ వేడుకలో పాల్గొన్నారు. -
టికెట్ కొనకుండా 20 దేశాలు దాటేశారు!
ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ ఈమధ్య గోవా వెళ్లారు. అక్కడ ఆయనకు స్పెయిన్ దేశానికి చెందిన మార్తా, బోరిస్ అనే దంపతులు కలిశారు. వాళ్లు తమ దేశం నుంచి ఒక్క చోట కూడా టికెట్ కొనకుండా 20 దేశాలు దాటుకుంటూ వచ్చారు. అన్నిచోట్లా ఎవరో ఒకరిని లిఫ్టు అడుగుతూ దారి మొత్తం దాటేశారు. సరిహద్దుల వద్ద కూడా వాళ్లకు ఎలాంటి సమస్యా ఎదురు కాలేదు. చివరకు అలా తిరుగుతూ గోవా చేరుకున్నారు. అక్కడ వాళ్లు ఓ పిల్లి పిల్లను చూసి, దాన్ని పెంచుకోడానికి తీసుకున్నారు. దానికి 'బర్మా' అని పేరుపెట్టారు. తమ దేశం తీసుకెళ్తామని, దానికి తమ దేశపు పాస్ పోర్టు కూడా ఇప్పిస్తామని వాళ్లు చెబుతున్నారట. వాళ్లు తన సినిమాలో కూడా నటించారని, 'లోఫర్' సినిమాలో వాళ్లను చూడొచ్చని తెలిపారు. ఈ విషయం అంతటినీ దర్శకుడు పూరీ జగన్నాథ్ తన ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేశారు. భలే విచిత్రంగా ఉంది కదూ! pic.twitter.com/6vjWeqq2s1 — PURI JAGAN (@purijagan) September 19, 2015 -
'లోఫర్'లో విలన్ గా చరణ్ దీప్
చెన్నై: పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'లోఫర్' సినిమాలో విలన్ గా నటిస్తున్నట్టు నటుడు చరణ్ దీప్ తెలిపాడు. 'లోఫర్'లో నటించే అవకాశం తనకు లభించిన బర్త్ డే గిప్ట్ అని పేర్కొన్నాడు. పూరితో కలిసి పనిచేయడం తనకెంతో సంతోషంగా ఉందన్నాడు. ఆయన కోసం పలు సినిమాలు వదులుకున్నానని వెల్లడించాడు. వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న 'లోఫర్' షూటింగ్ ప్రస్తుతం జోధ్ పూర్ లో జరుగుతోంది. ఇప్పటికే తొలి షెడ్యూల్ పూర్తయింది. జిల్లా, పటాస్ సినిమాల్లో ప్రధాన పాత్రలు పోషించాడు. పవన్ కళ్యాణ్ 'గబ్బర్ సింగ్ 2' సినిమాలోనూ చరణ్ దీప్ నటిస్తున్నాడు. అయితే ఈ సినిమాలో తన పాత్ర ఎలా ఉంటుందనేది ఇప్పుడే చెప్పబోనని స్పష్టం చేశాడు. 'సర్దార్' పేరు పరిశీలనలో ఉన్న ఈ చిత్రంలో మరాఠీ నటుడు శరద్ కేల్కర్ మెయిన్ విలన్ గా నటిస్తున్నాడు.